నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఒకసారి కళాశాలను పరిశీ లించిన ఎంసీఐ బృందం.. ద్వితీ య సంవత్సరం తరగతుల ని ర్వహణకు అనుమతి ఇవ్వడాని కి నిరాకరించిన విషయం తెలి సిందే. ఈ నెలలో రెండో విడత లో నిర్వహించే పరిశీలనలో బృందం సంతృప్తి చెందితేనే అ నుమతి లభిస్తుంది. లేకపోతే అంతే సంగతులు. ఈ నేపథ్యం లో అందరిలో ఆందోళన నెల కొంది.
కొన్నాళ్ల క్రితం ఇద్దరు స భ్యుల ఎంసీఐ బృందం మెడికల్ కళాశాలను పరిశీలించింది. సరై న వసతులు లేని కారణంగా ద్వితీయ సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. కళాశాలలో గ్రంథాలయం, ఆట స్థలం లేవని, రేడియాలజీ, ఇతర కోర్సుల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేరన్న కారణంతో ద్వితీయ సంవత్సరానికి అనుమతి నిరాకరించారు. ఈ సమస్యల పరిష్కారానికి డీఎంఈకి నివేదించారు. మెడికల్ కళాశాల పరిశీలనకు రావాలని ఎంసీఐని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు గత నెల 28 వ తేదీన మరోసారి కోరారు. దీనిపై స్పందించిన ఎంసీఐ.. ఈ నెలలో పరిశీలిస్తామని పేర్కొంది. ఎంసీఐ బృందం ఎప్పుడైనా జిల్లాకు వచ్చి వసతులను పరిశీలించవచ్చు. కళాశాలలో రెండో సంవత్సరం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కానీ ఎంసీఐ బృందానిదే తుది నిర్ణయం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల్లో ఉత్కంఠ
ఈ నెలలో ఎంసీఐ పరిశీలన ఉండడంతో అధికారుల్లో ఉత్కంఠ నెల కొంది. బృందం పరిశీలన ఏ విధంగా జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈసారి ద్వితీయ సంవత్సరానికి అనుమతి రాకుంటే కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. జిల్లాకు మంజూరైన ఏకైక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఎలాగైనా అనుమతి తీసుకురావాలనే ఉద్దేశంతో కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబా యి ఇతర అధికారులు కూడా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
నివేదికలు, సౌకర్యాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించారు. అయితే కళాశాలకు నియమితులైన ప్రొఫెసర్ల పనితీరు వారిని ఆందోళనకు గురి చేస్తోంది. వీరు సరిగా ఆస్పత్రికి రావ డం లేదు. ప్రొఫెసర్లు అం దుబాటులో లేకపోతే కళాశాలకు అనుమతి రావడం కష్టమే. దీంతో వీరంతా సక్రమంగా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కళాశాలకు మొదటి సంవత్సరం లో వంద సీట్లు మంజురు కాగా 96 సీట్లు భర్తీ అ య్యాయి. ద్వితీయ సంవత్సరానికి అనుమతి లభిస్తే నే వీరు ఇక్కడ చదివే అవకాశం ఉంటుంది. ఈ నెల లో ఎంసీఐ పర్యటన అనంతరం ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
భవితవ్యం ప్రశ్నార్థకం
Published Wed, Jun 4 2014 2:37 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement