వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందుంది చెడుకాలం అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం అన్ని జాగ్రత్తలతో సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్ళల్లో అయితే మరింత అప్రమత్తత అవసరం.
నంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ చిట్కా ఏమిటంటే ప్రతి సంవత్సరం ఏసీని సర్వీసింగ్ చేయించడం. ఎండలు మండించే దాకా వేచి ఉండకుండా ఏసీలు ఉన్న ఇళ్లలో ఏసీ కండిషన్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవసరమైతే గ్యాస్ పట్టించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెలవారీ ఎయిర్ ఫిల్టర్‌లను చెక్ చేసుకోవాలి. ఎయిర్ కండీషనర్ సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.
కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసుకోవాలి. కండెన్సర్ యూనిట్ చుట్టూ ఖాళీ 4-అడుగుల ప్లేస్ వదలాలి. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు ఏసీ బిల్లు తడిచి మోపెడు కాకుండా ఉండాలంటే అవసరం లేనపుడు ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. విండో ఫిల్మ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం బెటర్. వేసవిలో ఇది మన ఇంటిని చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది.
వేసవి ఇతర జాగ్రత్తలు
వేసవి రాగానే ఫ్రిజ్‌లో పెట్టే వాటర్ బాటిళ్లు మరో సెట్ కొని సిద్ధం చేయడం ఆనవాయితీ. ఫ్రిజ్ బాటిళ్లతోపాటు మట్టి కుండ నీళ్లను వాడటం ఉత్తమం. మట్టి కుండలోని నీటి రుచి ఈ తరం బాల్యానికి పరిచయం చేయండి. ఇంటి కిటికీలకు వట్టివేరు తడికలను కర్టెన్‌లుగా వేయడానికి ప్రయత్నించండి. పర్యావరణహితంగా ఇంటిని చల్లబరుచుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment