
మెడికల్ కౌన్సెలింగ్‌లో పాము కలకలం
మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో ఓ పాము కలకలం సృష్టించింది.
చిలకలగూడ: మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో ఓ పాము కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనంలో సోమవారం ఉదయం మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతుండగా.. 11 గంటల సమయంలో ప్రాంగణంలోకి పాము ప్రవేశించింది. అది చూసి విద్యార్థులు, నిర్వాహకులు భయాందోళన చెందారు.
వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చిలకలగూడ ఠాణాకు సమాచారం అందించారు. ఠాణాలో విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పాము కొండచిలువ జాతికి చెందిన ప్యాచ్‌సాండ్‌బోవ రకం అని.. కాటు వేయకుండా కరవడం దీని ప్రత్యేకత అని తెలిపాడు. పట్టుకున్న పామును ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి అప్పగిస్తే, అడవుల్లో వదిలిపెడతారని చెప్పాడు.