
మంత్రి పీఏని... మెడికల్ సీట్ ఇప్పిస్తా !
తాను మంత్రి పీఏనని, ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని రూ. 71 లక్షలు వసూలు చేసి టోకరా ఇచ్చిన ఘటనలో
రూ. 71 లక్షలు తీసుకొని టోకరా
నిందితుడిపై కేసు
బంజారాహిల్స్: తాను మంత్రి పీఏనని, ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని రూ. 71 లక్షలు వసూలు చేసి టోకరా ఇచ్చిన ఘ టనలో నల్లగొండకు చెందిన మేకల రఘురాంరెడ్డి బంజారాహిల్స్‌ఠాణాలో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్‌నెం. 14 నివాసి సయ్యద్ అత్తర్ హుస్సేనీ ఎంబీబీఎస్ సీటు కోసం యత్నిస్తున్నాడు. అతని బంధువు సల్మాన్ వచ్చి తనకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించే వ్యక్తి తెలుసని మేకల రఘురాంరెడ్డిని 2015 ఏప్రిల్‌లో పరిచయం చేశాడు. తాను మంత్రి పీఏ నని, తనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధికారులతో పరిచ యం ఉందని, వారి ద్వారా గతంలో చాలా మందికి మెడికల్ సీట్లు ఇప్పించానని రఘురాంరెడ్డి నమ్మబలికాడు. అత్తర్ హుస్సేనీకి ఎంబీబీఎస్ సీటు ఇప్పించేందుకు రూ. 85 లక్షలకు బేరం కుదర్చుకున్నాడు. మొదటి విడతలో అత్తర్ హుస్సేనీ రూ. 71 లక్షలు రఘరాంరెడ్డికి ఇచ్చాడు. కమీషన్ కింద సల్మాన్, నాగు అనే బ్రోకర్లకు రూ. 6 లక్షలు చెల్లించా డు.
అయితే సీటు మాత్రం రాలేదు. ఇవేళ, రేపు అంటూ తిప్పుకొని..ఇంకో రూ. 14 ల క్షలు ఇస్తే ఎంసీఐలోని అధికారికి ఇచ్చి సీటు ఇప్పిస్తానని మళ్లీ బేరం పెట్టాడు. దీంతో తా ము మోసపోయామని గ్రహించిన బాధితుడు అత్తర్ హుస్సేనీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఘటన లో నల్లగొండ పోలీసులు రఘరాంరెడ్డిని ఇటీవలే అరెస్టు చేశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.