5వరకు దరఖాస్తుల స్వీకరణ
న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)–2017కు సంబంధించి అభ్యర్థులకు 25 ఏళ్లుగా నిర్ణయించిన గరిష్ట వయోపరిమితిని సుప్రీం కోర్టు శుక్రవారం తొలగించింది. సీబీఎస్‌ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5వరకు దరఖాస్తు చేయొచ్చని స్పష్టంచేసింది. మే నెల 7న జరిగే ఈ పరీక్షకు భారత వైద్య మండలి ఆదేశాల ప్రకారం వయోపరిమితిని సీబీఎస్‌ఈ కేవలం నోటీసు జారీ ద్వారా నిర్ణయించజాలదని కోర్టు వ్యాఖ్యానించింది.
పరీక్ష రాయాలని కోరుకునే అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ.. అదనపు కేంద్రాల ఏర్పాటు కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లను, నగర మేయర్లను సాయం కోరొచ్చని సూచించింది. ఈ పరీక్షకు గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయిస్తూ సీబీఎస్‌ఈ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన రాయ్ సబ్యసాచి, అభ్యర్థుల పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది.
నీట్ వయోపరిమితి తొలగింపు
Published Sat, Apr 1 2017 3:38 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement