డల్లాస్‌లో మహత్మాగాంధీకి శ్రద్ధాంజలి | Homage to Mahatma Gandhiat Mahatma Gandhi Memorial in Dallas, TX | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో మహత్మాగాంధీకి శ్రద్ధాంజలి

Published Mon, Feb 1 2016 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

డల్లాస్‌లో మహత్మాగాంధీకి శ్రద్ధాంజలి

డల్లాస్‌లో మహత్మాగాంధీకి శ్రద్ధాంజలి

డల్లస్‌: జనవరి 30న భారత జాతిపిత, మహత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్లో పలువురు కమ్యూనిటీ సభ్యులు, నేతలు మహత్మాగాంధీ మెమోరియల్‌ వద్ద గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలో అతిపెద్దదైన మహత్మాగాంధీ మెమోరియల్‌ ప్లాజా, ఇర్వింగ్‌, టిఎక్స్ వద్ద కమ్యూనిటీ సభ్యులంతా ఒకేచోట చేరి గాంధీ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహత్మాగాంధీ మెమోరియల్‌ చైర్మన్‌ ప్రసాద్‌ తోటకూర, సహా ఛైర్మన్‌ తయాబ్‌ కుందవాలా, సెక్రటరీ రావు కాల్వాల, బోర్డు డైరెక్టర్‌ షబ్నామ్‌ మోదిగిల్‌, పలువురు కమ్యూనిటీ నేతలు విశ్వనాధమ్‌ పులిగండ్ల, గోపాల పిల్లాయి, రాహుల్‌, జాన్‌ శెర్రీ, అలెక్స్‌ అలెగ్జాండర్‌, అల్యకుట్టి ఫ్రాన్సిస్‌, సత్యాన్‌ కల్యాణ్‌దుర్గ్‌ తదితరులు పాల్గొని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

నార్త్‌ టెక్సస్ మహత్మాగాంధీ మెమోరియల్‌ సెక్రటరీ రావు కాల్వాల మాట్లాడుతూ.. మహత్మాగాంధీ మెమోరియల్‌ ఇండో అమెరికన్ కమ్యూనిటీ డల్లాస్‌కు సరిహద్దు గుర్తుగా మారిందని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకవచ్చేందుకు గాంధీ ఎంతోగానూ శ్రమించారని తెలిపారు. గాంధీ చెప్పిన బోధనలు, సిద్దాంతాలు.. భారత్‌ దేశంలో శాంతి, సామరస్యాన్ని తీసుకవచ్చాయని పేర్కొన్నారు.

తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పాటించిన సిద్ధాంతాల వల్లే బ్రిటిష్‌ పాలన నుంచి భారత్‌కు స్వేచ్చ లభించిందని చెప్పారు.

తాయిబ్‌ కుందవాలా మాట్లాడుతూ.. గాంధీజీ అహింస సిద్ధాంతాలు, ఆయన కృషితో పాటు దేశవ్యాప్తంగా ప్రజలనుంచి అసమానమైన ప్రేరణను కలిగించడంతో భారత్‌కు స్వాతంత్ర్యం సాధించగలిగినట్టు తెలిపారు.

శబ్నామ్‌ మోదిగిల్‌ మాట్లాడుతూ.. గాంధీజీ ఇతర దేశాల నేతలకు గాంధీజీ ఓ స్పూర్తి ప్రదాతగా నిలిచారని, ఆయనను స్పూర్తిగా తీసుకున్న చాలా ఖండాలలో పౌరహక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గాంధీజీ ఒక భారత్‌ ఖండానికి చెందినవాడు కాదని యావత్‌ ప్రపంచానికి చెందినవాడిగా కీర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement