అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యానికి వంద సీట్ల రెన్యూవల్ భయం పట్టుకుంది. మెడిసిన్ సీట్ల రెన్యూవల్ కోసం రెండు, మూడ్రోజుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజనాస్పత్రి(బోధనాస్పత్రి)ని తనిఖీ చేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఎంసీఐ బృందం నగరానికి వచ్చినపుడు వైద్య కళాశాల వసతి గృహంలో గదులు, ఫర్నీచర్ కొరత, కామన్ రూమ్స్, లైబ్రరీ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వజనాస్పత్రిలో ల్యాబ్ విస్తరణ, ఔట్, ఇన్‌పేషెంట్ రిజిస్ట్రేషన్, రేడియాలజీ విభాగానికి సంబంధించి ఎక్స్‌రే మిషన్ సమస్యతో పాటు వైద్యుల కొరతను గుర్తించింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్యం అందించేలా బోధనాస్పత్రి ఉండాలంటూ తేల్చి చెప్పింది. ఈ సారి తనిఖీలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం ‘వంద సీట్ల’పై వేటు తప్పదన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను రప్పించే పనిలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నీరజ ఉన్నారు. వైద్య కళాశాలలో కామన్ రూమ్స్, లైబ్రరీ ఏర్పాటు చేశారు. దీనికితోడు ఆస్పత్రిలోని రెసిడెంట్ హాస్టల్‌ను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు.
510 పోస్టుల పరిస్థితేంటో?
ఐదు వందల పడకలు గల సర్వజనాస్పత్రి, వంద సీట్లు గల వైద్య కళాశాలకు సంబంధించి 510 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఓ మాజీ మంత్రి అడ్డుపడటంతో పోస్టుల భర్తీ తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి, వైద్య కళాశాలను భ్రష్టుపట్టించారని పలువురు మండిపడుతున్నారు.
తేడా వస్తే రద్దే!
Published Sun, Jun 8 2014 2:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement