సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ, క్షయ ఆస్పత్రిని వికారాబాద్‌లోని అనంతగిరి టీబీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పీజీ వైద్య సీట్లు కోల్పోకుండా సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బోధనాసుపత్రిగా ఉన్న ఛాతీ ఆస్పత్రిలోని విభాగాలను ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించింది.
వైద్య కళాశాలలకు బోధనాసుపత్రి 10 కిలోమీటర్ల లోపు దూరంలో ఉండాలనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధన. కానీ ఆయా ఆసుపత్రుల నుంచి వికారాబాద్ ఛాతీ ఆసుపత్రికి 60 కి.మీ.ల పైగా దూరం ఉంటుంది. అంటే ఎంసీఐ నిబంధన ప్రకారం తరలింపు వల్ల 10 పీజీ వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సర్కారు పై విధంగా ఆలోచన చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి చె ప్పారు.
పీజీ సీట్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం
Published Thu, Jan 29 2015 12:36 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement