Private medical colleges
-
కొత్త మెడికల్ కాలేజీలకు నో
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఝలక్ ఇచ్చింది. మొత్తం 8 మెడికల్ కాలేజీలకు అనుమతి లేఖ (లెటర్ ఆఫ్ పర్మిషన్ – ఎల్వోపీ) ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు మెయిల్ పంపించింది. మౌలిక సదుపాయాలు లేకపోగా, అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. సౌకర్యాలు సరిగాలేని కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల, నారాయణపేట, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో వైద్య కళాశాలల కోసం గతేడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందం బోధనా సిబ్బంది లేకపోవడం (జీరో ఫ్యాకల్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల, ఇన్‌పేషెంట్లు విషయమై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ, ఐపీ మాత్రం ఎన్ఎంసీ నిబంధనల మేరకు లేదు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. కానీ రాష్ట్ర కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మినహా మిగతా సిబ్బంది లేరు. అలాగే నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా ఉండాలి. కానీ వాళ్లు లేకుండానే కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కాగా ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించుకోవాలి. లేనిపక్షంలో అనుమతులివ్వదు. కాగా ఈ విషయంపై డీఎంఈ డాక్టర్ వాణి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లెటర్ల కోసం ఎదురుచూస్తున్నామని, అవి అందిన తర్వాత అప్పీలుకు వెళ్తామని తెలిపారు. బోధనా సిబ్బంది లేరు.. వసతుల్లేవు రాష్ట్రంలో 29 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 56 మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 3,790 సీట్లు ఉండగా ఎక్కువ కాలేజీల్లో 150 చొప్పున మాత్రమే ఉన్నాయి. వీటిల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అనేకచోట్ల పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఔట్ పేషెంట్లు రాకపోవడంతో పీజీ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను తూతూ మంత్రంగా పూర్తి చేస్తున్నారు. కొందరు పీజీ మెడికల్ కోసం కోచింగ్‌లకు వెళ్తున్నారు. ఏదో పరీక్ష పాసైతే చాలన్న అభిప్రాయం అటు విద్యార్థులు, ఇటు కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొందనే విమర్శలు విని్పస్తున్నాయి. వాస్తవానికి వసతులు లేవని విద్యార్థులు కూడా బయటకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. చెప్పినా, నిరసన వ్యక్తం చేసినా ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోంది. గతంలోనే ఎన్ఎంసీ గరం ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అనేకచోట్ల ఇటువంటి పరిస్థితి ఉంటోందని ఎన్ఎంసీ గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉందని ఎన్ఎంసీ గతంలోనే తేల్చడం గమనార్హం. 150 ఎంబీబీఎస్ సీట్లున్న మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్పేòÙంట్లు ఉండాలి. కానీ ఒక చాలా కాలేజీల్లో సగం మేరకు కూడా ఔట్ పేషెంట్లు రావడంలేదు. ఇది వైద్య శిక్షణకు ఏమాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు. ఇక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 600 పడకలు అవసరం కాగా, చాలాచోట్ల 500–550తోనే నడిపిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ కేవలం 10 శాతం వరకే ఉంటోంది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం సరిపోదని చెబుతున్నారు. లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు అవసరమైన సంఖ్యలో లేవు. మెడికల్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా 450 మందికి సరిపోయేలా హాస్టల్ వసతి ఉండాల్సి ఉండగా, 150 మంది బాలికలు, 190 మంది బాలురకు సంబంధించిన హాస్టల్ వసతి మాత్రమే ఉంది. కొన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల శిక్షణ కోసం అవసరమైన అల్ట్రాసౌండ్ యంత్రాలు కూడా లేకపోవడం గమనార్హం. -
ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నరేళ్లకే తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఎంబీ బీఎస్ ఫీజును ఐదేళ్లకు కాకుండా నాలుగున్నరేళ్లకే తీసుకోవాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రైవేట్ కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర ఏళ్లు మాత్రమేనని, అందుకు తగ్గట్టుగానే ఫీజు తీసుకోవాలని సూచించింది. కొన్ని కాలేజీలు ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి స్పష్టతను ఇస్తున్నామని తెలిపింది. ఉదాహరణకు కోర్సు ఫీజు ఏడాదికి రూ. 14.5 లక్షలు అనుకుంటే, మొత్తం నాలుగున్నర ఏళ్లకు కలిపి రూ. 65.25 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్లలో విద్యార్థుల నుంచి తీసుకోవాలని, ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ. 13.05 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. దీనివల్ల ఆరు నెలలు అదనంగా వసూలు చేస్తున్న ఫీజుల భారం విద్యార్థులపై పడదని తెలిపింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజును ఐదు సమాన వాయిదాలలో వసూలు చేయాలని, మేనేజ్మెంట్లు ముందుగా ఫీజును వసూలు చేయరాదని కమిటీ సిఫార్సు చేసింది. అంటే ఎంబీబీఎస్ విద్యార్థుల వద్ద కోర్సు మొత్తానికి ఒకేసారి ఫీజు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఫీజు రెగ్యులేటరీ కమిటీ హెచ్చరించింది. ఏ యేడాది ఫీజును ఆ ఏడాది మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, ప్రతీ ఏడాది టీఏఎఫ్ఆర్సీ ఇలా ఆదేశాలు ఇస్తున్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లెక్కచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
100 ఎంబీబీఎస్ సీట్ల మిగులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పెద్ద ఎత్తున ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 100 వరకు ఎంబీబీఎస్ సీట్లు మిగిలినట్లు అంటున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. వాటికి మాప్ అప్ రౌండ్ నిర్వహించాక మిగిలిన 128 సీట్లను స్ట్రే వేకెన్సీ పద్ధతిలో నింపేందుకు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసినా పెద్దగా స్పందన రాలేదని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు బీ–కేటగిరీ సీట్లలోనూ కొన్ని సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు 100 వరకు మిగిలినట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని కాలేజీలు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు సమాచారం ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఫిజికల్ కౌన్సెలింగ్ రద్దుతో మారిన పరిస్థితి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లనూ భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ కౌన్సెలింగ్ చేపట్టవద్దని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అయినా సీట్లు మిగిలిపోతే వాటిని వదిలేయాలని పేర్కొంది. దీనివల్ల కూడా సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నారు. సహజంగా ఏటా కొన్ని ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుంటాయి. ఎన్ఆర్ఐ సీట్లపై అభ్యర్థుల అనాసక్తి... రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. బీ–కేటగిరీ సీట్లలో 85 శాతం వరకు లోకల్‌కు కేటాయిస్తుండటంతో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్ఆర్ఐలో సీట్లు ఎక్కువగానే ఉన్నా ఫీజులు అధికంగా ఉన్నాయి. బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు స్థాయిలో ఎన్ఆర్ఐ కోటా ఫీజులున్నాయి. అంటే ఏటా ఎన్ఆర్ఐ కోటా సీటు ఫీజు రూ. 23 లక్షలకుపైగా ఉంది. దీంతో 723 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లున్నా తక్కువమంది విద్యార్థులే ఆప్షన్లు పెట్టుకున్నారు. చివరకు వెసులుబాట్లు కల్పించినా ఇంకా సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో ఎంబీబీఎస్ చేసే బదులు ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ సీట్లు మిగలడంతో అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
మేం చెప్పే వరకూ ఆగండి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్ –1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయవద్దని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. రాజమండ్రిలోని జీఎస్ఎల్ కళాశాలలో ఎండీ– రేడియో డయగ్నోసిస్ కోర్సులో 14 సీట్లకు నకిలీ అనుమతులు జారీ అయినట్లు నేసనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంగళవారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం మళ్లీ తెలిపే వరకూ విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయద్దని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి కోరారు. ఇప్పటికే కళాశాలల్లో రిపోర్ట్ చేసిన, చేయని విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి జారీ చేసే తదుపరి నిర్ణయం కోసం వెబ్‌సైట్‌ను చూస్తుండాలని సూచించారు. ఎన్ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ లేఖ నంద్యాల జిల్లా శాంతీరామ్, విజయనగరం జిల్లా మహారాజా, తూర్పుగోదావరి జిల్లా జీఎస్ఎల్ వైద్య కళాశాలల్లో నకిలీ అనుమతులతో పీజీ సీట్లు పెంచినట్లు వెల్లడవడంతో గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని తిరిగి మొదటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సోమవారం సీట్లు కేటాయించింది. అయితే అనూహ్యంగా మంగళవారం మరో 14 సీట్లకు జీఎస్ఎల్ నకిలీ అనుమతులు ఉన్నాయంటూ ఎన్ఎంసీ పేర్కొంది. దీంతో ఈ అంశంపై స్పష్టత కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ అనుమతులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎన్ఎంసీ సమాచారమిచ్చిందని తెలిపారు. ఫిర్యాదు వివరాలను కోరామని చెప్పారు. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశామన్నారు. మరో వైపు నకిలీ అనుమతుల అంశంపై మూడు కళాశాలలకు విశ్వవిద్యాలయం వీసీ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. -
12లక్షల ర్యాంకుకు ఎన్నారై కోటా సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ సీట్లకు జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌లో.. ఎన్నారై కోటా (సీ కేటగిరీ)లో గరిష్టంగా 12 లక్షల నీట్ ర్యాంకర్ వరకు సీట్లు లభించాయి. అదే బీ కేటగిరీలో 5.39 లక్షల ర్యాంకర్ వరకు సీట్లు వచ్చాయి. తదుపరి జరగనున్న రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఈ ర్యాంకులు మరింత పెరిగే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఎంబీబీఎస్ బీ, సీ కేటగిరీల తొలివిడత కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ గురువారం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వినర్ కోటా సీటు లభించిన సంగతి తెలిసిందే. కన్వీనర్ కోటాకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. అందులో రిజర్వేషన్ కేటగిరీల్లో ఇంకా పెద్ద ర్యాంకుకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నారై సీట్లపై అనాసక్తి.. రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది. ఇలా అడ్డగోలు ఫీజులు ఉండటంతో.. 700 సీట్లు అందుబాటులో ఉన్నా.. 330 మంది మాత్రమే వాటికి ఆప్షన్ పెట్టుకున్నారు. చివరివరకు కన్వినర్, బీ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించి.. వాటిలో రానివారు మున్ముందు ఎన్నారై కోటా కింద చేరే అవకాశాలు ఉంటాయని వైద్యవిద్య వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్నారై కోటాలో ఎంబీబీఎస్ చేసే బదులు.. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన కూడా ఉందని అంటున్నాయి. నేటి నుంచి ఎంబీబీఎస్ తరగతులు షురూ 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు శుక్రవారం (సెపె్టంబర్ 1) నుంచి ప్రారంభం అవుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. పీజీ మెడికల్ తరగతులు ఈ నెల ఐదో తేదీ నుంచి మొదలవుతాయని తెలిపింది. ఇప్పటికే ఎంబీబీఎస్, పీజీలలో కన్వినర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలకు తొలి విడత కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. దీంతో తరగతులు ప్రారంభించాలని ఎన్ఎంసీ ఆదేశించిన నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కాగా.. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్లలోని ఈ కాలేజీల్లోనూ శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. -
ఆన్లైన్ కౌన్సెలింగ్‌తోనే వైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టే దిశగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్) కౌన్సెలింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రతిభకు న్యాయం 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్‌లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బ్లాకింగ్‌తో కోట్లు దండుకున్న కాలేజీలు! గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్‌తో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్‌లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్‌గా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు. రూ.60 వేలున్న కన్వీనర్ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు. ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
పెత్తందారులకు ‘ప్రైవేట్’ జబ్బు!
చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించి జేబులు నింపుకొనేందుకే తపించారు. ఒక్కటైనా ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పలేదు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాలికి వదిలేశారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం ఖండాతరాలు దాటి వెళ్తుంటే నాడు రాజ గురివింద నోరెత్తిన పాపాన పోలేదు!! ఇప్పుడు వైద్య రంగం బలం పుంజుకుంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయంతో కొత్తగా 17 వైద్య కళాశాలలు సమకూరుతున్నాయి. మన విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు పెరిగాయి. సామాన్యుడికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు మరింత మెరుగ్గా అన్ని చోట్లా అందుబాటులోకి వస్తాయి. దీంతో గుండెలదిరిన ఫిలింసిటీ పెత్తందారు యథాప్రకారం చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు ఆరాటపడ్డారు!! సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ నిర్వహణ ఆషామాషీ కాదు! వసతులు, సిబ్బంది విషయంలో తేడావస్తే ఆ ప్రభావం సీట్ల సంఖ్యపై పడుతుంది! వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలనే సదుద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని తెస్తుంటే వైద్య రంగాన్ని తెగనమ్మేస్తున్నట్లు రామోజీ కన్నీళ్లు కార్చారు! ఈ ఏడాది మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాలలో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ఒక్కోదానిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఒక్కో వైద్య కళాశాలకు బోధన, నర్సింగ్, పారామెడికల్, ఇతర సహాయ సిబ్బందితో కలిపి 1,013 మంది ఉద్యోగులు అవసరం. కళాశాల నిర్వహణకు ఏటా రూ.225 కోట్లు కావాలి. మొత్తంగా 17 మెడికల్ కాలేజీల కోసం ఏడాదికి రూ.3,825 కోట్లు వ్యయం అవుతుంది. ప్రభుత్వం కట్టేవేమీ కామినేని, నారాయణ మెడికల్ కాలేజీలు కావు! కొత్త కాలేజీల్లో యాభై శాతం సీట్లు జనరల్ కేటగిరీలోనే ఉంటాయి. మిగిలినవి మాత్రమే బీ, సీ కేటగిరీల్లోకి వెళ్తాయి. అయినా ఆ డబ్బేమీ ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లదు. పలు కేటగిరీల ద్వారా వచ్చే డబ్బు ఆయా కాలేజీలకే చెందుతుంది. వాటితో సంబంధిత మెడికల్ కాలేజీ బాగోగులను చూసుకుంటూ సమర్థంగా నిర్వహిస్తారు. అంతిమంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అదనంగా అందుబాటులోకి వస్తాయి. ♦ ఈ ఏడాది కొత్తగా వచ్చే ఐదు కాలేజీల్లో 113 సీట్లు (15 శాతం) ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 637 సీట్లలో 319 సీట్లను (50 శాతం) జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. 35 శాతం అంటే 223 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో, 15 శాతం అంటే 95 సీట్లను ఎన్నారై కోటా కింద భర్తీ చేస్తారు. కేవలం కొత్త కళాశాలలకే ఈ విధానాన్ని వర్తింపచేస్తున్నారు. ♦ ఇప్పటివరకు ఉన్న 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 2,360 సీట్లు ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే 17 కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు పెరుగుతాయి. అంటే రెట్టింపు దాటి పెరుగుతున్నాయి. ప్రభుత్వం రంగంలో 29 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం ద్వారా ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,910కి పెరుగుతాయి. అప్పుడు మన విద్యార్థులకు మంచి జరుగుతున్నట్లే కదా? ప్రభుత్వ వైద్యం బలోపేతం ఇలా ♦ నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే సేవలు. ♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు 2 సార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ఇప్పటివరకూ 1.70 కోట్లమందికి సొంతూళ్లలోనే వైద్యం. ♦ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం. ♦ 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు. ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు. -
సీట్ల బ్లాకింగ్‌లో వందల కోట్ల లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీలు రూ. లక్షల విలువ చేసే పీజీ సీట్లను రూ. కోట్లకు అమ్ముకున్నట్లు... ఈ కళాశాలల్లో రూ.వందల కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారీ మొత్తంలో నగదును సీజ్ చేసినట్లు ఈడీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం నాటి సోదాల సందర్భంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కార్యాలయాల నుంచి రూ. 1.4 కోట్ల నగదును స్వా ధీనం చేసుకున్నామని... ఆ కాలేజీ బ్యాంకు ఖాతాలో మరో రూ. 2.89 కోట్ల నగదును స్తంభింపజేశామని వివరించింది.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర రికార్డులను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఈడీ... మల్లారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి నగదు స్వా«దీనం చేసుకున్నట్లు మాత్రమే ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. లక్షల పెట్టుబడితో కోట్ల సంపాదన... కాళోజీ యూనివర్సిటీ అధికారులు గతేడాది చేసిన ఫిర్యాదు మేరకు మెడికల్ సీట్ల బ్లాకింగ్ దందాపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సీట్ల బ్లాకింగ్ దందాపై ఆరా తీశారు. పూర్తిస్థాయిలో ప్రాథమిక ఆధారాలు సేకరించి బుధవారం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిపిన ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించారు. కొల్లగొట్లే దానిలో కొంత వాళ్లకు... మెరిట్ విద్యార్థులతో కుమ్మక్కై పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ దందాలో దండుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని సీట్లు బ్లాక్ చేసేందుకు అంగీకరించిన విద్యార్థులకు సదరు కాలేజీలు చెల్లిస్తున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఆరోగ్య వర్సిటీల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాక కూడా మిగిలే సీట్లను ప్రైవేటు కాలేజీలు సొంతంగా భర్తీ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వెసులుబాటును అనుకూలంగా మార్చుకొని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు సీట్ల బ్లాకింగ్ దందాకు తెరతీశాయి. పీజీ నీట్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థులతో మరో కళాశాలలోనూ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు సీటు బ్లాక్ చేయిస్తున్నారు. ఇలా చివరకు మిగిలిపోయిన సీట్లలో ఒక్కో సీటును రూ. కోటి నుంచి రూ. 2.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. కౌన్సెలింగ్‌లో సీట్లు తీసుకోని విద్యార్థులు చివరకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన అపరాధ రుసుమును సైతం వారి తరఫున కాలేజీల యాజమాన్యాలే చెల్లిస్తున్నాయి. గుడ్‌విల్ కింద వారికి రూ. లక్షల్లో ముట్టజెప్పుతున్నాయి. ఇలా సీట్ల బ్లాక్ దందాతో రూ. లక్షలు ఖర్చు చేసి రూ. కోట్లు సంపాదిస్తున్నట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ప్రైవేటు మెడికల్ సీట్లలో స్థానిక రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా బీ కేటగిరీ సీట్లలో స్థానికులకు (తెలంగాణ ప్రాంతం వారికి) 85% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా ఉంటుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ శాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా బీ కేటగిరీ కింద 35 శాతం సీట్లు (మైనారిటీ కాలేజీల్లో 25 శాతం సీట్లు) కేటాయిస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇందులో 85% తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24 ప్రైవేటు మెడికల్ కళాశాలలుండగా, వాటిల్లో 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు లభించనున్నాయి. అదనపు సీట్లు ఇలా.. రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లున్నాయి. ఆ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు నీట్ ర్యాంకు ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పటివరకు ఉంది. కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనలతో బీ కేటగిరీలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగతా 15 శాతం (168) సీట్లకు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడే వీలు ఉంటుంది. ఓపెన్ కోటా కాబట్టి ఇందులోనూ తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనారిటీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. ఇతర రాష్ట్రాల వారికి చెక్ ఇప్పటివరకు బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు ఎక్కువ ఫీజు చెల్లించి ఎన్ఆర్ఐ కోటా సీట్లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. బీ కేటగిరీ ఫీజుకు రెండింతలు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు చెల్లించాల్సి వచ్చేది. లేదా ఇతర రాష్ట్రాలకు, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఎక్కువ ఫీజుతో చేరాల్సి వచ్చేది. దీనిపై మంత్రి హరీశ్‌రావు ఆదేశం మేరకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని బీ కేటగిరీ సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేయడం గమనార్హం. రాష్ట్రంలోనే డాక్టర్ కల సాకారం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ స్థానిక విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85 శాతానికి పెంచి తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ కావాలనే కలను రాష్ట్రంలోనే ఉండి చదివి సాకారం చేసుకోవాలనుకునే ఎంతోమందికి దీనిద్వారా గొప్ప అవకాశం కల్పించింది. – హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
ఫీ'జులుం' సాగడంలేదిక్కడ
ఎంబీబీఎస్ చదివిన ప్రతి విద్యార్థికీ ఇప్పుడు పీజీ తప్పనిసరి. ఇందుకోసం వైద్య విద్యార్థులు అహోరాత్రాలూ కష్టపడతారు. తీరా నీట్ పరీక్ష రాసి, ర్యాంకులు వచ్చాక.. ప్రభుత్వ కళాశాలల్లో సీటు రాక, ప్రైవేటు కళాశాలల్లో చేరలేక నిరుత్సాహ పడిపోతారు. ఫీజులు అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత వైద్య విద్యకు దూరమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇదే విషయంపై ఆలోచన చేశారు. వెంటనే భారీగా ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిస్థితి మారింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీటు పొందాలని ప్రయత్నిస్తున్నారు. – నాగా వెంకటరెడ్డి చంద్రబాబు దుర్మార్గం.. జగన్ మానవత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకునేలా నిర్ణయం తీసుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టగానే ఆయన బంధువుకు చెందిన విశాఖలోని గీతం మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదా కల్పించి, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, పీజీ సీట్ల ఫీజులు ఇష్టానుసారం పెంచుకొనే అవకాశమిచ్చారు. ఇందుకు అడ్డు చెప్పిన అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను తప్పించి మరీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ పీజీ వైద్య ఫీజు ఏడాదికి రూ.11 లక్షలు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏడాదికి రూ.24.20 లక్షలకు పెంచేసింది. అంటే రెండింతలకు పైగా పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేకమంది ఉన్నత వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీని సాకుగా చూపుతూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు కూడా ఫీజులు పెంచేశాయి. జగన్ సర్కారు వచ్చిన తర్వాత మానవతా దృక్పధంతో ఆలోచించింది. సీఎం జగన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య నేతృత్వంలో ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నియమించారు. దేశంలోని మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను పరిశీలించారు. సహేతుకత ఆధారంగా 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తగ్గించారు. దీంతో ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ ఫీజు రూ.24.20 లక్షల నుంచి రూ.8.64 లక్షలకు దిగొచ్చింది. అంటే ఏడాదికి రూ.15.56 లక్షలు చొప్పున మూడేళ్ల కోర్సుకు రూ.46.68 లక్షల భారం తల్లిదండ్రులకు తగ్గింది. దీంతో అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఏపీ వైపు చూస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో బి కేటగిరి సీట్లకు తీవ్రమైన పోటీ ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ తెలిపారు. ఫీజులు తక్కువ కావడంతో పాటు ఏపీలో కోర్సు పూర్తయిన తరువాత సర్వీసు బాండ్లు అమల్లో లేవు. ఇది కూడా విద్యార్థులకు సానుకూల అంశమని వైద్య కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు. పీజీ అయ్యేలోగా రుణం తీర్చేసుకోవచ్చు ఆంధ్రలో బి కేటగిరిలో పీజీ సీటు తెచ్చుకోగలిగితే పేద, మధ్య తరగతి వారు కూడా ధైర్యంగా చేరవచ్చు. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కోర్స్ పూర్తయ్యేలోగా స్టయిఫండ్‌తో, సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తూ అప్పు తీర్చేసుకోవచ్చు అని ఓ వైద్య విద్యార్థి అభిప్రాయపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ఫీజులు ఇలా.. జగన్ సర్కారు చర్యల కారణంగా మెడికల్ పీజీ క్లినికల్ డిగ్రీ, పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమా, ప్రి క్లినికల్ కోర్సుల కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఇన్స్టిట్యూషనల్/ఎన్ఆర్ఐ కోటా ఫీజులు మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. ► క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా ఫీజు రూ.4.32 లక్షలు కాగా, మేనేజ్మెంట్ కోటా రూ.8.64 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.50 లక్షలుగా ఉండగా కళాశాలల యాజమాన్యాలు కోర్సు డిమాండ్ ఆధారంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. క్లినికల్ డిగ్రీ బి కేటగిరి కింద ఏపీలో మూడేళ్లలో చెల్లించే ఫీజు 25.92 లక్షలు. అదే తెలంగాణలో ఏడాదికి రూ.23 లక్షలు చొప్పున మూడేళ్లలో రూ.69 లక్షలు చెల్లించాలి. ఇది ఏపీలో కన్నా 62.43 శాతం అధికం. ► పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమా కన్వీనర్ కోటా ఫీజు రూ.1.35 లక్షలు కాగా, మేనేజ్మెంట్ కోటా రూ.2.70 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.15 లక్షలు. తెలంగాణలో ఇవే రూ.4.30 లక్షలు, రూ.5.30 లక్షలు, రూ.15.90 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవి ఏపీలోకన్నా 68.60, 49.06, 5.66 శాతం అధికం. ► ప్రి క్లినికల్ కోర్సు ఫీజుల్లోనూ ఇదే విధంగా తేడాలు ఉన్నాయి. ► కర్ణాటక, కేరళలోనూ ఫీజులు ఏపీలోకన్నా ఎక్కువే. కర్ణాటక ప్రైవేటు మెడికల్ కాలేజీలో పీజీ సీటుకు కోర్సును బట్టి రూ.11.50 లక్షల నుంచి వసూలు చేస్తున్నారు. అదే డీమ్డ్ యూనివర్శిటీల్లో పీజీ బి కేటగిరి సీటు ఏడాది ఫీజు 25.30 లక్షలు. క్లినికల్ డిగ్రీ ఫీజు కేరళలో ఏపీలోకన్నా 42.4 శాతం అధికం. పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమో కోర్సుల ఫీజులు ఏకంగా 70.35 శాతం ఎక్కువ. పీజీ మెడికల్ సీట్లు ఇలా.. ► 2021– 2022 ప్రకారం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లు 2,358. ► ప్రభుత్వ కాలేజీల్లో 1,034 సీట్లు కాగా ఆల్ ఇండియా కోటా కింద 505, స్టేట్ కోటా కింద 529 ఉన్నాయి. ► ప్రైవేటు కాలేజీల్లో సీటు 1,324 కాగా కాంపిటెంట్ కోటా కింద 639, మేనేజ్మెంట్ కోటా 685 ఉన్నాయి. థ్యాంక్యూ.. జగన్ అంకుల్ ‘నీట్’లో ర్యాంకు వచ్చింది. ‘బీ’ కేటగిరిలో ఆం్ర«ధాలో సీటు వచ్చింది. పెంచిన ఫీజుల భారాన్ని భరించే ఆర్థిక పరిస్థితులు లేక అమ్మనాన్నలను, ఆంధ్రాను వదిలి 2016లో కర్ణాటకకు రావాల్సి వచ్చింది. నాకన్నా మెరుగైన ర్యాంకులు పొందిన నా ప్రెండ్స్ ఫీజులు భరించలేక వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీలో 2014 వరకు ఎంబీబీఎస్ సీటు బీ కేటగిరిలో ఏడాదికి రూ.2.50 లక్షలు ఉండేది. దాన్ని రూ.11 లక్షలకు పెంచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏపీని చూసి కర్ణాటకలోనూ పెంచేశారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మంచి ర్యాంకులు తెచ్చుకుని డబ్బు లేనివారు మెడిసిన్‌కు దూరమవుతున్నారు. ఆంధ్రాలో బీ కేటగిరీలో పీజీ సీటు వచ్చేలా ర్యాంకు తెచ్చుకోవాలని.. ఇక్కడ సీటొస్తే కుటుంబమంతా కలిసి ఉండవచ్చని అమ్మానాన్నలు పదేపదే చెపుతున్నారు. ఈ ఆకాంక్ష మా ఒక్కరిదే కాదు.. తల్లిదండ్రులందరిదీ. థాంక్యూ జగన్ అంకుల్. – ఎం.కావ్య (ఎంబీబీఎస్), కర్ణాటక -
మరో ముప్పు.. 33 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రం ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతం అవుతున్న దశలో మరో ఇబ్బంది వచ్చింది. బెంగళూరులో 33 మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. వీరికి వివిధ ఆస్పత్రులలో చికిత్సలు అందిస్తున్నట్లు బీబీఎంపీ ఆరోగ్య అధికారి విజయేంద్ర తెలిపారు. కోవిడ్ రోగులకు, కోలుకున్నవారిలో కొందరికి ఈ జబ్బు సోకుతున్నట్లు వార్తలు వచ్చాయి. మధుమేహం ఉన్న కోవిడ్ రోగులకు సోకే ప్రమాదముందని నిపుణులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారి మాట్లాడుతూ ఫంగస్ సోకిన వారికి వైద్యం అందిస్తూ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో పాటు ఫంగస్‌తో బాధపడే రోగులకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చికిత్సలందిస్తామని చెప్పారు. త్వరలో చికిత్సా విధానం: మంత్రి రాష్ట్రంలో త్వరలో 780 మంది స్పెషలిస్ట్ వైద్యులతో పాటు మొత్తం 2480 మంది డాక్టర్లను నియమిస్తామని ఆరోగ్యమంత్రి సుధాకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తిపై కోవిడ్ సాంకేతిక సమితితో చర్చించా, వారు గురువారం నివేదిక ఇస్తారన్నారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్సా విధానం ఏమిటనేది చూడాలి. ఇందుకు మహారాష్ట్రలో ఉచితంగా వైద్యమందిస్తున్నట్లు తెలిసిందన్నారు. కరోనా ఇండియన్ వేరియంట్ బ్రిటిష్ వేరియంట్ కంటే కొంచెం విభిన్నంగా ప్రవర్తిస్తోందని గుర్తించామన్నారు. -
కొత్తగా నాలుగు కోవిడ్ కేంద్రాలు: మంత్రి ఈటల
-
ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్ చికిత్సలు అందించాలని, నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను అధిక ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రస్తుతం రోగుల వద్దకు పీపీఈ కిట్లు లేకుండా కేవలం మాస్క్‌లతోనే డాక్టర్లు వెళ్లగలుగుతున్నందున, వాటికి అదనంగా చార్జీలు వసూలు చేయొద్దని సూచించారు. కోవిడ్ రోగులకు బెడ్ల కేటాయింపు అంశంపై శనివారం మంత్రి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో వేర్వేరు గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్స, ఆసుపత్రుల్లో బెడ్ల చార్జీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాగా, తమకు సరిపడా వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ వంటివి ఉచితంగా సరఫరా చేయాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వమే కావాల్సిన మందులు సరఫరా చేస్తుందన్నారు. ప్రైవేట్ వైద్య కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో 14 వేలకు పైగా బెడ్స్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనూ కావాల్సినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం బెడ్స్, ఉచిత చికిత్స.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అవసరమైన మం దులు, ఆక్సిజన్, ఇతర పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నందున కోవిడ్ రోగులకు 50 శాతం బెడ్స్ కేటాయింపుతో పాటు, అక్కడ కరోనా పేషెంట్లకు ఉచితంగా చికిత్స చేయాలని సూచించినట్టు మంత్రి ఈటల చెప్పారు. అలా అని అవసరం లేకపోయినా చికిత్సకోసం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చేరేందుకు రావొద్దని, డాక్టర్లు సిఫారసు చేస్తేనే వాటిలో చేరాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు వ్యాపార ధోరణితో కాకుండా మానవీయ దృక్పథంతో ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా కరోనా రోగులకు వైద్యం అందించాలని కోరామన్నారు. వ్యాక్సిన్ల కొరతపై కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలి.. కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున ఫంక్షన్లు, బహిరంగ సభలకు, సమావేశాలకు వెళ్లకూడదని సూచించారు. రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ విధింపు వంటివి ఉండవన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీలలో కేసుల తీవ్రత కారణంగానే తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా.. వైరస్ తీవ్రత తక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం 50 శాతం బెడ్లు కోరింది.. కరోనా నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి డాక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. మందులు, ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరినపుడు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 750 చొప్పున బెడ్స్ ఉంటాయని తాము యాభై శాతం బెడ్స్ ఇస్తామని ప్రభుత్వానికి చెప్పినట్టు మల్లారెడ్డి కాలేజీ ప్రతినిధి భద్రారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా ప్రజలకు ఉచితంగా అందిస్తామని మహేశ్వర మెడికల్ కాలేజీ ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు చెప్పారు. సెకండ్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదు.. ప్రస్తుతం వంద మంది కోవిడ్ రోగులు వస్తే కేవలం ముగ్గురు మాత్రమే వెంటిలేటర్ వరకు వెళ్తున్నారని కిమ్స్ ప్రతినిధి భాస్కర్‌రావు తెలిపారు. సెకండ్‌వేవ్‌తో ప్రమాదం ఏమి లేదన్నారు. ఇంకో మూడు సంవత్సరాలు జాగ్రత్త పడితేనే బయటపడతామన్నారు. కాగా, ఫీజులు.. బిల్లుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు రావడం సహజమేనన్నారు. అయితే లోన్లు కట్టలేదని బ్యాంకు అధికారులు వచ్చి ఆసుపత్రులను సీజ్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు! -
పీజీ మెడికల్ విద్యార్థుల ధర్నా
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ)/గన్నవరం రూరల్/నెల్లూరు అర్బన్/భీమిలి/శ్రీకాకుళం రూరల్/: ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో సీట్లు పొందిన పీజీ మెడికల్, డెంటల్ అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ధర్నాలకు దిగారు. ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించిన విషయం విదితమే. కాగా.. తొలివిడత సీట్లు పొందిన అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోగా కళాశాలల్లో చేరాల్సి ఉండగా, ప్రైవేట్ కళాశాలలు చేర్చుకోలేదు. దీనిని నిరసిస్తూ వందలాది విద్యార్థులు విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ, వివిధ ప్రైవేట్ కళాశాలల ఎదుట ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని వైద్య కళాశాలలు ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తున్నాయని.. తమకు పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం లేదని వాపోయారు. ► కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ పీజీ సీట్లు పొందిన విద్యార్థులు ఆ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ‘జీవో–56 విద్యార్థులకు వరం.. సేవ్ జీవో–56. వెంటనే సీట్లు కేటాయించాలి’ అంటూ నినాదాలు చేశారు. ► నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీట్లు పొందిన పీజీ వైద్య విద్యార్థులు తమను వెంటనే కళాశాలలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట ధర్నా జరిపారు. యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, అప్పటివరకు సంయమనం పాటించాలని సూచించారు. ► విశాఖ జిల్లా సంగివలస ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ ఎదుట పీజీ అడ్మిషన్లు పొందిన 31 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ► శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో పీజీ కోర్సుల్లో తమకు ప్రవేశాలు కల్పించాలంటూ వైద్య విద్యార్థులు ఫ్లెక్సీలతో కళాశాల ఎదుట ఆందోళన జరిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. ► ఏలూరు సమీపంలోని ఆశ్రం మెడికల్ కళాశాల వద్ద పెద్ద సంఖ్యలో పీజీ అభ్యర్థులు ధర్నా చేశారు. ► విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట పీజీ అడ్మిషన్లు కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ► అభ్యర్థులతో మాట్లాడిన యూనివర్సిటీ అధికారులు కళాశాలల్లో చేరే గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించగా.. అభ్యర్థులు వెనుదిరిగారు. -
పీజీ మెడికల్ సీట్ల ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజును తెలంగాణ సర్కారు పెంచింది. కన్వీనర్ కోటా సీటు ఫీజును ఆయా కాలేజీల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీటు ఫీజు గతంలో రూ. 24.20 లక్షలు ఉండగా, కొన్నిచోట్ల అదే ఫీజు ఖరారు చేసింది. కొన్ని కాలేజీల్లో రూ.23 లక్షలకు తగ్గించింది. సీ కేటగిరీ సీటుకు గరిష్టంగా రూ.72 లక్షల వరకూ వసూలు చేసుకోవడానికి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతినిచ్చింది. (వైరస్‌ను అంతం చేసే యూవీ బ్లాస్టర్...) ఇక డెంటల్ పీజీ ఏ కేటగిరీ ఫీజును రూ.5.15 లక్షలుగా, బీ కేటగిరీ సీటు ఫీజును రూ.8 లక్షలుగా నిర్ణయించారు. సీ కేటగిరీ సీటుకు రూ.12 లక్షల వరకూ వసూలు చేసుకోవచ్చు. వాస్తవానికి 2017లోనే మెడికల్ పీజీ సీటు ఫీజును రూ.6.90 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెంపుపై జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, హెల్త్ రిఫార్మర్స్ డాక్టర్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లాయి. దీంతో ఫీజుల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ, తుది తీర్పు వచ్చే వరకు సగం ఫీజును వసూలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. (తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో రైలు) -
డబ్బుంటేనే డాక్టర్ గిరి?
ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం భర్తీ చేసే సీట్ల ఫీజు రూ.60 వేలు. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ.11.55 లక్షలు. అదే సీ(ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు రూ. 23.10 లక్షలు. ఇప్పుడు వీటినే ప్రధానంగా మార్చనున్నారు.ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020–21 వైద్య విద్యా సంవత్సరంలోనే ఈ ఫీజుల భారాన్ని వైద్య విద్యార్థులపై పడేసేలా కేం ద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం అమలుపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బోగ్)ను కేంద్రం తాజాగా ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజును కాలేజీ యాజమాన్యాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తారు. మిగి లిన 50% కన్వీనర్ కోటా ఫీజులను కేంద్రం నిర్ధారించనుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘బోగ్’ఫీజులపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. వారి సలహాలను కోరింది. ఎంఎన్సీ చట్టం వల్ల అత్యంత తక్కువగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఫీజులు మరింత పెరుగుతాయి. యాజమాన్య సీట్ల ఫీజులూ ఇష్టారాజ్యంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్ఎంసీ బిల్లుపై మొదట్లో జూనియర్ డాక్టర్లు (జూడా) రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కానీ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పేద విద్యార్థులపై పిడుగు... తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల ఫీజు ఏడాదికి రూ. 10 వేలుకాగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటి ఫీజును రూ. 60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతంగా ఉన్న బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉండగా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుగా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను ఎంఎన్సీ నియంత్రిస్తుంది. వాటినే ఇప్పుడు ప్రధానంగా మార్చనున్నారు. ప్రస్తుతం ఈ ఫీజులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకటే ఫీజు ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కో డీమ్డ్ వర్సిటీలో ఫీజులు మన రాష్ట్రంలోని బీ కేటగిరీ ఫీజులకు దగ్గరగా ఉంటాయి. వాటిని క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా ఫీజులను రూ. 6–7 లక్షల వరకు క్రమబద్ధీకరిస్తారని సమాచారం. అవే ఫీజులను ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఖరారు చేస్తారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. గందరగోళం నెలకొంది... ఎన్ఎంసీ చట్టం నేపథ్యంలో ఫీజులపై ఇప్పుడు కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ఎంసీ చట్టం ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ‘బోగ్’నిర్ధారించనుంది. మిగిలిన 50 శాతం సీట్ల ఫీజును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి యాజమాన్యాలు నిర్ధారించుకునే అవకాశముంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ఇప్పుడు ఏ మేరకు నిర్ధారిస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఫీజుల పెంపుపై మాకు ఇప్పటివరకు సమాచారం రాలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచితే పెనుభారమే... డీమ్డ్ వర్సిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను పెంచితే అది పేద విద్యార్థులకు పెనుభారమే కానుంది. ఫీజులు పెంచుతారన్న ఆందోళనైతే ఇప్పటికీ నెలకొని ఉంది. ఎన్ఎంసీ బిల్లు వచ్చిన సమయంలో ఫీజులు పెరుగుతాయని ఉద్యమాలు చేశాం. అయినా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. - డాక్టర్ విజయేందర్, సలహాదారు, జూడాల సంఘం -
మెడికల్ సీట్లలో భారీ దందా
సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లలో భారీ కుంభకోణానికి రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు తెరలేపాయి. నెల రోజులుగా జరుగుతున్న ఈ దందా ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. బీ–కేటగిరీలో వివిధ కౌన్సెలింగ్‌లలో చేరిన పలువురు ఇతర రాష్ట్రాల విద్యార్థులు శుక్రవారం సాయం త్రం తమ సీట్లను రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక మిగిలిపోయిన సీట్లు ఎన్నారై కోటాగా మారిపోయాయి. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అటు దళారులు, ఇటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఆ ఎన్నారై సీట్లను ఎక్కువ ధరకు సీటు రాని ఇతర విద్యార్థులకు అమ్ముకున్నారు. అలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన విద్యార్థులు శనివారం (31 ఆగస్టు)మెడికల్‌లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఈ దందాలో అనేక ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములుగా ఉండడం గమనార్హం. తద్వారా అక్రమంలో పాలుపంచుకున్న విద్యార్థులకు లక్షలకు లక్షలు, దళారులు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అక్రమంగా, అప్పనంగా కోట్ల రూపాయలు దక్కాయి. కర్ణాటకలో ఈ వ్యవహారంలో దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు రాగా, అదే తరహాలో మన రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ చోద్యం చూస్తుండటం పై విమర్శలు వస్తున్నాయి. పెద్ద ముఠాలే ! రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. అందులో నాన్–మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 2,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో బీ–కేటగిరీ 875 సీట్లుండగా, 375 ఎన్నారై సీట్లున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 136 బీ–కేటగిరీ సీట్లు, 84 ఎన్నారై కోటా సీట్లు. ఇక ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. సీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.23.10 లక్షలు. అంటే బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు ఫీజు సీ–కేటగిరీ సీటుకుంది. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సీ–కేటగిరీ ఫీజుతోనే రెట్టింపు లాభం వస్తుంది. బీ–కేటగిరీ సీట్లకు రెండు విడతల కౌన్సిలింగ్, మాప్–అప్ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయ్యాక మిగిలే సీట్లు ఆటోమెటిక్‌గా ఎన్నారై కోటా సీట్లుగా మారిపోతాయని గతంలోనే సర్కారు జీవో ఇచ్చింది. ఈ జీవోను ఆధారం చేసుకొనే భారీ కుంభకోణానికి తెరలేచింది. పైగా నీట్ ర్యాంకుల నేపథ్యంలో రాష్ట్రంలోని బీ, ఎన్ఆర్ఐ (సీ) కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో బీ–కేటగిరీకి జరిగిన తొలి, రెండో విడతలతోపాటు మాప్–అప్ రౌండ్ కౌన్సెలింగ్ ఇతర రాష్ట్రాల విద్యార్థులను దళారులు చేర్పించారు. అందుకోసం దేశవ్యాప్తంగా అనేక ముఠాలు నడుస్తున్నాయి. ఉచ్చులోకి విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ ముఠాలతో ఒప్పందం చేసుకున్నాయి. నీట్లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దళారులు ఆశ చూపి వారిని ఈ ఉచ్చులోకి లాగారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి నీట్లో మంచి ర్యాంకు వచ్చింది. అతను ఏ ఉత్తరప్రదేశ్‌లోనో రాజస్థాన్‌లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనైనా లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలోనైనా సీటు సంపాదించాడనుకోండి. అక్కడ అతను చేరుతాడు. అలాగే ఆ విద్యార్థి తెలంగాణలోని ఏదో ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీ–కేటగిరీ కౌన్సిలింగ్‌కు హాజరవుతాడు. అందుకోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకొస్తాడు. ఆ రాష్ట్రంలో విద్యార్థి చేరిన కాలేజీలో ఉన్న క్లర్క్‌లకు దళారులు 10–15వేలు ఇచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్ల కలర్ జిరాక్స్‌లు తీసుకుంటారు. విచిత్రమేంటంటే కలర్ జిరాక్స్ సర్టిఫికేట్లను ఆ కాలేజీలోనే పెట్టి ఒరిజినల్ సర్టిఫికేట్లు తెలంగాణలోని కౌన్సిలింగ్‌లకు హాజరవుతారు. ఇక్కడ వచ్చిన సీట్లల్లో చేరిపోతారు. ఇలా ఆ విద్యార్థి రెండు చోట్లా సీట్లు పొంది చేరుతాడు. అన్ని రౌండ్ల కౌన్సిలింగ్‌లు పూర్తయ్యాక తెలంగాణలో తన సీటును రద్దు చేసుకుంటాడు. అయితే సీటు రద్దు చేసుకున్నందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ.3లక్షలు జరిమానా చెల్లించాలి. అలా చెల్లించి రద్దు చేసుకుంటారు. తిరిగి సొంత రాష్ట్రంలో తాను చేరిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాడు. దీంతో అతను తెలంగాణలో వదిలేసిన బీ–కేటగిరీ సీటు ఎన్నారై సీటుగా మారిపోతుంది. ఇలా రాష్ట్రంలో దాదాపు 100 ఎంబీబీఎస్ సీట్లల్లో దందా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం మేరకు ఈ దందాలో అనేక కాలేజీలు పాలుపంచుకున్నాయి. ఇక ఎన్నారై సీటును ఎంతకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు. డిమాండ్‌ను బట్టి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఒక యూపీ విద్యార్థి అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో చేరాడు. అతను దళారుల ద్వారా తెలంగాణలో బీ–కేటగిరీ సీటులో చేరాడు. చివరకు శుక్రవారం ఆ సీటును వదులుకున్నందుకు అతనికి రూ.5లక్షలు ముట్టచెప్పారు. దళారులకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు కూడా ఇచ్చారు. ఇలా కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇదంతా గుట్టుగా జరుగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న తంతు శుక్రవారం రాత్రి సీట్ల రద్దుతో ముగిసింది. దీంతో ఈ సీట్లన్నీ ఎన్నారై కోటాగా మారిపోయాయి. శనివారం ఒక్కరోజే ఈ సీట్లలో చేరేందుకు గడువుంది. దీంతో ఒక్క రోజులోనే కోట్లు చేతులు మారనున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రైవేటు కాలేజీలు, దళారులు, విద్యార్థుల మధ్య మొత్తంగా రూ.100 కోట్లు అక్రమంగా చేతులు మారినట్లు అంచనా. ఇక్కడి వారక్కడ.. అక్కడి వారిక్కడ! ఇదిలావుంటే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఇక్కడికక్కడే సీట్లు మార్చుకునేందుకు వీలుండదు. మన రాష్ట్ర విద్యార్థులను దళారులు ఇతర రాష్ట్రాల్లో ఇలా అక్రమాలు చేయడానికి వినియోగించుకున్నారు. మన రాష్ట్రంలో చేయాలంటే నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకంటే ఇక్కడ ఏ కాలేజీలో సీటొచ్చినా.. మరోచోట కలర్ జిరాక్స్ లేదా ఒరిజినల్తోనైనా రెండోచోట చేరడానికి వీలుండదు. ఒకసారి చేరాక మరోసారి కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే తన మొదటి సీటును వదులుకోవాల్సిఉంటుంది. అంటే ఒకేసారి రెండుచోట్ల చేరే అవకాశం సొంత రాష్ట్రాల విద్యార్థులకు ఉండదని వైద్య విద్యనిపుణులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి. కొందరు అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. -
ఎన్నారై నై... డీమ్డ్‌కే సై!
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీట్లపై విద్యార్థుల్లో రానురాను ఆసక్తి తగ్గుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఎన్నారై కోటా ఎంబీబీఎస్ ఫీజులు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై విద్యార్థుల అన్వేషణ కొనసాగుతోంది. సాధారణ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అంతంత ఫీజులు చెల్లించి ఎంబీబీఎస్ చదవడం కంటే, ఇతర రాష్ట్రాల్లో అంతకంటే నాణ్యమైన కాలేజీల్లో తక్కువ ఫీజుతో చదవడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటా సీట్లు గణనీయంగా మిగిలిపోయాయి. ఆయా కాలేజీల్లో బీ, సీ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. బీ–కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించిన 1,005 బీ–కేటగిరీ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ ఎన్నారై కోటా సీట్ల ఫీజు ఏడాదికి రూ.23.10లక్షలు ఉండటంతో వాటిలో చాలా సీట్లు మిగిలిపోయాయి. ఎన్నారై కోటాలో 469 ఎంబీబీఎస్ సీట్లుండగా, 328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 141 సీట్లు మిగిలిపోయాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఏం చేయాలో అర్థంగాక లబోదిబోమంటున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా 2018–19 వైద్య విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరింది. దీంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. నీట్ ర్యాంకుల ఆధారంగానే వీటన్నింటినీ భర్తీ చేస్తుండటంతో అఖిల భారత కోటా సీట్లకు, డీమ్డ్ వర్సిటీల్లోని వైద్య సీట్లకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏ కాలేజీకి ఆ కాలేజీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అంటే 40 డీమ్డ్ కాలేజీలుంటే అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడం కష్టమయ్యేది. ‘నీట్’పుణ్యమా అని అన్నింటికీ ఒకే దర ఖాస్తు, ఒకే కౌన్సెలింగ్ వచ్చింది. పైగా డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల తో సమానమైనవని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. డీమ్డ్ వైద్య కాలేజీలకు కూడా దేశంలో మంచి రేటింగ్స్ ఉన్నాయి. మన ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ఆ డీమ్డ్ వర్సిటీ కాలేజీలకు ఏమాత్రం నాణ్యతలో సరితూగ వని అంటున్నారు. డీమ్డ్ మెడికల్ కాలేజీలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడకు వెళ్లడానికి తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. డీమ్డ్ ఫీజు కూడా సగమే డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సీట్లను ఎలాంటి కేటగిరీలుగా విభజించలేదు. అన్నింటికీ ఒకే ఫీజు. అంటే మన ప్రైవేటు కాలేజీల్లో ఉన్న బీ–కేటగిరీ సీట్ల ఫీజుకు అటుఇటుగా డీమ్డ్ వర్సిటీ మెడికల్ ఫీజులుంటాయి. కొన్ని కాలేజీల్లోనైతే ఇక్కడి బీ–కేటగిరీ ఫీజు కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం డీమ్డ్ వర్సిటీలకు చెందిన మెడికల్ కాలేజీల్లో రూ.10లక్షల నుంచి రూ.12లక్షల మధ్యే ఫీజులున్నాయి. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రం మణిపాల్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.11.24 లక్షలు, అదే రాష్ట్రం కొలార్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన శ్రీదేవరాజ్ యూఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు రూ.9లక్షలుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీటుకు రూ.23.10 లక్షలు చెల్లించడం అవసరమా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్నారై కోటాలో చేరితే ఐదేళ్లకు కలిపి రూ.1.15 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే డీమ్డ్ వర్సిటీల్లో ఐదేళ్లకు కలిపి రూ.45 లక్షల నుంచి గరిష్టంగా రూ.60 లక్షల మధ్యే ఉంటుంది. దీంతో ఇక్కడి ఎన్ఆర్ఐ సీట్లపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు ఎన్నారై ఫీజును రూ.12 లక్షలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే అన్ని చోట్లా సీట్లు అయిపోయినప్పుడు ఇక్కడి ఎన్నారై కోటా సీట్లల్లో చేరే అవకాశముందని భావిస్తున్నారు. -
డాక్టర్ ఫీజుల మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో బీ కేటగిరీ, సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లల్లో 5 శాతం ఫీజులు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతేడాది ఐదు శాతం ఫీజు పెంచినా ఆ ఏడాదికే పరిమితం చేశారని, కాబట్టి ఈ ఏడాది మరో ఐదు శాతం ఫీజు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖ రాసినట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు ‘సాక్షి’కి తెలిపారు. పెంపుపై అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఏటా ఐదు శాతం ఫీజులు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఆ మేరకు ఈసారి కూడా ఫీజులు పెరుగుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఏడాదికి బీ కేటగిరీకి రూ. 57 వేలు, ఎన్ఆర్ఐ రూ. 1.15 లక్షలు అదనం... రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండగా అందులో నాలుగు మైనారిటీ మెడికల్ కాలేజీలున్నాయి. మైనారిటీ మెడికల్ కాలేజీలకు ఏడాదికి 5 శాతం పెంపు నిబంధన వర్తించదు. కాబట్టి మిగిలిన 17 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ఫీజుల పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇవిగాక ప్రైవేటు డెంటల్ కాలేజీల్లోనూ 5 శాతం ఫీజుల పెంచుకునే నిబంధన వర్తిస్తుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఇక 35 శాతం బీ కేటగిరీ సీట్లు ఉంటాయి. మరో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే వీలుంది. ఇప్పుడు బీ, సీ కేటగిరీ సీట్లకు ఫీజు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉంది. ఐదు శాతం పెంచితే రూ. 57,750 మేర పెరగనుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 12,12,750 కానుంది. ఇక సీ కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుంది. ఐదు శాతం పెంచితే అదనంగా రూ. 1,15,500 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్ సీ కేటగిరీ ఫీజు రూ. 24,25,500 కానుంది. అలాగే డెంటల్ కోర్సులకూ ఐదు శాతం మేర ఫీజు పెరగనుంది. ఐదేళ్లకు కలిపి చూస్తే పెంచిన ఫీజుల భారం విద్యార్థులపై అధికం కానుంది. కన్వీనర్ కోటా సీట్లలో మొదటి విడత ప్రవేశాలకు రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ ప్రా రంభమైంది. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఆ తర్వాత సీట్ల ఎంపిక పూర్తి చేస్తారు. అనంతరం రెండో విడత కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ సమయంలోనే బీ కేటగిరీ సీట్లకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆలోగా ఫీజుల పెంపుపై స్పష్టత ఇవ్వాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు 1250... ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20లో మొత్తంగా 4,600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 4 మైనారిటీ కాలేజీల సీట్లు పోను మిగిలిన ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,500 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లు 1,250 పోను మిగిలినవి బీ, సీ కేటగిరీకి చెందినవి ఉన్నాయి. బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు 875 కాగా, ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లు 375 ఉన్నాయి. ఈ 1,250 సీట్లకు ఫీజులను పెంచేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రంగం సిద్ధం చేశాయి. ఇక 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లోనూ 1,140 బీడీఎస్ సీట్లున్నాయి. సగం బీ, సీ కేటగిరీ సీట్లుకాగా వాటికి కూడా 5 శాతం మేర ఫీజులు పెరగనున్నాయి. -
ప్రైవేటు వైద్యవిద్యలోనూ ఈడబ్ల్యూఎస్
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేద (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు బుధవారం లేఖ రాసింది. దీనికోసం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపించాలని ఆదేశించింది. అయితే నీట్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లను ఆలిండియా కోటాలో కేంద్రం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా తమ కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్ సీట్లలో 15% ఆలిండియా కోటాకు ఇవ్వాలని, అప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా తెలంగాణలోని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకుని ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలోనే ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అప్పట్లో దీనిపై ఎంసీఐ నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాజాగా మరోసారి ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోటాలో పెరగనున్న 281 సీట్లు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 విద్యాసంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీతో కలిపి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇటీవల ఎంసీఐ అదనంగా 190 ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. ఇక 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4 మైనారిటీ కాలేజీలకు, 2 కొత్త మెడికల్ కాలేజీలకు ఈ కోటా వర్తించదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. అంటే అవి పోగా 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 2,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో సగం అంటే 1125 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. వాటిని ఆధారం చేసుకొని 25% సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద పెంచాల్సి ఉంటుంది. అంటే 281 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముంది. అయితే వీటికోసం ఎన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ జారీచేసింది. ఆ సీట్లకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు ఎలాగన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే 11 వేల మంది విద్యార్థులు కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఉన్నవారు సహజంగానే ప్రైవేటులో వచ్చే ఈ కోటా సీట్లకు అర్హులేనని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. నోటిఫికేషన్లలోనూ ఆ మేరకు వెసులుబాటుందన్నారు. ముందుకొచ్చే కాలేజీలెన్ని? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకోసం అసలు ఎన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ముందుకు వస్తాయన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపు ఆలిండియా కోటాకు 15% సీట్లు ఇవ్వాలన్న షరతు, పైపెచ్చు కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఫీజు ఏడాదికి రూ.60వేలు మాత్రమే కావడంతో తమకేంలాభమన్న వాదన ప్రైవేటు యాజమాన్యాల్లో వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక కాలేజీకి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 25 సీట్లు పెరిగితే వచ్చే ఫీజు ఏడాదికి రూ.15 లక్షలు మాత్రమే. అందుకోసం సీట్లు పెంచుకుని లాభమేంటని వారంటున్నారు. అయితే అదనంగా సీట్లు పెరగడం వల్ల అదే స్థాయిలో పీజీ మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయని, కాబట్టి అది ఆయా యాజమాన్యాలకు ప్రయోజనకరంగా ఉంటుం దని వైద్యాధికారులంటున్నారు. ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ముందుకు వెళ్లే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
బోధనాసుపత్రుల్లో వైద్యం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రుల్లో పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు ఆయా కాలేజీ యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరిపింది. రాష్ట్రంలోని ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వేలాది పడకలు ఖాళీగా ఉంటున్నాయని, అవి వృథాగా ఉండకుండా పేదలకు వైద్యం అందిస్తే మేలు చేసినట్లవుతుందని భావిస్తోంది. ఉచితంగా సేవలందిస్తే పేద రోగులు తరలి వస్తారని, తద్వారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన వైద్య విద్య అందించినట్లు అవుతుందని యాజమాన్యాలతో చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. సర్కారు వాదనలతో ప్రైవేటు యాజమాన్యాలు అంగీకరించట్లేదు. ఉచిత సేవలు ఇవ్వడం సాధ్యం కాదని, తామిచ్చే వైద్య సేవలను బట్టి ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించాలని వారు పట్టుబడుతున్నట్లు సమాచారం. ‘నీట్’ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయిస్తుండటంతో తమకు ఆదాయం తగ్గిందని, ఈ నేపథ్యంలో ఉచిత సేవలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏంచేయాలన్న దానిపై సర్కారు సంకటంలో పడిపోయింది. బోధనాసుపత్రుల్లోని పడకలు ఖాళీగా ఉండకుండా వాటిని పేదలకు సేవలు అందించడం ద్వారా భర్తీ చేయాలన్న కృత నిశ్చయంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ మేరకు ఆయన పలు దఫాలుగా సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఏమంటోంది... ప్రైవేటు బోధనాసుపత్రుల్లో వేలాది పడకలు ఖాళీగా ఉంటున్నాయి. అవి వృథాగా ఉండకుండా పేదలకు వైద్యం అందిస్తే మేలు చేసినట్లవుతుంది. ఉచితంగా సేవలందిస్తే పేద రోగులు తరలివస్తారు. తద్వారా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన వైద్య విద్య అందించినట్లు అవుతుంది. యాజమాన్యాల వాదన.. ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయిస్తుండటంతో మాకు ఆదాయం తగ్గిపోయింది. ఉచిత సేవలు ఇవ్వడం సాధ్యం కాదు. మేమిచ్చే వైద్య సేవలను బట్టి ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించాలి. సర్కారు వైద్య సేవలు అందకపోవడం వల్లే.. రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటికి అనుబంధంగా ఒక్కో దానికి బోధనాసుపత్రి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులకు రోగులు వెల్లువెత్తుతుండగా, ప్రైవేటులో అధిక ఫీజుల కారణంగా రోగులు ఆసక్తి చూపట్లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు బోధనాసుపత్రుల్లో పడకలు నిండట్లేదు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, దీంతో పేద రోగులు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రభుత్వ బోధనాసుపత్రుల వైపు వెళ్తుండటంతో అక్కడ రద్దీపెరిగింది. ఆ రెండు హామీలు నెరవేర్చితే..? ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నట్లు వైద్య సేవలకు ఎంతోకొంత డబ్బులిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ అలా చేస్తే ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వెనకడుగు వేస్తున్నారు. వారు చేసే సేవలకు ఇతరత్రా ఏదో రకంగా మేలు చేసేలా హామీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలకాధికారి వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీలోని దాదాపు 100 రకాల చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులకే సర్కారు పరిమితం చేసింది. వాటికి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయట్లేదు. ఆ చికిత్సలను ప్రైవేటు బోధనాసుత్రులకూ అనుమతి ఇవ్వాలని యాజమాన్యాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఆ డిమాండ్ నెరవేర్చే అంశంపై చర్చ జరుగుతోంది. అలాగే కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రైవేటు బోధనాసుపత్రులకూ వర్తింపజేయాలని యాజమాన్యాలు విన్నవిస్తున్నాయి. వీటిపై ఆలోచించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. సర్కారు దవాఖానాల్లో ఓపీ సమయం పెంపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సమయాన్ని 2 గంటలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఓపీ చూస్తుండగా, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతో ఈ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు 110 ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉన్న డయాగ్నిస్టిక్స్ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు. -
సంజీవనిపై ప్రైవేటు!
అసలే పెద్దాసుపత్రి. ఆరేడు జిల్లాలకు పెద్దదిక్కు. నిత్యం వేలాదిమంది రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా డబ్బే డబ్బు. అదీ మందుల వ్యాపారమైతే లాభాలకు హద్దే ఉండదు. ఇదే ఆలోచన మంత్రి అనుచరుడికి వచ్చింది. పైగా ఆ మంత్రికి సొంత శాఖ. చెబితే కాదనే సాహసం ఎవరూ చేయరు. అనుకున్నదే తడువు ఆసుపత్రి ‘పెద్ద’పై ఒత్తిడి తెచ్చారు. అసలే అక్రమాల్లో కూరుకుపోయిన ఆ ‘పెద్ద’ కూడా మంత్రి ప్రాపకం కోసం జీహుజూర్ అంటున్నారు. ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటయితే ప్రస్తుతం పేదలకు కాస్తోకూస్తో ఊరటనిస్తున్న చౌక మందుల (జనరిక్) దుకాణాలు మూతపడడం ఖాయంగా కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్ మందుల దుకాణాల (అన్న సంజీవని)ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇవ్వొద్దంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకు సైతం తూట్లు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన అనుచరుడు షాపు పెట్టుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే సాహసం కూడా సూపరింటెండెంట్ చేయడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. మంత్రి ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేందుకు వీలుగా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టెండరు లేకుండానే డైట్ కాంట్రాక్టును మరో ఏడాది పాటు కొనసాగించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెడికల్ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద ఆసుపత్రి కేంద్రంగా దందా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. జనరిక్ షాపులపై దొంగ దెబ్బ! గతంలో కర్నూలు సర్వజనాసుపత్రిలో ప్రైవేటు మెడికల్ షాపులు ఉండేవి. అతి తక్కువ బాడుగకే షాపులు ఇచ్చేవారు. అయితే, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మెడికల్ షాపులను రద్దు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇక మీదట ఎలాంటి ప్రైవేటు మెడికల్ షాపులనూ అనుమతించవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జనరిక్ మందుల షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుచరుడికి అనుమతి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి. తలూపుతున్న సూపరింటెండెంట్! పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ ఏళ్లుగా అద్దె చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఆర్అండ్బీ క్వార్టర్స్‌లో ‘హార్ట్ ఫౌండేషన్’ కొనసాగించారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మాటలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనరిక్ ఔషధశాలలను దెబ్బతీసే విధంగా, ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటుకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లతో మంతనాలు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు సంస్థలు కాంట్రాక్టు పనులు చేపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. రోగులకు ఆహార పంపిణీ మొదలుకుని.. సెక్యూరిటీ, స్కావెంజర్ పనులు, వివిధ పరికరాల కొనుగోళ్లు, మందుల సరఫరా వంటి అనేక కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్‌ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. వాటిని టెండర్లు పిలవకుండానే కొనసాగించారు. అయితే, ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఫరూక్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులు చేస్తున్న వారందరికీ మంత్రి పీఏ నేరుగా ఫోన్లు చేసి.. వ్యక్తిగతంగా కలవాలంటూ కబురు పంపారు. ఏయే కాంట్రాక్టు సంస్థ ఏ విధంగా పనులు చేస్తోందనే విషయాలను కూడా ఆసుపత్రిలోని కొద్ది మంది సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఆయా కాంట్రాక్టు సంస్థలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అనేక డిమాండ్లు పెట్టి నెరవేర్చుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఏకంగా తన అనుచరుడికి మెడికల్ షాపు అప్పగించేలా మంత్రి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రైవేటు మెడికల్ కాలేజీలకు హైకోర్టు కళ్లెం!
సాక్షి, హైదరాబాద్: కౌన్సెలింగ్ సందర్భంగా కొందరు విద్యార్థులను ఉపయోగించుకుంటూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేస్తున్న కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కళ్లెం వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, మాప్ అప్ రౌండ్ కింద సీట్లు భర్తీ చేసేందుకు వివిధ తేదీల్లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లోని లోపాలను అడ్డంపెట్టుకుని సీట్లను బ్లాక్ చేసు కుంటూ ప్రైవేటు మెడికల్ కాలేజీలు కోట్లు గడిస్తున్న క్రమంలో.. కౌన్సెలింగ్ తేదీలనే మార్చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఒక్క కోటా కింద కౌన్సెలింగ్ పూర్తయి, విద్యార్థులు కాలేజీలో చేరేందుకు నిర్ణయించే గడువు తేదీ ముగిశాకే మరో కోటా కింద కౌన్సెలింగ్ ప్రారంభించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. కన్వీనర్ కోటా కింద ఏప్రిల్ 1, 2 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లు పొందినవారు కాలేజీలకు రిపోర్ట్ చేసేందుకు ఏప్రిల్ 8, 9 తేదీలను గడువు గా ఖరారు చేయాలంది. అప్పుడు ఏప్రిల్ 10 తర్వాతే యాజమాన్య కోటా కింద మొదటి దశ కౌన్సెలింగ్ ప్రారంభించాలని, దీంతో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చీ.. కాలేజీల్లో చేరని వారినే ఈ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంది. కన్వీనర్ కోటా కింద రెండో దశ కౌన్సెలింగ్ తేదీలను ఏప్రిల్ 20, 21లుగా నిర్ణయిస్తే, ఏప్రిల్ 30న కాలేజీల్లో చేరేందుకు చివరి తేదీగా ఖరారు చేయాలంది. మే 1 తర్వాత యాజమాన్యపు కోటా రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభించాలని తెలిపింది. యాజమాన్య కోటా రెండో దశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే మాప్ అప్ రౌండ్ నిర్వహించాలని ఆదేశించింది. యాజమాన్యపు కోటాకు సైతం మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించొచ్చని, కన్వీనర్ కోటా రెండో దశ కౌన్సెలింగ్ పూర్తయి, కాలేజీల్లో చేరే గడువు ముగిశాకే మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సందర్భంగా అభ్యర్థులందరి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవాలని, దీంతో ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను పావులుగా వాడుకునే అవకాశం ఉండదని తెలిపింది. విద్యార్థుల కేటాయింపులు పూర్తయ్యాక వర్సిటీలే నేరుగా అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆయా కాలేజీలకు పంపించే దిశగా ఆలోచన చేయాలంది. దీని వల్ల సీట్ల బ్లాకింగ్‌ను నిరోధించేందుకు అవకాశం ఉందంది. వైద్య విద్య వ్యాపారీకరణను అడ్డుకునే దిశగా పరిష్కారాలను అన్వేషించాలని విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జరగాల్సిన నష్టం జరిగి పోయింది... యాజమాన్యపు కోటా కింద పలు ప్రైవేటు కాలేజీలు సీట్ల బ్లాకింగ్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డాయని, అందువల్ల ఈ కోటా కింద జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన డాక్టర్ పి.రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. పిటి షనర్ కోరిన విధం గా యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఈ కోటా కింద సీట్లు పొందిన అనేక మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని, అందువల్ల పిటిషనర్ అభ్యర్థనను ఆమో దించలేమంది. 2018–19 విద్యా ఏడాదికి జరిగిన ప్రవేశాల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, దాన్ని పూర్వ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని తెలిపింది. ప్రవేశాల తుది గడువు ముగిసినందున, పిటిషనర్‌కు వేరే కాలేజీలో ప్రవేశం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదంది. వచ్చే విద్యా ఏడాది నుంచి అవి జరగక్కుండా ఉండేందుకు వర్సిటీ తీసుకుంటున్న పరిష్కార మార్గాలేమిటో చూడాలంది. వర్సిటీ కౌంటర్‌ను పరిశీలిస్తే, కౌన్సెలింగ్ తేదీల్లో ఉన్న లోపాల వల్లే సీట్ల బ్లాకింగ్ జరిగినట్లు అర్థమవుతుందని తెలిపింది. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేయాలంటూ వర్సిటీకి సూచించింది. -
నేషనల్ ఫుల్... రాష్ట్రంలో నిల్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక మణిపాల్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా ఉన్న కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ. 11.24 లక్షలు.. అదే రాష్ట్రంలోని కొలార్‌లో శ్రీదేవరాజ్ యూఆర్ఎస్ డీమ్డ్ మెడికల్ కాలేజీలో రూ. 9 లక్షలు.. కానీ మన రాష్ట్రంలో ఏ ప్రైవేటు కాలేజీలోనైనా ఎన్నారై కోటా సీటు ఫీజు మాత్రం రూ. 23.1 లక్షలు ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్ మెడికల్ కాలేజీల ఎంబీబీఎస్ ఫీజుకు, రాష్ట్రంలో సీ (ఎన్నారై) కేటగిరీ ఫీజుకు ఇంతలా తేడా ఉండటంతో రాష్ట్ర విద్యార్థులు అటువైపు పరుగులు తీస్తున్నారు. మెడికల్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నేషనల్ పూల్‌లో చేరడంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో 319 సీ కేటగిరీ సీట్లకుగాను తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 120 సీట్లు మిగిలాయి. 102 బీడీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. నేషనల్ పూల్ దెబ్బ రాష్ట్రం నేషనల్ పూల్‌లో చేరడంతో అఖిల భారత కోటా కింద దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లకు, డీమ్డ్ వర్సిటీలకు నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్‌కు కలిపి దేశవ్యాప్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడటానికి రాష్ట్ర విద్యార్థులకు వీలు కలిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 120 ఎన్నారై సీట్లు మిగలడం, డీమ్డ్ వర్సిటీల సీట్లకు మరో రెండు కౌన్సెలింగ్‌లు ఉండటంతో రాష్ట్రంలో సీట్ల భర్తీపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఇప్పటికే పలు మైనారిటీ మెడికల్ కాలేజీలు ఫీజు తగ్గించాయి. మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్నారై ఎంబీబీఎస్ సీటు ఫీజు రూ. 28 లక్షలుంటే షాదాన్ మెడికల్ కాలేజీ యాజమాన్యం రూ. 22 లక్షలకు తగ్గించింది. వీఆర్కే మైనారిటీ కాలేజీ యాజమాన్యం రూ. 20 లక్షలకు, అయాన్ మెడికల్ కాలేజీ రూ. 18 లక్షలకు తగ్గించాయి. నాన్ మైనారిటీ ప్రైవేటు కాలేజీలూ ఇదే బాటలో నడిచే పరిస్థితి కనిపిస్తోంది. టాప్ ర్యాంకుల్లో డీమ్డ్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం 2018–19 వైద్య విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరింది. దీంతో విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. నీట్ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేస్తుండటంతో అఖిల భారత కోటా సీట్లకు, డీమ్డ్ వర్సిటీల్లోని వైద్య సీట్లకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏ కాలేజీకి ఆ కాలేజీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ‘నీట్’పుణ్యమా అని అన్నింటికీ ఒకే దరఖాస్తు, ఒకే కౌన్సెలింగ్ వచ్చింది. పైగా డీమ్డ్ వర్సిటీ హోదా ఉన్న మెడికల్ కాలేజీలు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలతో సమానమైనవని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. ర్యాంకింగ్‌లోనూ ఈ కాలేజీలు ముందు స్థానంలో ఉన్నాయని, డీమ్డ్ వర్సిటీ కాలేజీల నాణ్యతలో మన ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏమాత్రం సరిపడవని అంటున్నారు. అన్ని సీట్లకూ ఒకే ఫీజు డీమ్డ్ మెడికల్ కాలేజీలు కర్ణాటక, తమిళనా డు, మహారాష్ట్రల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికెళ్లడానికి రాష్ట్ర విద్యార్థులకు ఏ ఇబ్బందీ ఉండదు. ఆ కాలేజీల్లో అన్ని సీట్లకు ఒకే ఫీజు. అంటే మన ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ ఫీజు కు అటుఇటుగా అక్కడ ఫీజులు ఉంటాయి. కొన్ని కాలేజీల్లో ఇక్కడి బీ కేటగిరీ ఫీజు కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడి బీ కేటగిరీ సీట్లపైనా విద్యార్థులు ఆసక్తి కనబరిచే పరిస్థితి ఉండదని వాదనలు వినిపిస్తున్నాయి. -
మేనేజ్మెంట్ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీ, సీ(ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లను ఈ నోటి ఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన ఓ ప్రకట నలో పేర్కొన్నారు. నీట్ ర్యాంకు ఆధారంగానే యూనివర్సిటీ సీట్లను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఈ నెల 30 నుంచి జూలై 5న సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 6న మెరిట్ జాబితా తయారు చేస్తామన్నారు. వివరాలను www.knruhs.inలో పొందవచ్చని సూచించారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో ఏవైనా సమస్యలుంటే వెబ్‌సైట్‌లోని ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. కౌన్సెలింగ్ సమయంలో ఏదైనా కాలేజీకి అదనంగా సీట్లు వస్తే వాటిని కూడా ఇదే నోటిఫికేషన్ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్ఆర్ఐ సీట్లను కూడా నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తామని వెల్లడించారు. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం(26న)తో ముగిసింది. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ఆధారంగా తాత్కా లిక మెరిట్ జాబితాను, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్‌ను వర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత నీట్ మెరిట్ ఆధారంగా తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించనున్నామన్నారు. ఇందుకు హైదరాబాద్, వరంగల్ రెండు ప్రాంతాల్లో 5 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాప్(ఆర్మీ), నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ), స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అంగవైకల్యం, పోలీస్ మార్టి ర్స్ చిల్డ్రన్ (పీఎంసీ) తదితర ప్రత్యేక కేటగిరీల్లో దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, నాన్ లోకల్ అభ్యర్థుల కు జేఎన్టీయూ, కూకట్‌పల్లిలో సెంటర్ ఏర్పాటు చేశా మన్నారు. పూర్తి సమాచారాన్ని www.knruhs.inలో చూడొచ్చని వెల్లడించారు. జేఎన్టీయూలో స్పెషల్ కేటగిరీ, నాన్ లోకల్ అభ్యర్థుల షెడ్యూల్... 30.6.18– క్యాప్ (ఆర్మీ), స్పోర్ట్స్ అండ్ గేమ్స్, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్స్‌కు. 01.7.18– ఎన్సీసీ, అంగవైకల్యం గల వారికి. 02.7.18 నుంచి 4 వరకు– నాన్ లోకల్ అభ్యర్థులకు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలు ఇవే... జేఎన్టీయూ, కూకట్పల్లి, హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి దూరవిద్య కేంద్రం,ఓయూ క్యాంపస్, హైదరాబాద్ ఏవీ కాలేజీ, దోమల్‌గూడ, గగన్‌మహల్, హైదరాబాద్ నిజాం కాలేజీ, బషీర్‌బాగ్, హైదరాబాద్ -
పీజీ వైద్య సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ వైద్య సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఏప్రిల్ 20 లోగా తొలి దశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 (సోమవారం) నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి నాలుగైదు రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయిన వెంటనే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 10న వెబ్ ఆప్షన్లు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేస్తారు. మన రాష్ట్రంలో జాతీయ పూల్‌కు సీట్లు మినహాయిస్తే 428 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ ఏడాది అర్హత సాధించినవారు తక్కువగా ఉండటం, జాతీయ పూల్‌లో ఎక్కువ మందికి సీట్లు రాకపోవడం, వాళ్లంతా స్టేట్ సీట్లకు రావడంతో పోటీ మరింతగా పెరిగింది. ఒక్కో సీటుకు 15 మందికిపైనే పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్థోపెడిక్స్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ మెడిసిన్, ఎండీ గైనకాలజీ, ఎండీ రేడియాలజీ తదితర కోర్సులపై అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది నేషనల్ పూల్ నిలువునా ముంచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అర్హత మార్కులు సాధించినవారు చాలా తక్కువగా ఉన్నారని, కటాఫ్ మార్కుల శాతం తగ్గిస్తే మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. మే 31 నాటికి చివరి దశ కౌన్సెలింగ్ పూర్తి: రిజిస్ట్రార్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న అన్ని సీట్లకూ మే 31లోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం మే 31 నాటికి అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నుంచి సీట్ల కేటాయింపు వరకూ అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 50 శాతం పీజీ వైద్య సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, మిగతా 50 శాతం జాతీయ పూల్ సీట్లకు సీబీఎస్ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని చెప్పారు. -
ఎన్టీఆర్ వర్సిటీ నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర!
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ. 167 కోట్లు పక్కదారి పట్టించడం ద్వారా వర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 8ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. వర్సిటీ అభివృద్ధి, పరిరక్షణ సమితి ఫోరం పిలుపు మేరకు వర్సిటీ ఉద్యోగులందరూ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా వర్సిటీని సోమవారం పూర్తిగా స్తంభింపజేశారు. వర్సిటీ బయట బైటాయించి «ధర్నా చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన వర్సిటీ అభివృద్ధికి కించిత్ సాయపడని చంద్రబాబు ప్రభుత్వం.. దానిని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా విశాఖపట్నం గీతం మెడికల్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చినట్లుగానే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకూ ఇచ్చి పేద వర్గాలకు వైద్య విద్య అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యంగా నారాయణ మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదాను కట్టబెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వర్సిటీని అర్థికంగా బలహీనపరిచే చర్యలకు ప్రభుత్వం పూనుకుందని ఉద్యోగులు ఆరోపించారు. గీతమ్ మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వబోమని ఆనాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 1986 యూనివర్సిటీ శాసన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ప్రామాణిక వైద్యవిద్య విధానం ఉండాలని నిర్ధేశించిన మేరకు వారు నిరాకరించాన్నారు. వాస్తవానికి గీతమ్‌కు డీమ్డ్ హోదా కట్టబెట్టడం ద్వారా ఒక్క సీటు కూడా కన్వీనర్ కోటాకు చెందదని, రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూరదని పేర్కొన్నారు. సొంత క్యాంపస్ లేదు.. ఉన్న నిధులూ లాగేసుకుంటారా? ఇప్పటికే యూనివర్సిటీ అనేక సమస్యలతో నిండి ఉందని, ఇలాంటి సమయంలో వర్సిటీ నిధులను వైద్య కాలేజీలకు కేటాయించి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీఎహెచ్) గుర్తింపు తెచ్చుకోవాలని సర్కారు భావించడాన్ని వర్సిటీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. వైద్య కళాశాలల్లో పనులను పలు ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగించారని, వీటి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. వైద్య కళాశాలలకు గుర్తింపు కొనసాగాలంటే ఎంసీఐ నిబంధనల ప్రకారం ఆసుపత్రులను నిర్వహించాలేకాని, ఎన్ఏబీహెచ్ గుర్తింపు అవసరం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీకి సొంత క్యాంపస్ ఇవ్వకపోగా.. ఉన్న నిధులను లాగేసుకోవడంపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. జీవో రద్దు చేసే వరకు ఎంతకైనా పోరాడతామని ఉద్యోగులు హెచ్చరించారు. -
వడివడిగా నూతన వైద్య కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వైద్య విద్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏటా ప్రభుత్వ వైద్య కాలేజీల సంఖ్యను పెంచుతోంది. ప్రైవేటు వైద్య కాలేజీల సంఖ్యకు పోటీగా ప్రభుత్వ కాలేజీలో సీట్లు పెరుగుతున్నాయి. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటైంది. సిద్దిపేటలోనూ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ చివరికి వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో సిద్దిపేట కాలేజీలో అడ్మిషన్లు జరిగేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ, సూర్యాపేటజిల్లాల్లో కొత్తగా వైద్య కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య కాలేజీకి అనుమతి రావాలంటే కనీసం 400 పడకల ఆస్పత్రి ఉండాలి. నల్లగొండలోని జిల్లా ఆస్పత్రిలో 250 పడకలు ఉన్నాయి. ఇటీవల 150 పడకల చొప్పున రెండు బ్లాకులను నిర్మించి ప్రారంభించారు. అన్ని కలిపి 550 పడకలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కాలేజీ భవనాల నిర్మాణం, పరికరాలు, ఇతర వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. సూర్యాపేటలో స్థలం సమస్య.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 100 పడకల ఆస్పత్రి ఉంది. ఇందులోనే అదనంగా 300 పడకలు ఏర్పాటు చేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆ నిర్మాణ ప్రక్రియ మొదలుకానుంది. సూర్యాపేటలో వైద్య కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో కాలేజీ నిర్మాణ స్థలంపై సందిగ్ధత వీడట్లేదు. 300 సీట్లు పెరిగే అవకాశం.. మొత్తానికి రెండేళ్లలో సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో కలిపి మూడు ప్రభుత్వ వైద్య కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కాలేజీలో సగటున 100 సీట్లకు అనుమతులొచ్చినా మొత్తం 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 150 సీట్ల చొప్పున అనుమతి వస్తే కొత్త సీట్ల సంఖ్య 450 ఉండనుంది. ప్రభుత్వ కాలేజీలు పెరుగుతుండటంతో పేద కుటుంబాల పిల్లల్లో ఎక్కువ మందికి వైద్య విద్యనభ్యసించే అవకాశం కలగనుంది. అన్ని కేటగిరీలు కలిపి తెలంగాణలో ప్రస్తుతం 22 వైద్య కాలేజీలు ఉన్నాయి. వీటిలో 6 ప్రభుత్వ, 1 ఈఎస్ఐ, 3 ప్రైవేటు మైనారిటీ, 12 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 3,200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 6 ప్రభుత్వ కాలేజీల్లో కలిపి 1,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. -
హౌస్ సర్జన్ల స్టైపెండ్ స్వాహా!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కాలేజీలు విద్యార్థులను దోచుకుంటున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో చదివే వారికి ప్రభుత్వ పరంగా చెల్లించే స్టైపెండ్‌ను స్వాహా చేస్తున్నాయి. విద్యార్థులకు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్నాయి. దాదాపు అన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలువురు హౌజ్ సర్జన్లు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ)కు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలు పక్కనపెట్టి.. ఎంబీబీఎస్ కోర్సు ఐదున్నర ఏళ్లు ఉంటుంది. తొలి ఏడాది మొత్తం తరగతిలోనే బోధన ఉంటుంది. రెండో ఏడాది నుంచి నాలుగున్నర ఏళ్ల వరకు తరగతి బోధనతోపాటు వైద్య చికిత్స అంశాలను ప్రాక్టికల్‌గా(ప్రత్యక్షంగా) బోధిస్తారు. అనంతరం ఏడాది పాటు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో నేరుగా అన్నిరకాల చికిత్సలు చేస్తారు. ఈ ఏడాది సమయంలో వీరిని హౌస్ సర్జన్లుగా పిలుస్తారు. వైద్య కాలేజీకి అనుబంధంగా ఉండే ఆస్పత్రిలోని వైద్య విభాగాల్లో కొన్నిరోజుల చొప్పున సేవలు అందిస్తారు. మెడిసిన్, సర్జరీ, గైనిక్ విభాగాల్లో తప్పనిసరిగా పనిచేస్తారు. ఇలా చదువులో భాగంగా వైద్య సేవలు అందిస్తున్న హౌస్సర్జన్లకు ప్రతి నెలా రూ.12,800 చొప్పున స్టైపెండ్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. హౌస్సర్జన్లకు చెల్లింపులను అంగీకరిస్తున్నట్లుగా అడ్మిషన్ల సమయంలోనే కాలేజీ యాజమాన్యాలు.. వైద్య విద్య డైరెక్టరేట్‌కు, వైద్య విశ్వవిద్యాలయానికి లేఖ ఇస్తాయి. కానీ ఈ నిబంధనలు ఆచరణలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో 15 ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2,100 మంది హౌజ్ సర్జన్లు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికీ స్టైపెండ్ అందడం లేదని తెలుస్తోంది. అసలే బోధనా ఫీజులకు తోడు ప్రత్యేక ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్య కాలేజీలు.. చివరికి ౖస్టైపెండ్ సొమ్మును కూడా సొంతానికి వాడుకుంటున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోనూ... హౌస్సర్జన్లకు స్టైపెండ్ చెల్లింపు విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్ (ఆదిలాబాద్), నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ ప్రభుత్వ కాలేజీలో మినహా.. మిగతా ఐదు కాలేజీల్లో 900 మంది హౌస్సర్జన్లు ఉన్నారు. డీఎంఈ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 ఆస్పత్రుల్లో వారు సేవలు అందిస్తున్నారు. అయితే వారికి ఏడు నెలలుగా స్టైపెండ్ అందడం లేదు. ప్రభుత్వ బోధనాస్పత్రుల వైద్య సేవల్లో కీలకంగా వ్యవహరిస్తున్న హౌస్సర్జన్లకు చెల్లించే స్టైపెండ్ చెల్లింపులో నిర్లక్ష్యం వైఖరితో.. పేదలకు అందే ఆరోగ్య సేవలపైనా ప్రభావం చూపుతుందనే విమర్శలున్నాయి. -
మా ఆదేశాలు అమలు చేయడం లేదేం?
ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘానికి హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో పెంచిన పీజీ వైద్య విద్య ఫీజుల వసూలు విషయంలో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం అమలు చేయడం లేదంటూ పలువురు విద్యార్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం గురువారం ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9న జీవో 41 జారీ చేసింది. అదేవిధంగా మెడికల్, డెంటల్ కోర్సుల సీట్ల భర్తీ విషయంలో నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఈ నెల 9న జీవో 40 ఇచ్చింది. ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ ది హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్, ఉస్మానియా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్లు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం, పెంచిన ఫీజుల్లో 50 శాతం చెల్లించాలని విద్యార్థులను ఆదేశించింది. మిగిలిన మొత్తాలకు బాండ్లు తీసుకోవాలని ఆయా కాలేజీలకు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు బాండ్ తీసుకోవడానికి కాలేజీలు నిరాకరిస్తున్నాయంటూ పలువురు విద్యార్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బాండ్ల స్థానంలో బ్యాంకు గ్యారెంటీ అడుగుతున్నారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వివరించారు. -
పీజీ వైద్య సీట్ల భర్తీపై కొత్త వివాదం!
⇒ ఇంకా మొదలుకాని కౌన్సెలింగ్ ప్రక్రియ ⇒ పర్సంటైల్ విధానంపై ప్రైవేటు కాలేజీల అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల భర్తీపై కొత్త వివాదం నెలకొంది. దీంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన సీట్ల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. పీజీ సీట్ల భర్తీకి అమల్లో ఉన్న పర్సంటైల్ విధానంపై ప్రైవేటు కాలేజీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతమున్న నిబంధనలను సడలించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టే పరిస్థితి కన్పించట్లేదు. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఇప్పటికే నీట్ ప్రవేశపరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లతో పాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను ప్రభుత్వమే కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనుంది. కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. పీజీ సీట్ల భర్తీకి గతేడాది వరకు రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఇందులో జనరల్ కేటగిరీకి చెందినవారు కనీసం 50 శాతం, ఇతర వర్గాలు 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధించేవారు. వారికి వచ్చిన ర్యాంకుల వారీగా సీట్లను కేటాయించేవారు. అయితే ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా జనరల్ కేటగిరీ వారు నీట్లో కనీసం పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. ఈ విధానంలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఒక్కోసారి అర్హత సాధించడం కష్టమవుతుంది. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల్లో మెరుగైన మార్కులు సాధించిన మొదటి 50 శాతం మందే అర్హత సాధించిన వారవుతారు. మిగిలిన 50 శాతం అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోతారు. ఈ విధానాన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. పర్సంటైల్ శాతాన్ని 50 నుంచి 35 శాతానికి కుదించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. -
‘నీట్’ ర్యాంకులు బేఖాతర్!
-సుప్రీం ఆదేశాలకు తూట్లు -ఎన్ఆర్ఐ సీట్ల భర్తీలో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యం -ఇప్పటికే ఒక్కో ఎంబీబీఎస్ సీటు రూ. 3కోట్లకుపైనేవిక్రయం! -తూతూమంత్రంగా కౌన్సెలింగ్? సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రైవేటు మెడికల్ కాలేజీలు బేఖాతర్ చేస్తున్నాయి. ముఖ్యంగా 15 శాతం ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) సీట్లను అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీలు అంగట్లో సరుకుగా ఇప్పటికే విక్రయించుకున్నాయి! ఒక్కో సీటును రూ. 3 కోట్లకుపైగానే విక్రయించాయని సమాచారం. కాలేజీల తీరు వల్ల ‘నీట్’ స్ఫూర్తి దెబ్బతిన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నీట్ ర్యాంకుల ఆధారంగా జరగాల్సిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి మార్గదర్శకాలు ఉండటంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలాగైతే ‘నీట్’ ర్యాంకులెందుకు? గతేడాది వరకు ఎంసెట్ ద్వారా ప్రభుత్వ మెడికల్ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేసేవారు. ప్రైవేటులో మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లకు ప్రైవేటు కాలేజీలు సొంతంగా పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టేవి. మిగిలిన 15 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లను ర్యాంకులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా విక్రయించుకునేవి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలనే సుప్రీంకోర్టు ‘నీట్’ను తప్పనిసరి చేసింది. బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ సీట్లను తప్పనిసరిగా నీట్ ర్యాంకుల ద్వారానే కేటాయించాలని ఆదేశించింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు యాజమాన్యాలు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు కాలేజీలవారీగా నోటిఫికేషన్ జారీచేసి కౌన్సెలింగ్ నిర్వహించుకొని ఇష్టారీతిన సీట్లను భర్తీ చేసుకునేలా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లన్నింటికీ కలిపి ఒకే కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించ రని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఆర్ఐ సీట్లకు ఒక్కో కాలేజీ ఒక్కో నోటిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించుకుంటే పారదర్శకత ఏముంటుందని...అలాంటప్పుడు ‘నీట్’ ర్యాంకులు ఎందుకంటున్నారు. 540 ఎన్ఆర్ఐ సీట్లు హాంఫట్... రాష్ట్రంలో మొత్తం 22 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 3,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లు, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 సీట్లు, మూడు మైనారిటీ కాలేజీల్లో 450 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లతోపాటు 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం 2,100 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం (1,050) సీట్లను, మైనారిటీ కాలేజీల్లోని 60 శాతం కన్వీనర్ కోటాకు చెందిన 270 సీట్లనూ ఈ ఏడాదికి ఎంసెట్-3 ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉండగా ‘నీట్’ ర్యాంకుల ద్వారా మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లోని మొత్తం 1,230 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. అయితే ఆయా కాలేజీల్లో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ప్రకారం 540 సీట్లను యాజమాన్యాలు ఇప్పటికే ఇష్టారాజ్యంగా విక్రయించుకున్నాయన్న విమర్శలున్నాయి. బీ కేటగిరీకి ఏడాదికి పెంచే రూ. 11 లక్షల్లో ఐదు రెట్లు అంటే రూ. 55 లక్షల వరకు ఎన్ఆర్ఐ సీట్ల ఫీజు పెంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించడం తెలిసిందే. ఆ ప్రకారం ఐదున్నరేళ్లకు రూ. 3 కోట్లకుపైగా పెంచనున్నారు. ఇప్పటికే తమకు ఇష్టమైన వారికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అంతకుమించి ఫీజుతో విక్రయించుకున్నారని తేలింది. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి రూ. 3.5 కోట్లకు పైగానే విక్రయించుకున్నాయని తెలిసింది. ఆ ప్రకారం కనీసం రూ. 1,600 కోట్లకు ఆ సీట్లనన్నింటినీ విక్రయించినట్లు చర్చ జరుగుతోంది. అయితే సాంకేతికంగా ఆ సీట్లకు తూతూమంత్రంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. -
‘నీట్’ ర్యాంకులు బేఖాతర్!
-సుప్రీం ఆదేశాలకు తూట్లు -ఎన్ఆర్ఐ సీట్ల భర్తీలో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యం -ఇప్పటికే ఒక్కో ఎంబీబీఎస్ సీటు రూ. 3కోట్లకుపైనేవిక్రయం! -తూతూమంత్రంగా కౌన్సెలింగ్? సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రైవేటు మెడికల్ కాలేజీలు బేఖాతర్ చేస్తున్నాయి. ముఖ్యంగా 15 శాతం ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) సీట్లను అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీలు అంగట్లో సరుకుగా ఇప్పటికే విక్రయించుకున్నాయి! ఒక్కో సీటును రూ. 3 కోట్లకుపైగానే విక్రయించాయని సమాచారం. కాలేజీల తీరు వల్ల ‘నీట్’ స్ఫూర్తి దెబ్బతిన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నీట్ ర్యాంకుల ఆధారంగా జరగాల్సిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి మార్గదర్శకాలు ఉండటంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలాగైతే ‘నీట్’ ర్యాంకులెందుకు? గతేడాది వరకు ఎంసెట్ ద్వారా ప్రభుత్వ మెడికల్ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేసేవారు. ప్రైవేటులో మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లకు ప్రైవేటు కాలేజీలు సొంతంగా పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టేవి. మిగిలిన 15 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లను ర్యాంకులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా విక్రయించుకునేవి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలనే సుప్రీంకోర్టు ‘నీట్’ను తప్పనిసరి చేసింది. బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ సీట్లను తప్పనిసరిగా నీట్ ర్యాంకుల ద్వారానే కేటాయించాలని ఆదేశించింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు యాజమాన్యాలు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు కాలేజీలవారీగా నోటిఫికేషన్ జారీచేసి కౌన్సెలింగ్ నిర్వహించుకొని ఇష్టారీతిన సీట్లను భర్తీ చేసుకునేలా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లన్నింటికీ కలిపి ఒకే కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించ రని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఆర్ఐ సీట్లకు ఒక్కో కాలేజీ ఒక్కో నోటిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించుకుంటే పారదర్శకత ఏముంటుందని...అలాంటప్పుడు ‘నీట్’ ర్యాంకులు ఎందుకంటున్నారు. 540 ఎన్ఆర్ఐ సీట్లు హాంఫట్... రాష్ట్రంలో మొత్తం 22 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 3,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లు, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 సీట్లు, మూడు మైనారిటీ కాలేజీల్లో 450 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లతోపాటు 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం 2,100 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం (1,050) సీట్లను, మైనారిటీ కాలేజీల్లోని 60 శాతం కన్వీనర్ కోటాకు చెందిన 270 సీట్లనూ ఈ ఏడాదికి ఎంసెట్-3 ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉండగా ‘నీట్’ ర్యాంకుల ద్వారా మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లోని మొత్తం 1,230 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. అయితే ఆయా కాలేజీల్లో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ప్రకారం 540 సీట్లను యాజమాన్యాలు ఇప్పటికే ఇష్టారాజ్యంగా విక్రయించుకున్నాయన్న విమర్శలున్నాయి. బీ కేటగిరీకి ఏడాదికి పెంచే రూ. 11 లక్షల్లో ఐదు రెట్లు అంటే రూ. 55 లక్షల వరకు ఎన్ఆర్ఐ సీట్ల ఫీజు పెంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించడం తెలిసిందే. ఆ ప్రకారం ఐదున్నరేళ్లకు రూ. 3 కోట్లకుపైగా పెంచనున్నారు. ఇప్పటికే తమకు ఇష్టమైన వారికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అంతకుమించి ఫీజుతో విక్రయించుకున్నారని తేలింది. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి రూ. 3.5 కోట్లకు పైగానే విక్రయించుకున్నాయని తెలిసింది. ఆ ప్రకారం కనీసం రూ. 1,600 కోట్లకు ఆ సీట్లనన్నింటినీ విక్రయించినట్లు చర్చ జరుగుతోంది. అయితే సాంకేతికంగా ఆ సీట్లకు తూతూమంత్రంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. -
పది మెడికల్ కాలేజీల అనుమతికి నో!
తెలంగాణలో 6, ఏపీలో 4 కాలేజీలకు ఎంసీఐ నిరాకరణ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతులను నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా ఎంసీఐకి సిఫార్సు చేశాయి. ఈ మెడికల్ కాలజీల్లో 2016-17 విద్యాసంవత్సరం నుంచి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించాలని కోరగా ఎంసీఐ అందుకు అంగీకరించలేదు. ఈ కాలేజీల్లో కనీస వసతులు లేనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎంసీఐ లిఖిత పూర్వకంగా తెలియజేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లా పటాన్చెరులో అల్లేటి ఎడ్యుకేషన్ సొసైటీ కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలో శివారెడ్డిపేటలో కొత్త మెడికల్ కాలేజీకి, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ మిట్టపల్లిలో మరో మెడికల్ కాలేజీకి, అయ్యన్న ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారెడ్డి జిల్లా కనకకామిడిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, వరంగల్‌లో మరో కొత్త మెడికల్ కాలేజీకి, మెదక్ జిల్లా ములుగు మండలంలో ఆర్.వి.ఎం చారిటబుల్ ట్రస్టు కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎంసీఐ నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, చిత్తూరు జిల్లా రేణిగుంటలో కంచికామకోటి పీఠం మెడికల్ కాలేజీకి, చిత్తూరు జిల్లా శ్రీనివాస ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి, విశాఖపట్నం జిల్లా మర్రివలసలో గాయత్రి విద్యాపరిషత్ ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఎంసీఐ ఒప్పుకోలేదు. అలాగే ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అదనంగా 150 మెడికల్ సీట్లను కోరగా అందుకు నిరాకరించింది. విశాఖలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫాతిమా మెడికల్ కాలేజీలో 100 సీట్లకు, హైదరాబాద్‌లోని అపోలో కాలేజీలో 100 సీట్లకు ఈ ఏడాది అడ్మిషన్లు చేయవద్దని కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తగినంతగా లేరనే కారణంతో నాలుగు కొత్త కోర్సుల ప్రారంభానికి కూడా ఎంసీఐ అంగీకారం తెలుపలేదు. -
నేడు ఎంసెట్-2 నోటిఫికేషన్
జూలై 9న ప్రవేశ పరీక్ష - ఆ తర్వాత వారంలో ఫలితాలు.. ఆగస్టు 1 నుంచి తరగతులు - నీట్‌పై ఆర్డినెన్స్‌తో ప్రవేశాలపై తొలగిన సందిగ్ధం - ప్రభుత్వ, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఎంసెట్ ద్వారానే - ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లు నీట్ ద్వారా భర్తీ - ప్రైవేటు వైద్య సీట్లకు జూలై 24న నీట్-2 సాక్షి, హైదరాబాద్: నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం మెడికల్ ఎంసెట్-2కు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 9న మెడికల్ ఎంసెట్-2 నిర్వహిస్తారు. అదే రోజు కీ విడుదల చేస్తారు. వారానికి ఫలితాలు విడుదల చేస్తారు. నీట్-2 ప్రవేశ పరీక్ష జూలై 24న నిర్వహించనున్నారు. ఇక నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్లతోపాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్-2 ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ(35 శాతం), 15 శాతం ఎన్నారై కోటా సీట్లను మాత్రం ‘నీట్’ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 1,025 ప్రైవేటు సీట్లకు నీట్ తెలంగాణలో మొత్తం 18 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నా యి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో(కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి సీట్లున్నా యి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను, 10 నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం(725) సీట్లను ప్రభుత్వం నిర్వహించే మెడికల్ ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 1,725 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35శాతం(507) బీ కేటగిరీ సీట్లను, మరో 15శాతం(218) సీట్లను ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. అలాగే మైనారిటీ కాలేజీల్లోని 300 సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. మొత్తం 1,025 సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక డెంటల్‌లో ప్రభుత్వ కాలేజీ ఒకటి ఉండగా అందులో 100 సీట్లున్నాయి. ప్రైవేటు డెంటల్ కాలేజీలు 11 ఉండగా... వాటిలో 1,040 సీట్లున్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ఆధారంగా.. మేనేజ్మెంట్ సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలపై పిడుగు కేంద్ర ఆర్డినెన్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పిడుగులాంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే బీ కేట గిరీ, ఎన్నారై మెడికల్ సీట్ల భర్తీ జరిగితే కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పడినట్లేనంటున్నారు. అయితే నీట్ ర్యాంకులను ప్రకటిం చాక.. అడ్మిషన్లు ఎవరు నిర్వహిస్తారన్న దానిపైనే ప్రైవేటు కాలేజీలకు ముకుతాడు పడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు. ర్యాంకులు ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ శాస్త్రీయంగా ఉంది. ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే ఎంసెట్ నిర్వహించాలనడం సమంజసం. ఎందుకంటే ఆ సీట్లకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పరీక్ష రాస్తారు. బయటి రాష్ట్రాల వారు రాయరు. ప్రైవేటులోని బీ కేటగిరీ సీట్లకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ఎన్నారై సీట్లను వారిష్టం వచ్చినట్లు భర్తీ చేసుకునేవారు. కాబట్టి నీట్ పరిధిలోనే వాటిని భర్తీ చేయాలనడం సమంజసంగా ఉంది. నీట్ వల్ల దేశంలో వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పుతుంది. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రైవేటు సీట్లలోనూ ప్రవేశాలకు అవకాశం దక్కుతుంది. - కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ -
‘ప్రైవేటు’ విశృంఖలతకు సుప్రీం కళ్లెం
సందర్భం ప్రైవేటు విద్యాసంస్థల ప్రవేశాలు, ఫీజులు వారి ఇష్టానుసారమే అనడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మెరిట్ మాత్రమే ఉన్నత ప్రామాణికమని, నీట్ ప్రైవేటు సంస్థల ప్రాథమిక హక్కులకు భంగకరం కాదని, అది రాజ్యాంగ బద్ధమని స్పష్టీకరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తాయని ఆశిద్దాం. జాతి ఔన్నత్యానికి వెన్నె ముక విద్యే. కానీ దాన్ని ఒక వ్యాపారంగా మార్చడంలో ప్రభుత్వాలు, న్యాయస్థా నాలు, మరీ ముఖ్యంగా విద్యా సంస్థలు తమ వంతు పాత్రను పోషించాయి. మొత్తం విద్యా వ్యవస్థ దారుణంగా దిగజారి పోయింది. సుప్రీంకోర్టు ఇటీ వల వెలువరించిన ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) తీర్పు నేపథ్యంలో ఒకసారి ఈ పరిస్థితిని పరికిద్దాం. ఒకప్పుడు కేపటేషన్ ఫీజు వసూలు చేయడం తీవ్ర నేరం. మన రాష్ట్రంలో దీన్ని అరికట్టడానికి ఒక చట్టం ఉంది. కోర్టు తీర్పుల ఫలితంగా అది నిర్వీర్యం అయింది. ఆ చట్టం ప్రకారం, ఒకప్పుడు వైద్య, ఇంజ నీరింగ్ ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ ఉండేది. అందరికీ ర్యాంకులు ఇచ్చేవారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్నిటిలోనూ ప్రవేశాలకు ఆ ర్యాంకులే ప్రాతిపదిక. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఉండేవి. సీట్ల కేటాయింపును కన్వీనరే నిర్వహించే వారు, ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించేది. ఇది చాలా కాలం బాగానే పనిచేసింది. ఉన్నిక్రిష్ణన్ (1993) కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధానం దేశవ్యాపితంగా అమలయ్యేలా చేసింది. అప్పటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్ని క్రిష్ణన్ కేసును తిరగ తోడటానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ కేసుల్లో వివిధ హైకోర్టులు రకరకాలుగా తీర్పులు చెప్పాయి. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తే, మరికొన్ని పై తీర్పుని సమ ర్థించాయి. ఫీజుల వసూళ్ళలో వైవిధ్యం వల్ల మేనేజ్ మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు, కన్వీనర్ కోటా విద్యార్థుల ఫీజును భరించాల్సి వస్తుందనేది యాజమా న్యాల ముఖ్య వాదన. కానీ, కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులు మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందేవారు. వారి ఫీజు ప్రభుత్వ కాలేజీల ఫీజులతో సమానంగా ఉండేది. మేనేజ్మెంట్ కోటాలో చేరే వారు అటువంటి మెరిట్ లేనివారు, వారు ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది. దీన్నే అసంబద్ధమనేవారు! 2002 బీఎంఏ పాయ్ కేసులో సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఈ వాదనకు ఆమోద ముద్ర వేసింది, ఉన్ని క్రిష్ణన్ కేసు ఈ మేరకు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు నిచ్చింది. ఇస్లామిక్ అకాడమీ (బాంబే మోడరన్ స్కూల్ 2004), పీఏ ఇనాందార్ (2005) కేసులలో సుప్రీం కోర్టు ప్రేవేటు విద్యాసంస్థల యాజమాన్యాల వాదనను సమ ర్థించాయే తప్ప, అసలు సమస్య వైపు చూడలేదు. మెరిట్ ఉండాలంటూనే, అందుకు త గిన ప్రాతిపదికను రూపొందించలేదు. ఇది మొత్తం విద్యారంగం రూపునే మార్చివేసింది. ప్రైవేటు కాలేజీల వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం ఉండరాదనడంతో ప్రవేశ పరీక్షలు, అధ్యాపకుల నియామకాలు ప్రైవేటు కాలేజీలే నిర్వహిం చుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోయి, విద్యాపరమైన వ్యవ హారాలకే పరిమితమైంది. ప్రైవేటు రంగంలో దిగజారిన ప్రమాణాలు, సరైన విద్యా వసతుల లేమి, అంతులేని ఫీజులు కలసి ‘మెరిట్’ను పాతర వేశాయి. ప్రభుత్వాలు నిర్లిప్తంగా విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశాయి. ఏమైతేనేం విద్యారంగం తీవ్రంగా దెబ్బతింది. మెరిట్‌కు విలువ లేకుండా పోయింది. ఫీజులు మెరిట్ ఉన్నవాళ్లకు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా వైద్య విద్య వెల కోట్లకు చేరింది. మెరిట్ ఉన్న వాళ్లను బయట ఉంచి, లేనివాళ్లకు తలుపులు తెరిచారు. దీన్ని ఏదో మేరకు నియంత్రించాలనే 2007లో కేంద్రం నీట్‌ను ముందుకు తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సంక ల్పించింది. దీంతో ప్రైవేటు సంస్థలు నీట్ ప్రవేశ పరీక్ష తమకు వర్తించదని, ఇది గత సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవ డమని, రాజ్యాంగబద్ధం కాదని దీన్ని సవాలు చేశాయి. వివిధ హైకోర్టుల్లోని అన్ని కేసులను తమవద్దకే బదిలీ చేయించుకుని సుప్రీంకోర్టు అన్నిటినీ కలిపి విచారించి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కేసులో 18.7.2013న తీర్పును వెల్లడించింది. నీట్ ప్రైవేట్ కాలేజీలకు వర్తించ దని, అది వారి హక్కులలో జోక్యం చేసుకోవడమేనని తీర్పునిచ్చింది. నీట్, వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను రద్దు చేయజాలదని మెజారిటీ తీర్పు చెప్పింది. ఈ తీర్పునే ఇటీవల సుప్రీం కోర్టు (11.4.2016)న వెనక్కు తీసుకొని, రాజ్యాంగ ధర్మాసనం ముందు పునర్విచారణకు ఆదేశించింది. రాజ్యాంగ ధర్మాసనం 2.5.2016న తన తీర్పును వెల్లడించింది. ప్రైవేటు విద్యాసంస్థల కళాశాలల ప్రవే శాలు, ఫీజులు వారి ఇష్టానుసారమే అనడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వాదన ఇంతకు ముందటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తేల్చింది. మెరిట్ మాత్రమే ఉన్నత ప్రామాణికమని, దీన్ని ఎట్టి పరిస్థితులలో దిగజార్చేది లేదని స్పష్టం చేసింది. అదే విధంగా కేపిటేషన్ ఫీజు విపరీతంగా వసూలు చేయ టాన్ని సమర్థించబోమని చెప్పింది. నీట్ ప్రవేశ పరీక్ష చట్టం, నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం కాదని, ప్రైవేటు సంస్థల ప్రాథమిక హక్కులను భంగపరచడం లేదని తేల్చింది. నీట్ రాజ్యాంగబద్ధమని స్పష్టీకరించింది. ఫీజు లను నియంత్రించవచ్చునని చెప్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. సుమారు దశాబ్దం పైగా కొనసాగిన అనిశ్చిత పరిస్థితికి ఈ తీర్పు తెరదించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, వాటి నిర్వహణ రంగాలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తారని ఆశిద్దాం. అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా బాధ్యతగా ఉంటాయని ఆశించవచ్చునా? - ఎ. సత్యప్రసాద్ వ్యాసకర్త మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈమెయిల్ : asphyd@icloud.com -
ప్రైవేటు వైద్య సీటుకు ఫీజు మోత
♦ ప్రైవేటు ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపునకు రంగం సిద్ధం ♦ ఎంబీబీఎస్‌లో బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ సీట్లకు 5% పెంచాలని యోచన ♦ ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై ఏఎఫ్ఆర్సీలో చర్చ ♦ సర్కారుకు ప్రతిపాదించాలని నిర్ణయించిన ఏఎఫ్ఆర్సీ సాక్షి, హైదరాబాద్: గతేడాదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లకు ఫీజులు పెంచిన ప్రభుత్వం... ఈ ఏడాది మరోసారి ఫీజులు పెంచేందుకు సన్నద్ధమైంది. ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గడంతో డబ్బున్నోళ్లే డాక్టర్ కోర్సు చదివేలా పరిస్థితి తయారైంది. ప్రైవేటు యాజమాన్యాలకు కాసుల వర్షం కురియనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచాలని ఇటీవల అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్ఆర్సీ)కి ప్రతిపాదించాయి. దీనిపై ఏఎఫ్ఆర్సీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రస్తుతం బీ కేటగిరీ సీటు ఫీజు ఏడాదికి రూ. 9 లక్షలుండగా... ఆ ఫీజును రూ. 11 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ) సీట్ల ఫీజు రూ. 11 లక్షలుండగా... రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే పీజీ వైద్య సీట్లకు కూడా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు పెంచాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఏఎఫ్ఆర్సీ కూలంకషంగా చర్చించింది. ఎంబీబీఎస్‌కు 5%... పీజీకి 10% తెలంగాణలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 50 శాతం (725) సీట్లను ఎంసెట్ ద్వారా ర్యాంకు తెచ్చుకున్నవారికి ప్రభుత్వ ఫీజు(60 వేలు) ప్రకారం కేటాయిస్తారు. 35 శాతం (507) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా నింపుతారు. మరో 15 శాతం (218) సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద కాలేజీ యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఫీజులు పెంచమని కోరాయి. గతేడాది ఫీజులు పెంచినప్పటికీ అనుకున్నంత స్థాయిలో పెంపు జరగలేదని ప్రైవేటు కళాశాలలు వాదిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, భవనాలు, ఇతరత్రా సదుపాయాలకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నందున ప్రస్తుత ఫీజులు సరిపోవనేది వారి వాదన. వీటిని పరిగణనలోకి తీసుకొని అన్ని విషయాలు చర్చించిన ఏఎఫ్ఆర్సీ ఎంబీబీఎస్‌లోని బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు 5 శాతం ఫీజు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే పీజీ ప్రైవేటు వైద్య సీట్లకు కూడా 10 శాతం వరకు పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ మేరకు నడుచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని ఏఎఫ్ఆర్సీ నిర్ణయించినట్లు తెలిసింది. -
నీట్ నుంచి ప్రైవేట్ కాలేజీలకు మినహాయింపు
మెడికల్ కోర్సులో చేరేందుకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి ప్రైవేట్ కాలేజీలను మినహాయిస్తూ సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న 600 మెడికల్ కాలేజీలపై ప్రభావం చూపనుంది. నీట్ ద్వారానే కాక విద్యార్థులను వేరే టెస్ట్ లు నిర్వహించి కూడా కాలేజీల్లో చేర్చుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఇప్పటివరకూ ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలకు ఒకే పరీక్షను నిర్వహించేవారు. అయితే ఈ కామన్ ఎంట్రన్స్ సరికాదని 2013లో నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మొదట కామన్ టెస్ట్ కే మొగ్గు చూపిన సుప్రీం... మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరిక మేరకు ఆ పిటిషన్ ను పున: విచారించింది. ఈ రివ్యూ విచారణలో నీట్ ఎంట్రన్స్ నుంచి ప్రైవేట్ కాలేజీలను మినహాయించింది. -
ఆ సీట్లకు కోట్లలో బేరం!
* ‘బి’ కేటగిరీలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు మిగుల్చుకున్న ప్రైవేటు వైద్య కాలేజీలు * ఎన్నారై కోటాలోకి మార్చుకుని అమ్ముతున్న వైనం * ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు రూ. కోటిన్నరపైనే.. బీడీఎస్ సీటుకు రూ.30 లక్షలు వసూలు * అక్రమాలపై కిమ్మనని ఉన్నతాధికారులు! * ఆ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: సవాలక్ష ఆంక్షలు, అడ్డగోలు నిబంధనలను అడ్డుపెట్టి మిగుల్చుకున్న ఎంబీబీఎస్ ‘బి’ కేటగిరీ సీట్లను... ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు రూ.కోట్లకు అమ్ముకుంటున్నాయి. ఆ సీట్లను ఎన్నారై కోటా కిందకు మార్చి మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ఎంబీబీఎస్ సీటుకు రూ.1.10 కోట్ల నుంచి రూ.1.70 కోట్ల వరకు.. డెంటల్ సీటును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు కట్టబెడుతున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలోని ‘బి’ కేటగిరీ సీట్లకు ప్రత్యేకంగా ఎం-సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సీట్లను ముందే ఒక్కోటీ రూ.కోటికిపైగా సొమ్ము తీసుకుని అమ్మేసుకున్న ప్రైవేటు వైద్య కాలేజీలు... వాటిని కొన్నవారికే సీట్లు వచ్చేలా ఎం-సెట్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డాయి. అయినా పలువురు పేద విద్యార్థులు ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. అలాంటి వారికి సీట్లు దక్కకుండా ఉండేందుకు ప్రైవేటు వైద్య కాలేజీలు అడ్డగోలు నిబంధనలను తెరపైకి తెచ్చాయి. ఎంబీబీఎస్ సీటు కోసం ఏకంగా నాలుగేళ్ల ఫీజు (రూ.36 లక్షలు)కు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిబంధన పెట్టాయి. దీంతో పలువురు పేద అభ్యర్థులు సీట్లు పొందలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడం లేదు కదా అంటూ ఉన్నతాధికారులు ప్రైవేట్ కొమ్ముకాస్తున్నారు. ఇక ఇలా మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలను బయటకు తెలియనీయకుండా ప్రైవేటు కాలేజీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ సీట్లన్నింటినీ ఎన్నారై కోటాలోకి మార్చుకొని... భారీ మొత్తానికి అమ్ముకుంటున్నాయి. ‘‘యాజమాన్యాలు ప్రతీ విషయంలోనూ ప్రభుత్వంతోనే (ఉన్నతస్థాయిలో) సంప్రదింపులు జరుపుతున్నాయి. మేమెవరైనా ఫలానా తప్పు జరుగుతోందని అడిగితే ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే చేస్తున్నామని అంటున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రారంభం నుంచి వారిది ఇష్టారాజ్యమే. నాకు తెలిసి ఒక్కో కాలేజీ కోట్ల రూపాయల్లో లావాదేవీలు చేస్తున్నాయి. ఫ్యాకల్టీ లేకపోయినా ఎంబీబీఎస్‌పై మోజుతో తల్లిదండ్రులు ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు..’’ అని సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం అన్ని మెడికల్ కాలేజీల్లో భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలి. అంటే మరో నాలుగు రోజుల్లోగా సీట్లను విక్రయించుకునే పనిలో ప్రైవేటు కాలేజీలు బిజీగా ఉన్నాయి. ఒక్కో సీటు రూ. 1.70 కోట్లు: హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి ఏకంగా రూ.1.70 కోట్లు చెల్లించాడు. ‘బి’ కేటగిరీలోని సీటు రద్దు చేసి ఎన్నారై కోటాలో ఇస్తున్నందుకు ఈ మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసిందని ఆ విద్యార్థి తండ్రి ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు. ‘‘నాకు ఒక్కరే సంతానం. డాక్టర్ చదివించాలని నా కల. అందుకే పైసా పైసా కూడబెట్టిన సొమ్మును ఇప్పుడు ఆ డాక్టర్ సీటు కోసం త్యాగం చేశాను’’ అని పేరు ప్రకటించడానికి ఇష్టపడని ఆ తండ్రి చెప్పారు. మొదట్లో రూ.1.3 కోట్లకు ఇస్తామన్నారని, తీరా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందనగా టెన్షన్‌కు గురిచేసి రూ.40 లక్షలు ఎక్కువగా తీసుకున్నారని చెప్పారు. ఇక మాదాపూర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి తన కుమారుడికి వైద్య సీటు కోసం రూ.1.55 కోట్లు చెల్లించాడు. పెద్ద కుంభకోణం: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 35 శాతం ‘బి’ కేటగిరీలో 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం నిర్వహించిన ఎం-సెట్ పరీక్ష అనంతరం అడ్డగోలు నిబంధనలు పెట్టి దాదాపు 50 ఎంబీబీఎస్ సీట్లు మిగిల్చి అమ్ముకుని రూ.75 కోట్లు.. 200 బీడీఎస్ సీట్లను మిగుల్చుకుని రూ.50 కోట్లు వెనకేసుకుంటున్నాయి. ‘ఇదో పెద్ద కుంభకోణం. ప్రభుత్వం మొదటి నుంచి ప్రైవేట్ వారికి దాసోహమైంది. గతేడాదిదాకా బి-1 కేటగిరీలో దాదాపు 200 సీట్లను ఎంసెట్ మెరిట్ ప్రాతిపదికన కేటాయించేవారు. ఈసారి వాటిని యాజమాన్య కోటాలో కలిపేశారు. ఫలితంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది..’’ అని ప్రభుత్వ వైద్యకళాశాల ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ప్రైవేటు కాలేజీలు ‘బి’ కేటగిరీలో సీట్లు మిగుల్చుకుని, ప్రభుత్వానికి చెప్పకుండానే అమ్మేసుకుంటున్నాయని అధికార వర్గాలు చెబుతున్న మాటలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ‘బి’ కేటగిరీలో మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు కె.విజయ్‌కుమార్, కౌషిక్ యాదవ్, శ్రీధర్‌గౌడ్, రమేష్ ముదిరాజ్‌లు మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
‘బ్యాంకు గ్యారంటీ’కి జీవోనా?
ప్రైవేట్ ఎంసెట్ వ్యవహారంపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగతా నాలుగేళ్లకూ ముందే బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు యాజమాన్యాలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘‘బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు ఇదేమైనా జాతీయ రహదారి నిర్మాణ పనుల వ్యవహారమా? ఇలాంటి జీవో ఇచ్చే అధికారం మీకెక్కడిది?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవోను సవాలు చేస్తూ కామినేని వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొందరు వేర్వేరుగా వేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇలా బ్యాంకు గ్యారంటీ తీసుకునే విధానం దేశంలో ఎక్కడా లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవీందర్ వాదించారు. విద్యార్థులు మధ్యలో మానేస్తే కాలేజీలు నష్టపోతాయని, అందుకే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ నిబంధన అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
'సీట్లను అమ్ముకుంటే బ్లాక్ లిస్టులో పెడతాం'
హైదరాబాద్: ఈనెల 12 నుంచి ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అయితే దీనిపై ముందుగా 8 వతేదీన ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. 'బి' క్యాటగిరి సీట్లను కొంతమంది బ్రోకర్లు అక్రమంగా అమ్ముకోవాలని చూస్తున్నారన్నారు. ఒకవేళ 'బి' క్యాటగిరి సీట్లను అమ్ముకుంటే ఆయా కళాశాలలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ రకంగా సీట్లను కొనుక్కోవాలనే విద్యార్థులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను విత్ హెల్డ్ లో పెట్టడమే కాకుండా.. రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 35౦ సీట్లు తగ్గినట్లు కామినేని తెలిపారు. బీహార్ లో ఎన్నికలు ఉన్నందును ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం తమకు ఉందని కామినేని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం గతంలోనే తమ నాయకత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. -
ప్రైవేటు పీజీ వైద్య విద్యార్థులకు ఊరట
డబ్బులు డిమాండ్ చేస్తున్న కళాశాలలపై చర్యలు హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు పీజీ విద్యార్థులకు గౌరవ భృతి ఇవ్వాల్సి ఉండగా... వారి నుంచే డబ్బులు వసూలు చేస్తుండటంపై భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాలు, గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి రాజేశ్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)కి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. సంబంధిత వైద్య కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆసుపత్రుల ఆదాయంతోనే భృతి.. ప్రైవేటు వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రి ఉంటుంది. వాటిల్లో పీజీ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. సేవలు చేసినందుకు వారికి గౌరవ భృతిని సంబంధిత కళాశాల యాజమాన్యమే చెల్లించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా విద్యార్థుల నుంచే ఏడాదికి రూ. 2.90 లక్షలను ముందస్తుగా వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తాన్నే విద్యార్థులకు భృతిగా చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎంసీఐ పీజీ కమిటీ ఛైర్మన్ భగవాన్ తివారీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎంసీఐ స్పందించింది. పీజీ వైద్యుల కౌన్సిలింగ్ మ్యాట్రిక్స్.. ఏడాదిపాటు ‘తప్పనిసరి’ వైద్య సేవలందించాలనే నిబంధనపై భర్తీ చేయనున్న పీజీ వైద్యుల కౌన్సెలింగ్ మ్యాట్రిక్స్‌ను వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో 685 మంది వైద్య విద్యార్థుల నియామకాలు జరపనుండగా... ఇందులో 566 మందిని బోధనాసుపత్రుల్లో, 119 మందిని వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నారు. సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వైద్య విద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నియామకాల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ వైద్య కాలేజ్‌లు, అనుబంధ ఆసుపత్రుల్లో వైద్యులను కేటాయించనున్నారు. -
ఇష్టారాజ్యంగా ‘ఎం-సెట్’
కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రైవేటు వైద్య కళాశాలల ఒంటెత్తు పోకడ ⇒ ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ పంపాలని విద్యార్థులకు ఎస్ఎంఎస్లు ⇒ వెబ్సైట్లో అప్లోడ్ కావట్లేదని తల్లిదండ్రుల గగ్గోలు ⇒ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అడ్మిషన్ల వ్యవహారం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు కౌన్సెలింగ్ ప్రక్రియలోనూ ఒంటెత్తు పోకడను ప్రదర్శిస్తున్నాయి. ఎం-సెట్ ఫలితాల్లో ర్యాంకుల ఊసెత్తని యాజమాన్యాలు తాజాగా ఇంటర్ హాల్‌టికెట్ నంబర్లను ఈ నెల 22లోగా తమ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలంటూ విద్యార్థులకు ఎస్ఎంఎస్లు పంపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ‘సాక్షి’కి చెప్పారు. అయితే ఎంత ప్రయత్నించినా వెబ్సైట్లో ఆ వివరాలు అప్లోడ్ కావట్లేదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని తండ్రి ఆరోపించారు. దీనిపై వెబ్సైట్లో పేర్కొన్న నంబర్‌కు ఫోన్ చేస్తే ‘ఇది ఒక క్లినికల్ సెంటర్. మాకు, ఎం-సెట్ పరీక్షకు సంబంధం లేదు’ అని సమాధానం వచ్చినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజులే సమయం ఉందని... ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదని ఆందోళన చెందుతున్నారు. కాగా, ర్యాంకుల ప్రకటనకు ఇంటర్ వెయిటేజీ ఉండదంటూ చెప్పుకొచ్చిన యాజ మాన్యాలు తాజాగా హాల్ టికెట్ నంబర్ అడిగారంటే ఇంటర్ వెయిటేజీ ఉంటుందేమోనన్న చర్చ విద్యార్థుల్లో జరుగుతోంది. కానీ వెయిటేజీ ఉండదని ఆ మేరకు ప్రత్యేక ఎం-సెట్‌పై జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మరి ఎందుకు హాల్‌టికెట్ నంబర్ అడిగారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. ఎం-సెట్‌పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలోకానీ... సచివాలయంలోని ముఖ్య కార్యదర్శి పేషీలోకానీ ప్రైవేటు ఎం-సెట్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండటంలేదు. ప్రభుత్వం వారికి వత్తాసు పల కడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. 35 శాతం యాజమాన్య కోటా సీట్లను ఎం-సెట్ నిర్వహణకు ముందే కళాశాలల యాజమాన్యాలు ఒక్కోటీ రూ. కోటికిపైగా అమ్ముకొని వందల కోట్లు వెనకేసుకున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తడం తెలిసిందే. -
డోలాయమానంలో 400 ఎంబీబీఎస్ సీట్లు
4 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వసతులు లేవన్న ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 400 ఎంబీబీఎస్ సీట్ల మంజూరీలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా (ఎంసీఐ) ఎటూ తేల్చలేదు. ఈ ఏడాది ఈ సీట్లను కొనసాగించే విషయమై ఇప్పటివర కు ఆమోదం కూడా తెలపలేదు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి వైద్య మహిళా కళాశాల, మల్లారెడ్డి వైద్య కళాశాలలకు చెందిన 300 ఎంబీబీఎస్ సీట్లపై గందరగోళం నెలకొంది. మెడిసిటీ వైద్య కళాశాలకు చెందిన 50, ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలకు చెందిన 50 సీట్లపై అస్పష్టత నెలకొంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఆయా కళాశాలల్లో అవసరమైన వసతులు లేకపోవడంతో ఎంసీఐ అభ్యంతరం తెలి పింది. ప్రధానంగా లేబొరేటరీ, పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది, ఇతరత్రా సదుపాయాలు ప్రమాణాల ప్రకారం లేవని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ సీట్లపై ఎంసీఐ ఆమోదం తెలపడానికి వచ్చే నెల 15 వరకు సమయముందని ఆయా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఎంసీఐ కోరుకున్న విధంగా వసతులు కల్పించామని, ఈ సీట్లకు అనుమతి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో ఆందోళన... 400 ఎంబీబీఎస్ సీట్లు డోలాయమానంలో పడడంతో వైద్య విద్యలో ప్రవేశించాలనుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వాటిల్లోని 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలోని 60 సీట్లను డబ్బులు ఇచ్చి సీట్లు పొందినవారు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే 35 శాతం చొప్పున ప్రైవేటు యాజమాన్య సీట్లకు మూడో తేదీన ప్రత్యేక ఎం-సెట్ జరుగుతోన్న విషయం విదితమే. ఆ ప్రకారం ఈ నాలుగు కాలేజీల్లోని 140 సీట్లలో కొన్నింటిని కొందరు విద్యార్థులు డబ్బు ఇచ్చి బుక్ చేసుకున్నట్లు సమాచారం. వారూ ఆందోళన చెందుతున్నారు. ఏకంగా 400 సీట్లు తగ్గడంతో యాజమాన్య కోటా కోసం పరీక్ష రాసే విద్యార్థులు తీవ్ర నిరాశ పడే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలలు డబ్బులు వసూలు చేస్తున్నాయే కానీ ఎంసీఐ నిబంధనలు పాటించడంలో శ్రద్ధ చూపకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. మరో రెండు కాలేజీలకు 100 సీట్లు ఇదిలావుండగా రాష్ట్రంలోని రెండు ప్రైవేటు వైద్య కళాశాలలకు 100 సీట్లు పెంచుతూ ఎంసీఐ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కో కళాశాలకు 50 చొప్పున పెంచినట్లు సమాచారం. అయితే ఈ వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఎంట్రన్స్ పరీక్ష వద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఫీజు పెంపుదలను ఉపసంహరించుకోవాలని, కామన్ ఎంట్రన్స్ ద్వారానే ప్రవేశాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలను ఒకే గొడుగు కిందికి తెచ్చి ప్రవేశాలు నిర్వహించడం, మేనేజ్మెంట్ కోటా కింద ఫీజు రూ.9 లక్షలు నిర్ణయించడం వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, ఆ వర్సిటీ భూముల్లో గృహాలు నిర్మిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం సీట్లు.. రూ.11లక్షల ఫీజు
-
50 శాతం సీట్లు.. రూ.11లక్షల ఫీజు
* ఆ ప్రకారం ఎంబీబీఎస్ ఫీజులు పెంచాలి * ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా సవరించాలి * టీ సర్కారుకు విన్నవించనున్న ప్రైవేటు వైద్య కళాశాలలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెరిగేఅవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కేటగిరీల్లో ఫీజులు పెంచినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే పెద్దఎత్తున ఫీజులు పెంచినందున ఇక్కడా పెంచాలని ప్రైవేటు మెడికల్ కాలేజీలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాయి. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీలు కోరుతున్నట్లు భారీగా కాకుండా... ఎంతో కొంత పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ‘బి’, ‘సి’ కేటగిరీల్లోని అన్ని సీట్లకూ ఏకీకృతంగా రూ.11 లక్షల చొప్పున పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. 1,050 సీట్లకు రూ. 11 లక్షల చొప్పున తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు ఆధ్వర్యంలో 15 వైద్య కళాశాలలు ఉన్నాయి. 850 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. ప్రైవేటు సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు, ‘బి’ కేటగిరీలో 10 శాతం సీట్లను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతంలో 25 శాతం యాజమాన్య కోటా సీట్లు, 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ 40 శాతం సీట్లను కూడా ప్రస్తుతం ఎంసెట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. అయితే ‘బి’, ‘సి’ కేటగిరీల్లోని 50 శాతం సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతున్నాయి. అంటే మొత్తం 1,050 సీట్లకు సొంతంగా పరీక్ష పెట్టుకుని నింపుకోవాలని, వీటన్నింటికీ ఎన్ఆర్ఐ ఫీజుకు సరిసమానం చేస్తూ పెంచాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ‘బి’ కేటగిరీ సీట్లకు రూ. 2.40 లక్షలు, ‘సి1’ కేటగిరీ సీట్లకు రూ. 9 లక్షలు, ‘సి2’ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లకు రూ. 11 లక్షలు వసూలు చేస్తున్నారు. వీటన్నింటికీ ఎన్ఆర్ఐ కోటా మాదిరే రూ. 11 లక్షల ఫీజు చేయాలని ప్రైవే టు యాజమాన్యాలు కోరుతున్నాయి. ఫీజులు పెంచాలని కోరుతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబీబీఎస్ ఫీజులు పెంచినందున తెలంగాణలోనూ పెంచాలని సర్కారును కోరతామని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజ్మెంట్ల సంఘం అధ్యక్షుడు సి.లక్ష్మీనర్సింహారావు చెప్పారు. ఏపీ ప్రకారం ఫీజులను సవరించాలన్న విషయం ప్రభుత్వ దృష్టిలోనూ ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. గత ఏడాదే పెంచినందున? తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదే సి1 కేటగిరీ ఫీజు రూ. 5.5 లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. సి2 (ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు రూ. 5.5 లక్షల నుంచి 11 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ ఏడాది ఫీజు పెంచడం సబబుగా ఉండదనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చ. పైగా నిబంధనల ప్రకారం ఏడాదికే ఫీజు పెంచడం కుదరదని అంటున్నారు. అయినా ప్రభుత్వం తలుచుకుంటే నిబంధనలకు సవరణలు చేసి ఫీజు పెంచుకోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ ముందుకెళ్లినట్లు సమాచారం. -
యాజమాన్య కోటాకు ప్రత్యేక ఎంట్రన్స్
ప్రైవేటు మెడిక ల్ కాలేజీల డిమాండ్‌కు సర్కారు సానుకూలత సిద్ధమవుతోన్న ఫైలు.. ఈ ఏడాది నుంచే అమలు? సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లకు ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించాలని చేస్తున్న డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు చకచకా కదులుతున్నట్లు తెలిసింది. సీఎం పచ్చజెండా ఊపితే త్వరలో అమలులోకి రానుంది. యాజమాన్య కోటా సీట్లపై ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా అధికారికంగానే ఐదేళ్ల ఎంబీబీఎస్‌లో ఒక్కో సీటుకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేస్తాయి. అయితే ప్రత్యేక పరీక్ష పేరుతో నిర్ణయించిన మేరకే కాకుండా దొడ్డిదారిన మరింత వసూళ్లు చేస్తారేమోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పరీక్ష ప్రైవేటు చేతుల్లోకి వెళితే భర్తీ విధానం ఎలా ఉంటుందోనని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రవేశ పరీక్షకే విద్యార్థులు తీవ్ర ఆందోళన, ఒత్తిడి పడుతుండగా రెండో పరీక్ష రాయడానికి విద్యార్థులు ససేమిరా అంటున్నారు. 840 సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్... తెలంగాణలోని మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉండగా, 2,100 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు (ఫీజు రూ.60 వేలు), ‘బి’ కేటగిరీ 10 శాతం (ఫీజు రూ.2.40 లక్షలు) సీట్ల ను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కిం ద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతం (840 సీట్లను) యాజమాన్య కోటా కింద ప్రైవేటు కళాశాలలు ఎంసెట్ ఆధారంగానే భర్తీ చేసుకుంటున్నాయి. వీటికే ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిం చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. గతేడాదే ప్రత్యేక ఎంట్రన్స్‌కు సంబంధించిన డిమాండ్ రాగా అప్పట్లో రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల దీనిని పక్కన పెట్టేశారు. ప్రభుత్వం నిర్ణయించే సంస్థ ఆధ్వర్యంలోనే ఎంట్రన్స్ ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎంసెట్ తరహాలోనే... అత్యంత నిబద్ధత కలిగిన సంస్థకు అప్పగించి కట్టుదిట్టంగా ఎంట్రన్స్‌ను నిర్వహించే విషయాన్ని సర్కారు ఆలోచన చే స్తోంది. బుధవారం జరిగిన వైద్య ఆరోగ్య అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఇద్దరు ముగ్గురు అధికారులను పక్కకు పిలిచి దీనిపై చర్చించినట్లు తెలిసింది. త్వరలో వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఎంట్రన్స్‌ను నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అన్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ. 11.50 లక్షలకు మించి వసూలు చేయకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ముకుతాడు వేయొచ్చని సీఎం అన్నట్లు తెలిసింది. రెండు పరీక్షలతో భారమే.. ప్రత్యేక ఎంట్రన్స్ వల్ల విద్యార్థులు రెండు పరీక్షలు రాయడం భారంగా మారనుంది. కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రెండు పరీక్షలు ఉన్నందున విద్యార్థులు అలవాటు పడతారని అంటున్నారు. గురువారం నాటికి ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం 88,350 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహిస్తే దాదాపు అదే సంఖ్యలో దరఖాస్తులు వచ్చే వీలుంది. ప్రత్యేక ఎంట్రన్స్‌కు ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడానికే రూ. 10 వేలు వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది. -
ప్రైవేటు వైద్య కళాశాలలకు షాక్
మార్కుల వెసులుబాటు నిబంధనలను కొట్టేసిన హైకోర్టు 55 శాతం విద్యార్థికి 14.. 72 శాతం విద్యార్థికి సున్నా మార్కులా! వచ్చే ఏడాది నుంచి ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు జరగాలి ఇప్పటికే పూర్తయిన ప్రవేశాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టీకరణ హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టు పెద్ద షాక్‌నిచ్చింది. ఇప్పటివరకు 15 శాతం ఇంటర్వ్యూ మార్కుల ను అడ్డంపెట్టుకుని యాజమాన్యపు కోటా కింద సీట్లను తమకు అధిక మొత్తాలు చెల్లించిన విద్యార్థులతో భర్తీ చేసుకుంటున్న యాజమాన్యాలకు బ్రేక్ వేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్, డెంటల్ తదితర కోర్సుల్లో యాజమాన్యపు కోటా కింద ప్రవేశాలు కల్పించే సమయంలో విద్యార్థులకు ఇంటర్వ్యూ ద్వారా 15 శాతం మార్కులు కేటాయించే వెసులుబాటును యాజ మాన్యాలకు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది రూపొందించిన నిబంధనలను కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు పీజీ వైద్య విద్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక ఏపీ విద్యా సంస్థలు (ప్రవేశాల నియంత్రణ, క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం 1983కు, మృదుల్ ధార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సైతం విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వెంటనే కొత్త నిబంధనలు రూపొందించాలని ఆదేశిం చింది. అంతేకాక వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాజమాన్యపు కోటా కింద జరిగే పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా ప్రతిభ (మెరిట్) ఆధారంగా మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 15 శాతం ఇంటర్వ్యూ నిబంధనల ప్రకారం యాజమాన్యపు కోటా కింద ఆయా కాలేజీల్లో ఇప్పటికే పూర్తయిన ప్రవేశాలకు వైద్య విశ్వవిద్యాలయం ఆమోదముద్ర వేసి ఉంటే, ఆ ప్రవేశాలపై ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపదని, ఆ ప్రవేశాలు యథాతథంగా కొనసాగవచ్చునంటూ ధర్మాసనం తన తీర్పులో స్పష్టతనిచ్చింది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ప్రవేశాలను విశ్వవిద్యాలయం ఆమోదిం చలేదు కాబట్టి, ఆ కాలేజీలకి సంబంధించి తాజాగా ప్రతిభావంతుల జాబితాను తయారుచేసి, ఆ జాబితాను సదరు కాలేజీకి పంపాలని యూనివర్సిటీని ఆదేశించింది. యూనివర్సిటీ నుంచి వచ్చే జాబితా ఆధారంగా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతిభ ఆధారంగా ఆయా విద్యార్థులకు వారు కోరిన కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఎన్ఐఆర్ కాలేజీకి ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ మూడు సంవత్సరాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా 15 శాతం ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ తమకు ప్రవేశాలు నిరాకరించిందని, అసలు ఈ 15 శాతం మార్కుల నిబంధనలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ డాక్టర్ ఎస్.పి.శివాని, మరో నలుగురు వైద్య విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 25న తీర్పు వెలువరించింది. ‘‘ఈ కేసులో ఎన్ఆర్ఐ కాలేజీ తయారు చేసిన మెరిట్ జాబితాను పరిశీలిస్తే, ఎంబీబీఎస్ కోర్సులో 55.95 శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి ఇంటర్వూలో 15 మార్కులకు14 ఇచ్చారు. అదే 72.08 శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి ఇంటర్వ్యూలో 15కు గాను సున్నా మార్కులు కేటాయించారు. 72 శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి పీజీ సీటు దొరకే పరిస్థితి లేకుండా పోయింది. ఫీజు కింద భారీ మొత్తాలు చెల్లించిన వారికే యాజమాన్యాలు సీట్లు కేటాయిస్తున్నాయని చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. 15 శాతం మార్కుల నిబంధనలు క్యాపిటేషన్ ఫీజు నిషేధం చట్టానికి విరుద్ధంగా ఎలా ఉన్నాయో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ 15 శాతం మార్కుల నిబంధనలను చట్ట విరుద్ధమని ప్రకటిస్తూ, వాటిని కొట్టివేస్తున్నాం’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రైవేటు వైద్య కళాశాల తీరును ధర్మాసనం ఎండగట్టింది. -
ఎంసీఐ వైఖరి సరికాదు
* సుప్రీంలో వాదనలు వినిపించిన ప్రయివేట్ వైద్యకళాశాలలు * ఏపీ, తెలంగాణల నుంచి 13 వైద్య కాలేజీల్లో సీట్ల కోత * రెన్యువల్ సీట్లకైనా అనుమతి ఇప్పించండి సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల సీట్లు రెన్యువల్, కొత్త సీట్లు మంజూరు, అదనపు సీట్లకు అనుమతికి సంబంధించి భారత వైద్య మండలి(ఎంసీఐ) వైఖరిపై దాఖలైన సుమారు 20 పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. దేశవ్యాప్తంగా పలు ప్రయివేట్ వైద్య కాలేజీలు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్. ఆర్. దవే, జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సీట్ల మంజూరు విషయంలో ఎంసీఐ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని తెలిపారు. 77 ప్రభుత్వ కళాశాలల్లో తగిన వసతులు, బోధనా సిబ్బంది లేకపోయినా ఆ రాష్ట్రాల సీఎస్ల అండర్ టేకింగ్ తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చారని, అయితే ప్రయివేట్ కళాశాలలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంకా సమయం ఉన్నందున రెన్యువల్స్, అదనపు సీట్లు, కొత్త కళాశాలలకు సీట్లకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. కోర్టును ఆశ్రయించిన కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 13 కళాశాలలున్నాయి. వీటిలో మూడు కొత్త కళాశాలలు కూడా ఉన్నాయి. ఈ కొత్త కళాశాలలు, పాత కళాశాలలకు సంబంధించి 1,250 సీట్లకు ఎంసీఐ కోత విధించింది. కళాశాలలను ఎంసీఐ తనిఖీ చేసిన తర్వాత లోటుపాట్లపై ఆయా కళాశాలలకు తెలిపి.. వాటిని పూరించేందుకు కొంత సమయం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిందని, అయితే ఈ విషయంలో ఎంసీఐ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కేవలం ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఎంసీఐ పనిచేసింది తప్ప.. లోటుపాట్లపై సమాచారమివ్వలేదని, కేవలం 4 నుంచి 5 శాతం లోటుపాట్లు ఉన్నా సీట్ల మంజూరుకు అనుమతి నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం నాణ్యమైన విద్యకు చర్యలు తీసుకోవాల్సిందే కదా అని వ్యాఖ్యానించింది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వం ఉన్నత విద్యను అందించే పరిస్థితుల్లో లేదని, ప్రయివేటు సంస్థలు వందల కోట్లు పెట్టి విద్యాసంస్థలు నెలకొల్పితే.. చిన్న చిన్న వసతుల లేమిని చూపి సీట్ల అనుమతిని నిరాకరించడం న్యాయం కాదన్నారు. నాణ్యత లేనివాటిని తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని, ఆ పేరు చెప్పి అందరినీ పక్కనబెట్టడం అన్యాయమని వాదించారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల వారీగా వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఆ మేరకు ఒక్కో కళాశాల తరఫున న్యాయవాదులు విడిగా తమ వాదనలు వినిపించారు. అయినప్పటికీ ధర్మాసనం ఆ సీట్లను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు సంతృప్తిచెందలేదు. కనీసం గత కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న సీట్లనైనా రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చివరగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. ఈ కేసును వచ్చే గురువారానికి వాయిదావేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. -
‘ప్రైవేట్’ ప్రత్యేక ఎంట్రెన్స్ వద్దు: ఆర్.కృష్ణయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ఎంట్రెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ గురువారం బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు నిర్వహించే పరీక్షకు అనుమతి ఇవ్వడమంటే అక్రమాలకు, అవకతవకలకు ద్వారాలను తెరవడమే అవుతుందన్నారు. -
ఏకీకృత ఫీజుపై సర్కారుకు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లకు ఏకీకృత ఫీజు (కామన్ ఫీజు)పై గురువారం ఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్స్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వైద్య కళాశాలల్లో వసతులను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకూ ఫీజులను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు మాత్రం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు ఫీజులు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. వారం రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుని జీవో జారీ చేస్తారు. ఈ ఏడాది నుంచే ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఏకీకృత ఫీజు అమల్లోకి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్లు దక్కుతాయి. ఇకపై కన్వీనర్ కోటా, బీ కేటగిరీ కోటా ఉండవు. ప్రవాస భారతీయ కోటా సీట్లు మాత్రం ఆయా వైద్య కళాశాలలే నేరుగా సీట్లు భర్తీ చేసుకుంటాయి. -
ఒక్క సీటు రెండు కోట్లు!
* ఇది యాజమాన్య కోటా వైద్యవిద్య పీజీ సీట్ల ధర * 646 పోస్టులకు 22 వేల మంది అభ్యర్థుల పోటీ * ప్రవేశ పరీక్షకు రెండు నెలల ముందే బేరసారాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ఉన్న 646 పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) సీట్లు ప్రవేశపరీక్ష నిర్వహించటానికి రెండు నెలల ముందే ‘అమ్ముడు’పోతున్నాయి. ఒక్కో పీజీ సీటు రూ. 2 కోట్లు పలుకుతోందంటే డిమాండు ఎలా ఉందో తెలుస్తోంది. వైద్యవిద్యలో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీటు ధర రూ. కోటి దాటిపోయింది. మార్కెట్లో పీజీ వైద్యులకే తగినంత గుర్తింపు ఉండడంతో.. వైద్యవిద్య పీజీ సీట్ల కోసం ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. కానీ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. * ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైద్యవిద్య పీజీ ప్రవేశపరీక్ష మార్చిలో జరగనుంది. కానీ రెండు నెలల ముందే ప్రైవేటు కాలేజీల్లో పీజీ వైద్య సీట్లకు బేరాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 8 ప్రభుత్వ, 15 ప్రైవేటు రంగ వైద్య కళాశాలల్లో మొత్తం 2,431 పీజీ సీట్లు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది సుమారు 22 వేల మంది పోటీపడే అవకాశముందని అంచనా. * ఇందులో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద 646 పీజీ సీట్లున్నాయి. ఆ సీట్ల కోసం డబ్బున్న అభ్యర్థులు కళాశాలల యాజమాన్యాలతో బేరం మాట్లాడుకుని టోకెన్ అడ్వాన్సులు ఇస్తున్నారు. * వైద్యవిద్య పీజీ కోర్సుల్లో రేడియాలజీ విభాగం సీటును రూ. 1.80 నుంచి రూ. 2 కోట్లకు అమ్ముతున్నట్టు తెలిసింది. ఆర్థోపెడిక్ విభాగానికి కూడా తీవ్ర డిమాండ్ ఉంది. గతేడాది రూ. 1.30 కోట్లు పలికిన సీటు ఈ ఏడాది రూ. 1.50 కోట్లకు చేరింది. * మిగతా సీట్లకు డిమాండ్‌ను బట్టి ధర: ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎండీ జనరల్ మెడిసిన్, ఎండీ పీడియాట్రిక్, ఎండీ అనస్థీషియా సీట్లకు డిమాండ్ ఆధారంగా యాజమాన్యాలు ధరలను నిర్ణయిస్తున్నాయి. * గతేడాది ఎంఎస్ ఆర్థోపెడిక్ యాజమాన్య సీటుకూ ఈ ఏడాదికీ 20% పెంచారని ఒక అ భ్యర్థి తెలిపారు. మరొక అభ్యర్థి అయితే ఇక్కడి రేటు ఎక్కవనుకుని.. కేరళలో అనస్థీషియా సీటు రూ. 90 లక్షలకే కొనుక్కున్నట్లు చెప్పారు. సర్కారు నియంత్రణ లేదు... ఎంబీబీఎస్ యాజమాన్య కోటా విషయంలో ఇటీవల హైకోర్టు ఆదేశాలిస్తూ.. ప్రతిభ ఆధారంగా ఆన్లైన్లో భర్తీ చేపట్టాలని నిర్దేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకూ ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. ఇక పీజీ వైద్యవిద్య యాజమాన్య కోటా సీట్ల విక్రయాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా పోతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తేనే న్యాయం ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. యాజమాన్య కోటా సీట్లకు వేరేగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామనే ప్రతిపాదన ఉంది. కానీ.. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ప్రైవేటు కళాశాలలు సొంతంగా ప్రవేశ పరీక్షలు పెట్టి సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డాయి. తమకు కావాల్సిన అభ్యర్థులకు మార్కులు వేసుకుని డబ్బులు దండుకున్నాయి. - డా.వెంకటేష్, వైద్య విద్య సంచాలకులు (అకడమిక్) -
క్యాపిటేషన్ ఫీజు చట్టవిరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యార్థుల నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధమని, అనైతికమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలా, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కాలేజీల్లో ప్రవేశాలకు నిరాకరించకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రప్రభుత్వానికి సూచించింది. లేకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ విద్యా సంస్థలు కాస్తా.. స్టూడెంట్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్లుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. క్యాపిటేషన్ ఫీజు పేరుతో అనేక సెల్ఫ్ ఫైనాన్స్ విద్యా సంస్థలు ఎంబీబీఎస్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయని, అందువల్ల ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆ సంస్థలు దూరంగా ఉంచుతున్నాయని స్పష్టం చేసింది. క్యాపిటేషన్ ఫీజు వసూలుకు చెందిన ఒక కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, ఏకే సిక్రీలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.