నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కళాశాలలో సౌకర్యాలు సక్రమంగా లేని కారణంగా ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం తరగతులకు అనుమతి ఇవ్వరాదంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీ ఐ) బృందం నివేదిక సమర్పించడమే ఇందుకు కారణం. దీంతో వచ్చే ఏడాది మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఎంసీఐ నుంచి ఇద్దరు సభ్యులు సూర్యప్రకాశ్‌రావ్, భరత్‌షా గత ఫిబ్రవరిలో మెడికల్ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం నివేదికను సమర్పించారు.
మంజూరు చేసింది రాజన్నే..
2008లో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీని వాస్ షష్టి పూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేశారు. అనంతరం దీనికి రూ. 100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో ఖలీల్‌వాడీ గ్రౌండ్‌లో మెడిక ల్ కళాశాల పనులు ప్రారంభించారు. 2011 డిసెంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా పను లు ఆలస్యంగా జరిగాయి.
2013 మే-16,17 లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీలన చేపట్టింది. అప్పుడే ఆ బృందం మొదటి సంవత్సరానికి అనుమతి కోసం కొద్దిగా పేచీ పెట్టింది. దీంతో జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలు మా ర్లు ఢిల్లీకి వెళ్లి అనుమతి కోసం కృషి చేశారు. ఎట్టకేలకు జూలైలో ఎంసీఐ మొదటి సంవత్స రం తరగతుల నిర్వహణకు పచ్చజెండా ఊపిం ది. వంద మంది విద్యార్థులతో ఆగస్టు-5న తరగతులు ప్రారంభమయ్యాయి. రెండవ సంవత్సరం కోసం అధికారులు ఎంతో కృషి చేయవల్సి వచ్చింది. సౌకర్యాల లేమితో కళాశాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇవీ అసౌకర్యాలు
రెండవసారి పరిశీలనకు వచ్చిన ఇద్దరు సభ్యు ల ఎంసీఐ బృందం కళాశాలలోని అసౌకర్యాలను ఎత్తి చూపింది. ఇంటెన్సీవ్ కార్డియాక్ కేర్ యూనిట్, ఫార్మకాలజీ, పాథలాజికల్ క్లీనిక్‌లు లేవని నివేదికలో పేర్కొంది. మైక్రోబయాలాజీ విభాగంలో పైకప్పు ఉడిపోయే దశలో ఉందంటూ నివేదించింది. సెంట్రల్ ఫొటోగ్రఫీ యూనిట్ లేకపోవడం, విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి వసతి గృహాలు లేకపోవడం, గ్రం థాలయంలో సరైన సౌకర్యాలు లేకపోవడం తదితర అంశాలను పే ర్కొంది.
ప్రొఫెసర్లు నాలుగురు, అసోసియేషన్ ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగురు, రెసిడెంట్ వైద్యులు ఏడుగురు, జూ నియర్ రెసిడెంట్ వైద్యులు ఆరుగురు తదితరులతో పాటు మొత్తం కళాశాలకు కేటాయించిన 99 మం ది ప్రొఫెసర్లలో కేవలం 30 మంది మాత్రమే ఉండడం బృందం తప్పుపట్టింది. వివిధ విభాగాలకు సం బంధించిన ఆరోగ్యపరీక్షలకు సరిప డా సౌకర్యాలు సైతం లేవని బృం దం తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 2014-15 విద్యా సంవత్సరానికిగాను రెండవ సంవత్సరం100 సీట్ల ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. ఎం సీఐ బృందం ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం కళాశాలకు రెండో సంవత్సరానికి అనుమతి రాదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
నేడు అభివృద్ధి కమిటీ సమావేశం
నేడు మెడికల్ కళాశాలలో డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం జరుగనుంది. కళాశాలలో సౌకర్యాల ఏర్పాటు, ఎంసీఐ పేర్కొన్న అంశాలను చర్చించనున్నారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాంతరా వ్, అడిషనల్ డెరైక్టర్ , కళాశాల ప్రిన్సిపాల్ హాజరుకానున్నారు.
ప్రమాదంలో వైద్య విద్య
Published Mon, Mar 24 2014 1:47 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement