రెలైక్కబోతూ కిందపడి వ్యక్తి మృతి
నెల్లూరు రైల్వేస్టేషన్లో ఘటన
మృతుడు తిరుమలగిరి వాసి
రేగొండ : మండలంలోని తిరుమలగిరి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి బయల్దేరిన ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోతూ కిందపడి మృతిచెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రైల్వేస్టేషన్లో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన మాచర్ల రాజు(35) హ నుమాన్ మాలధారణ వేసుకొని 41 రోజుల దీక్ష చేశాడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాల విరమణ కోసం కుటుంబ సమేతంగా విజయవాడకు సోమవారం వెళ్లాడు. మంగళవారం విజయవాడలోని కనదుర్గమ్మ ఆల యంలో మాల విరమణ చేశాడు. అనంతరం రాజు కుమారుడు వెంకటేష్ తల నీలాలను తిరుపతిలో తీసేందుకు విజయవాడ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్లో బయల్దేరారు.
ఈ క్రమంలోనే పిల్లలకు దాహం వేస్తుందని చెప్పడంతో రాజు నెల్లూరు రైలు స్టేషన్లో రైలు ఆగగానే రైలు దిగి వెళ్లాడు. రాజు నీళ్ల బాటిల్ తీసుకోవడంలో కొంతజాప్యం జరిగింది. దీంతో రైలు కదలడంతో రాజు పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు వేగం పెరగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యూరుు. వెంటనే రాజు కుటుంబ సభ్యులు చైన్ లాగి రైలు ఆపి నెల్లూరు ఆస్పత్రిలో చేర్పించగా గంటలోనే మృతిచెందాడని భార్య రజిత రోదిస్తూ తెలిపింది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, తల్లి ఉన్నారు.