
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. 2018– 19 విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలని కేంద్రాన్ని బుధవారం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బోర్డు కోరింది. ఈ మేరకు నీట్ పరీక్ష ఆధారంగా కేటాయించే ఎంబీబీఎస్ సీట్ల జాబితాలో సిద్దిపేట కళాశాల పేరును కూడా పొందుపరిచారు.
20 ఎకరాల్లో భవనాలు..
సిద్దిపేట మెడికల్ కళాశాల కోసం రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే 300 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసింది. ఇందులో రోగులకు సేవలు కూడా అందిస్తున్నారు. కళాశాల, అధ్యాపకులు, సిబ్బం ది నివాసాలు, విద్యార్థుల హాస్టళ్లు, పరిశోధనల కోసం సిద్దిపేట శివారులోని ఎన్సాన్‌పల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు నిర్మించారు. ప్రస్తు తం వీటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.135 కోట్లు మంజూరు చేసింది. కాలేజీకోసం ఇప్పటికే ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా సిద్దిపేట జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ, ఎంసీఐ అనుమతితో కార్యరూపం దాల్చింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన నిర్మించగా, కళాశాల భవన నిర్మాణాలు శరవేగంతో తుది దశకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment