medical councelling
-
మెడికల్ కౌన్సిలింగ్లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్‌రావు
సాక్షి,న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిలింగ్లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను నూటికి నూరు శాతం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో మంగళవారం(ఆగస్టు 6) జీరో అవర్‌లో మస్తాన్‌రావు మాట్లాడారు. మెరిట్ కోటా కింద సీట్లు పొందిన ఓబీసీ విద్యార్థులను రిజర్వేషన్ కోటా కింద లెక్కించడంపై మస్తాన్‌రావు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థుల స్లైడింగ్ సందర్భంగా ఓబీసీలు ఖాళీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి తో భర్తీ చేయాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు సంవత్సరాల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. -
మెడికల్ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ మెడికల్ కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మెడికల్ రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినా రెండో విడత కౌన్సెలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపులో మొదట రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరగుతోందని విద్యార్థులు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన కోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుదితీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో కాళోజీ వర్సిటీ అధికారులు కౌన్సిలింగ్‌కు సంబంధించిన రీషెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఒక నేరం.. 2 చట్టాలు.. ఒక శిక్ష
న్యూఢిల్లీ: ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించొచ్చని, కానీ రెండుసార్లు శిక్ష విధించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. గుట్కా అక్రమ రవాణా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. గుట్కా, పాన్ మసాలా అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రతా ప్రమాణాల(ఎఫ్ఎస్ఎస్) చట్టం కింద కేసు పెట్టాలని, ఐపీసీ వర్తించదని గతంలో బాంబే హైకోర్టు తెలిపింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెడుతూ ‘ఏదైనా ఒక చర్య లేదా ఉల్లంఘనను రెండు వేర్వేరు చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తే, నేరస్తుడిని రెండు లేదా ఒకే చట్టం ప్రకారం విచారించొచ్చు. కానీ అదే నేరానికి రెండుసార్లు శిక్ష విధించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో మహారాష్ట్ర పోలీసులు ఐపీసీ ప్రకారం కూడా విచారణ ప్రారంభించడానికి అనుమతిచ్చింది. ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించడానికి ఎలాంటి పరిమితులు లేవని, రెండుసార్లు శిక్ష విధించడమే ఆమోదయోగ్యం కాదని స్పష్టతనిచ్చింది. ఐపీసీ విస్తృతిని నిర్వచించడంలో బాంబే హైకోర్టు పొరబడిందని పేర్కొంది. మరోవైపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలు వివాదాస్పదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ నందన్ నిలేకని సాయం కోరింది. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : మెడికల్ కౌన్సిలింగ్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పెనుమలూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. -
ఆదిలాబాద్ రిమ్స్‌కు ఎమ్సీఐ అనుమతి నిరాకరణ
-
ఎంబీబీఎస్ సిలబస్ మారుతోంది..!
ఎంబీబీఎస్.. పరిచయం అక్కర్లేని కోర్సు! వేలమంది అభ్యసిస్తున్న ప్రోగ్రామ్! లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని.. ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి.. ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. కానీ, ఆ తర్వాత కోర్సు అభ్యసనం పరంగా ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు సాధించట్లేదనే వాదన ఉంది. సిలబస్‌ను అప్డేట్ చేయకపోవడం దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో ఎంబీబీఎస్ సిలబస్‌ను మార్చే దిశగా ఏడాదిన్నర క్రితమే కసరత్తు ప్రారంభమైంది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆధ్వర్యంలో రూపొందిన ముసాయిదా సిలబస్ ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)కు చేరింది. 2019 నుంచే కొత్త సిలబస్ అమల్లోకి రానుందనే వార్తల నేపథ్యంలో ఎంబీబీఎస్ కొత్త సిలబస్‌లో ప్రధాన మార్పులు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ.. ‘ప్రస్తుతం బోధిస్తున్న ఎంబీబీఎస్ సిలబస్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే 1997లో రూపొందించింది. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ పరంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులుతేవాలి. ప్రస్తుత రోగాలు, అవసరాలకు తగ్గట్లు ఎంబీబీఎస్ సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు, సమాజానికి ప్రయోజనం ఉంటుంది’ – గత కొంత కాలంగా విద్యావేత్తలు, వైద్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివి. వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీహెచ్ఎస్.. ఎంబీబీఎస్ కోర్సుకు కొత్త సిలబస్ రూపొందించాలని ఎంసీఐ అకడమిక్ కమిటీకి సూచించింది. దీనికి అనుగుణంగా దాదాపు ఏడాదిన్నరపాటు కసరత్తు చేసిన కమిటీ పలు కొత్త మార్పులతో సిలబస్ రూపొందించింది. ముసాయిదా ప్రతిని ఇటీవల డీజీహెచ్ఎస్కు అందించింది. ఇది ఆమోదం పొందితే 2019–20 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో అడుగుపెట్టే విద్యార్థులకు కొత్త సిలబస్ స్వాగతం పలికే అవకాశముంది. ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఎంసీఐ రూపొందించిన కొత్త సిలబస్ విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్రోచ్‌ను పెంచేలా ఉంది. ఇప్పటివరకు అయిదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సులో అధిక శాతం థియరీ సబ్జెక్ట్లే. దీంతో విద్యార్థులు కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ సమయంలో సరైన పనితీరు కనబర్చ లేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి సంవత్సరం నుంచే క్లినికల్, నాన్–క్లినికల్ సబ్జెక్టుల్లో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ప్రాధాన్యమిచ్చేలా కొత్త సిలబస్‌ను ఎంసీఐ అకడమిక్ కమిటీ రూపొందించింది. దాంతోపాటు కొత్త కరిక్యులంలో థియరీ, ప్రాక్టీస్ మధ్య అంతరా (గ్యాప్)న్ని తగ్గించనున్నారు. అదే విధంగా మొదటి సంవత్సరంలోనే బేసిక్, లేబొరేటరీ సైన్స్లకు ప్రాధాన్యం పెంచనున్నారు. కోర్సు రెండు, మూడు సంవత్సరాల్లో క్లినికల్ మెడిసిన్ అంశాలకు ప్రాధాన్యం పెంచేలా కరిక్యులంలో మార్పు చేశారు. ఫౌండేషన్ కోర్సు ఎంబీబీఎస్ కొత్త కరిక్యులంలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం.. ఫౌండేషన్ కోర్సు పేరుతో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌ను రూపొందించడం. మొదటి సంవత్సరంలో తొలి రెండు నెలలు ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని కూడా పెంచడం. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో వైద్యులు అనుసరించాల్సిన విధానాలు, ప్రజారోగ్యం, వైద్య రంగంలో నైతిక విలువల ప్రాధాన్యత, హెల్త్ ఎకనామిక్స్, లెర్నింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, లైఫ్ సపోర్ట్, సోషియాలజీ అండ్ డెమోగ్రాఫిక్స్, బయోహజార్డ్ సేఫ్టీ, పర్యావరణ అంశాలు, సామాజిక దృక్పథం తదితర అంశాలను ఫౌండేషన్ కోర్సులో భాగంగా బోధిస్తారు. ఫలితంగా ఎంబీబీఎస్ కోర్సు ఆవశ్యకత, ఈ కోర్సుకున్న సామాజిక బాధ్యత గురించి విద్యార్థులకు అవగాహన వస్తుంది. ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్నాకే.. పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కోర్ సబ్జెక్టుల బోధన ప్రారంభమవుతుంది. రియల్ కేస్ స్టడీస్ ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్‌లో నైపుణ్యం ఎంతో అవసరం. మొదటి సంవత్సరం నుంచే ఈ దిశగా అడుగులు వేసేలా కొత్త కరిక్యులంలో కొన్ని అంశాలు పొందుపర్చారు. ఈ మేరకు బేసిక్స్‌ను, లేబొరేటరీ సైన్సెస్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు వాస్తవ పరిస్థితుల్లోని ‘కేస్’లను క్లాస్‌రూంలో చెప్పి.. విద్యార్థుల మధ్య వాటిపై గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించడం, అదే విధంగా కేస్ బేస్డ్ లెర్నింగ్‌కు మొదటి సంవత్సరంలోనే ప్రాధాన్యమిచ్చేలా కరిక్యులంలో మార్పులు చేశారు. ఎలక్టివ్స్ విధానం కొత్త కరిక్యులంలో మరో ముఖ్య మార్పు ఎలక్టివ్స్ విధానాన్ని సిఫార్సు చేయడం. తద్వారా విద్యార్థుల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ దృక్పథం పెరగనుంది. ఈ ఎలక్టివ్స్‌లో భాగంగా క్లినికల్ ఎలక్టివ్స్, లేబొరేటరీ పోస్టింగ్స్, కమ్యూనిటీ ఎక్స్‌పోజర్స్‌ను ప్రధానంగా పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో ఈ అంశాలపై విద్యార్థులు చాలా తక్కువగా దృష్టిసారిస్తున్నారు. అయితే తప్పనిసరి ఎలక్టివ్స్ విధానం ఫలితంగా నిర్దేశిత ఎలక్టివ్స్ వల్ల స్వీయ శిక్షణ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, రీసెర్చ్ సామర్థ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంతో వీటిని రూపొందించారు. ఫోరెన్సిక్ సైన్స్‌పై అవగాహన ఎంబీబీఎస్ నూతన కరిక్యులంలో పేర్కొనాల్సిన మరో ప్రధాన అంశం.. ఫోరెన్సిక్ సైన్స్ అంశంపై పూర్తి అవగాహన కల్పించనుండటం. ఎంబీబీఎస్ ఫైనలియర్లో ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండు పేపర్లను (క్లినికల్ ఫోరెన్సిక్ సైన్స్, మెడికో–లీగల్ కేస్‌లపై ప్రాక్టికల్ ట్రైనింగ్) రూపొందించాలని నిర్ణయించారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విధానానికి రూపకల్పన చేశారు. ఎంబీబీఎస్ లైసెన్స్ పొందడానికి ముందే సదరు స్కిల్స్‌లో సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి అని ఎంసీఐ అకడమిక్ కమిటీ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రతి మెడికల్ కళాశాల.. అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్‌తో అనుసంధానమై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. నేటి పరిస్థితులకు అనుగుణంగా స్కిల్ ల్యాబ్, ఈ–లెర్నింగ్, సిమ్యులేషన్ వంటి నైపుణ్యాలు సైతం అందించేలా సిలబస్‌లో మార్పులు చేయనుంది. మరిన్ని మార్పులు క్లినికల్ ట్రైనింగ్‌లో స్టూడెంట్–డాక్టర్ విధానం పేరుతో కొత్త విధానానికి రూపకల్పన చేశారు. దీని ప్రకారం విద్యార్థులకు కొన్ని ప్రధాన అంశాల్లో నైపుణ్యాలు అందించనున్నారు. అవి.. అవుట్ పేషెంట్, ఎమర్జెన్సీ విభాగాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలపైఅవగాహన కల్పించడం. రోగుల సేవలో, వ్యాధుల నిర్ధారణలో పాల్పంచుకోవడం, రోగికి చికిత్స అందించే క్రమంలో ప్రాథమిక విధానాలపై అవగాహన కల్పించడం. ఫ్యామిలీ మెడిసిన్ శిక్షణను తప్పనిసరి చేయడం. క్లినికల్ ట్రైనింగ్ విధానంలో మార్పులు చేయడం. ‘కోర్’ అంశాల ఆవశ్యకతతోపాటు ఎలక్టివ్స్‌ను పేర్కొనడం. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ ఎంబీబీఎస్ కరిక్యులంలో కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని రూపొందించాలని కూడా ఎంసీఐ సిఫార్సు చేసింది. ఫలితంగా వాస్తవ పరిస్థితుల్లో అవసరమైన అంశాలపై అవగాహన, సునిశిత పరిశీలన నైపుణ్యాలు లభిస్తాయని పేర్కొంది. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ వైద్య విద్యలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఫ్యాకల్టీ. అదే విధంగా ఇప్పటికే ఉన్న ఫ్యాకల్టీ విషయంలో కొత్త నైపుణ్యాలపై అవగాహన తక్కువగా ఉండటం. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు రీజనల్ లెర్నింగ్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంసీఐ సిఫార్సు చేసింది. ఎగ్జిట్ ఎగ్జామ్‌పై సందిగ్ధం గత కొంత కాలంగా ఎంబీబీఎస్ విద్యార్థులను ఆందోళకు గురిచేస్తున్న వార్త.. ‘ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎగ్జిట్ ఎగ్జామ్ పేరుతో నిర్వహించే మరో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే లైసెన్స్ పొందేందుకు అర్హత లభిస్తుంది’. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో కొత్త కరిక్యులంకు సంబంధించి రూపొందించిన ముసాయిదాలో ఎగ్జిట్ ఎగ్జామ్ విషయంలో ‘స్టేటస్ కో టు బి మెయిన్‌టెయిన్డ్’ అని ఎంసీఐ పేర్కొంది. విద్యార్థులకు ప్రయోజనాలు.. నూతన అభ్యసన నైపుణ్యాలు. ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ బోధనను ప్రాక్టికల్‌గా అనుసంధానం. ఫ్యామిలీ మెడిసిన్ సిద్ధాంతాలపై సమగ్ర అవగాహన. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. స్వీయ నిర్దేశిత అభ్యసన నైపుణ్యం. నైతిక విలువలు, వ్యక్తిగత దృక్పథం, వృత్తి నైపుణ్యాలను సమీకృతం చేసుకునే నైపుణ్యం. ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులం ప్రధాన ఉద్దేశాలు.. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్సెంటివ్స్ ఆహ్వానించదగ్గ పరిణామం 1997 తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత ఎంబీబీఎస్ సిలబస్‌లో మార్పుల దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సిలబస్‌లో పేర్కొన్న ప్రాక్టికల్ అప్రోచ్ అంశాల కోణంలో బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచేలా కృషిచేస్తే కొత్త కరిక్యులంతో విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది. ఫౌండేషన్ కోర్సు బోధించాలనే ఉద్దేశం వల్ల విద్యార్థులకు వైద్య విద్య గురించి తెలియడమేకాకుండా.. సామాజిక ఆరోగ్య పరిస్థితులపైనా అవగాహన ఏర్పడి.. భవిష్యత్తులో వారు సేవా దృక్పథంతో, నైతిక విలువలు పాటించేలా వ్యవహరించగలుగుతారు. – డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. -
బ్లాక్‌లిస్టులో 82 మెడికల్ కాలేజీలు..
సాక్షి, న్యూఢిల్లీ : 2018-19 విద్యా సంవత్సరానికి గానూ 82 వైద్య కళాశాలల ప్రవేశానుమతులపై నిషేధం విధించాల్సిందిగా జాతీయ వైద్య మండలి(ఎమ్సీఐ)... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ విషయంపై స్పందించిన సంబంధిత శాఖ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. వివిధ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ఇతర వనరులు తదితర అంశాల ఆధారంగా ఎమ్సీఐ తనిఖీలు నిర్వహించిందన్నారు. తనిఖీల్లో భాగంగా సంబంధిత అంశాల్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్సీఐ ఆయా కళాశాలలను బ్లాక్ లిస్టులో చేర్చాల్సిందిగా సూచించిందని తెలిపారు. ఈ మేరకు 2018- 19 సంవత్సరానికి గానూ ప్రవేశాలు నిషేధించాల్సిందిగా సిఫారసు చేసిందన్నారు. బ్లాక్‌లిస్టులోని 82 మెడికల్ కాలేజీల్లో 70 ప్రైవేట్, 12 ప్రభుత్వ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. ఈ కళాశాలలపై నిషేధం విధించడం ద్వారా అందుబాటులో ఉన్న 64 వేల సీట్లలో సుమారు 10వేల సీట్లు విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కొత్తగా 31 ప్రభుత్వ, 37 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతించాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి తిరస్కరించినట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 2021-22 నాటికి కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
సిద్దిపేట మెడికల్ కాలేజీకి 150 సీట్లు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. 2018– 19 విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలని కేంద్రాన్ని బుధవారం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బోర్డు కోరింది. ఈ మేరకు నీట్ పరీక్ష ఆధారంగా కేటాయించే ఎంబీబీఎస్ సీట్ల జాబితాలో సిద్దిపేట కళాశాల పేరును కూడా పొందుపరిచారు. 20 ఎకరాల్లో భవనాలు.. సిద్దిపేట మెడికల్ కళాశాల కోసం రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే 300 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసింది. ఇందులో రోగులకు సేవలు కూడా అందిస్తున్నారు. కళాశాల, అధ్యాపకులు, సిబ్బం ది నివాసాలు, విద్యార్థుల హాస్టళ్లు, పరిశోధనల కోసం సిద్దిపేట శివారులోని ఎన్సాన్‌పల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు నిర్మించారు. ప్రస్తు తం వీటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.135 కోట్లు మంజూరు చేసింది. కాలేజీకోసం ఇప్పటికే ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా సిద్దిపేట జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ, ఎంసీఐ అనుమతితో కార్యరూపం దాల్చింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన నిర్మించగా, కళాశాల భవన నిర్మాణాలు శరవేగంతో తుది దశకు చేరుకున్నాయి. -
వైద్య వివరాలు ఇవ్వకపోవడం నేరం
ప్రయివేటు డాక్టరయినా ప్రభుత్వ డాక్టరయినా చికిత్సా వివరాల పత్రాలు ఇవ్వకపోతే వైద్యలోపం ఉందని భావిస్తారు. చికిత్సాపత్రాలు నిరాకరిస్తే అది వైద్యంలో నిర్లక్ష్యమే. వైద్యలోపానికి నష్టపరిహారం చెల్లించకతప్పదు. కేరళ హైకోర్టు రాజప్పన్ వర్సెస్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్సిటిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ ఎల్ ఆర్ 2004 (2) కేరళ 150) కేసులో రోగుల సమాచార హక్కును చాలా స్పష్టంగా నిర్దేశించింది.‘‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ 1.3.1 ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన, వాటిపైన సలహా, పరిశోధన తరువాత రోగ నిర్ధారణ జరిగితే ఆ వివరాలు, రోగికి ఇవ్వాలి. రెగ్యులేషన్ చివర ఇచ్చిన మూడో అనుబంధంలో పేర్కొన్న ప్రకారం కేస్ షీట్ ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తి మరణిస్తే అన్ని కారణాలు తెలియజేసే వివరాలు అందులో ఉండాలి, డాక్టర్ ఏ మందులు ఎప్పుడు వాడాలో నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేస్ షీట్లో తేదీల వారీగా ఉండాలి. చికిత్స వివరాలు చాలా సమగ్రంగా ఉండాలి. రోగి గానీ అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో మొత్తం కేస్ షీట్ తదితర వివరాలు అందించాలి. ఈ రెగ్యులేషన్ల ద్వారా రోగికి తన రికార్డు కోరే హక్కును చట్టం గుర్తించింది. పొందే మార్గాలను కూడా నిర్దేశించింది.’’ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపూ లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేస్ షీట్, మూడో అనుబంధపు వివరాలతో పాటు సంబంధిత పత్రాలు ఇంకేమయినా ఉంటే వాటినీ ఇవ్వాలి. ఏ చట్టంలోనూ దీనికి మినహాయింపు లేదనీ కనుక మొత్తం చికిత్స వివరాల ఫోటో కాపీలు ఇవ్వక తప్పదని కేరళ హైకోర్టు వివరించింది. హాస్పటల్ ఇచ్చిన ఈ మెడికల్ రికార్డును తమకు వ్యతిరేక సాక్ష్యంగా రోగులు వాడుకుంటారని వైద్యశాల యజమానులు వాదించారు. కాని ఈ కారణంపై వైద్యులకు మినహాయింపు ఇచ్చే అవకాశమే లేదని హైకోర్టు తెలిపింది. ఒకవేళ వైద్యులు సక్రమంగా వైద్యం చేసి ఆ వివరాలే నమోదు చేసి ఉంటే డాక్టర్లకు అది అనుకూల సాక్ష్యమవుతుంది. డాక్టర్లు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు సాక్ష్యంగా వాడుకోవలసిందే. మంచి చికిత్స చేసిన వారు కేసులు వస్తాయని భయపడాల్సిన పనే లేదు. తప్పుడు చికిత్స నిరోధించాలంటే రోగులకు చికిత్సచేసిన వివరాలకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాల్సిందే. ఈ కేసులో న్యాయార్థికి తన కూతురికి చేసిన చికిత్సవివరాలు తీసుకునే హక్కు ఉందనీ, ఇచ్చే బాధ్యత డాక్టర్లపైన హాస్పటల్ పైన ఉందని హైకోర్టు వివరించింది. ఈ వైద్యవివరాలను నిరాకరించడం అంటే తన బాధ్యతానిర్వహణలో అది లోపమో నిర్లక్ష్యమో అవుతుందని అనేక హైకోర్టులు వినియోగదారుల హక్కుల న్యాయస్థానాలు వివరించాయి. కన్హయ్యాలాల్ రమణ్ లాల్ త్రివేది వర్సెస్ డాక్టర్ సత్యనారాయణ విశ్వకర్మ (1996, 3 సి.పి.ఆర్ 24 గుజరాత్) కేసులో ఆస్పత్రి అధికారులు, వైద్యులు రోగికి రికార్డులు ఇవ్వలేదు. దీన్ని వైద్య లోపంగానూ, నిర్లక్ష్యంగానూ నిర్ధారించింది. వారు మెడికల్ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి కూడా నిరాకరించారు. నివేదికలను నిరాకరించడం వల్ల ఆ వైద్యులు అందించిన చికిత్సలో ప్రమాణాలు లోపించాయని భావించడానికి ఆస్కారం ఏర్పడింది. వారు రోగికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. పైగా రికార్డులలో ప్రస్తావించవలసిన వివరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక హాస్పటల్ వారు కేస్‌షీట్‌లో అనస్థటిస్ట్ పేరును తమ ఆపరేషన్ నోట్స్‌లో వెల్లడించలేదు. ఆకేసులో ఇద్దరు అనస్థటిస్టులు రోగికి అనస్థీషియా ఇచ్చారు. ఒకే రోగికి రెండు రకాల ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయని తేలింది. రెండు పత్రాలు విడిగా సమర్పించారు. దీన్ని బట్టి హాస్పటల్ వర్గాలు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మీనాక్షి మిషన్ హాస్పటల్ అండ్ రిసర్చ్ సెంటర్ వర్సెస్ సమురాజ్ అండ్ అనదర్ [I(2005) CPJ(NC)] కేసులో జాతీయ కమిషన్ తీర్పు చెప్పింది. (కేంద్ర సమాచార కమిషన్ నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్యరంగం పారదర్శకతపై రచ యిత సమర్పించిన పరిశోధనా పత్రంలో భాగం). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
జుట్టు కోసం వెళ్లి...ప్రాణంపైకి తెచ్చుకున్నాడు
-
లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, స్పీకర్ సుమిత్రా మహాజన్ వారి డిమాండ్‌ను తిరస్కరిస్తూ.. సభ్యులు సభా నియమాలను తెలుసుకోవాలన్నారు. సహకార బ్యాంకులకు పన్ను మినహాయింపు లేదు వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పనిచేస్తున్న సహకార బ్యాంకులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వటం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పరస్పర సహకార భావనను వదిలి లాభాలే లక్ష్యంగా అవి పనిచేస్తున్నందునే పన్ను మినహాయింపు ఇవ్వటం లేదన్నారు. దాదాపు 98 ప్రైవేట్ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో... శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రశాంతంగా జరిగాయి. నేతాజీ జయంతిని దేశ్‌ప్రేమ్ దివస్(దేశభక్తి దినం)గా ప్రకటించాలని సీపీఎం బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ జీరో అవర్‌లో కోరారు. ‘బెగ్’ అనే మాటను వాడవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి సభ్యులు, మంత్రులకు సూచించారు. బ్రిటిష్ కాలం నాటి భావజాలాన్ని విడనాడాలని సూచించారు. పార్లమెంట్‌కు వరుస సెలవులు శని, ఆదివారాలతోపాటు నూతన సంవత్సరాది సందర్భంగా సోమవారం జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటిస్తూ పార్లమెంట్ ఉభయసభలు నిర్ణయించాయి. జనవరి రెండో తేదీన తిరిగి సమావేశం అవుతాయి. ఈశాన్య రాష్ట్రాల సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హోమియోపై మరో కమిషన్.. నేషనల్ మెడికల్ కమిషన్ మాదిరిగానే భారత జాతీయ వైద్యవిధానాలు, హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌లు తాజాగా ప్రతిపాదించాయి. బిల్లులోని ముఖ్యాంశాలు... ► నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ► ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి. ► వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. ► వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ► పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. -
సిద్దిపేట వైద్య కళాశాలలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న సిద్దిపేట ప్రభుత్వ వైద్య కాలేజీలో బోధన సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. ట్యూటర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ వంటి 38 కీలక పోస్టుల భర్తీకి వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు సిద్దిపేట వైద్య కాలేజీలో 2018–19 విద్యా సంవత్సరంలో అడిష్మన్లు జరిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్య కాలేజీ నిర్వహణ అనుమతి కోసం భారత వైద్య మండలి(ఎంసీఐ) బృందం త్వరలోనే సిద్దిపేట కాలేజీని సందర్శించనుంది. దీంతో సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (నిమ్స్) తరహాలో సిద్దిపేట కాలేజీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి కలిగిస్తోంది. నియామకాలు, ఇతర ఏర్పాట్లు అన్ని స్వతంత్రంగానే జరుపుకొనే వెసులుబాటు కల్పించింది. డిపార్ట్మెంట్ క్యాడర్ పోస్టులు అనాటమీ ట్యూటర్ 02 ఫిజియాలజీ ట్యూటర్ 02 బయోకెమిస్ట్రీ ట్యూటర్ 03 ఫార్మకాలజీ ట్యూటర్ 01 ఫోరెన్సిక్ మెడిసిన్ ట్యూటర్ 01 జనరల్ మెడిసిన్ ఎస్ఆర్ 03 జనరల్ మెడిసిన్ జేఆర్ 06 పిడియాట్రిక్స్ జేఆర్ 01 సైకియాట్రీ జేఆర్ 01 జనరల్ సర్జరీ జేఆర్ 06 ఆర్థోపెడిక్స్ జేఆర్ 02 ఓబీజీ ఎస్ఆర్ 02 ఓబీజీ జేఆర్ 04 క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ 04 -
నీట్ ఫలితాల వెల్లడిపై స్టే
► మధ్యంతర ఉత్తర్వులిచ్చిన మద్రాసు హైకోర్టు బెంచ్ ► జూన్ ఏడులోపు వివరణకు ఆదేశం సాక్షి, చెన్నై/మదురై: వైద్య విద్య కోర్సుల్లో 2017 ఏడాదికి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్’ పరీక్ష ఫలితాల వెల్లడి నిలుపుదల చేస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులపై కౌంటర్ అఫిడవిట్‌ను జూన్ 7వ తేదీలోగా దాఖలు చేయాల్సిందిగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), సీబీఎస్ఈ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్యశాఖలను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. ఈనెల 7న నిర్వహించిన నీట్ పరీక్షా ప్రశ్నా పత్రాల్లోని గందరగోళాన్ని వెలుగులోకి తెస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తిరుచ్చికి చెందిన శక్తి మలర్ పిటిషన్ వేశారు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసిన వారికి ప్రశ్నాపత్రాలు సులభంగా ఇచ్చారని, ఇంగ్లిష్‌లో రాసిన వారు ఇబ్బందులుపడ్డారని, కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని శక్తి మలర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండాలంటూ కోర్టు కేసును జూన్ 7కు వాయి దా వేసింది. కాగా, గుజరాత్ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, పరీక్ష మళ్లీ నిర్వహించాలనిగుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీజీ కోర్సుల కటాఫ్ తగ్గింపు: నీట్ పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కటాఫ్‌ను 7.5 పర్సంటైల్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. కటాఫ్ తగ్గించకపోతే సీట్లకు సరిపడా అభ్యర్థులు ఎంపికకాలేరని వేర్వేరు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జనరల్ కేటగిరీకి కటాఫ్ 42.5, రిజర్వ్డ్ కేటగిరీకి 32.5 పర్సంటైల్‌కు తగ్గింది. -
ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్
- కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా ఇవ్వాలి - మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తప్పనిసరి చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు సరిగా అమలు చేయలేదు. దీనిపై ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎంసీఐ చివరకు సీరియస్‌గా ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా ఈ ఏడాది నుంచి సై్టఫండ్ ఇవ్వకపోతే ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందుకే ఫీజుల పెంపు... స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధన నేపథ్యంలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కోరినట్లుగా ఫీజులు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీలకు మధ్య జరిగిన చర్చల్లోనూ ఇదే ప్రధాన అంశంగా ఉంది. తమకు వచ్చే ఫీజులు ఏమాత్రం చాలవని యాజమాన్యాలు ప్రభుత్వం వద్ద పంచా యితీ పెట్టాయి. ఫీజులు పెంచితే స్టైఫండ్ ఇస్తామన్నాయి. అందుకే ఫీజులు పెంచామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రం స్టైఫండ్‌కు మెలిక పెడుతున్నాయి. ప్రస్తుతం చేరుతున్న సమయంలోనే సై్టఫండ్ ఇవ్వబోమని, అందుకు ఒప్పుకోవాలని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నాయని ఆరోగ్య సంస్కరణల వైద్యుల సంఘం (హెచ్ఆర్డీఏ) సెక్రటరీ జనరల్ శ్రీని వాస్ ‘సాక్షి’తో అన్నారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ విషయంపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డికి ఫిర్యాదు ఇచ్చామని ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు బ్యాంకు గ్యారంటీ తీసుకోకూడదని ఆయన స్పష్టంచేశారు. రూ. 30 వేల వరకు సై్టఫండ్... పీజీ వైద్య విద్య చదివే విద్యార్థులు ఒకవైపు చదువుతూనే మరోవైపు బోధనాసుపత్రులు, సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లుగా వైద్య సేవలు అందిస్తుంటారు. వారు చేసే సర్వీసుకు ఆయా కాలేజీలు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో పీజీ వైద్య విద్యార్థులు చేసే వైద్య సేవలకు తప్పనిసరిగా స్టైఫండ్ ఇవ్వాలి. ఈ నిబంధనను ప్రభుత్వ వైద్య కాలేజీలు అమలుచేస్తున్నా, ప్రైవేటు కాలేజీలు అమలుచేయడంలేదు. మొదటి ఏడాది పీజీ విద్యార్థులకు నెలకు రూ. 27 వేలు, రెండో ఏడాదికి రూ. 28 వేలు, మూడో ఏడాదికి రూ. 30 వేలు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన వారికీ ఇదే వర్తిస్తుంది. కానీ ఇప్పటివరకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచే కొంత మొత్తం తీసుకొని స్టైఫండ్‌గా ఇచ్చేవి. మరికొన్ని అదీ లేకుండా మొండిచెయ్యి చూపేవి. -
కామన్ కౌన్సెలింగ్‌పై నిపుణుల సలహా!
దీనిపై సూచనలివ్వాలని ఏజీని కోరిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, వైద్య పీజీ సీట్ల భర్తీ కోసం కామన్ కౌన్సెలింగ్‌పై నిపుణుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై సూచనలు ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్‌ను ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్‌తో పాటు వైద్య పీజీ సీట్లకూ కామన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం, కన్వీనర్ కోటాతో పాటు, మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరి), ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లతో పాటు మైనారిటీ కాలేజీల్లోని సీట్లనూ ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంపై ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వరకే ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. కామన్ కౌన్సెలింగ్ విధానం అమలులోకి వస్తే సీట్ల భర్తీలో ప్రైవేట్ కాలేజీల పాత్ర నామమాత్రం కానుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నీట్ వయోపరిమితి తొలగింపు
5వరకు దరఖాస్తుల స్వీకరణ న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)–2017కు సంబంధించి అభ్యర్థులకు 25 ఏళ్లుగా నిర్ణయించిన గరిష్ట వయోపరిమితిని సుప్రీం కోర్టు శుక్రవారం తొలగించింది. సీబీఎస్ఈ ఆన్లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5వరకు దరఖాస్తు చేయొచ్చని స్పష్టంచేసింది. మే నెల 7న జరిగే ఈ పరీక్షకు భారత వైద్య మండలి ఆదేశాల ప్రకారం వయోపరిమితిని సీబీఎస్ఈ కేవలం నోటీసు జారీ ద్వారా నిర్ణయించజాలదని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష రాయాలని కోరుకునే అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష నిర్వహిస్తున్న సీబీఎస్ఈ.. అదనపు కేంద్రాల ఏర్పాటు కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లను, నగర మేయర్లను సాయం కోరొచ్చని సూచించింది. ఈ పరీక్షకు గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయిస్తూ సీబీఎస్ఈ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన రాయ్ సబ్యసాచి, అభ్యర్థుల పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. -
రాష్ట్రానికి కొత్తగా 153 పీజీ వైద్య సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 11 వైద్య కళాశాలలు, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (స్విమ్స్)లకు 153 పీజీ వైద్య సీట్లు పెంచేందుకు భారతీయ వైద్య మండలి అనుమతిచ్చింది. ప్రొఫెసర్లు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం సీట్లు పెంచుతామని రెండు నెలల క్రితమే కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేసి 15 రోజుల క్రితమే 389 వైద్య పీజీ సీట్లు పెంచాలంటూ కేంద్రానికి, భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో 153 పీజీ వైద్య (క్లినికల్) సీట్లు మాత్రమే మండలి పెంచింది. పీజీ వైద్య సీట్లు పెరిగినట్లు తమకు వైద్య మండలి నుంచి అనధికారిక సమాచారం అందిందని, అధికారిక ఉత్తర్వులు మాత్రం రావాల్సి ఉందని డీఎంఈ తెలిపారు. త్వరలోనే పీజీ వైద్య సీట్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరగనుంది. -
కేఎంసీలో పీజీ సీట్లు పెంపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తంగా 153 సీట్లు మంజూరు కాగా అందులో కర్నూలు మెడికల్ కాలేజికి 30 పెరిగాయి. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 నుంచి 20కి, పీడియాట్రిక్స్‌లో 5 నుంచి 8కి, అనెస్తీషియాలో 6 నుంచి 7కు, రేడియాలజిలో 3 నుంచి 6కు, జనరల్ సర్జరీలో 10 నుంచి 20కి, ఆర్థోపెడిక్స్‌లో 8 నుంచి 11కు, ఈఎన్టీలో 4 నుంచి 5కు, గైనకాలజిలో 6 నుంచి 7కు పీజీ సీట్లు పెరిగాయి. కనీసం 90 సీట్లకు పైగా పెరుగుతాయని ఆశించగా 30 సీట్లు మాత్రమే పెరగడం వైద్యవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు . ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది. -
ఉర్దూలోనూ ‘నీట్’ నిర్వహణపై మీ వైఖరేంటి?
కేంద్రం, ఎంసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ఉర్దూలో కూడా నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిష న్పై వైఖరి తెలపా లంటూ కేంద్రం, భారత వైద్య మండలి (ఎంసీఐ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్ర వారం విచారణ చేపట్టింది. దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజల సంఖ్య ఆధారంగా ఉర్దూ ఆరో స్థానంలో ఉందని, రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో కూడా ఉర్దూకు చోటు దక్కిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు 11, 12 తరగతులను ఉర్దూ మీడియంలో చదివారని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఉర్దూలోనూ లభిస్తున్నాయని వివరించారు. అత్యధిక మంది మాట్లాడే భాషల్లో గుజరాతీ ఏడో స్థానంలో, కన్నడ 8వ స్థానంలో, ఒడియా పదో స్థానంలో, అస్సామీ 12వ స్థానంలో ఉన్నాయని, వీటన్నింటినీ ‘నీట్’ నిర్వహణ భాషల్లో చేర్చారని, ఉర్దూను మాత్రం చేర్చలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉర్దూ మీడియంలో చదివారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన అభ్యర్థన వస్తే ఏ భాషలోనైనా ‘నీట్’ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎంసీఐ విన్నవించింది. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి ఈ మేరకు అభ్యర్థన కేంద్రానికి వెళ్లిందని పిటిషనర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి, ఎంసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. -
నీట్ పీజీ అర్హత మార్కులు తగ్గించండి
కేంద్ర మంత్రి నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులను తగ్గించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రితో కామినేని సమావేశమయ్యారు. దీనిపై మంత్రి కామినేని మీడియాతో మాట్లాడుతూ.. అర్హత మార్కుల తగ్గింపు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రాథమికంగా అంగీకరించారని తెలిపారు. అయితే ఎంత శాతం మార్కులు తగ్గిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నడ్డా చెప్పారని వివరించారు. అలాగే రాయలసీమ ప్రాంత విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు తిరుపతిలో నీట్ పీజీ వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. -
సైకాలజిస్టుల ప్రాంతీయ అధ్యక్షుడిగా బాలాజిసింగ్
నంద్యాల: కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా స్థానిక సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ ఎంపికయ్యారు. తిరుపతిలో శనివారం జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కర్నూలుకు చెందిన జయరెడ్డి ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ తరహాలో సైకాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. -
డాక్టర్లకు గోల్డ్ కాయిన్లు ఇచ్చి..!
తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోడానికి ఫార్మా కంపెనీలు వైద్యులకు బహుమతులు, లంచాలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇటీవల బెంగళూరులో పిల్లల వైద్యుల వార్షిక సదస్సు ఒకటి జరిగింది. దానికి ఒక కంపెనీ సంక్రాంతి కానుక అని చెప్పి.. డిజిటల్ వేయింగ్ స్కేల్స్, బంగారు కాయిన్లు, స్టెతస్కోప్ తదితరాలను బహుమతులుగా ఇచ్చింది. వాటితో పాటే.. తమ సంస్థ ఉత్పత్తి చేసే థైరాయిడ్ మందులు, రోటా వైరస్‌లకు భారీ ఆర్డర్లు సంపాదించుకుంది. కానీ, వాక్సిన్ల కోసం డాక్టర్లకు లంచాలిచ్చారడాన్ని సదస్సు నిర్వాహకులు ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, వాక్సిన్ల కోసం బహుమతులు ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఎవరైనా వాక్సిన్లు భారీమొత్తంలో కొంటే వాళ్లకు మొత్తం ధరలో కొంత కన్సెషన్లు లభిస్తాయని డాక్టర్ కరుణాకర చెప్పారు. తాను 18 ఏళ్లుగా పిల్లల వైద్యుడిగా ఉన్నానని, ఇప్పటివరకు డాక్టర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు ఎవరూ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఫార్మా కంపెనీలు వైద్యులకు ఉచిత బహుమతులు ఇవ్వడాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిషేధించింది. కానీ, సంక్రాంతి కానుకలు ఇవ్వకూడదన్న నిబంధన లేకపోవడంతో దాన్ని సదరు సంస్థ క్యాష్ చేసుకుంది. ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నందుకు ఒక్కో డాక్టర్ 150 చొప్పున థైరాయిడ్, రోటావైరస్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయాల్సి వచ్చింది. 2016లో నిర్వహించిన సదస్సులో కూడా ఇలాగే జరిగింది కానీ, అప్పట్లో ఆ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ బ్యానర్ పెట్టుకుంది. ఇవే తరహా వ్యాక్సిన్లు 50 చొప్పున ఆర్డర్ చేసినందుకు ఒక్కో డాక్టర్‌కు ముత్యాల సెట్లు ఇచ్చారు. వాటితో పాటు 200 వ్యాక్సిన్లు ఆర్డర్ చేసినవారికి ఐఫోన్ 5ఎస్‌లు కూడా ఇచ్చారు. -
నిఖిల్ వైద్య సేవలపై గందరగోళం
-
ఇంకా మానని గాయం..
► నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలపై గందరగోళం ► ప్రభావం చూపుతున్న తెలంగాణ వైద్య మండలి తీర్పు ► ఆంక్షలతో వైద్యం చేయలేని స్థితిలో డాక్టర్ చంద్రభూషణ్ సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలు అందించే అంశంపై గందరగోళం నెలకొంది. తెలంగాణ వైద్య మండలి తీర్పు నేపథ్యంలో నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో నిఖిల్‌కు ఇకపై వైద్యసేవలు ఎవరు అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఒప్పందం మేరకు గాయం పూర్తిగా మానే వరకు శస్త్రచికిత్స చేసిన డాక్టరే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించాలి. ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్యం అందించారు. అయితే తమకు కనీసం మాట కూడా చెప్పకుండా తమ కుమారునికి ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం అనైతికమని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఎంసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వైద్య మండలి చంద్రభూషణ్‌పై రెండేళ్లు వేటు వేసింది. తీర్పు నేపథ్యంలో ఆయన బాధితునికి వైద్యం చేయలేని స్థితి. ఆయన స్థానంలో ఎవరు వైద్యం అందిస్తారో కూడా ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. దీంతో నిఖిల్‌కు వైద్యసేవలు అందించే అంశం ప్రశ్నార్థకమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం: గ్లోబల్ యాజమాన్యం నిఖిల్‌కు వైద్యం చేసేందుకు ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఎంసీఐ ఆయనపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం బాధితుడు నడుస్తున్నాడు. మెట్లు కూడా ఎక్కి దిగుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. బాధితుడు నడవగలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించాం. దానికి వారి తల్లిదండ్రులు అంగీకరించారు. బాధితునికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తాం. ఇప్పటికే ప్రత్యామ్నాయ వైద్యులను కూడా ఏర్పాటు చేశాం. గాయాన్ని శుభ్రం చేసి 11 రోజులైంది నిఖిల్‌కు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేసి ఎనిమిది మాసాలైంది. ఇంకా గాయం మానలేదు. లేచి నాలుగు అడుగులు వేస్తే కాళ్లు వాస్తున్నాయి. ఇప్పటికీ భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. మా అభ్యంతరం మేరకు ఎత్తు పెంపు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. కానీ రెండు కాళ్లకు వేసిన రాడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గాయం మానకపోవడంతో దానికి కట్టుకట్టారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పటికప్పుడు కట్లను విప్పి శుభ్రం చేయాల్సి ఉన్నా.. 11 రోజుల నుంచి ఎవరూ రాలేదు. ఆస్పత్రికి ఫో¯ŒS చేస్తే.. సరైన స్పందన రావడం లేదు. అదేమంటే డాక్టర్‌పై ఫిర్యాదు చేసి.. సస్పెండ్ చేయించారు కదా.. అంటూ వైద్య సేవల బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. – గోవర్ధన్ రెడ్డి, నిఖిల్ తండ్రి -
జనరిక్ పేరుతోనే మందులు రాయాలి
వైద్యులకు ఎంసీఐ ఆదేశం సాక్షి, హైదరాబాద్: జనరిక్ పేరుతోనే మందులు రాయాలని వైద్యులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మళ్లీ ఆదేశించింది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌లో మందుల పేర్లను పెద్దక్షరాలతోనే (కేపిటల్ లెటర్స్) రా యాలని ఆదేశించింది. గతంలోనూ ఇదే ఆదేశాలు జారీ చేసినా అవి సరిగా అమలుకావడంలేదు. జనరిక్ అంటే జబ్బుకు డాక్టర్లు ఇచ్చే మందు (ఔషధం) మూల పదార్థం పేరు. మూల పదార్థం పేరుతోనే ప్రిస్క్రిప్షన్ రాయాలన్నది ఎంసీఐ తాజా ఆదేశం. ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో జనరిక్ పేరుతో మందులు రాసేలా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రైవేటు, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో జనరిక్ పేరుతో మందులు రాసే విధానాన్ని అమలు చేయడం సాధ్యంకాదని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. గతంలోనూ ఎంసీఐ ఇదే ఆదేశాలిచ్చిందని నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి టి.గంగాధర్ ‘సాక్షి’తో అన్నారు. -
విద్యార్థులకు న్యాయం చేయండి
-
విద్యార్థులకు న్యాయం చేయండి: రఘువీరా
హైదరాబాద్: మెడికల్ కౌన్సిలింగ్ లో ఏపీ ప్రభుత్వం అనుసరించిన అసంబద్ధ విధానాల మూలంగా రిజర్వేషన్ ఉన్న విద్యార్ధులు తీవ్రంగా నష్ట పోయారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని ఆయన గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ పూర్తి కాకుండానే ఏపీలో సీట్లు భర్తీ చేశారని దీంతో 550 సీట్లు బ్లాక్ చేయబడ్డాయని, పద్మావతీ కళాశాలలో సీట్లు విడిగా భర్తీ చేయడం, 127 సీట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు. నిత్యం బడుగుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఇందుకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంకు 2283 అయితే నాల్గవ కౌన్సిలింగ్ కి వచ్చే సరికి ఆ ర్యాంకు 3354 కు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో 2283 ర్యాంకు తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులు తీవ్రంగా నష్ట పోయారని వారందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన గవర్నర్ కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. -
కేఎంసీలో ‘మెడికల్ కౌన్సిల్’ తనిఖీలు
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని ఎంజీఎం, సీకేఎం, నేత్ర వైద్యశాల, హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, భీమారంలోని టీబీ ఆస్పత్రులలో గురువారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు తనిఖీలు చేశారు. కేఎంసీలో 200 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలతో పాటు ఫ్యాకల్టీ, పరికరాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. కోల్‌కతాకు చెందిన అభిమన్యు బస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వి.కె.దాస్, మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన పి.కె. ఖచార్, ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన రవీంద్రసింగ్ రాజ్బుట్ల బృందం తనిఖీలు చేపట్టింది. ఇద్దరు సభ్యులు కెఎంసీలో, మరో ఇద్దరు కేఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీలోని, బాలుర, బాలికల హాస్టళ్లను పరిశీలించారు. కళాశాలలో ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలను చూశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, దొడ్డ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, సీతమహాలక్ష్మి, పుషే్పందర్నాథ్ పాల్గొన్నారు. ఎంజీఎంలో తనిఖీలు.. కేఎంసీకి బోధనాస్పత్రిగా ఉన్న ఎంజీఎంలో ఎంసీఐ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఓపీ, క్యాజువాలిటీ, మెడికల్, సర్జరీ, అర్థో, అపరేషన్ థియేటర్, ఏఎంసీ, ఐసీసీయు, ఐఎంసీ, ఐసీఎస్యు వంటి అత్యవసర వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్యకు తగినంత మంది వైద్యులు ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఎంసీఐ బృందం ముందు నిరసన.. కేఎంసీలో ఎంసీఐ సభ్యులు నిర్వహిస్తున్న ఆయా విభాగాల వైద్యుల హెడ్ కౌంట్ విషయంలో వివాదం తలెత్తింది. ఉదయం 11 గంటల సమయంలో విభాగాల వారీగా ఉన్న వైద్యుల కౌంట్ తెలుపాలని ఎంసీఐ సభ్యులు ఉత్తర్వులు జారీ చేయగా ఆ సమయంలో కొంత మంది వైద్యులు అపరేషన్ థియేటర్లో ఉండడంతో పాటు రాత్రి వేళలో విధులు చేసిన వైద్యులు అలస్యంగా హాజరుకావడం వల్ల కొంత మంది వైద్యులు సంతకాలు చేయలేదు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అన్ని విభాగాల వైద్యులు కేఎంసీకి చేరుకుని హెడ్ కౌంట్‌కు హాజరు కాగా అలస్యంగా వచ్చిన వైద్యుల కౌంటింగ్‌ను పరిగణలోకి తీసుకోమని ఎంసీఐ సభ్యులు తెలుపడంతో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ విద్యాసాగర్ జోక్యం చేసుకుని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులకు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో హౌస్సర్జన్ల సమ్మె
పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న హౌస్సర్జన్లు మంగళవారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నారు. తమకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని, కనీస వసతులు కల్పించాలని వారు డిమాండం చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్య సేవలకు హౌస్సర్జన్లు హాజరుకావడంలేదు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకే తాము పనిచేస్తామని వారు స్పష్టంచేశారు. -
అక్కడ పనిచేసే అధికారులకు వెయిటేజీ ఇవ్వాల్సిందే
- గరిష్టంగా 30 శాతం వరకు వెయిటేజీ మార్కులివ్వొచ్చు - హైకోర్టు కీలక తీర్పు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలు, కష్టతర ప్రదేశాల్లో పనిచేసే ఇన్ సర్వీస్ వైద్య అధికారులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ ఇవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏడాదికి 10 శాతం చొప్పున గరిష్టంగా 30 శాతం మార్కులను వెయిటేజీగా ఇవ్వాలంది. ఈ సందర్భంగా వారు ఆయా ప్రాంతాల్లో ఎన్ని సంవత్సరాలు సేవలు అందించారో దానిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డాక్టర్ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ సోమవారం కీలక తీర్పు వెలువరించారు. ఇన్ సర్వీసు కింద 30 శాతం మేర వెయిటేజీ మార్కులను ఇవ్వాలంటూ తాను పెట్టుకున్న వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన డాక్టర్ డి.గోపాలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేశ్ కైత్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున పి.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలు, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ డాక్టర్ దినేశ్ సింగ్ చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీసు వారికి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పిటిషనర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేశారని తెలిపారు. అదేవిధంగా పలు మారుమూల ప్రాంతాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారన్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు పిటిషనర్ దరఖాస్తు చేసుకుని, మెరిట్లో 19వ ర్యాంకు సాధించారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, విస్తృత ప్రజా ప్రయోజనాల మేరకు గ్రామీణ, గిరిజన, మారుమూల, కష్టతర ప్రాంతాలు, ప్రదేశాల్లో పనిచేసిన వైద్యులకు ప్రోత్సాహకం కింద సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులో కూడా పిటిషనర్ దాదాపు 20 ఏళ్ల పాటు పలు చోట్ల సేవలు అందించిన విషయాన్ని ఆయన తన తీర్పులో గుర్తు చేశారు. -
వైద్య విద్యకు చికిత్స చేయమంటే ఇలా చేస్తారా?
న్యూఢిల్లీ : భారతదేశం 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపుకున్న రోజుల్లో కూడా దేశంలో కోట్లాది మంది పేదలకు వైద్యం అందక అకాల మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు లేకపోవడమే కాకుండా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లో, పల్లెల్లో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే కాకుండా పల్లెల వైపు చూసేందుకు కూడా వైద్యులు ఇష్టపడడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు దేశంలో ప్రైవేటు వైద్య విద్యను ప్రోత్సహించడం ఒక్కటే పరిష్కారమార్గమని స్వయంగా దేశ ప్రధాన మంత్రి చైర్మన్‌గా కొనసాగుతున్న ‘నీతి ఆయోగ్’ కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి తరుణంలో ప్రైవేటులో వైద్య విద్యను మరింత ప్రోత్సహించినట్లయితే ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో సులభంగానే ఊహించవచ్చు. పైగా ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఫీజులను కూడా చట్టం ద్వారా నియంత్రించవద్దని, మార్గదర్శకాలు రూపొందిస్తే సరిపోతుందని నీతి ఆయోగ్ తన నివేదికలో సిఫార్సు చేసింది. ఫీజులను చట్టపరంగా నియంత్రించడం వల్ల చట్ట వ్యతిరేకంగా ఫీజులు తీసుకుంటారని, ట్రస్టీలు, సొసైటీల కింద ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతించినప్పటికీ ప్రస్తుతం అనేక ప్రైవేటు ఆస్పత్రులు లాభాలు గడించడం లేదా? ప్రైవేటు వైద్య కళాశాలలు, ప్రైవేటు ఆస్పత్రులకు లాభాలను చట్టపరం చేస్తే తప్పేమిటని నీతి ఆయోగ్ ప్రశ్నిస్తోంది. ఈ తర్కంలో అంతరార్థం ఏమిటో నీతి ఆయోగ్‌కే తెలియాలి. ఇప్పటికే సీటు కోసం కోటి రూపాయలను వసులు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలకు ఫీజు విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తే ఆ ఫీజులు ఎన్ని కోట్ల రూపాయలకు పెరుగుతాయో అంచనా వేయవచ్చు. కోట్ల రూపాయల ఫీజులను కుమ్మరించి వైద్య విద్యను అభ్యసించే డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని ఎలా అనుకుంటున్నారో! ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్న వారే కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడానికి ప్రాధాన్యమిస్తున్న నేటి సమాజంలో వైద్య విద్య కాసులకు అమ్ముడుపోతే కానరాని పరిణామాలెన్నో. కార్పొరేట్ ఆస్పత్రులే వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాయి. అవే రెండు రకాలు లాభాలు గుంజుకుంటాయి. శవాలకు వైద్య చికిత్స అందిస్తూ బిల్లులు గుంజుతున్న ప్రైవేటు ఆస్పత్రులున్న నేటి పరిస్థితుల్లో పల్లెల్లో ఆస్పత్రులు నడిపే దాతలు ఎవరుంటారు. నీతి ఆయోగ్ సిఫార్లులను అమలు చేయడం అంటే నిలువు దోపిడీకి లైసెన్స్ మంజూరు చేయడమేనని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి సుజాతా రావు, పంజాబ్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ జీఎస్. గ్రెవాల్ లాంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలపాటు పార్లమెంట్ స్థాయి సంఘం కష్టపడి కసరత్తు చేసి తయారు చేసిన మార్గదర్శకాలను నీతి ఆయోగ్ ప్యానెల్ బుట్టదాఖలు చేసింది. వైద్య రంగంలో అవినీతిని అరికట్టడంలో భారత వైద్య మండలి విఫలమైన నేపథ్యంలో పార్లమెంట్ స్థాయి సంఘం గత మార్చిలో వైద్య విద్యా విధానంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మే నెలలో ఉన్నత స్థాయి కమిటీని వేసి సమస్యలను పరిష్కరించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలోనే ఈ నీతి ఆయోగ్ ప్యానెల్ ఆవిర్భవించింది. పేరులోని నీతిని పెట్టుకున్న ప్యానెల్ కార్పొరేట్ ఆస్పత్రుల అవినీతికి అమ్ముడు పోలేదా ? అన్న అనుమానాలు ప్రజల్లో కలగుతున్నాయి. 1980 దశకంలో కేంద్రం దేశంలో ప్రైవేటు ఆస్పత్రులకు తలుపులు తెరవడాన్ని విద్యావంతులు, నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెల్సిందే. -
దీర్ఘకాలం యవ్వనంతో ఉండటం సాధ్యమేనా?
నా వయసు 54 ఏళ్లు. ప్రత్యేకమైన వ్యాధులు, బాధలు లేవు. వయసు పెరుగుతుండటం వల్ల కనిపించే లక్షణాలు లేకుండా, దీర్ఘకాలం పాటు ఫిట్నెస్తో ఉండటానికి ఆయుర్వేదంలో మార్గాలు ఉన్నాయా? దయచేసి వివరించండి. - పేరి శ్రీరామశర్మ, బొబ్బిలి ఆయుర్వేదం వయసును బట్టి మానవుడి జీవన దశలను నాలుగుగా విభజించింది. అవి... ‘శైశవ, కౌమార, యౌవన, వార్థక్యాలు’. ఒక్కొక్క దశలో దానికి అనుగుణమైన జవసత్వాలుంటాయి. మానసిక పరిపక్వత కూడా అదేవిధంగా ఉంటుంది. శరీరంపై వలీ పలితాలు (వలి అంటే చర్మం ముడతలు పడడం, పలితం అంటే కేశం తెల్లబడడం) కనిపించకపోతే మనసుకు ముసలితనం అన్న భావనే కలగదు. వయసుకు అనుగుణమైన ఆరోగ్యాన్ని అందిస్తూ ఎప్పుడూ రోగాల బారిన పడకుండా ఉండాలన్నదే ఆయుర్వేద ఆశయం. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, బలంగా ఉంటూ మానసిక దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదం ‘ఆహార, విహార, ఔషధాల’ను నిశితంగా విశదీకరించింది. జరా అంటే ముసలితనం. జరామరణాలను శాశ్వతంగా జయించలేము. కానీ ‘అవి వచ్చేస్తున్నాయి, సమీపిస్తున్నాయి’ అనే భయాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేద సూత్రాలు, ఓషధులు ఉపకరిస్తాయి. ఆయుర్వేద అష్టాంగాలలో ‘రసాయనతంత్రం, వాజీకరణ తంత్రం’ అనే రెండు శాఖలు దీనికి సంబంధించినవే. మరణం వచ్చే వరకు యౌవనంలో ఉండే ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విషయం భగవాన్ ధన్వంతరీ ప్రార్థనశ్లోకంలో గమనించవచ్చు. నమామి ధన్వంతరిమాదిదేవం... లోకే ‘జరారుర్భయ మృత్యునాశం ... ధాతారమీశం వివిధౌషధీనాం...’’ రసాయనాలు: ఆధునిక పరిభాషలో కెమికల్స్‌ను రసాయనిక పదార్థాలంటారు. కెమిస్ట్రీని రసాయనశాస్త్రం అంటారు. కానీ ఈ సందర్భానికి ఆ అర్థం వర్తించదు. ఈ పదం ఆయుర్వేదశాస్త్రపు ప్రత్యేక సాంకేతిక పదం. శరీరంలోని సప్తధాతువులలో మొదటిది ‘రస’ధాతువు. రసధాతువు పరిపుష్టంగా ఉంటే మిగిలిన ఆరు ధాతువులు (రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రం) కూడా దృఢంగా ఉంటాయి. దీనికి సంకేతంగా ‘రసాయన’ అనే పదం ఉద్భవించింది. ఆయుర్వేదంలో కొన్ని వందల ఓషధులు, ఖనిజాలు రసాయన గుణాలు కలిగి ఉన్నాయి. అవి సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి: దీర్ఘాయుష్షు, జ్ఞాపకశక్తి, బుద్ధికుశలత, ఆరోగ్యం, యౌవనం (తరుణం వయః), తేజస్సు, శరీరకాంతి, చక్కటి కంఠస్వరం, దేహేంద్రియాలకు బలం, ప్రణతి (మానసిక ఉల్లాసం), కాంతి వర్థిల్లుతాయి. చరకసంహితాః సూత్రస్థానం: ‘‘...లభతేనా రసాయనాత్ లాభోపాయోహి శస్తానాం రసాదీనాం రసాయనం’’ వాజీకరణ ఔషధ ప్రయోజనం. ఇది కేవలం శృంగార సామర్థ్యవర్ధకమే కాదు. దేహపుష్టి, బలం (రోగనిరోధక శక్తి) కూడా వాజీకరణ ఔషధాల వల్ల పెంపొందుతాయి. (చరకుడు : ‘‘... యశః శ్రీయం బలం పుష్టిం వాజీకరణ మేవతత్’’ కాబట్టి కొన్ని ముఖ్యమైన రసాయన వాజీకరణ ద్రవ్యాలను వైద్యసలహా మేరకు అనునిత్యం సేవిస్తే ‘వయఃస్థాపకం’’గా పనిచేస్తాయని, అదే యౌవనానికి ప్రత్యామ్నాయమని, దీర్ఘాయుః కారకమని ఆయుర్వేదం ఉటంకించింది. చరకాచార్యులు ఓ పది ద్రవ్యాలను ప్రత్యేకించి ‘వయఃస్థాపకాలుగా పేర్కొన్నారు. ‘‘అమృతా అభయాధాత్రీ యుక్తా శ్వేతాజీవంతీ, అతిసారా, మండూక పర్ణీ, స్థిరా, పునర్నవా... ఇతి దశేమాని వయః స్థాపనాని భవంతి’’ తెలుగులో అవి... ‘‘తిప్పతీగె, కరక్కాయ, ఉసిరికాయ, సన్నరాస్నము, చల్లగుమ్ముడు, మనుబాల, పిల్లిపీచర, మండూకపర్ణి, బ్రాహ్మీ, గలిజేరు‘‘. వీటిలో దేనినైనా కషాయరూపంలో సేవించవచ్చు. బజారులో లభించేవి, నిత్యం వాడుకోదగినవి, దుష్ఫలితాలు లేని రసాయనాలు గుడూచీసత్వం (తిప్పసత్తు): 2 గ్రాములు రెండుపూటలా తేనెతో. త్రిఫలాచూర్ణం: 3 గ్రాములు ప్రతి రాత్రి తేనెతో శిలాజిత్ క్యాప్సూల్స్: రోజుకి రెండు కూష్మాండలేహ్యం / చ్యవనప్రాశలేహ్యం / అగస్త్యహరీతకీ రసాయనం ఒక చెంచా, రెండుపూటలా చప్పరించి పాలు తాగాలి. శతావరీ కల్ప: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా గృహవైద్యం: రోజుకు 5 తులసి, 2 మారేడు దళాలు నమిలి తినండి. ఆహారం: ఉప్పు, పులుపు, కారం చాలా తక్కువగా ఉండే సాత్విక శాకాహారం తీసుకోవాలి. మిత, సమీకృతాహారం దృష్టిలో ఉంచుకోవాలి. ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు వెన్న, ఆవు పెరుగు నిత్యం తీసుకోగల రసాయనాలు. విహారం: తగినంత నిద్ర, వ్యాయామం, ధ్యానం అవసరం. మానసికంగా శాంతం, ఉత్సాహం, సంతోషం అవసరం. శోక చింతా భయద్వేషాలు ఆయుఃక్షీణానికీ, వ్యాధులకు దారితీస్తాయి. ఒత్తిడిని అధిగమించడం కూడా అవసరమని తెలుసుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
డాక్టర్ నిరుద్యోగి...!
సాక్షి, హైదరాబాద్: మెడిసిన్‌లో సీటొస్తే చాలు జీవితంలో స్థిరపడినట్లేనని ఇన్నాళ్లూ భావించిన వారంతా ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. నాలుగేళ్ల వైద్యవిద్య, ఏడాది హౌస్ సర్జన్ శిక్షణ పూర్తి చేసుకొని మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో నర్సు ఉద్యోగం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పీజీ ఉంటే తప్ప గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ పట్టాలు పుచ్చుకున్న వారికి రాష్ట్రంలో ఎలాగూ ఉద్యోగాలు లేవు. ఇంజనీరింగ్, ఎంటెక్ పట్టభద్రులు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ పట్టాలు తీసుకున్న వైద్యులూ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల ఎంబీబీఎస్ చదివిన నిరుద్యోగుల సంఖ్య 15వేలకు చేరింది. వారిసంఖ్య ఏటా 3వేలు పెరుగుతోంది. ప్రభుత్వ విభాగంలో నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితులు బాగోలేకపోవడంతో ఎంబీబీఎస్ వైద్యులు నిరాశలో పడిపోయారు. అడ్డంగా వాడేసుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు సరిగ్గా మూడేళ్ల కిందట.. అంటే 2013 సెప్టెంబర్ 3న ఎంబీబీఎస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో 1,200 కుపైగా పోస్టులకు దరఖాస్తులు పిలిస్తే.. ఒక్కో పోస్టుకు 25 మందిపైనే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తుండడంతో ఎంబీబీఎస్ చదివిన వారు స్పందించడం లేదు. 2013 తర్వాత ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషనే ఇవ్వలేదు. దీంతో ఎక్కడైనా కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తామని వెళుతున్నా ఎంబీబీఎస్ వైద్యులను దారుణంగా వాడుకుంటున్నారు. క్యాజువాలిటీ లేదా ఎమర్జెన్సీ వార్డుల్లో రక్తపోటు, మధుమేహం, పల్స్ రేటు చూడటం వంటివి మినహా వాళ్లకు మరేమీ చెప్పరు. పైగా ఇలాంటి వాళ్లకు నైట్ డ్యూటీలు తప్ప పగలు ఏదైనా వైద్యం నేర్చుకునే పని చెప్పరు. రూ. 40వేలకు మించి జీతం ఇవ్వరు. దీంతో పీజీ సీట్లు రాని వేలమంది వైద్యులు తమ ఊర్లలోనే క్లినిక్‌లు నడుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వేలాదిమంది లక్షలు చెల్లించి రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదివి వచ్చారు. వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీజీ లేకుండా ఎంబీబీఎస్ దండగ..! పీజీ లేకుండా ఎంబీబీఎస్ చదవడం దండగ అని వేల మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో లక్షలు చెల్లించి చదివిన వారు మరింతగా బాధపడుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక రెండేళ్ల లోపు పీజీ సీటు రాకపోతే పోటీ పెరిగి తర్వాత పీజీ సీటు రావడం లేదని, పీజీ సీటుకు రెండు కోట్లు చెల్లించి ఎంతమంది చదవగలరని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల కిందట సర్కారు పీజీ చదివిన వైద్యులు కావాలని వైద్యవిధానపరిషత్లో నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 255 పోస్టులు ఉండగా.. దరఖాస్తులు 200 మాత్రమే వచ్చాయి. అందులో ఉద్యోగంలో చేరింది కేవలం 58 మందే. కాంట్రాక్టు ఉద్యోగాలంటే ఎంబీబీఎస్ వైద్యులే రాకపోతే, పీజీ వైద్యులకు కాంట్రాక్టులో నోటిఫికేషన్ ఇస్తే రారనేది అందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల కొరత వందలు కాదు వేలలో ఉంది. -
మంత్రి పీఏని... మెడికల్ సీట్ ఇప్పిస్తా !
రూ. 71 లక్షలు తీసుకొని టోకరా నిందితుడిపై కేసు బంజారాహిల్స్: తాను మంత్రి పీఏనని, ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని రూ. 71 లక్షలు వసూలు చేసి టోకరా ఇచ్చిన ఘ టనలో నల్లగొండకు చెందిన మేకల రఘురాంరెడ్డి బంజారాహిల్స్ఠాణాలో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్‌నెం. 14 నివాసి సయ్యద్ అత్తర్ హుస్సేనీ ఎంబీబీఎస్ సీటు కోసం యత్నిస్తున్నాడు. అతని బంధువు సల్మాన్ వచ్చి తనకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించే వ్యక్తి తెలుసని మేకల రఘురాంరెడ్డిని 2015 ఏప్రిల్‌లో పరిచయం చేశాడు. తాను మంత్రి పీఏ నని, తనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధికారులతో పరిచ యం ఉందని, వారి ద్వారా గతంలో చాలా మందికి మెడికల్ సీట్లు ఇప్పించానని రఘురాంరెడ్డి నమ్మబలికాడు. అత్తర్ హుస్సేనీకి ఎంబీబీఎస్ సీటు ఇప్పించేందుకు రూ. 85 లక్షలకు బేరం కుదర్చుకున్నాడు. మొదటి విడతలో అత్తర్ హుస్సేనీ రూ. 71 లక్షలు రఘరాంరెడ్డికి ఇచ్చాడు. కమీషన్ కింద సల్మాన్, నాగు అనే బ్రోకర్లకు రూ. 6 లక్షలు చెల్లించా డు. అయితే సీటు మాత్రం రాలేదు. ఇవేళ, రేపు అంటూ తిప్పుకొని..ఇంకో రూ. 14 ల క్షలు ఇస్తే ఎంసీఐలోని అధికారికి ఇచ్చి సీటు ఇప్పిస్తానని మళ్లీ బేరం పెట్టాడు. దీంతో తా ము మోసపోయామని గ్రహించిన బాధితుడు అత్తర్ హుస్సేనీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఘటన లో నల్లగొండ పోలీసులు రఘరాంరెడ్డిని ఇటీవలే అరెస్టు చేశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పది మెడికల్ కాలేజీల అనుమతికి నో!
తెలంగాణలో 6, ఏపీలో 4 కాలేజీలకు ఎంసీఐ నిరాకరణ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతులను నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా ఎంసీఐకి సిఫార్సు చేశాయి. ఈ మెడికల్ కాలజీల్లో 2016-17 విద్యాసంవత్సరం నుంచి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించాలని కోరగా ఎంసీఐ అందుకు అంగీకరించలేదు. ఈ కాలేజీల్లో కనీస వసతులు లేనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎంసీఐ లిఖిత పూర్వకంగా తెలియజేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లా పటాన్చెరులో అల్లేటి ఎడ్యుకేషన్ సొసైటీ కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలో శివారెడ్డిపేటలో కొత్త మెడికల్ కాలేజీకి, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ మిట్టపల్లిలో మరో మెడికల్ కాలేజీకి, అయ్యన్న ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారెడ్డి జిల్లా కనకకామిడిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, వరంగల్‌లో మరో కొత్త మెడికల్ కాలేజీకి, మెదక్ జిల్లా ములుగు మండలంలో ఆర్.వి.ఎం చారిటబుల్ ట్రస్టు కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎంసీఐ నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, చిత్తూరు జిల్లా రేణిగుంటలో కంచికామకోటి పీఠం మెడికల్ కాలేజీకి, చిత్తూరు జిల్లా శ్రీనివాస ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి, విశాఖపట్నం జిల్లా మర్రివలసలో గాయత్రి విద్యాపరిషత్ ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఎంసీఐ ఒప్పుకోలేదు. అలాగే ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అదనంగా 150 మెడికల్ సీట్లను కోరగా అందుకు నిరాకరించింది. విశాఖలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫాతిమా మెడికల్ కాలేజీలో 100 సీట్లకు, హైదరాబాద్‌లోని అపోలో కాలేజీలో 100 సీట్లకు ఈ ఏడాది అడ్మిషన్లు చేయవద్దని కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తగినంతగా లేరనే కారణంతో నాలుగు కొత్త కోర్సుల ప్రారంభానికి కూడా ఎంసీఐ అంగీకారం తెలుపలేదు. -
'వైద్యులు నైతిక విలువలకు కట్టుబడాలి'
విజయవాడ: ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు సమగ్ర వైద్యం అందించడంతో పాటు వైద్యులు నైతిక విలువలకు కట్టుబడి ఉండటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్హతలు, మెరిట్ ప్రతిపాదికన 1000 నర్సులు,501 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వైద్య ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు చెబుతున్నట్లు సమాచారం తమ వద్ద ఉన్నదని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 'ప్రస్తుత పరిస్ధితులలో సిఫార్సుల ద్వారా నా కొడుకు, కూతురుకు కూడ ఉద్యోగం ఇప్పించుకోలేనని.. అంత పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగ నియమకాలు చేపడుతున్నాం' అని మంత్రి కామినేని వెల్లడించారు. ఇప్పటివరకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల క్రింద లక్ష మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. గర్భిణీలకు మార్చి 8 వ తేది నుండి అల్ట్రా సౌండ్ పరీక్షలను ఉచితంగా చేస్తామని తెలిపారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
లక్షకు చేరువలో రిజిస్టర్డ్ వైద్యులు
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య లక్షకు చేరువవుతోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్లో పేర్లు నమోదు చేసుకున్న వైద్యుల సంఖ్య ఆధారంగా ఇప్పటివరకూ 90 వేలకు చేరింది. మరో ఏడాదిలోనే ఆ సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఉమ్మడిగానే ఉంది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న వైద్యుల్లో 60 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారుండగా.. 30 వేల మంది పీజీ పూర్తి చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏటా 6 వేల మంది ఎంబీబీఎస్ పట్టాలు తీసుకుంటున్నారు. వెయ్యి మంది పీజీ పట్టాలు అందుకుంటున్నారు. రిజిస్టర్ వైద్యులు లక్షకు చేరువవుతున్నా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపు 15 వేల మంది వైద్యులు పనిచేయాల్సి ఉంటే ప్రస్తుతం 7 వేల మంది మాత్రమే ఉన్నారు. గత కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ఎంబీబీఎస్‌తో ఉద్యోగాలు లేవు.. ఉభయరాష్ట్రాల్లో పీజీ సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఎంబీబీఎస్ చేసిన అందరికీ పీజీ పూర్తి చేయడం సాధ్యం కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్‌తో అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రైవేటులోనూ ఉద్యోగావకాశాలు ఉండటంలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 15 వేల మందికి పైగా ఎంబీబీఎస్ నిరుద్యోగులున్నట్టు అంచనా. ఎంసీఐలో ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్‌కు వస్తున్న వివరాల ప్రకారం సుమారు 20 వేల మంది వైద్యులు విదేశాల్లో స్థిరపడినట్టు అంచనా. వీళ్లలో మెజారిటీ వైద్యులు పీజీ పూర్తి చేసిన వారే. అయితే ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లడం కొంచెం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగానే కార్పొరేట్ ఆస్పత్రులు పెరగడం, పీజీ వైద్యులకు అవకాశాలు వస్తుండటంతో ఇక్కడే స్థిరపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎంబీబీఎస్ చదివిన వారి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఎంబీబీఎస్ పూర్తిచేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరితే నైట్ డ్యూటీ డాక్టర్లుగా వేస్తున్నారు. సొంతంగా క్లినిక్‌లు పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు.. ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా స్పెషాలిటీ డాక్టర్లు క్లినిక్‌లు తెరుస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌ల పరిస్థితి ఘోరంగా ఉంది. అయినా... తక్కువే మెడికల్ కౌన్సిల్లో వైద్యుల నమోదు గణనీయంగా ఉన్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల మందికి కూడా ఒక డాక్టరు ఉండటంలేదు. పీజీ చేసిన వైద్యులు ఓ స్థాయి పట్టణ ప్రాంతాలకే పరిమితం కావడం, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి మొగ్గుచూపకపోవడం దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు. -
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు
-
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు
► ఉత్తర్వులు జారీచేసిన వైద్య ఆరోగ్యశాఖ ► రాష్ట్రంలో వైద్యం చేయాలంటే కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ► ఆస్పత్రుల పర్యవేక్షణ, నకిలీ డాక్టర్ల గుర్తింపు బాధ్యతా కౌన్సిల్‌దే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పా టైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోప్రపంచంలో ఎక్కడ వైద్య విద్య పూర్తిచేసినా తెలంగాణలో వైద్యం చేయాలంటే ఈ కౌన్సిల్ లో తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాష్ట్రం విడిపోయినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లోనే వైద్యులు తమ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. తాజాగా రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు కావడంతో తెలంగాణ వైద్యులకు వెసులుబాటు కలిగింది. ఇప్పటికే తెలంగాణలో ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. మెడికల్ కౌన్సిల్‌కే ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యత కొత్తగా ఏర్పాటైన మెడికల్ కౌన్సిల్ రాష్ట్రంలో ఆస్పత్రులపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రమాణాలకు విరుద్ధంగా ఆస్పత్రులను నడిపే వారిపై చర్యలు తీసుకునే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది. నకిలీ డాక్టర్లను గుర్తించడం కూడా కౌన్సిల్ బాధ్యతే. కౌన్సిల్లో సభ్యులుగా డాక్టర్ రాజ్ సిద్దార్థ్, డాక్టర్ వి.రాజలింగం, డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇ.రవీంద్రరెడ్డి, డాక్టర్ జగన్మోహన్రావు, డాక్టర్ బి.రమేష్కుమార్లు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు వైద్య విద్య సంచాలకులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్లు సభ్యులుగా ఉంటారు. -
మళ్లీ తనిఖీలకు ఆదేశాలివ్వడం సరికాదు
♦ ‘వైద్యకళాశాలల్లో అదనపు సీట్ల మంజూరు’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ♦ ‘మిమ్స్’ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన ధర్మాసనం ♦ ఓసారి ఎంసీఐ తనిఖీల తరువాత మళ్లీ తనిఖీలకు ఆదేశాలివ్వరాదు ♦ మిమ్స్‌లో మరోసారి తనిఖీలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రద్దు సాక్షి, హైదరాబాద్: వైద్య కళాశాలల్లో అదనపు సీట్ల మంజూరు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఒకసారి సంబంధిత కాలేజీలో తనిఖీలు నిర్వహించి అదనపు సీట్ల మంజూరుకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కాలేజీలో సౌకర్యాలు లేవని తేల్చినప్పుడు... అదే అంశంపై మళ్లీ తనిఖీల నిర్వహణకోసం ఆదేశాలివ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(మిమ్స్-హైదరాబాద్)కు 50 అదనపు సీట్లు మంజూరు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. 50 అదనపు సీట్ల మంజూరుకు సంబంధించి మిమ్స్‌లో మరోసారి తనిఖీలు నిర్వహించాలంటూ ఎంసీఐని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసింది. ఒకసారి తనిఖీలు నిర్వహించి అదనపు సీట్ల మంజూరుకు మిమ్స్‌కు అర్హత లేదని ఎంసీఐ తేల్చినప్పుడు.. మరోసారి తనిఖీలకు ఆదేశాలు జారీచేయడం చట్టపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఉన్నత ప్రమాణాల్ని నిర్దేశించి దేశంలో వైద్యవిద్యను పర్యవేక్షిస్తున్న అత్యున్నత సంస్థ(ఎంసీఐ)ను అది నిర్దేశించిన ప్రమాణాలనుంచి తప్పుకోవాలని న్యాయవ్యవస్థ ఆదేశించజాలదంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ రమేష్ దవే, ఆదర్శ్ కుమార్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ‘‘ఓ సంస్థలో విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చే స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకుంటే.. ఒకవేళ ఆ విద్యార్థులు తుదిపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వారు నిజజీవితంలో మంచి వృత్తి నిపుణులుగా తయారుకాలేరు. ఈ కేసులోనూ ఎంసీఐ నిర్దేశించిన ప్రమాణాల మేరకు మిమ్స్‌లో సౌకర్యాలు లేవు. అందువల్ల 50 అదనపు సీట్ల మంజూరు సాధ్యం కాదు. అయినప్పటికీ మరోసారి తనిఖీలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎంతమాత్రం సరికాదు. వాటిని రద్దు చేస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వివాదం పూర్వాపరాలివీ... 2012-13 విద్యాసంవత్సరానికి మిమ్స్‌కు ఎంసీఐ 100 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. తరువాతి విద్యాసంవత్సరానికి మరో 50 అదనపు సీట్లను పొందగలిగింది. ఈ 50 అదనపు సీట్ల ఉత్తర్వుల్ని 2014-15 సంవత్సరానికి పొడిగించాలన్న మిమ్స్ అభ్యర్థనను ఎంసీఐ తోసిపుచ్చింది. 2015-16 సంవత్సరానికి కూడా మిమ్స్ అటువంటి దరఖాస్తు పెట్టుకోగా, తనిఖీలు నిర్వహించిన ఎంసీఐ.. నిర్దేశించిన ప్రమాణాల మేరకు సౌకర్యాలు లేవని తేలుస్తూ అదనపు సీట్ల మంజూరు సాధ్యం కాదని తేల్చింది. దీనిపై మిమ్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, న్యాయమూర్తి జయంత్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం.. మిమ్స్‌లో మరోసారి తనిఖీలు నిర్వహించాలంటూ ఎంసీఐని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని సవాలుచేస్తూ ఎంసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ ఏ.ఆర్.దవే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష
ఎంసీఐ ఆమోదం న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమ సిఫారసులను కేంద్ర ఆరోగ్యశాఖకు పంపించింది. ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సంబంధించిన ప్రతిపాదనలపై ఎంసీఐ అభిప్రాయం కోరిందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ఈనెల 1వ తేదీన ఎంసీఐ సర్వసభ్య సమావేశం ఆమోదముద్ర వేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు, వివిధ ప్రైవేటు మెడికల్ కళాశాలల సంఘాలు సొంతంగా ప్రవేశపరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. విద్యార్థులు విడివిడిగా ఆయా ప్రవేశపరీక్షలు రాయాల్సి వస్తోంది. ఉమ్మడి ప్రవేశపరీక్షల విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు లాభం కలుగుతుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, 2009లోనే ఎంసీఐ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినప్పటికీ, ఎంసీఐ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1956కు సవరణ తేవాలని, దానివల్ల ఉమ్మడి పరీక్షపై నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుందని ఎంసీఐ ప్రభుత్వాన్ని కోరింది. -
‘ప్రైవేటు’కు తలొగ్గిన ఎంసీఐ?
వైద్య కళాశాలల నిబంధనల్లో సడలింపు పడకల కనీస పరిమితి 700 నుంచి 300కు తగ్గించడంపై విమర్శలు హైదరాబాద్: వైద్య విద్యలో ప్రైవేటు కళాశాలల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లను పెంచుకోవడం, వాటి భర్తీకి సొంతంగా ప్రవేశపరీక్షకు అంగీకరింపజేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) కూడా ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పడకల సంఖ్య, బోధనా సిబ్బంది తదితర మౌలిక సదుపాయాలపై నిబంధనలను ఎంసీఐ సడలించడమే దీనికి కారణం. ఎంసీఐ తాజా నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల వైద్య విద్య ప్రమాణాలు పడిపోతాయని వైద్య విద్యార్థులు పేర్కొంటున్నారు. పాత నిబంధనల ప్రకారం 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులున్న వైద్య కళాశాల ప్రారంభించాలంటే 700 పడకల ఆసుపత్రి ఉండాలి. కానీ దీనిని 300కు కుదించారు. బోధనా సిబ్బంది సంఖ్యను కూడా ప్రస్తుతమున్న సంఖ్య కంటే మూడొంతులు తగ్గించినట్లు తెలిసింది. ఈ నిబంధనల సవరింపును అడ్డం పెట్టుకొని వైద్య కళాశాలలు ప్రస్తుతమున్న సీట్లను రెండింతలు చేసుకునే అవకాశముంది. ‘బిర్లా’లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు హైదరాబాద్: జి.పి. బిర్లా ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెట్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్మెంట్లో ఏడాది డిప్లొమా కోర్సు సెప్టెంబర్ నుంచి నిర్వహిస్తున్నట్లు జి.పి. బిర్లా సైన్స్ సెంటర్ డెరైక్టర్ బి.జి.సిద్దార్థ్ వెల్లడించారు. ఈ కోర్సులపై అవగాహనకు 22 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9866082945/ 23241061/ 23235081 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ‘ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం లేదు’ సాక్షి, హైదరాబాద్: జూన్‌లో జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో శిరీష అనే విద్యార్థినికి నిబంధనల ప్రకారమే ఈ-2 గ్రేడ్ ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తెలిపారు. ‘ఎస్ఎస్సీ’ నిర్వాకంతో ఆమెకు నష్టం జరిగిందంటూ మంగళవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆమె స్పందించారు. ఆ విద్యార్థిని లెక్కలు-1 పరీక్షకు హాజరు కాలేదని, లెక్కలు-2 పరీక్ష రాసి సీ-2 గ్రేడ్ సాధించినప్పటికీ ఈ-2 గ్రేడ్ ఇవ్వాలని నిబంధనలున్నట్లు తెలిపారు. -
మెడికల్ కౌన్సెలింగ్‌లో పాము కలకలం
చిలకలగూడ: మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో ఓ పాము కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనంలో సోమవారం ఉదయం మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతుండగా.. 11 గంటల సమయంలో ప్రాంగణంలోకి పాము ప్రవేశించింది. అది చూసి విద్యార్థులు, నిర్వాహకులు భయాందోళన చెందారు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చిలకలగూడ ఠాణాకు సమాచారం అందించారు. ఠాణాలో విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పాము కొండచిలువ జాతికి చెందిన ప్యాచ్సాండ్బోవ రకం అని.. కాటు వేయకుండా కరవడం దీని ప్రత్యేకత అని తెలిపాడు. పట్టుకున్న పామును ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి అప్పగిస్తే, అడవుల్లో వదిలిపెడతారని చెప్పాడు. -
కరిక్యులంలో ‘సామాజిక సేవ’కే పెద్దపీట!
మెడికల్ కాలేజీలో సీటు కోసం విపరీతమైన డిమాండ్... లక్షలు వెచ్చించేందుకైనా వెనుకాడని పరిస్థితి. దీంతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి కమర్షియల్‌గా మారుతోందనే సర్వత్రా విమర్శలు. మరో వైపు ఆధునిక అవసరాలకు తగ్గట్లు సిలబస్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఎంసీఐ 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాశ్ మిశ్రాతో గెస్ట్‌కాలం... ప్రపంచంలో ఎక్కువ మంది వైద్య నిపుణులను అందిస్తున్న దేశంగా మనకు గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా 400 వైద్య కళాశాలల్లో 56 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కానీ వైద్య విద్యా విధానంలో నాణ్యత ప్రమాణాలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంబీబీఎస్ కొత్త కరిక్యులం నాణ్యతా ప్రమాణాలను పెంచే విధంగా ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ విధానాల్లో మార్పులు ఉంటాయి. వైద్య వృత్తి ప్రధాన ఉద్దేశమైన సమాజ సేవ భావనను పెంపొందించేలా సిలబస్ ఉంటుంది. సిలబస్‌లోని అంశాలు అభ్యసనం, నాణ్యత, సామాజిక కోణాలు.. కొత్త సిలబస్‌లో ప్రధానాంశాలుగా ఉంటాయి. వాస్తవ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీని రూపకల్పన జరిగింది. అవసరాలకు తగ్గట్లు కరిక్యులంను నిరంతరం సమీక్షిస్తుంటేనే నాణ్యత సాధ్యమౌతుంది. కొత్త కరిక్యులం నమూనాకు ఎంసీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంసీఐ జనరల్ బాడీలు ఆమోదం తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి వస్తుంది. కనీస ప్రమాణాలు తప్పనిసరి కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ఎంసీఐ నిబంధనలు సరళం చేయాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంసీఐ యాక్ట్ - 1956లో 33వ సెక్షన్లో కొన్ని కనీస ప్రమాణాలను సూచించింది. ఈ సదుపాయాలు ఉంటేనే ఇటు విద్యార్థులు, అటు రోగుల కోసం టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరుతుంది. అలా లేకుంటే ప్రజలను రోగాల నుంచి కాపాడాల్సిన వైద్య వృత్తి నాణ్యత విషయంలో రాజీ పడినట్లవుతుంది. ‘నకిలీ’ వాస్తవమే మౌలిక సదుపాయాలు, బోధన పరంగా ఎన్నో నిబంధనలు విధించాం. అయినా ఎంసీఐ పర్యవేక్షణ కమిటీల తనిఖీ సమయంలో నకిలీ ఫ్యాకల్టీ, మెటీరియల్, సదుపాయాలు వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకునేందుకు ఎంసీఐ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఏదైనా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ లోపాలును గుర్తించినప్పుడు సదరు కమిటీ ఎంసీఐ ఎథిక్స్ కమిటీకి నివేదిక అందిస్తుంది. దీని ఆధారంగా ఎంసీఐ సంబంధిత మెడికల్ ఇన్స్టిట్యూట్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. శాస్త్రీయంగా ఫీజుల పెంపు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫీజుల పెంపు అధికారం రాష్ట్రాలకు కల్పించారు. ఆయా రాష్ట్రాల మధ్య ఎంబీబీఎస్ ఫీజుల వ్యత్యాసాలకు కారణం ఇదే. మెడికల్ సీటు ఫీజుల పెంపు శాస్త్రీయంగా ఉండాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమించాలి. పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి అధ్యక్షులుగా, విద్యావేత్త, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉండాలి. ఆయా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు అందించే ప్రతిపాదనలు, వాస్తవాలను పరిశీలించిన తర్వాత కమిటీ ఫీజులపై సిఫార్సులు చేస్తుంది. ఆ రాష్ట్రాలు ఫీజులును నిర్ణయించాలి. ఇంటర్న్‌షిప్ వ్యతిరేకత ఇందుకే మెడికల్ గ్రాడ్యుయేట్లకు తప్పనిసరి చేసిన రూరల్ ఇంటర్న్‌షిప్‌పై విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది. రూరల్ హెల్త్ సెంటర్స్‌లో మౌలిక సదుపాయాల లేమి ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరగడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్న్‌షిప్ ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడే విద్యార్థుల్లో ఇంటర్న్‌షిప్ పట్ల ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది. సేవాభావం పెంచుకోవాలి వైద్య విద్య, వృత్తులను పవిత్రమైనవిగా భావించాలి. తమ వల్ల సమాజానికి మేలు జరగాలి అనే సేవా భావం పెంచుకోవాలి. అప్పుడే ఈ కోర్సు ఉద్దేశం నెరవేరుతుంది. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత మెడికల్ విద్యా విభాగంలో వస్తున్న మార్పులపై అప్డేట్ అవుతూ ముందుకు సాగాలి. -
ప్రైవేటు పీజీ వైద్య విద్యార్థులకు ఊరట
డబ్బులు డిమాండ్ చేస్తున్న కళాశాలలపై చర్యలు హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు పీజీ విద్యార్థులకు గౌరవ భృతి ఇవ్వాల్సి ఉండగా... వారి నుంచే డబ్బులు వసూలు చేస్తుండటంపై భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాలు, గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి రాజేశ్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)కి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. సంబంధిత వైద్య కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆసుపత్రుల ఆదాయంతోనే భృతి.. ప్రైవేటు వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రి ఉంటుంది. వాటిల్లో పీజీ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. సేవలు చేసినందుకు వారికి గౌరవ భృతిని సంబంధిత కళాశాల యాజమాన్యమే చెల్లించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా విద్యార్థుల నుంచే ఏడాదికి రూ. 2.90 లక్షలను ముందస్తుగా వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తాన్నే విద్యార్థులకు భృతిగా చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎంసీఐ పీజీ కమిటీ ఛైర్మన్ భగవాన్ తివారీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎంసీఐ స్పందించింది. పీజీ వైద్యుల కౌన్సిలింగ్ మ్యాట్రిక్స్.. ఏడాదిపాటు ‘తప్పనిసరి’ వైద్య సేవలందించాలనే నిబంధనపై భర్తీ చేయనున్న పీజీ వైద్యుల కౌన్సెలింగ్ మ్యాట్రిక్స్‌ను వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో 685 మంది వైద్య విద్యార్థుల నియామకాలు జరపనుండగా... ఇందులో 566 మందిని బోధనాసుపత్రుల్లో, 119 మందిని వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నారు. సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వైద్య విద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నియామకాల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ వైద్య కాలేజ్‌లు, అనుబంధ ఆసుపత్రుల్లో వైద్యులను కేటాయించనున్నారు. -
రెండో బ్యాచ్ టెన్షన్
నెల్లూరు (అర్బన్) : ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండో బ్యాచ్ (మెడికల్ సీట్లు) ప్రారంభం కోసం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి రావాల్సిన అనుమతులపై ఉత్కంఠ నెలకొంది. ఎంసెట్ పరీక్ష ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి కొద్దిరోజుల్లో మెడికల్ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం తనిఖీచేసి నెలరోజులు దాటినా ఇంతవరకు రెండో బ్యాచ్‌కు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల అధికారుల్లో ఆందోళన నెలకొంది. నెలరోజులు దాటినా.. రెండో బ్యాచ్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఏప్రిల్ 27వ తేదీన రెండోసారి ఎంసీఐ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం మెడికల్ కాలేజీకి వచ్చింది. సిబ్బంది కొంత తక్కువగా ఉండటం, హాస్టళ్లలో పూర్తిస్థాయి సదుపాయాలు లేకపోవడం, ఫర్నీచర్ కొరత, జీజీహెచ్‌లో లోపాలను ఎంసీఐ గుర్తించినట్లు తెలిసింది. అధికారుల అంచనా ప్రకారం ఎంసీఐ తనిఖీ చేసి వెళ్లిన నెలరోజుల్లోపే అనుమతుల విషయంపై తేల్చేస్తారు. అయితే ఈసారి నెల రోజులు దాటినా ఎంసీఐ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అందరిలోనూ భయం నెలకొంది. ఎమ్మెల్యేలు స్పందించాకే... ఎంసీఐ నుంచి ఇంకా అనుమతుల విషయంపై నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు స్పందించిన తర్వాత కళాశాల అధికారుల్లో చలనం వచ్చింది. అనుమతులు రాకపోతే విద్యార్థులు నష్టపోతారని ఎమ్మెల్యేలు డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు గత నెల 29న కళాశాలకు వచ్చి అధికారులతో మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా అనుమతులు వస్తాయని ఆరాతీశారు. ఈ విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాలని సదరు అధికారులకు సూచించారు. అధికారులు మే నెలాఖరులోగా వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఎంసీఐ నుంచి అనుమతులు రాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇది జరిగాక మంత్రి నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ఎంసీఐ ఏం పరిశీలించింది? లోపాలు ఏమిటని తెలుసుకొని వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. అనంతరం దీనిపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. కాలేజీ అధికారులు ఎంసీఐ గుర్తించిన లోపాల గురించి, వాటిని సర్దుబాటు చేసిన వివరాలను డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఎంసీఐ అనుమతి ఇవ్వలేని పక్షంలో మే ఆఖరివారంలో పిలిచి చెబుతుందని, అయితే ఇంతవరకు తమకు ఎంసీఐ నుంచి పిలుపురాలేదని మరికొద్దిరోజుల్లో ఎంసీఐ అనుమతి వస్తుందని ఆశాభావంగా ఉన్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రావు చెబుతున్నారు. అయితే ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఎంసీఐ తనిఖీలు
- కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో పరిశీలన - నేడు సీకేఎం, జీఎంహెచ్, టీబీ ఆస్పత్రుల సందర్శన ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల అనుబంధ వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రితోపాటు వర్ధన్నపేట పీహెచ్సీ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. కేఎంసీ కళాశాలలో 150 సీట్లతో పాటు అదనంగా పెంచిన 50 సీట్లకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలు ఉన్నాయా.. లేదా అని సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎన్.మండల్ మౌలానా అజాద్, కోల్‌కతాకు చెందిన బట్ బయల్, గుజరాత్‌కు చెందిన సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్ వర్మ ఉదయాన్నే కేఎంసీకి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. మొదటగా కళాశాలలోని 16 విభాగాలకు చెందిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా.. అని రికార్డులు పరిశీలించారు. అనంతరం గత సంవత్సరం ఎంసీఐ బృందం ఎత్తిచూపిన లోపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.18.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన బాయ్స్, గర్ట్స్ హాస్టల్స్ నూతన భవనాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న అకాడమిక్ హాల్ భవనం, లెక్చరర్స్ హాల్, గ్రంధాలయాల భవనాలను సందర్శించారు. -
అయినా.. డాక్టర్ మారలేదు!
8 మంది రిజిస్ట్రేషన్లు రద్దు అయినప్పటికీ కొనసాగిస్తున్న వైద్యం ప్రశ్నించే నాథుడు కరువు సాక్షి, హైదరాబాద్: అవసరం లేకున్నప్పటికీ వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఏపీ, తెలంగాణలకు చెందిన 8 మంది వైద్యుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసింది. ఫలితంగా వారు ఇకపై ఎలాంటి వైద్య సేవలూ అందించరాదు. అయితే, సదరు డాక్టర్లు మాత్రం రిజిస్ట్రేషన్ల రద్దు వ్యవహారాన్ని లైట్‌గా తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం చేస్తున్నారు. వైద్య వృత్తి నిబంధనలకు ఈ పరిణామం వ్యతిరేకమైనప్పటికీ.. అడిగేవారు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు రద్దయిన వైద్యులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఓ ఆస్పత్రిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఓ డాక్టరు అవసరం లేకున్నా ఆపరేషన్ చేశారు. దీనిపై ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సర్జన్ రిజిస్ట్రేషన్ రద్దయింది. అయినప్పటికీ సదరు వైద్యుడు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ రద్దయ్యాక తిరిగి పునరుద్ధరించేవరకూ ఎలాంటి వైద్యమూ చేయకూడదని మెడికల్ కౌన్సిల్ నిబంధనల్లో ఉంది. అయినప్పటికీ సదరు డాక్టరు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే, తాజాగా మరో నలుగురు వైద్యులపై కూడా మెడికల్ కౌన్సిల్‌కి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా సదరు డాక్టర్లపై కౌన్సిల్ కొరడా ఝుళిపించే అవకాశం ఉంది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు వైద్యంలో భాగంగా రోగిని మోసం చేయడం కంటే దుర్మార్గమైన చర్య మరొకటి లేదు. అనైతిక వైద్యంపై ఎంసీఐ వైద్యుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తే, తిరిగి పునరుద్ధరించేవరకూ ఆ డాక్టర్లు ఎలాంటి వైద్యమూ చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్ చర్యల కిందకు వస్తుంది. వారిపై ఎంసీఐకి ఫిర్యాదు చేస్తాం. - డా.కె.రమేష్‌రెడ్డి, ఎంసీఐ సభ్యులు -
పీజీ సీట్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ, క్షయ ఆస్పత్రిని వికారాబాద్‌లోని అనంతగిరి టీబీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పీజీ వైద్య సీట్లు కోల్పోకుండా సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బోధనాసుపత్రిగా ఉన్న ఛాతీ ఆస్పత్రిలోని విభాగాలను ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించింది. వైద్య కళాశాలలకు బోధనాసుపత్రి 10 కిలోమీటర్ల లోపు దూరంలో ఉండాలనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధన. కానీ ఆయా ఆసుపత్రుల నుంచి వికారాబాద్ ఛాతీ ఆసుపత్రికి 60 కి.మీ.ల పైగా దూరం ఉంటుంది. అంటే ఎంసీఐ నిబంధన ప్రకారం తరలింపు వల్ల 10 పీజీ వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సర్కారు పై విధంగా ఆలోచన చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి చె ప్పారు. -
పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు
పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు మరో 86 పీజీ సీట్లకు ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు లేకపోవడంతో.. మంజూరైనా ఇప్పటివరకు గుర్తింపు లేకుండా ఉన్న 49 సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ పీజీ సీట్లకు గుర్తింపునిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. అందులో సూపర్ స్పెషాలిటీ సీట్లు 8 ఉండగా... బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లు 41 ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ సీట్లు 6, గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ సీట్లు 2 ఉన్నాయి. ఇక బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంఎస్ జనరల్ సర్జరీ సీట్లు 11, ఎండీ అనస్థీషియా సీట్లు 9, ఎండీ బయో కెమిస్ట్రీ 4, ఎండీ డీవీఎల్ 4, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 3, ఎండీ ఫోరెన్సిక్ మెడిసిన్ 3, ఎండీ రేడియోథెరపీ 2, ఎండీ మైక్రో బయాలజీ 2, ఎండీ ఫార్మకాలజీ 2 సీట్లు గుర్తింపు పొందాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఎండీ డీవీఎల్కు చెందిన ఒక్క సీటుకు కూడా ఎంసీఐ గుర్తింపునిచ్చింది. వాస్తవంగా ఈ సీట్లకు వచ్చే ఏడాది మే నెల నాటికి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంసీఐ ఆదేశించింది. అయితే గడువుకు ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలావుండగా రాష్ట్రానికి అదనంగా మరో 86 పీజీ మెడికల్ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు తయారుచేసి పంపింది. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 47, గాంధీ మెడికల్ కాలేజీకి 13, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి 26 సీట్లు కావాలని ప్రతిపాదించింది. ఇవి గనుక మంజూరైతే ఈ మూడు కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న 516 సీట్లకు కలిపితే మొత్తం 602 పీజీ సీట్లు కానున్నాయి. -
జస్టిస్ వర్మ మృతికి కారణాలేంటి?
ఎంసీఐకి కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి ఆదేశం న్యూఢిల్లీ: వైద్య నిర్లక్ష్యం వల్లే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ మరణించారన్న ఆరోపణలపై తీసుకున్న చర్యలను బహిర్గతపరచాలంటూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గురువారం భారత వైద్య మండలి(ఎంసీఐ)ని ఆదేశించారు. గుర్గావ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వర్మ 2013 ఏప్రిల్‌లో మృతిచెందారని, దీనిపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్యతో పాటు మరో 34 మంది నాటిప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ చర్యలు, ఆస్పత్రి వివరాలు తెలపాలని సుభాష్ అనే వ్యక్తి సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించగా సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఎంసీఐకి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవృత్తికి జీవితాంతం అంకితమైన న్యాయకోవిదుడు పదవీ విరమణ తర్వాత అద్దె ఇంట్లో నివసించారని, ఆయన మృతిపై అనుమానాలు రావడం ఆందోళనకరమని అన్నారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించిన వారికి బంగళాలు, వైద్యసాయం వంటి ప్రభుత్వ సదుపాయాలు అందుతుంటే సీజేఐగా పనిచేసి రిటైరైన వ్యక్తికి ఆ సేవలేవీ అందలేదన్నారు. -
కేఎంసీలో ఎంసీఐ తనిఖీ
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రులైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రి, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం సభ్యులు సోమవారం పర్యటించారు. గత ఏడాది ఎంసీఐ సభ్యు లు తనిఖీలు నిర్వహించినపుడు కళాశాల పరిధిలో 150 సీట్లలో అదనంగా పెంచిన 50 సీట్లకు సౌకర్యాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు డీఎంఈ పుట్ట శ్రీని వాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ ఢిల్లీలో ఎంసీఐ సభ్యులను కలిసి వసతులు కల్పిస్తామని పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో పెంచిన సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో ఎంసీ ఐ సభ్యులు దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), అరుణ్‌వ్యాస్ (అహ్మద్‌బాద్), జేఎం జడేజా (అహ్మద్‌బాద్), సుమన్ బన్సాలీ (జోధ్‌పూర్) తనిఖీ చేశారు. విడివిడిగా పరిశీలనలు కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యవిద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను దేశ్‌ముఖ్, అరుణ్‌వ్యాస్ క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా ఓపీ విభాగంతోపాటు బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్, రెడియోలజీ, అత్యవసర చికిత్స విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఐసీసీయూ, మెడికల్, సర్జికల్ వార్డులను సందర్శించారు. రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. మరో ఇద్దరు ఎంసీఐ సభ్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేఎంసీలో తనిఖీ చేశారు. సీకేఎంతోపాటు జీఎంహెచ్‌లో కూడా తనిఖీలు కొనసాగారుు. సభ్యులు ఆస్పత్రిలోని గైనిక్, పోస్టు ఆపరేటివ్, లేబర్, స్కా నింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి పరిపాలనాధికారులతో సమావేశమై ఆస్పత్రిలోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కేఎంసీలో సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొ త్తం 9 గంటలపాటు ఎంసీఐ తనిఖీలు నిర్వహించింది. కాగా, గత ఏడాది కేఎంసీ సీనియర్ రెసిడెన్సీలో సౌకర్యాలు సక్రమంగా లేవని ఎంసీఐ తనిఖీల్లో తేలగా, ఈ లోపాలను సవరించినట్లు అధికారులు తెలిపారు. నేడు డీఎంఈ రాక కళాశాలలో ఎంసీఐ సభ్యులు తనిఖీ లు నిర్వహిస్తున్న సమయంలో జూని యర్ డాక్టర్లు సమ్మెలో ఉండడంతో మెడికల్ సీట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు మంగళవారం డీఎంఈ శ్రీనివాస్... కేఎంసీకి రానున్నారు. -
సమ్మె ఆపేది లేదు: జూడాలు
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్యా, ఇమ్రాన్లు మీడియాతో మాట్లాడారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైనదని పేర్కొన్నారు. తమ సమ్మె వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయని ఆరోపించడం సరికాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. వైద్యవిద్య ప్రైవేటీకరణ వల్లే: చుక్కా రామయ్య వైద్యం ప్రైవేటుపరం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజామద్దతు లేని నిరసన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని వారికి సూచించారు. పేదరోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. జూడాల తల్లిదండ్రులకు నోటీసులు గత నెలరోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను డిబార్ చేస్తామని గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదివారం హెచ్చరించింది. ఈ మేరకు తమ కళాశాలలో చదువుతన్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే విధులకు హాజరు కావాలని, లేకుంటే డిబార్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు తమకు నోటీసులు అందినట్లు గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థుల తల్లితండ్రులు మీడియాకు తెలిపారు. -
సీట్లు సరే.. మరి సౌకర్యాలు!?
ఎంసీఐ అభ్యంతరాలు నేటికీ పరిష్కరించని వైనం యూనిట్ల పెంపు కోరుతూ లేఖ రాసిన ప్రిన్సిపాల్ రెండు నెలలు గడిచినా చర్యలు శూన్యం సిద్ధార్థ వైద్య కళాశాలలో వింత పరిస్థితి విజయవాడ : రాష్ట్రానికి 950 మెడిసిన్ సీట్లు తీసుకొచ్చానని, మరిన్ని తెచ్చేందుకు కృషిచేస్తున్నానంటూ పదేపదే చెబుతున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్.. పెంచిన సీట్లకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని విస్మరించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు వైద్య విద్యార్థులకు సదుపాయాలు లేకుంటే మళ్లీ సీట్లు కోల్పోతామని తెలిసినా, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో గత ఏడాది వంద యూజీ (ఎంబీబీఎస్) సీట్లకు అడ్మిషన్లు జరపగా వాటిని 150కి పెంచాలని కళాశాల అధికారులు విన్నవించారు. తొలుత నిరాకరించినా అనంతరం ప్రభుత్వ హామీపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండీషనల్ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ఏడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. పెంచిన సీట్లకు అనుగుణంగా సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. యూనిట్లు పెంచాలంటూ లేఖ ప్రస్తుతం వంద మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు సరిపడా ఉన్న యూనిట్లను 150 మందికి అనుగుణంగా పెంచాలని కోరుతూ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు లేఖ రాశారు. దానికి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. నవంబర్ నుంచి ఎప్పడైనా రావొచ్చు.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం నవంబర్ నుంచి ఏ క్షణంలోనైనా వైద్య కళాశాలలో తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన వైద్య శాఖ మంత్రి సిద్ధార్థ వైద్య కళాశాలలో సౌకర్యాలు కల్పించడంతోపాటు అదనపు యూనిట్ల మంజూరుకు కృషి చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.. ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం, లైబ్రరీ వంటి సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుతం లైబ్రరీ నిర్మాణం జరుగుతుండగా, ఆర్సీహెచ్ బ్లాక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పెంచిన సీట్లకు అనుగుణంగా విద్యార్థులకు హాస్టల్ భవనాల నిర్మాణాలు చేపట్టడంతోపాటు పెథాలజీ, అనాటమీ, ఫిజియాలజీ వంటి విభాగాలను విస్తరించాల్సిన అవసరం ఉంది. 2012లో ఒకసారి సీట్లు పెంచినప్పుడు ఆయా విభాగాల్లో సదుపాయాల లేమి కారణంగానే సీట్లు రద్దు చేశారు. ప్రస్తుతం 150 సీట్లు కాపాడుకోవాలంటే ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. -
ఎంబీబీఎస్ ఫీజు పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరానికి యాజమాన్యపు కోటా (సి- కేటగిరీ) కింద భర్తీ చేసే ఎంబీబీఎస్ సీట్ల ఫీజును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఈ నోటీసులు జారీ చేసింది. ప్రవేశాల సమయంలో ఇంటర్ మార్కులతో పాటు మౌఖిక పరీక్షకు 15 శాతం మార్కులు కేటాయించే వెలుసుబాటును యాజమాన్యాలకు కల్పించడంపై హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి నిబంధనను రూపొందించడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. నిబంధనలకు సవరణలు చేసి మరీ 15 శాతం వెయిటేజీ నిబంధనను చేర్చారని తెలుసుకున్న ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామంది. న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 9ను సవాలు చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు బాలరాజు, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చరణ్ కౌశిక్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
రిమ్స్‌కు గడ్డుకాలం
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒకవైపు వైద్యుల కొరత వెంటాడుతుంటే.. మరోవైపు ఉన్న వైద్యులు వెళ్లిపోవడం.. ఇంకో పక్క వైద్యు ల పదవీకాలం ముగియడంతో రిమ్స్ భవిష్య త్తు అగమ్యగోచరంగా మారింది. వైఎస్సార్ సీఎంగా ఉన్నంత కాలం రిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందాయి. ఆయన మరణానంతరం సదుపాయాలు, వైద్యులు, పరికరాల కొరతతో రోగులకు వైద్యం అందడం లేదు. రిమ్స్‌లో 21 విభాగాలకు 148 పోస్టులు మంజూరయ్యాయి. ఏడేళ్లుగా పూర్తిస్థాయిలో వైద్యపోస్టులు భర్తీకాలేదు. ఇప్పటివరకు కేవలం 65 పోస్టులే భర్తీకాగా 83 ఖాళీగా ఉన్నాయి. కాగా ఉన్న 65 మంది వైద్యుల్లోంచి 18 మంది వైద్యుల పదవీ కాలం ముగియడంతో ఆ సంఖ్య 47కు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. డీఎంఈకి ప్రతిపాదనలు రిమ్స్‌లో పదవీకాలం ముగిసిన 18 మంది వైద్యులను పొడగించాలంటూ రిమ్స్ అధికారులు డీఎంఈ(డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు ప్రతిపాదనలు పంపారు. వీరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. 18 మందిలో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారు ఉండగా, డీఎం ఈకి పంపిన ప్రతిపాదనల్లో వీరందరికి అనుమతిస్తుం దా? లేదా అనేది అనుమానంగా ఉంది. ఒకవేళ డీఎం ఈ నుంచి ఆదేశాలు వస్తే అందులో తెలంగాణ ప్రాంత వైద్యులు లేనట్లైతే.. స్థానికులకు ఇవ్వాలంటూ వారి నుంచి నిరసనలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. 18 మందిని పొడిగించడం వీలుకాదని డీఎంఈ తేల్చేసిన పక్షంలో ఇక రిమ్స్‌లో 47 మంది వైద్యులు మాత్రమే మిగులుతారు. వీరిలో కొంత మంది ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు మృగ్యం కానున్నాయి. ఎంసీఐ పరిశీలనకు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిమ్స్‌కు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పరిశీలనకు వస్తే అంతే సంగతి. ఇప్పటికే రిమ్స్ నుంచి మొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తి చేసుకొని వెళ్లింది. ఈ నేపథ్యంలో పీజీ తరగతుల అనుమతి, మెడికల్ సీట్లు పెంచే యోచనలో రిమ్స్ పరిశీలనకు ఎంసీఐ సిద్ధమైన పక్షంలో ఇందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సిబ్బంది సంఖ్య చూపించాలి. ప్రతి సారీ ఎంబీబీఎస్ తరగతుల అనుమతికి ఎంసీఐ వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కొంత వైద్యులను అద్దెకు తెచ్చి చూపించేవారు. ఆ సమయంలో రిమ్స్‌లో వైద్యుల సంఖ్య వంద వరకు ఉండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 47 మంది వైద్యులే ఉండడంతో అనుమతికి కావాల్సిన స్థాయిలో వైద్యులను చూపించడం అసాధారణం. ఒకవేళ ఎంసీఐకి వీటన్నింటిని పూర్తిస్థాయిలో నివేదించకపోతే ఇంతటితో మెడికల్ సీట్లను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు బ్యాచ్‌లు పూర్తి చేసేంత వరకు మాత్రమే కళాశాల కొనసాగించి ఆ తర్వాత ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని రిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఎన్నో కోట్లు వృథా. లక్షల మంది పేద ప్రజల ఆశలు ఆవిరిపోతాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రిమ్స్‌పై దృష్టిసారించి వైద్యులు, సదుపాయాల కల్పన కోసం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెండేళ్లుగా భర్తీ లేవు రెండేళ్ల నుంచి రిమ్స్‌లో వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. 2012లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిమ్స్‌లో 52 పోస్టులు భర్తీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు డెరైక్టర్లు మారారు. కానీ వైద్యుల భర్తీ మాత్రం జరగలేదు. దీంతో వైద్య విద్యార్థులకు బోధనతోపాటు, రోగులకు వైద్య సేవలు అందడం లేదు. లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ రిమ్స్‌లో వైద్యులు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. పలుమార్లు రిమ్స్‌లో వైద్యుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు నోటిపికేషన్ ఇచ్చినా కొన్ని కారణాల వల్ల నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. రిమ్స్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనైన రిమ్స్‌కు న్యాయం జరుగాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపాం.. - డాక్టర్ సురేష్ చంద్ర, రిమ్స్ డెరైక్టర్ రిమ్స్‌లో 18 మంది వైద్యుల పదవీకాలం ముగియడంతో వారిని పొడిగించేందుకు డీఎంఈకి ప్రతిపాదనలు పంపాం. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 18 మంది వైద్యులకు అనుమతి వచ్చిన వెంటనే ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతాం. -
మౌనం వెనుక మర్మమేమిటో..!
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 128మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు కళాశాలకు వచ్చిన వీరిలో చాలామంది ఆ తరువాత మొహం చాటేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు వచ్చిన రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఏడాది కాలంగా వైద్యవిద్య బోధన, రోగులకు వైద్యసేవలు అందించడానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు రావడం లేదు. వాస్తవానికి ఇక్కడికి కేటాయించిన ప్రొఫెసర్లందరూ కళాశాలలోనే తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండాలి. అందుకు అనుగుణంగానే వారి కోసం అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులో సకాల సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. కానీ ఉండే వారు లేక అవి బోసిపోతున్నాయి. చాలామంది వైద్యులు జిల్లాకే రావడం లేదు. హైదరాబాద్‌కు చెందిన 32మంది ప్రొఫెసర్లు అక్కడే ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీసుల్లో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లను ఇక్కడికి కేటాయించగా వీరు రెండుసార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసర్‌ను ఇక్కడికి కేటాయించారు. ఆయన వైద్యవిద్యలో భాగమైన పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రసిద్ధి. ఈ సేవలను అందించేందుకు ఇక్కడికి కేటాయించగా ఇప్పటి వరకు ఆయన కళాశాల వైపు చూడలేదు. నలుగురు స్త్రీ వైద్యనిపుణులు ఇక్కడికి కేటాయించగా, వీరు రెండు నెలల పాటు వైద్యసేవలు అందించి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. ప్రస్తు తం ఆస్పత్రిలో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉం డాల్సింది, కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా ఉదయం ఒక గంట మాత్రమే ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల మౌనం మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చ ర్యలు తీసుకోవడంలో కళాశాల అధికారులు స్పందిం చడం లేదు. గతంలో వీరిపై చర్య తీసుకుంటే ఉన్నఫలంగా వెళ్లిపోతారని, దీంతో కళాశాలకు అనుమతికి ఇబ్బందులు వస్తాయని భావించారు. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి అనుమతి లభించింది. అయినా ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. విధులకు రాకుండా రిజిష్టరులో సంతకాలు లేకుండానే ప్రతి నెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఆయన వీరిపై కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవడం లేదు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై గత మార్చిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సుబ్రమణ్యం నివేదిక అందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కళాశాల అధికారులు సాహసించలేదు. ఇటీవల కొంతమంది ప్రొఫెసర్లు తమ యూనియన్ నాయకులను తీసుకవచ్చి ఎవరూ ఏమనకూడదన్నట్లుగా వైద్యాధికారులపై చిందులు వేయించారు. అప్పటి నుంచి ప్రొఫెసర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా త యారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన పెద్దాస్పత్రి, వైద్యకళాశాలలు సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
యాజమాన్యాలు తప్పు చేస్తే.. శిక్ష విద్యార్థులకా?
ఎంసీఐపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆగ్రహం న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ సీట్ల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీరును కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తప్పుబట్టారు. వైద్య కళాశాలలు, యాజమాన్యాలు నిబంధనలను అనుసరించకపోతే, విద్యార్థులను శిక్షించడం ఏమిటన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో కోత విధించడం అంటే అనేక మంది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడమే అన్నారు. -
సిద్ధార్థ వైద్య కళాశాలకు మొండిచెయ్యి
సీట్లు మంజూరుపై కరుణించని ఎంసీఐ రాష్ట్రంలో అన్ని కళాశాలలకు పునరుద్ధరించినా సిద్ధార్థకు దక్కని వైనం ఈ ఏడాది వంద సీట్లకే పరిమితం లబ్బీపేట : సిద్ధార్థ వైద్య కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కరుణించ లేదు. అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరుపై చివరి నిమిషంలోనైనా ఆమోదం వస్తుందన్న యూనివర్సిటీ అధికారులు ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 350 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధరించిన ఎంసీఐ, సిద్ధార్థకు మాత్రం మొండిచెయ్యి చూపింది. వైద్య మంత్రి సొంత జిల్లాలో ఉన్న కళాశాలకు సీట్లు రప్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది సిద్ధార్థ వైద్య కళాశాల వందసీట్లకు పరిమితం కానుంది. సిద్ధార్థ కళాశాలకు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 40 శాతం, ఎస్వీయూ పరిధిలో 20 శాతం, ఉస్మానియా పరిధిలో 40 శాతం మందికి సీట్లు కేటాయిస్తారు. ఏకైక స్టేట్ వైడ్ కళాశాలగా ఉన్న సిద్ధార్థకు అదనపు సీట్లు కేటాయించక పోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులకు నష్టమేనని నిపుణులు చెపుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొంటున్నారు. బోధకులు కొరత తీవ్రంగా ఉండటాన్ని ఎంసీఐ గుర్తించినట్లు వారు అంటున్నారు. ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సీట్లు దక్కేవని చెబుతున్నారు. వంద సీట్లు ఉన్న కళాశాలకు 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో 50 మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో వాటిని భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలు చేసి సౌకర్యాలు లేని కారణంగా వాటిని రద్దు చేసేంది. గత ఏడాది వంద సీట్లనే భర్తీ చేశారు. అదనంగా సీట్లు మంజూరు చేయాలంటూ కళాశాల అధికారులు మళ్లీ ఎంసీఐకు ద రఖాస్తు చేయడంతో బృందం అకస్మికంగా తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం కళాశాలకు అదనపు సీట్లు దక్కని విషయంలో అధికారుల వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధిని ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. ఎంసీఐ బృందం తనిఖీలను వస్తున్నట్లు ముందుగానే తెలిసినా పలు విభాగాలను సిద్ధం చేయలేదు. కళాశాలలోని ఓ విభాగంలో వైజ్ఞానిక ప్రదర్శన దుమ్ముపట్టి ఉండటాన్ని ఎంసీఐ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకే తనిఖీలకు ఎంసీఐ సభ్యులు రాగా, 11 గంటల సమయంలో కూడా వైద్యులు విధులకు రావడం, ఐడీ కార్డులు, నెఫ్రాన్లు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల అదనపుసీట్లు రాక పోవడంలో పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారుల వైఫల్యం కూడా ఉంది. ఎంసీఐ అభ్యంతరాలు ఇవి టీచింగ్ క్లాసులు నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. బ్లడ్ బ్యాంక్‌కు ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యాధి నిర్ధారణ విభాగంలో సైతం అధునాతన పరికరాలు లేవని , ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం రిపేరులో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లైబ్రరీ, పెథాలజీ సెకండ్ డొమాస్టిక్ రూమ్, కమ్యునిటీ మెడిసిన్‌కు ప్రాక్టికల్ ల్యాబ్ లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్స్ లేక పోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికైనా సీట్లు దక్కే అవకాశం ఉంది. -
నిర్లక్ష్యానికి మూల్యం
సాక్షి, నెల్లూరు: ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితిలో నత్తనడకన సాగుతున్న భవన నిర్మాణ పనులు. పెపైచ్చు నాసిరక నిర్మాణాలు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తనిఖీ చేసే నాటికి సమకూరని వసతులు. వెరసి ఈ ఏడాది కూడా నెల్లూరు మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీ కలగానే మిగలనుంది. మెడికల్ కళాశాలలో సకాలంలో వసతులు ఏర్పాటు పూర్తికాక పోవడంతో సింహపురి కళాశాలకు చెందిన 150 సీట్లతో పాటు రాష్ట్రంలో మొత్తం 350 ఎంబీబీఎస్ సీట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన విషయం విదితమే. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య,ఆరోగ్య,వైద్యవిద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగ ళవారం అధికారులతో సమీక్షించారు. రద్దైన ఎంబీబీఎస్ సీట్లు తిరిగి వచ్చే అవకాశం కనిపించడంలేదని ఆయన విలేకరులకు తెలిపారు. గత ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోగా తీరా నిధులు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు భవననిర్మాణాల విషయంలో మరింత నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చే యించాల్సిన అధికారులు సైతం ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు మరింత ఆలస్యమయ్యాయి. పర్యవసానంగా ఈ నెల మొదట్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం వచ్చేనాటికి వసతులు సమకూరక పోవడంతో వారు ఈ ఏడాది అడ్మిషన్లకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో ఏడాది కూడా సింహరి మెడికల్ కళాశాలలో సీట్లు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మెడికల్ కళాశాల పనుల నాణ్యత సైతం ప్రశ్నార్థకంగా మారింది. నాలుగురోజుల క్రితం సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ ఈ పనుల నాణ్యతను అడుగడుగునా పరిశీలించిన అధికారుల పై మండిపడ్డారు. ఇవేం పనులు అంటూ మండిపడిన విషయం తెలిసిందే. వైద్యకళాశాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి 2013-14కు కళాశాలను ప్రారంభిస్తామన్న అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. రూ.362 కోట్ల నిధులకు గాను తొలుత కేవలం నామమాత్రంగా రూ.20 కోట్లు మాత్రమే మంజూరు చేసి ఆయన చేతులు దులుపు కున్నారు. వైద్యకళాశాల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కే అన్నట్టు ఉండిపోయాయి. ఇటీవల మరో రూ.80 కోట్లు నిధులు మంజూరు చేసినా నిర్మాణ పనులను అధికారులు, నేతలు పట్టించుకోక పోవడంతోనే వైద్యకళాశాల సకాలంలో పూర్తికాలేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం వైద్యకళాశాలకు సంబంధించి పరిపాలన భవనం,సిబ్బంది వసతి గృహాలు, బాలురు, బాలికల వసతి గృహాల పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడంతో పాటు ప్రొఫెషర్స్,అసిస్టెంట్ ప్రొఫెషర్స్,సిబ్బంది నియామకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సకాలంలో పూర్తి కావాల్సి ఉంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరిశీలించి సంతృప్తి చెంది గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వైద్యకళాశాల ప్రారంభ మౌతుంది. ఈ నెల ప్రారంభంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వచ్చి పరిశీలించే నాటికి పనులు పూర్తికాలేదు. పర్యవసానంగా ఈ ఏడాది సైతం విద్యార్థులు 150 సీట్లను కోల్పోవలసి వస్తోంది. కళాశాల మంజూరు: నెల్లూరుకు వైద్యకళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం 2012లో జీఓ జారీ చేసింది. ప్రస్తుత డీఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని 80 ఎకరాల స్థలంలో రూ.362 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాలను నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్పాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కళాశాల నిర్మాణానికి అనుమతులు వెలువడ్డాయి. ఆర్భాటంగా ప్రకటించిన నాటి మంత్రి వైద్యకళాశాల నమూనాలను ఎస్ఎస్ కన్సల్టెంట్ తయారు చేయగా అప్పటి మంత్రి,వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు నెల్లూరులో ఆర్భాటంగా సమావేశం నిర్వహించి కళాశాల నిర్మాణం తీరుతెన్నులను వివరించారు. తొలుత 150 సీట్లతో వైద్యకళాశాలను ప్రారంభించినా భవిష్యత్తు తరాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 260 సీట్లకు కళాశాలను పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి గొప్పలు చెప్పారు. అందుకు అనుగుణంగా భవనాల నిర్మాణాలను చేపడుతున్నామని, అవసరమై నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని కూడా నాడు మంత్రి ఆనం ప్రకటించారు. సకాలంలో నిధులు మాత్రం ఇవ్వక పోవడంతో మెడికల్ కళాశాల పనులు ఆలస్యమయ్యాయి. వైద్యవిద్యార్థులకు మొదటి సంవత్సరంలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. అనాటమీకి థియేటర్, మిగిలిన వాటికి ల్యాబ్‌లు తప్పనిసరి. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్స్,ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌తో పాటు పది మంది ట్యూటర్లు అవసరమవుతారు. వీరితో పాటు కార్యాలయాల సిబ్బంది సరేసరి. ఈ లెక్కన వందలాది మంది సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది. నిబంధనల మేరకు కళాశాల నిర్మాణం పూర్తయి మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్యపరికరాలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని భారతీయ వైద్యమండలి కళాశాల నిపుణులు సంతృప్తి చెందితేనే విద్యార్థులకు వైద్యకళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ లెక్కన మిగిలిన దాదాపు రూ.300 కోట్లు నిధులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తే తప్ప వచ్చే ఏడాదైనా వైద్యకళాశాల ప్రారంభం అవుతుందా అన్నది అనుమానమే. -
'కోల్పోయిన మెడికల్ సీట్లపై ఎంసీఐను కలుస్తాం'
ఏయిమ్స్ కమిటీ ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... విభజనతో సీమాంధ్రలో కొన్ని వందల మెడికల్ సీట్లు కోల్పోయామని ఆయన తెలిపారు. సీమాంధ్రలో కోల్పోయిన మెడికల్ సీట్లు తిరిగి పొందెందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కలుస్తామని ఆయన వివరించారు. -
హమ్మయ్య.. ‘ద్వితీయ’కు అనుమతి వచ్చింది!
నిజామాబాద్ అర్బన్ : ఎట్టకేలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) కరుణించి నట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరానికి అనుమతిచ్చినట్లు సమాచారం. మూడురోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఎంసీఐ సమావేశంలో ఈమేరకు ఆమోదం లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కళాశాల అధికారు లు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సెకండియర్‌కు అనుమతి వస్తుం దో.. లేదోనన్న ఆందోళన లో ఉన్న వారు హర్షం వ్య క్తం చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభమైన మెడికల్ కళాశాలలో రెండోసంవత్సరం కొనసాగింపునకు సంబంధించి ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఎంసీఐ సభ్యులు పరిశీలనకు వచ్చారు. అప్పుడు కళాశాలలో సరైన సౌకర్యాలు లేవంటూ సెకండియర్ కు అనుమతి నిరాకరించారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉండటం, లైబ్రరీ లేకపోవడం, వసతిగృహాలు, ఆటస్థలం, తరగతి గదు ల్లో అసౌకర్యాలను లోపాలుగా చూపుతూ అనుమతికి నిరాకరించారు. దీంతో అధికారుల్లో, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. రెండో సంవత్సరానికి అనుమతి రాకపోతే కళాశాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈనేపథ్యంలో అధికారులు సమస్యల పరిష్కారానికి నడుంబిగించారు. రెండోసారి పరిశీలన డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారు. సౌకర్యాలను మెరుగు పర్చిన తర్వాత మరోసారి కళాశాలను పరిశీలించాలని ఎంసీఐను కోరారు. స్పందించిన ఎంసీఐ బృందం ఈనెల 7న మరోసారి మెడికల్ కళాశాలను పరిశీలించారు. ఈసారి సంతృప్తి చెందిన సభ్యులు ఎంసీఐ సమావేశంలో రెండోసంవత్సరానికి అనుమతికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. వందసీట్లను కేటాయిస్తూ అనుమతి మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారంరోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా ఆదేశాలు అందలేదు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కు రెండో సంవత్సరం అనుమతికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. ఎంసీఐ మాత్రం సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు రావచ్చు. -శ్రీనివాస్, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ -
రిమ్స్‌లో సమస్యలపై ప్రత్యేక కమిటీ
ఒంగోలు సెంట్రల్ : స్థానిక రిమ్స్‌లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ అంజయ్య, ఇతర అధికారులు, భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీర్లు, మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి బుధవారం రిమ్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం రిమ్స్ లెక్చర్‌హాల్‌లో వారందరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ అంజయ్య మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) వారు రిమ్స్‌లో ఎంబీబీఎస్ నాలుగో ఏడాది తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు కారణమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఎంసీఐ బృందాన్ని మరోసారి తనిఖీలకు ఆహ్వానిస్తూ దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రిమ్స్‌లో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్‌లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. రిమ్స్‌లో సమస్యలపై ఆ కమిటీ ప్రతినెలా సమీక్షిస్తుందన్నారు. మెడికల్ కాలేజీ, సిబ్బంది క్వార్టర్స్, ఇతర భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వంతో మాట్లాడి ఎంసీఐ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగాన్ని పరిశీలించి సిబ్బందికి వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమకు వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య విభాగం సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పలువురు రోగులు, వారి బంధువులు రిమ్స్‌లో నెలకొన్న మంచినీరు, మరుగుదొడ్లు, ఐసీయూలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంవో డాక్టర్ బాలాజీనాయక్ పాల్గొనగా, ఎమ్మెల్యే వెంట ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు ఉన్నారు. -
వైద్య కళాశాలల్లో... 250 సీట్లకు కోత
సదుపాయాలు లేవని ఎంసీఐ వేటు - మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్ బెంగళూరు : మౌలిక సదుపాయాలు సరిగా లేవన్న కారణంతో బెంగళూరు, మైసూరు, హుబ్లీ, బళ్లారిలోని వైద్య విద్య కళాశాలల్లోని 250 సీట్లపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కోత విధించినట్లు సాక్షాత్తు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన బుధవారం మాట్లాడారు. ఏటా మెడికల్ కళాశాలల్లోని సదుపాయాలను ఎంసీఐ బృందం పరిశీలిస్తుందని, అనంతరం ఆయా కళాశాలలకు సీట్లను కేటాయిస్తుందని తెలిపారు. గత సంవత్సరమూ ఇలాగే 250 సీట్లకు కోత విధించగా.. తాను చొరవ తీసుకొని వాటిని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చానని తెలిపారు. ఈ సారి కూడా ఎంసీఐతో చర్చిస్తానన్నారు. బెంగళూరు మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే రూ.117 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సంవత్సరం గుల్బర్గ, కొప్పళలో కళాశాలలను ప్రారంభిస్తామన్నారు. నాణ్యత, పారదర్శకతకు ‘మండలి’.. వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులకు నాణ్యమైన మందులను పారదర్శకతతో కొనుగోలు చేయడానికి తమిళనాడులో ఉన్న విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక ‘మండలి’ని ఏర్పాటు చేస్తామని, తద్వారా తక్కువ ధరకే మందులు లభిస్తాయని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి అనుమతి లభించిందని, ఆర్థికశాఖతో, మంత్రి మండలిలో దీనిపై చర్చించి త్వరలో అమలు చేస్తామని శరణ్‌ప్రకాశ్ పాటిల్ తెలిపారు. -
తేడా వస్తే రద్దే!
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యానికి వంద సీట్ల రెన్యూవల్ భయం పట్టుకుంది. మెడిసిన్ సీట్ల రెన్యూవల్ కోసం రెండు, మూడ్రోజుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజనాస్పత్రి(బోధనాస్పత్రి)ని తనిఖీ చేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఎంసీఐ బృందం నగరానికి వచ్చినపుడు వైద్య కళాశాల వసతి గృహంలో గదులు, ఫర్నీచర్ కొరత, కామన్ రూమ్స్, లైబ్రరీ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వజనాస్పత్రిలో ల్యాబ్ విస్తరణ, ఔట్, ఇన్‌పేషెంట్ రిజిస్ట్రేషన్, రేడియాలజీ విభాగానికి సంబంధించి ఎక్స్‌రే మిషన్ సమస్యతో పాటు వైద్యుల కొరతను గుర్తించింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్యం అందించేలా బోధనాస్పత్రి ఉండాలంటూ తేల్చి చెప్పింది. ఈ సారి తనిఖీలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం ‘వంద సీట్ల’పై వేటు తప్పదన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించే పనిలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నీరజ ఉన్నారు. వైద్య కళాశాలలో కామన్ రూమ్స్, లైబ్రరీ ఏర్పాటు చేశారు. దీనికితోడు ఆస్పత్రిలోని రెసిడెంట్ హాస్టల్‌ను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. 510 పోస్టుల పరిస్థితేంటో? ఐదు వందల పడకలు గల సర్వజనాస్పత్రి, వంద సీట్లు గల వైద్య కళాశాలకు సంబంధించి 510 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఓ మాజీ మంత్రి అడ్డుపడటంతో పోస్టుల భర్తీ తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి, వైద్య కళాశాలను భ్రష్టుపట్టించారని పలువురు మండిపడుతున్నారు. -
భవితవ్యం ప్రశ్నార్థకం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఒకసారి కళాశాలను పరిశీ లించిన ఎంసీఐ బృందం.. ద్వితీ య సంవత్సరం తరగతుల ని ర్వహణకు అనుమతి ఇవ్వడాని కి నిరాకరించిన విషయం తెలి సిందే. ఈ నెలలో రెండో విడత లో నిర్వహించే పరిశీలనలో బృందం సంతృప్తి చెందితేనే అ నుమతి లభిస్తుంది. లేకపోతే అంతే సంగతులు. ఈ నేపథ్యం లో అందరిలో ఆందోళన నెల కొంది. కొన్నాళ్ల క్రితం ఇద్దరు స భ్యుల ఎంసీఐ బృందం మెడికల్ కళాశాలను పరిశీలించింది. సరై న వసతులు లేని కారణంగా ద్వితీయ సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. కళాశాలలో గ్రంథాలయం, ఆట స్థలం లేవని, రేడియాలజీ, ఇతర కోర్సుల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేరన్న కారణంతో ద్వితీయ సంవత్సరానికి అనుమతి నిరాకరించారు. ఈ సమస్యల పరిష్కారానికి డీఎంఈకి నివేదించారు. మెడికల్ కళాశాల పరిశీలనకు రావాలని ఎంసీఐని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు గత నెల 28 వ తేదీన మరోసారి కోరారు. దీనిపై స్పందించిన ఎంసీఐ.. ఈ నెలలో పరిశీలిస్తామని పేర్కొంది. ఎంసీఐ బృందం ఎప్పుడైనా జిల్లాకు వచ్చి వసతులను పరిశీలించవచ్చు. కళాశాలలో రెండో సంవత్సరం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కానీ ఎంసీఐ బృందానిదే తుది నిర్ణయం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అధికారుల్లో ఉత్కంఠ ఈ నెలలో ఎంసీఐ పరిశీలన ఉండడంతో అధికారుల్లో ఉత్కంఠ నెల కొంది. బృందం పరిశీలన ఏ విధంగా జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈసారి ద్వితీయ సంవత్సరానికి అనుమతి రాకుంటే కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. జిల్లాకు మంజూరైన ఏకైక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఎలాగైనా అనుమతి తీసుకురావాలనే ఉద్దేశంతో కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబా యి ఇతర అధికారులు కూడా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. నివేదికలు, సౌకర్యాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించారు. అయితే కళాశాలకు నియమితులైన ప్రొఫెసర్ల పనితీరు వారిని ఆందోళనకు గురి చేస్తోంది. వీరు సరిగా ఆస్పత్రికి రావ డం లేదు. ప్రొఫెసర్లు అం దుబాటులో లేకపోతే కళాశాలకు అనుమతి రావడం కష్టమే. దీంతో వీరంతా సక్రమంగా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కళాశాలకు మొదటి సంవత్సరం లో వంద సీట్లు మంజురు కాగా 96 సీట్లు భర్తీ అ య్యాయి. ద్వితీయ సంవత్సరానికి అనుమతి లభిస్తే నే వీరు ఇక్కడ చదివే అవకాశం ఉంటుంది. ఈ నెల లో ఎంసీఐ పర్యటన అనంతరం ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు లేనట్టే..!
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల అశ్రద్ధ వెరసి స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) పాలిట శాపంగా మారింది. ఎంతో ఉన్నతాశయంతో నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల లేమి కారణంగా ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం అడ్మిషన్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిలిపివేసింది. అంతేగాకుండా ఇప్పటికే ఈ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇదే కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతులు నిర్వహించేందుకు కూడా అనుమతులు నిరాకరించింది. పలుమార్లు రిమ్స్‌ను సందర్శించి తనిఖీ చేసిన ఎంసీఐ బృందం.. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు అవసరమైన పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులు ఇక్కడ లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులను అన్ని వసతులున్న ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడే వసతులు, ఇతర సమస్యలు పరిష్కరించి నాలుగో సంవత్సరం తరగతులు నిర్వహిస్తారా..లేకుంటే ఇతర కళాశాలలకు విద్యార్థులను సర్దుబాటు చేస్తారా..? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నిధులున్నా..నిర్లక్ష్యం... రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పూర్తిస్థాయిలో నిధులున్నప్పటికీ అధికారుల చేతగానితనం, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా చివరకు అడ్మిషన్లు నిలిపివేసే పరిస్థితి నెలకొంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ఉన్నత లక్ష్యంతో రాష్ట్రంలోని పలుచోట్ల నాలుగు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. వాటిలో ఒకటి ఒంగోలుకు కేటాయించగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేశారు. అయితే, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పాలకులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనులు నత్తనడక నడిచాయి. మిగిలిన జిల్లాల్లో దీంతో పాటు నిర్మాణం ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ పట్టా కూడా పుచ్చుకుని వెళ్లిపోయినప్పటికీ.. ఇక్కడ మాత్రం ఆలస్యంగా కళాశాలను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం మూడో సంవత్సరం వరకే విద్యార్థులున్నారు. 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రారంభించిన రిమ్స్‌కు ఇప్పటి వరకూ 242.31 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు నత్తనడకన పనులు నిర్వహిస్తున్నారు. 2013లో గత కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినప్పటికీ ముందుకు సాగడం లేదు. దీనివల్ల పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో పరిశీలించిన ఎంసీఐ బృందం పలు ఆంక్షలు విధించింది. ప్రొఫెసర్ల కొరత కూడా కారణమే... స్థానిక రిమ్స్‌ను ప్రొఫెసర్ల కొరత వేధిస్తోంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, అర్దోపెడిక్, రేడియాలజీ, టీబీ, సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు నేటికీ ప్రొఫెసర్లు లేరు. తరగతులు ప్రారంభించి మూడేళ్లయినప్పటికీ పూర్తిస్థాయిలో వసతులతో పాటు ప్రొఫెసర్లు లేకపోవడంతో ఎంసీఐ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ కళాశాల తరగతులు నిర్వహించాలంటే 8 మంది ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు ట్యూటర్లు, 75 మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు అవసరం. కానీ, ఆ మేరకు ఇక్కడ లేకపోవడంతో రిమ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 200 మంది విద్యార్థులు ఉండాల్సిన హాస్టల్లో 300 మంది ఉంటూ అవస్థపడుతున్నారు. ఇవన్నీ రిమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు, నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు ఆటంకంగా మారాయి. దీనిపై రిమ్స్ డెరైక్టర్ అంజయ్యను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... రిమ్స్‌లో వసతులు, ఇతర అంశాల పరిశీలనకు మరోసారి రావాల్సిందిగా ఎంసీఐ బృందాన్ని ఆహ్వానించినట్లు తెలిపారు. -
కేఎంసీలో సీట్లు భద్రమేనా?
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో అంతకుముందు ఉన్న 150 సీట్లకు అదనంగా మరో 50 సీట్లు గత సంవత్సరం మంజూరయ్యాయి. అయితే ఈ సంవత్సరం 200 సీట్లు ఉంటాయా లేదా 150 సీట్లనే కొనసాగిస్తారా అనేది సంది గ్ధంగా మారింది.గత సంవత్సరం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) 50 సీట్లు మంజూరు చేసినప్పుడు కళాశాలలో సిబ్బం దిని నియమించాలని, వసతులను కల్పిం చాలని సూచించింది. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ఉద్యోగులను నియమించలేదు. దీంతో ఈసారి ఎంసీఐ బృందం తనిఖీ నిర్వహిస్తే కచ్చితంగా 50 సీట్లు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నా రు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల్లో ఎంసీఐ బృందం తనిఖీలు నిర్వహించి.. నాలుగు కళాశాలల్లో సీట్లను రద్దు చేసింది. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో తనిఖీ నిర్వహించిన ఎంసీఐ బృందం సరైన సౌకర్యాలు లేవంటూ 100 సీట్లను రద్దు చేసినట్లు తెలిసింది. ఏదేమైనా ఎంసీఐ బృందం తనిఖీకి వచ్చిన తర్వాతే కేఎంసీలో ఎన్ని సీట్లు ఉంటాయో తేలనుంది. -
ప్రమాదంలో వైద్య విద్య
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కళాశాలలో సౌకర్యాలు సక్రమంగా లేని కారణంగా ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం తరగతులకు అనుమతి ఇవ్వరాదంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీ ఐ) బృందం నివేదిక సమర్పించడమే ఇందుకు కారణం. దీంతో వచ్చే ఏడాది మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఎంసీఐ నుంచి ఇద్దరు సభ్యులు సూర్యప్రకాశ్రావ్, భరత్షా గత ఫిబ్రవరిలో మెడికల్ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం నివేదికను సమర్పించారు. మంజూరు చేసింది రాజన్నే.. 2008లో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీని వాస్ షష్టి పూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేశారు. అనంతరం దీనికి రూ. 100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో ఖలీల్‌వాడీ గ్రౌండ్లో మెడిక ల్ కళాశాల పనులు ప్రారంభించారు. 2011 డిసెంబర్లో ప్రారంభం కావాల్సి ఉండగా పను లు ఆలస్యంగా జరిగాయి. 2013 మే-16,17 లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీలన చేపట్టింది. అప్పుడే ఆ బృందం మొదటి సంవత్సరానికి అనుమతి కోసం కొద్దిగా పేచీ పెట్టింది. దీంతో జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలు మా ర్లు ఢిల్లీకి వెళ్లి అనుమతి కోసం కృషి చేశారు. ఎట్టకేలకు జూలైలో ఎంసీఐ మొదటి సంవత్స రం తరగతుల నిర్వహణకు పచ్చజెండా ఊపిం ది. వంద మంది విద్యార్థులతో ఆగస్టు-5న తరగతులు ప్రారంభమయ్యాయి. రెండవ సంవత్సరం కోసం అధికారులు ఎంతో కృషి చేయవల్సి వచ్చింది. సౌకర్యాల లేమితో కళాశాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవీ అసౌకర్యాలు రెండవసారి పరిశీలనకు వచ్చిన ఇద్దరు సభ్యు ల ఎంసీఐ బృందం కళాశాలలోని అసౌకర్యాలను ఎత్తి చూపింది. ఇంటెన్సీవ్ కార్డియాక్ కేర్ యూనిట్, ఫార్మకాలజీ, పాథలాజికల్ క్లీనిక్‌లు లేవని నివేదికలో పేర్కొంది. మైక్రోబయాలాజీ విభాగంలో పైకప్పు ఉడిపోయే దశలో ఉందంటూ నివేదించింది. సెంట్రల్ ఫొటోగ్రఫీ యూనిట్ లేకపోవడం, విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి వసతి గృహాలు లేకపోవడం, గ్రం థాలయంలో సరైన సౌకర్యాలు లేకపోవడం తదితర అంశాలను పే ర్కొంది. ప్రొఫెసర్లు నాలుగురు, అసోసియేషన్ ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగురు, రెసిడెంట్ వైద్యులు ఏడుగురు, జూ నియర్ రెసిడెంట్ వైద్యులు ఆరుగురు తదితరులతో పాటు మొత్తం కళాశాలకు కేటాయించిన 99 మం ది ప్రొఫెసర్లలో కేవలం 30 మంది మాత్రమే ఉండడం బృందం తప్పుపట్టింది. వివిధ విభాగాలకు సం బంధించిన ఆరోగ్యపరీక్షలకు సరిప డా సౌకర్యాలు సైతం లేవని బృం దం తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 2014-15 విద్యా సంవత్సరానికిగాను రెండవ సంవత్సరం100 సీట్ల ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. ఎం సీఐ బృందం ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం కళాశాలకు రెండో సంవత్సరానికి అనుమతి రాదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నేడు అభివృద్ధి కమిటీ సమావేశం నేడు మెడికల్ కళాశాలలో డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరుగనుంది. కళాశాలలో సౌకర్యాల ఏర్పాటు, ఎంసీఐ పేర్కొన్న అంశాలను చర్చించనున్నారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాంతరా వ్, అడిషనల్ డెరైక్టర్ , కళాశాల ప్రిన్సిపాల్ హాజరుకానున్నారు. -
వైద్య కళాశాలకు ఎంసీఐ అనుమతి అనుమానమే!
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్ : నెల్లూరు నగరంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ ఏడాది ప్రారంభించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అనుమతి లభించడం అనుమానంగా ఉంది. జిల్లా అభివృద్ధి పనుల్లో ఒకటి కానున్న ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటును తమ కృషిగా చెప్పుకుని ఆనం సోదరులు ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని భావించారు. ఈ ఏడాదే ఈ కళాశాలను ప్రారంభించాలని అనుకున్నారు. ప్రారంభంలో నత్తనడకగా సాగిన పనులు ఇటీవల వేగాన్ని పుంజుకున్నాయి. ఎంత శరవేగంగా నిర్మాణ పనులు సాగినా అనుకున్న సమయానికి పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. వైద్య కళాశాలను ప్రారంభించాలంటే ఎంసీఐ నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో అన్ని వసతులను కలిగి ఉండాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ వైద్యకళాశాల పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న మేరకు ఆగస్టులో మొదటి సంవత్సర వైద్య విద్య కోర్సు తరగతులు ప్రారంభించేందుకు తగిన మౌలిక వసతులు ఇంకా సమకూరలేదు. ఈ నెలాఖరుకు వైద్యకళాశాల పరిశీలనకు ఎంసీఐ బృందం రానుంది. ఈ బృందం కళాశాలను పరిశీలించి సంతృప్తి చెందితేనే ప్రారంభానికి అనుమతి ఇస్తుంది. ఇప్పటి వరకు వైద్య కళాశాల నిర్మాణం ఆసంపూర్తిగానే ఉంది. అన్ని విధాల మౌలిక సదుపాయాలతో పూర్తి చేయాలంటే మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఎంసీఐ బృందం పరిశీలనకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తి చెందే అవకాశం లేదు. అయితే ఆగస్టులో వైద్యకళాశాలను ప్రారంభించేందుకు మరో రెండు నెలలు అదనంగా వ్యవధి కావాలని ఎంసీఐ బృందాన్ని వైద్య విద్యసంచాలకులు (డీఎంఈ) కోరనున్నట్లు తెలిసింది. కళాశాల ఏర్పాటుకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో 300 పడకల సామర్థ్యం కలిగి ఉండాలి. కాని ప్రస్తుతం ఉన్న పెద్దాసుపత్రిలో 200 పడకలు మాత్రమే ఉన్నాయి. పెద్దాసుపత్రి పరిధిలో ఉన్న రేబాలా, జూబ్లీ ఆసుపత్రుల పడకలను ఎంసీఐకి చూపించి అనుమతి పొందాలని డీఎంఈ ఆలోచనలో ఉంది. కానీ ఎంసీఐ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోదని సీనియర్ వైద్యాధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో కొన్ని వసతులు లేవు. అప్పట్లో డీఎంఈ సకాలంలో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని ఎంసీఐతో నమ్మబలికింది. దీంతో ఎంసీఐ ఆ వైద్యకళాశాలకు అనుమతిచ్చింది. కొద్దికాలం తరువాత ఎంసీఐ తాము చేసిన తప్పు తెలుసుకుని నిజామాబాద్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలకు రెండో సంవత్సర వైద్యవిద్య కోర్సును ప్రారంభించేందుకు అనుమతి నిరాకరించింది. ఈ అనుభవాల నేపథ్యంలో ఎంసీఐ అసంపూర్తిగా ఉన్న వైద్యకళాశాల ప్రారంభానికి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో వైద్యవిద్య మొదటి సంవత్సర కోర్సు చేయాలనుకునే విద్యార్థుల ఆశలు ఆడియాశలే కానున్నాయి. -
వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్ !
లబ్బీపేట, న్యూస్‌లైన్ : సిద్ధార్థ వైద్య కళాశాల అధికారులకు ఎంసీఐ ఫీవర్ పట్టుకుంది. కళాశాలలో సౌకర్యాలు లేవంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గత ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేసింది. తిరిగి వాటిని పొందేందుకు అధికారులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం ఏ క్షణంలోనైనా తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా వార్డులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది ఎంసీఐ బృందం వచ్చిన తర్వాత ఫిజియాలజీ ల్యాబ్‌ను తెరవడంతో, వారు తన రిపోర్టులో దానిని వినియోగించడం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సారి అటువంటి తప్పిదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు వైద్యులకు సూచిస్తున్నారు. అయితే శాశ్వత నిర్మాణాల విషయంలో గత ఏడాదికి ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఏమి జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2012లో 50 సీట్లు మంజూరు వంద ఎంబీబీఎస్ సీట్లు ఉన్న సిద్ధార్థ వైద్య కళాశాలను 2012లో ఎంసీఐ బృందం తనిఖీ చేసి అదనంగా మరో 50 సీట్లు మంజూరు చేసింది. ఆ సమయంలో లైబ్రరీ, రూరల్ కమ్యూనిటీ హెల్త్ (ఆర్సీహెచ్) బ్లాక్ నిర్మాణం, బోధనా సిబ్బంది పెంపు వంటి సమస్యలను ఏడాదిలో పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలకు రాగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చక పోగా, మరిన్ని సమస్యలను వారు గుర్తించారు. దీంతో పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చేసేది లేక ఈ ఏడాది వంద సీట్లకే అడ్మిషన్లు నిర్వహించారు. ఇప్పటికీ ఈ సమస్యలన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసి ప్రయోజనం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిలిచిపోయిన కేంద్ర నిధులు దేశ వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిధులు కేటాయించింది. వాటికి మ్యాచింగ్ గ్రాంటు కిందట 25 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం సిద్ధార్థ వైద్య కళాశాలకు కేంద్రప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడతగా రూ.11 కోట్లు మంజూరవగా, వివిధ పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపనులకు వెచ్చించారు. మ్యాచింగ్ గ్రాంటు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయక పోవడంతో, కేంద్రం రెండో విడత విడుదల చేయాల్సిన గ్రాంటు రూ.11కోట్లు నిలిచిపోయాయని, దీంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదనేది వారి వాదన . తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిధులు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని అధికారులు వాపోతున్నారు. -
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలన
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఇద్దరు సభ్యులు గల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను పరిశీలించింది. అహ్మదాబాద్ మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ భరత్షా, మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్‌రావులు ఉదయం ఆరు గంటలకే కళాశాలకు చేరుకున్నారు. భరత్షా కళాశాలకు అనుబంధమైన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు సేవలు ఎలా అందిస్తున్నారు. వివిధ విభాగాల ఏర్పాటు, వైద్యులు ఎంత మంది ఉన్నారు. వైద్యపరీక్షలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించి విడివిడిగా పరిశీలన చేశారు. నూతన భవనంలో విభాగాల ఏర్పాటు సంతృప్తి కరంగా ఉందంటూ తెలియజేశారు.అయితే రోగులకు వైద్యసేవలు అందించడంలో వైద్యుల ఏర్పాటుపై ప్రశ్నించినట్లు తెలిసింది. మెడికల్ కళాశాలలో డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు లెక్చరర్ గ్యాలరీ, తరగతి గదులు, ఆడిటోరియం, శవపరీక్ష గదులు, ల్యాబ్స్, గ్రంథాలయం తదితర విభాగాలను పరిశీలించారు. ప్రొఫెసర్ల నియామకంపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య, వారికి ఇప్పటి వరకు బోధించిన విద్యావిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పరిశీలన జరిగింది.అనంతరం రాత్రి ఏడు గంటల నుంచి 10.30 గంటల వరకు నివేదికల పరిశీలించారు. శనివారం కూడా ఎంసీఐ బృంద సభ్యులు పరిశీలనలు చేస్తారు. అనంతరం నివేదికలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు (ఎంసీఐ) సమర్పిస్తారు. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల అనుమతి కోసం ఈ పరిశీలన సాగింది. -
పేరుకే పెద్దాసుపత్రి.. పరికరాలు లేక కుస్తీ
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: కోస్తాంధ్రాలో పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లోని రేడియాలజీ వైద్య విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవటంతో అక్కడ నిత్యం సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయి. పురాతన కాలం నాటి వైద్య పరికరాలు, కాలపరిమితి దాటిన వైద్య పరికరాలే నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అవి తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది.త్వరలో ఆస్పత్రిలో భారత వైద్య మండలి(ఎంసీఐ) తనిఖీలు చేయనుంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ఎంసీఐ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందనే భయాందోళనలో ఆస్పత్రి అధికారులు ఆందోళన చెందుతున్నారు. రేడియాలజీ కీలకమే... ఆస్పత్రిలోని రేడియాలజీ వైద్య విభాగంలో పలురకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఎక్సరే, ఆల్ట్రాసౌండ్, సిటిస్కాన్ తదితర పరీక్షలు కూడా ఈ విభాగంలోనే నిర్వహిస్తున్నారు. నరాల వ్యాధుల వారికి, మెదడు సంబంధిత వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాద భాధితులకు, గర్భిణిలకు, కిడ్నీ వ్యాధులున్నవారికి, ఇతర జబ్బులున్న వారికి రేడియాలజీలో పరీక్షలు చేసిన పిదప మాత్రమే వైద్యం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ఎక్సరే మెషిన్లు నాలుగు పనిచేయకపోవటంతో మూలనపడేశారు. కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు ఆస్పత్రి అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినా స్పందన లేదు. ప్రస్తుతం మూడు మెషిన్లు మాత్రమే పనిచేస్తుండటంతో అధికంగా వస్తున్న పేద రోగులకు సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగటం లేదు. సిటిస్కాన్ మెషిన్‌కూడా తరచూ మరమ్మతులకు గురువుతుంది. ఆస్పత్రిలో ఇది ఏర్పాటుచేసి 12 సంవత్సరాలు పూర్తయింది. వాస్తవానికి దీని కాలపరిమితి 10 ఏళ్లు మాత్రమే. ఇక ఎంఆర్ఐ మెషిన్‌ను నేటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. సుమారు 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పెద్దాసుపత్రిలో రేడియాలజీ వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందించాలంటే తప్పనిసరిగా అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సి ఉంది. వివరణ... వైద్య పరికరాలు తరచూ మరమ్మతులకు గురవుతున్న విషయాన్ని ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు రేడియాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ పార్వతీశ్వరరావు తెలిపారు. నూతన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఆ ప్రక్రియ పూర్తికాగానే పరికరాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. -
వైద్య మండలికి మళ్లీ జీవం
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైద్య మండలి (ఎంసీఐ) పూర్తిస్థాయి కమిటీకి కేంద్రం జీవం పోసింది. సంస్థ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తూ కేంద్రం బుధవారం మొత్తం 68 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. కొత్త కమిటీలో రాష్ట్రం నుంచి అయిదుగురికి స్థానం లభించడం విశేషం.ఎంసీఐ (సవరణ) రెండో ఆర్డినెన్స్, 2013లోని నిబంధనలను అనుసరించి... కొత్త కమిటీ పునర్నియామకంతో బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు ఇచ్చిన అధికారాలు, విధులు రద్దయ్యాయని, మొత్తంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్లనే రద్దుచేశామని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రైవేట్ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే నిమిత్తం ముడుపులు స్వీకరించినందుకు 2010లో ఎంసీఐ అధ్యక్షుడిని సీబీఐ అరెస్ట్ చేయడంతో యావత్ కమిటీ రద్దయ్యింది. కొత్త కమిటీలో 23 మంది రాష్ట్రాలతో సంప్రదించి కేంద్రం నామినేట్ చేసిన సభ్యులు కాగా మరో 29 మంది యూనివర్సిటీలు, ఆరోగ్యశాస్త్రాల వర్సిటీల నుంచి ఎన్నికైన సభ్యులున్నారు. ఒకరు డామన్-డయ్యూ నుంచి కేంద్రం నామినేట్ చేసిన సభ్యుడు కాగా ఏడుగురు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రిజిస్టర్డ్ మెడికల్ గ్రాడ్యుయేట్లు. 8 మంది కేంద్రం స్వయంగా నామినేట్చేసిన సభ్యులు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్, రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గన్ని భాస్కరరావు, విశాఖపట్నం ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో బోధకుడైన డాక్టర్ పి.గుణశేఖర్, వైద్య విద్య సంచాలకుడు (అకడమిక్) డాక్టర్ కాకొల్లు వెంకటేశ్, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కె.రమేశ్‌రెడ్డికి సభ్యులుగా అవకాశం దక్కింది. త్వరలోనే ఆఫీస్‌బేరర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రెండేళ్లకు మించి పదవిలో కొనసాగరు. ఇతర సభ్యులు నాలుగేళ్లపాటు పదవిలో ఉంటారు. -
ప్లాస్టిక్ సర్జరీ అవసరం పెరిగింది
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ సర్జన్ల అవసరం పెరిగింద ని, ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, పుట్టుకతో గానీ వచ్చిన వికృత ఆకారాన్ని సరైన ఆకృతిలోకి తీసుకురావడానికి ఈ సర్జరీలు అవసరమని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ సమావేశాలు శనివారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను డాక్టర్ రవీందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే అందం కోసం అని అనుకుంటారని, ఈ అపోహల నుంచి బయటపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీ సుకొచ్చిందని, ఆస్పత్రులు అనవసర పరీక్షలు చేయిం చినా, రోగులను మోసం చేసినా ఈ చట్టం ద్వారా ఆ ఆసుపత్రులను పరిశీ లించి చర్యకు ప్రభుత్వానికి నివేదిక పంపే అవకాశాన్ని మెడికల్ కౌన్సిల్‌కు కల్పించిందన్నారు. అల్లోపతి మందులను ఆర్ఎంపీలు రాస్తే వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉన్నా సేవలందించేందకు ప్లాస్టిక్ సర్జన్ లేకపోవడంతో ఆ విభాగం వృథాగా ఉందన్నారు. ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే ప్రైవేట్ డాక్టర్లకు, హైదరాబాద్‌కు పంపుతున్నారన్నారు. దీంతో పేద ప్రజలపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ప్లాస్టిక్ సర్జన్స్‌కు ఇచ్చే వేతనం పెంచైనా ఇక్కడ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహనకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు, అతిపెద్ద ఆస్పత్రులున్నాయని, ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ సర్జరీపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ రాష్ట్ర సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్ల సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సమావేశం లో సమావేశ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ వెంకటరాఘవరెడ్డి, కార్యదర్శి డాక్టర్ హ నుమంతరావు, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విష్ణుమూర్తి పాల్గొన్నారు. -
వైద్యుల రిజిస్ట్రేషన్‌కు కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డాక్టర్ల(మెడికల్ ప్రాక్టీషనర్లు) రిజిస్ట్రేషన్‌కు కొత్త నిబంధనావళిని ఈ నెల 12వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2010-11 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సుల వైద్య విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ, గ్రామీణ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో మెడికల్ ప్రాక్టీషనర్ల నమోదుకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వీటిని ఈ నెల 12వ తేదీన గెజిట్‌లో ప్రచురిస్తారు. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఒకరు లేదా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీ ప్రతినిధులు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేయవచ్చు. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కాని, అర్హతలు లేని వైద్యులు సేవలు అందిస్తున్నట్లు తెలిస్తే తనిఖీ చేసి చర్యలు తీసుకునే అధికారం మెడికల్ కౌన్సిల్‌కు ఉంటుంది. అనైతిక చర్యలకు పాల్పడే వైద్యుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కూడా కౌన్సిల్‌కు ఉంటుంది.