
‘ప్రైవేట్’ ప్రత్యేక ఎంట్రెన్స్ వద్దు: ఆర్.కృష్ణయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ఎంట్రెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ గురువారం బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు నిర్వహించే పరీక్షకు అనుమతి ఇవ్వడమంటే అక్రమాలకు, అవకతవకలకు ద్వారాలను తెరవడమే అవుతుందన్నారు.