Mahatma Gandhi Memorial
-
మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద యోగా దినోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోడి 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి నేడు విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు స్వాగతం పలుకుతూ గత పది సంవత్సరాలగా ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాననిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని అన్నారు.డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. ముందుగా మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు.ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మరియు మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు అయిన సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు మరియు ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు ృ మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ మొదలైన వారు తగు ఏర్పాట్లుచేసి యోగావేడుకలు విజయవంతంగావడంలో కీలకపాత్ర వహించారు. విశాలమైదానంలో రెండుగంటలకు పైగా సాగిన ఈ యోగావేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు. -
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
డాలస్‌లో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యం లో అక్టోబర్ 6న ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇర్వింగ్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, టెక్సాస్) వద్ద మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ వేడుకలకు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ముఖ్య అతిధి గా విచ్చేసి మహాత్మాగాంధీకి నివాళులర్పించి ప్రసంగిస్తారని, ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ అఫ్ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారని ప్రకటించారు. ఈ వేడుకలలో భాగంగా శాంతికి సంకేతం గా 15 పావురాలను గాల్లోకి వదులుతామని.. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో "గాంధీ శాంతి యాత్ర" జరుగుతుందని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ప్రవేశం ఉచితమని, బ్రేక్ ఫాస్ట్ , టి షర్ట్స్, అందజేసాస్తామన్నారు. గాంధీ మెమోరియల్‌కు సమీపంలో ఉన్ననార్త్ లేఖ్ కాలేజ్ నుంచి గాంధీ మెమోరియల్‌కు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, తమ కార్లను అక్కడ పార్క్ చేసి ఉదయం 7:30 నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, బి. ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్ , అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
డాలస్ గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు
సాక్షి, డాలస్ : డాలస్‌లోని గాంధీ విగ్రహాన్ని పలువురు తెలుగు సినీ ప్రముఖులు సందర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న సుప్రసిద్ధ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, ప్రముఖ సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సిరా శ్రీ, కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో బంగారు పతక విజేత చేరుపల్లి వివేక్ తేజలు డాలస్‌లోని భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి, అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న సుందరమైన పార్కులో ఈ గాంధీ మెమోరియల్ ఏర్పాటై ఉంది. గాంధీ మెమోరియల్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర కృషిని వారు అభినందించారు. ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకున్నా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి గాంధీ స్మారకస్థలిని సందర్శించిన వీరందరికీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. -
డల్లాస్‌లో మహత్మాగాంధీకి శ్రద్ధాంజలి
డల్లస్: జనవరి 30న భారత జాతిపిత, మహత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్‌లో పలువురు కమ్యూనిటీ సభ్యులు, నేతలు మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలో అతిపెద్దదైన మహత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్, టిఎక్స్ వద్ద కమ్యూనిటీ సభ్యులంతా ఒకేచోట చేరి గాంధీ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహత్మాగాంధీ మెమోరియల్ చైర్మన్ ప్రసాద్ తోటకూర, సహా ఛైర్మన్ తయాబ్ కుందవాలా, సెక్రటరీ రావు కాల్వాల, బోర్డు డైరెక్టర్ షబ్నామ్ మోదిగిల్, పలువురు కమ్యూనిటీ నేతలు విశ్వనాధమ్ పులిగండ్ల, గోపాల పిల్లాయి, రాహుల్, జాన్ శెర్రీ, అలెక్స్ అలెగ్జాండర్, అల్యకుట్టి ఫ్రాన్సిస్, సత్యాన్ కల్యాణ్దుర్గ్ తదితరులు పాల్గొని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. నార్త్ టెక్సస్ మహత్మాగాంధీ మెమోరియల్ సెక్రటరీ రావు కాల్వాల మాట్లాడుతూ.. మహత్మాగాంధీ మెమోరియల్ ఇండో అమెరికన్ కమ్యూనిటీ డల్లాస్‌కు సరిహద్దు గుర్తుగా మారిందని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకవచ్చేందుకు గాంధీ ఎంతోగానూ శ్రమించారని తెలిపారు. గాంధీ చెప్పిన బోధనలు, సిద్దాంతాలు.. భారత్ దేశంలో శాంతి, సామరస్యాన్ని తీసుకవచ్చాయని పేర్కొన్నారు. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పాటించిన సిద్ధాంతాల వల్లే బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు స్వేచ్చ లభించిందని చెప్పారు. తాయిబ్ కుందవాలా మాట్లాడుతూ.. గాంధీజీ అహింస సిద్ధాంతాలు, ఆయన కృషితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలనుంచి అసమానమైన ప్రేరణను కలిగించడంతో భారత్‌కు స్వాతంత్ర్యం సాధించగలిగినట్టు తెలిపారు. శబ్నామ్ మోదిగిల్ మాట్లాడుతూ.. గాంధీజీ ఇతర దేశాల నేతలకు గాంధీజీ ఓ స్పూర్తి ప్రదాతగా నిలిచారని, ఆయనను స్పూర్తిగా తీసుకున్న చాలా ఖండాలలో పౌరహక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గాంధీజీ ఒక భారత్ ఖండానికి చెందినవాడు కాదని యావత్ ప్రపంచానికి చెందినవాడిగా కీర్తించారు. -
ఎంసీఐ తనిఖీలు
- కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో పరిశీలన - నేడు సీకేఎం, జీఎంహెచ్, టీబీ ఆస్పత్రుల సందర్శన ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల అనుబంధ వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రితోపాటు వర్ధన్నపేట పీహెచ్సీ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. కేఎంసీ కళాశాలలో 150 సీట్లతో పాటు అదనంగా పెంచిన 50 సీట్లకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలు ఉన్నాయా.. లేదా అని సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎన్.మండల్ మౌలానా అజాద్, కోల్‌కతాకు చెందిన బట్ బయల్, గుజరాత్‌కు చెందిన సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్ వర్మ ఉదయాన్నే కేఎంసీకి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. మొదటగా కళాశాలలోని 16 విభాగాలకు చెందిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా.. అని రికార్డులు పరిశీలించారు. అనంతరం గత సంవత్సరం ఎంసీఐ బృందం ఎత్తిచూపిన లోపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.18.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన బాయ్స్, గర్ట్స్ హాస్టల్స్ నూతన భవనాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న అకాడమిక్ హాల్ భవనం, లెక్చరర్స్ హాల్, గ్రంధాలయాల భవనాలను సందర్శించారు. -
ఎంజీఎం దుస్థితి...పధాని దృష్టికి
వరంగల్, న్యూస్‌లైన్: ‘జాతర నిధులకు ఎలాంటి లోటు లేదు. మరింత పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్లను గుర్తించాం. వాటి పనులను ప్రారంభించాం. జాతర రూట్లో ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నాం. గత జాతర సందర్భంగా కొన్ని గ్రామాల్లో వాహనాలు నిలిచిపోవడంతో క్రేన్ పెట్టి క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి గ్రామాలను, రోడ్లను గుర్తించి విస్తరిస్తున్నాం. జనవరి 30 వరకు రోడ్లన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధంగా ఉంటాం..’ అని ఆర్అండ్బీ ఎస్ఈ జె.మోహన్ నాయక్ అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్ల మరమ్మతులకు రూ.19 కోట్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో రూ. 19 కోట్ల విలువైన పనులకు టెండర్లు ముగిశాయని, రూ. 21 కోట్ల విలువైన పనులకు వచ్చే నెల 2న టెండర్లు పూర్తి చేస్తామన్నారు. జాతర పనులు, కొత్త రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మేడారం చుట్టూ కొత్త రోడ్లు గత జాతర సమయంలో ఏయే రోడ్ల వెంట, ఎక్కడ నుంచి ఎంత మంది వస్తారనే విషయాలను గుర్తించాం. పస్రా-గుండాల రోడ్లను డబుల్ లేన్‌గా విస్తరిస్తున్నాం. పస్రా నుంచి నార్లపూర్ వెంట మొత్తం 6 కిలోమీటర్లు, బయ్యక్కపేట వరకు 11.6 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మధ్యలో తెగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నాం. తాడ్వాయి, నార్లపూర్ వరకు 11 కిలోమీటర్ల రోడ్డును పెద్దగా చేస్తున్నాం. ఇక ఊరట్టం నుంచి మల్యాల వరకు 10 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నం. దీనికి మొదట అటవీ శాఖ అభ్యంతరం తెలిపినా తర్వాత క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. ఇక ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఈసారి నేరుగా మేడారం వచ్చేందుకు ప్రధాన రోడ్డును గుర్తించాం. కరీంనగర్ నుంచి భూపాపల్లి మీద గా బయ్యక్కపేట నుంచి నేరుగా మేడారం వచ్చేందుకు రోడ్డును నిర్మిస్తున్నాం. రూ. 4 కోట్లు కేటాయించాం. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే... పరకాల, జంగాలపల్లి, ములుగు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రావు. గ్రామాల రోడ్లు..రెండింతలు ప్రధానంగా గ్రామాల్లో ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోనే ట్రాఫిక్ ఆగిపోతోంది. దీంతో ఈసారి చుట్టూ ఉన్న గ్రామాల్లోని రోడ్లను రెండింతలు చేసే ప్రయత్నం చేస్తునా. నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్ గ్రామాల్లో రోడ్లను వెడల్పు చేస్తున్నాం. వట్టివా గు, తుమ్మలవాగుల నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పు డు వాటిపై రూ. 8 కోట్లతో రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పనులు మొదలుపెట్టాం. జంపన్నవాగుపై మరో బ్రిడ్జి జంపన్నవాగుపై మరో 100 మీటర్ల పొడవుగా కొత్త బ్రిడ్జిని ప్రతిపాదించాం. దీనికి రూ. 3 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడున్న బ్రిడ్జి పక్కనే దీనిని నిర్మాణం చేస్తాం. ఇక్కడ భూ సేకరణ సమస్య కూడా లేదు. గతంలో సేకరించిన భూమి ఉంది. జనవరి 30 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి తోడు సమ్మక్క గద్దెల నుంచి జంపన్నవాగు వరకు ఇప్పుడు డబుల్ రోడ్డును 10 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నాం. దీనికి కూడా నిధుల కేటాయింపు జరిగింది. దీంతో స్నాన ఘట్టాలకు వెళ్లేందుకు చాలా తేలికవుతుంది. ఇవన్నీ పూర్తి చేసి జాతర వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. ఇప్పటికే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను వేరే చోట్ల పనులు చేయనీయకుండా... మేడారం పనులనే కట్టబెట్టాం. వచ్చేనెల 2న మరో రూ. 21 కోట్ల పనులకు టెండర్లు పూర్తి కాగానే... త్వరగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. జాతర రూట్లోనే కాకుండా లింక్ రోడ్లన్నీ ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తున్నాం. వాటన్నింటినీ జనవరి 30 వరకు పూర్తి చే స్తాం.