డబ్బులు డిమాండ్ చేస్తున్న కళాశాలలపై చర్యలు
హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు పీజీ విద్యార్థులకు గౌరవ భృతి ఇవ్వాల్సి ఉండగా... వారి నుంచే డబ్బులు వసూలు చేస్తుండటంపై భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాలు, గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి రాజేశ్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)కి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. సంబంధిత వైద్య కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఆసుపత్రుల ఆదాయంతోనే భృతి..
ప్రైవేటు వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రి ఉంటుంది. వాటిల్లో పీజీ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. సేవలు చేసినందుకు వారికి గౌరవ భృతిని సంబంధిత కళాశాల యాజమాన్యమే చెల్లించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా విద్యార్థుల నుంచే ఏడాదికి రూ. 2.90 లక్షలను ముందస్తుగా వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తాన్నే విద్యార్థులకు భృతిగా చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎంసీఐ పీజీ కమిటీ ఛైర్మన్ భగవాన్ తివారీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎంసీఐ స్పందించింది.
పీజీ వైద్యుల కౌన్సిలింగ్ మ్యాట్రిక్స్..
ఏడాదిపాటు ‘తప్పనిసరి’ వైద్య సేవలందించాలనే నిబంధనపై భర్తీ చేయనున్న పీజీ వైద్యుల కౌన్సెలింగ్ మ్యాట్రిక్స్‌ను వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో 685 మంది వైద్య విద్యార్థుల నియామకాలు జరపనుండగా... ఇందులో 566 మందిని బోధనాసుపత్రుల్లో, 119 మందిని వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నారు. సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వైద్య విద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నియామకాల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ వైద్య కాలేజ్‌లు, అనుబంధ ఆసుపత్రుల్లో వైద్యులను కేటాయించనున్నారు.
ప్రైవేటు పీజీ వైద్య విద్యార్థులకు ఊరట
Published Tue, Jul 14 2015 12:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement
Advertisement