కేఎంసీలో పీజీ సీట్లు పెంపు
Published Tue, Mar 28 2017 10:22 PM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తంగా 153 సీట్లు మంజూరు కాగా అందులో కర్నూలు మెడికల్ కాలేజికి 30 పెరిగాయి. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 నుంచి 20కి, పీడియాట్రిక్స్‌లో 5 నుంచి 8కి, అనెస్తీషియాలో 6 నుంచి 7కు, రేడియాలజిలో 3 నుంచి 6కు, జనరల్ సర్జరీలో 10 నుంచి 20కి, ఆర్థోపెడిక్స్‌లో 8 నుంచి 11కు, ఈఎన్‌టీలో 4 నుంచి 5కు, గైనకాలజిలో 6 నుంచి 7కు పీజీ సీట్లు పెరిగాయి. కనీసం 90 సీట్లకు పైగా పెరుగుతాయని ఆశించగా 30 సీట్లు మాత్రమే పెరగడం వైద్యవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement