కేఎంసీలో ‘మెడికల్ కౌన్సిల్’ తనిఖీలు
కేఎంసీలో ‘మెడికల్ కౌన్సిల్’ తనిఖీలు
Published Fri, Sep 23 2016 2:49 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని ఎంజీఎం, సీకేఎం, నేత్ర వైద్యశాల, హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, భీమారంలోని టీబీ ఆస్పత్రులలో గురువారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు తనిఖీలు చేశారు. కేఎంసీలో 200 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలతో పాటు ఫ్యాకల్టీ, పరికరాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. కోల్‌కతాకు చెందిన అభిమన్యు బస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వి.కె.దాస్, మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌కు చెందిన పి.కె. ఖచార్, ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన రవీంద్రసింగ్ రాజ్‌బుట్‌ల బృందం తనిఖీలు చేపట్టింది. ఇద్దరు సభ్యులు కెఎంసీలో, మరో ఇద్దరు కేఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీలోని, బాలుర, బాలికల హాస్టళ్లను పరిశీలించారు. కళాశాలలో ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలను చూశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, దొడ్డ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, సీతమహాలక్ష్మి, పుషే్పందర్‌నాథ్ పాల్గొన్నారు.
ఎంజీఎంలో తనిఖీలు..
కేఎంసీకి బోధనాస్పత్రిగా ఉన్న ఎంజీఎంలో ఎంసీఐ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఓపీ, క్యాజువాలిటీ, మెడికల్, సర్జరీ, అర్థో, అపరేషన్ థియేటర్, ఏఎంసీ, ఐసీసీయు, ఐఎంసీ, ఐసీఎస్‌యు వంటి అత్యవసర వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్యకు తగినంత మంది వైద్యులు ఉన్నారా లేదా అని ఆరా తీశారు.
ఎంసీఐ బృందం ముందు నిరసన..
కేఎంసీలో ఎంసీఐ సభ్యులు నిర్వహిస్తున్న ఆయా విభాగాల వైద్యుల హెడ్ కౌంట్ విషయంలో వివాదం తలెత్తింది. ఉదయం 11 గంటల సమయంలో విభాగాల వారీగా ఉన్న వైద్యుల కౌంట్ తెలుపాలని ఎంసీఐ సభ్యులు ఉత్తర్వులు జారీ చేయగా ఆ సమయంలో కొంత మంది వైద్యులు అపరేషన్ థియేటర్‌లో ఉండడంతో పాటు రాత్రి వేళలో విధులు చేసిన వైద్యులు అలస్యంగా హాజరుకావడం వల్ల కొంత మంది వైద్యులు సంతకాలు చేయలేదు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అన్ని విభాగాల వైద్యులు కేఎంసీకి చేరుకుని హెడ్ కౌంట్‌కు హాజరు కాగా అలస్యంగా వచ్చిన వైద్యుల కౌంటింగ్‌ను పరిగణలోకి తీసుకోమని ఎంసీఐ సభ్యులు తెలుపడంతో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ విద్యాసాగర్ జోక్యం చేసుకుని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులకు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Advertisement
Advertisement