సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 11 వైద్య కళాశాలలు, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (స్విమ్స్)లకు 153 పీజీ వైద్య సీట్లు పెంచేందుకు భారతీయ వైద్య మండలి అనుమతిచ్చింది. ప్రొఫెసర్లు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం సీట్లు పెంచుతామని రెండు నెలల క్రితమే కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేసి 15 రోజుల క్రితమే 389 వైద్య పీజీ సీట్లు పెంచాలంటూ కేంద్రానికి, భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపింది.
ఈ నేపథ్యంలో 153 పీజీ వైద్య (క్లినికల్) సీట్లు మాత్రమే మండలి పెంచింది. పీజీ వైద్య సీట్లు పెరిగినట్లు తమకు వైద్య మండలి నుంచి అనధికారిక సమాచారం అందిందని, అధికారిక ఉత్తర్వులు మాత్రం రావాల్సి ఉందని డీఎంఈ తెలిపారు. త్వరలోనే పీజీ వైద్య సీట్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరగనుంది.
రాష్ట్రానికి కొత్తగా 153 పీజీ వైద్య సీట్లు
Published Wed, Mar 29 2017 2:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement