సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ మెడికల్ కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మెడికల్ రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినా రెండో విడత కౌన్సెలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపులో మొదట రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరగుతోందని విద్యార్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై గతంలో విచారణ చేపట్టిన కోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుదితీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో కాళోజీ వర్సిటీ అధికారులు కౌన్సిలింగ్‌కు సంబంధించిన రీషెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment