సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లకు ఏకీకృత ఫీజు (కామన్ ఫీజు)పై గురువారం ఏఎఫ్‌ఆర్సీ (అడ్మిషన్స్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వైద్య కళాశాలల్లో వసతులను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకూ ఫీజులను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు మాత్రం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు ఫీజులు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
వారం రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుని జీవో జారీ చేస్తారు. ఈ ఏడాది నుంచే ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఏకీకృత ఫీజు అమల్లోకి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్లు దక్కుతాయి. ఇకపై కన్వీనర్ కోటా, బీ కేటగిరీ కోటా ఉండవు. ప్రవాస భారతీయ కోటా సీట్లు మాత్రం ఆయా వైద్య కళాశాలలే నేరుగా సీట్లు భర్తీ చేసుకుంటాయి.
ఏకీకృత ఫీజుపై సర్కారుకు ప్రతిపాదనలు
Published Fri, May 16 2014 12:08 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement