- కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో పరిశీలన
- నేడు సీకేఎం, జీఎంహెచ్, టీబీ ఆస్పత్రుల సందర్శన
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల అనుబంధ వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రితోపాటు వర్ధన్నపేట పీహెచ్‌సీ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. కేఎంసీ కళాశాలలో 150 సీట్లతో పాటు అదనంగా పెంచిన 50 సీట్లకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలు ఉన్నాయా.. లేదా అని సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎన్.మండల్ మౌలానా అజాద్, కోల్‌కతాకు చెందిన బట్ బయల్, గుజరాత్‌కు చెందిన సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్ వర్మ ఉదయాన్నే కేఎంసీకి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. మొదటగా కళాశాలలోని 16 విభాగాలకు చెందిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా.. అని రికార్డులు పరిశీలించారు. అనంతరం గత సంవత్సరం ఎంసీఐ బృందం ఎత్తిచూపిన లోపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.18.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన బాయ్స్, గర్ట్స్ హాస్టల్స్ నూతన భవనాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న అకాడమిక్ హాల్ భవనం, లెక్చరర్స్ హాల్, గ్రంధాలయాల భవనాలను సందర్శించారు.
ఎంసీఐ తనిఖీలు
Published Sun, Apr 26 2015 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement
Advertisement