ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఫీజు పెంపుదలను ఉపసంహరించుకోవాలని, కామన్ ఎంట్రన్స్ ద్వారానే ప్రవేశాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఫీజు పెంపుదలను ఉపసంహరించుకోవాలని, కామన్ ఎంట్రన్స్ ద్వారానే ప్రవేశాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలను ఒకే గొడుగు కిందికి తెచ్చి ప్రవేశాలు నిర్వహించడం, మేనేజ్‌మెంట్ కోటా కింద ఫీజు రూ.9 లక్షలు నిర్ణయించడం వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, ఆ వర్సిటీ భూముల్లో గృహాలు నిర్మిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.