సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డాక్టర్ల(మెడికల్ ప్రాక్టీషనర్లు) రిజిస్ట్రేషన్‌కు కొత్త నిబంధనావళిని ఈ నెల 12వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2010-11 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సుల వైద్య విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ, గ్రామీణ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో మెడికల్ ప్రాక్టీషనర్ల నమోదుకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వీటిని ఈ నెల 12వ తేదీన గెజిట్‌లో ప్రచురిస్తారు.
ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఒకరు లేదా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీ ప్రతినిధులు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేయవచ్చు. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌కాని, అర్హతలు లేని వైద్యులు సేవలు అందిస్తున్నట్లు తెలిస్తే తనిఖీ చేసి చర్యలు తీసుకునే అధికారం మెడికల్ కౌన్సిల్‌కు ఉంటుంది. అనైతిక చర్యలకు పాల్పడే వైద్యుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కూడా కౌన్సిల్‌కు ఉంటుంది.
వైద్యుల రిజిస్ట్రేషన్‌కు కొత్త నిబంధనలు
Published Fri, Aug 9 2013 12:51 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement