Tuberculosis hospital
-
చెప్పుతో సమాధానమిచ్చినా మారలేదు
కూతురు వయస్సున్న ఓ మహిళా వైద్యురాలిని ఫోన్లో వేధింపులకు గురిచేసినందుకు చెప్పుతో సమాధానం చెప్పారు ఆమె. అయినా సరే ఆ శాఖలో కొందరు సిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు. ఎప్పటిలాగే వెకిలి చేష్టలు చేస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మిన్నకుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని జిల్లా క్షయ నివారణ శాఖ విభాగంలో ఓ మహిళా వైద్యురాలిని లైంగికంగా వేధించడం.. ప్రశ్నించడానికి వచ్చిన ఆమె తల్లిపై దాడికి ప్రయత్నించగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్‌బాబును శనివారం జూనియర్ డాక్టర్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమయ్యింది. ఇంత జరిగినా ఇక్కడున్న కొందరు సిబ్బంది తీరు మారలేదు. మహిళా డాక్టర్‌కు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి, ఆమెకు అండగా నిలవాల్సిన వారే ఒత్తిడి తీసుకొచ్చారు. సోమవారం యధావిధిగా మహిళా డాక్టర్ చిత్తూరులోని క్షయ నివారణ విభాగంలో విధులకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి చేరుకుని బయోమెట్రిక్ హాజరు వేయడానికి వెళ్లగా పరికరం ఉన్న గదికి తాళాలు వేసేశారు. హాజరుపట్టికలో సంతకం చేయడానికి వెళ్లగా ఆ గదిని కూడా మూసేశారు. తాళాలు తీయమని సిబ్బందిని కోరితే.. ‘మేడం ఎందుకు ఆయనతో గొడవ. జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఓ పది రోజులు లీవు పెట్టి వెళ్లిపోండి. ఎవరైనా ఎన్‌క్వైరీకి వస్తే నేనేదో ఫ్రెస్టేషన్లో అలా చేశానని చెప్పండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ మహిళా డాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఘటనపై ఎవరైనా విచారణకు వస్తే అసలు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పమని కూడా బలవంతం చేశారు. తీరా మహిళా డాక్టర్ ఇందుకు అంగీకరించకపోవడంతో సిబ్బంది తాళాలు తీసి బయోమెట్రిక్, హాజరుపట్టికను బయట ఉంచారు. పనిచేసే చోట మహిళా వైద్యురాలిపై వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిలో కనీస పశ్చాత్తాపం లేకపోగా కిందిస్థాయి సిబ్బందికి చెప్పి తనను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆమె తన స్నేహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటన జరిగిన మూడు రోజులవుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దీనిపై ఎలాంటి విచారణకూ ఆదేశించకుండా మిన్నకుండటం విమర్శలకు దారితీస్తోంది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సేవల సమన్వయాధికారిణి డాక్టర్ సరళమ్మ మాత్రం ఏం జరిగిందనే విషయాన్ని మహిళా డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య వృత్తికే కళంకం తెచ్చే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని జిల్లా ప్రభుత్వ వైద్యుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు డాక్టర్ పాల్‌రవికుమార్ ఖండించారు. డాక్టర్ రమేష్‌బాబును సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం చిత్తూరు నగర కార్యదర్శి కె.రమాదేవి డిమాండ్ చేశారు. బాధిత మహిళా డాక్టర్ మాత్రం దీనిపై వెనక్కు తగ్గేది లేదని, తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఉండాలంటే వక్రబుద్ధి ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని తోటి సిబ్బంది వద్ద ఖరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. తాను గతంలో రాజీనామా చేసిన పత్రాన్ని ఆ వైద్యుడు మార్చి రాసుకోవడం, ఫోన్లో తనతో మాట్లాడిన అసభ్య పదాలు, దాడి జరిగిన సమయంలో తీసిన పలు వీడియో క్లిప్పింగులను నేరుగా కలెక్టర్‌కు చూపించడానికి సిద్ధమవుతున్నారు. -
ఛాతీ, టీబీ ఆస్పత్రి తరలింపు అడ్డుకోండి
వాస్తు కారణంతో తరలింపు అన్యాయం హైకోర్టులో నాగం జనార్దన్‌రెడ్డి, జెడ్సన్ వేర్వేరు పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఇందులో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యవిద్య డెరైక్టర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ెప్రజలకు అందుబాటులో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని 75 కిలోమీటర్ల అవతలకు తరలించేందుకు ప్రభుత్వం గతనెల 27న జీవో కూడా జారీ చేసిందని, ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని వారు తెలిపారు. ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో 750 బెడ్లతో టీచింగ్ ఆస్పత్రి, 150 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించారని నాగం తన పిటిషన్లో వివరించారు. అదే సమయంలో ఆస్పత్రిని తరలించాలని యోచించిన అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి వచ్చిన నిరసనతో విరమించుకుందని తెలిపారు. వాస్తు కారణాలతో ఈ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఛాతీ, టీబీ ఆస్పత్రికి వచ్చే రోగులకు గుండె, న్యూరో, కిడ్నీ తదితర విభాగాల్లో వైద్య నిపుణుల అవసరం కూడా ఉంటుందని, దీన్ని తరలిస్తే రోగులు ఇబ్బంది పడతారని జెడ్సన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ అలా చెప్పడం వెనుక కుట్ర టీబీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండొద్దని, మారు మూల ప్రాంతంలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పడం వెనుక కుట్ర ఉందని నాగం ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేద రోగులపై వైఎస్‌కు ఉన్న ప్రేమ కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. -
పీజీ సీట్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ, క్షయ ఆస్పత్రిని వికారాబాద్‌లోని అనంతగిరి టీబీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పీజీ వైద్య సీట్లు కోల్పోకుండా సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బోధనాసుపత్రిగా ఉన్న ఛాతీ ఆస్పత్రిలోని విభాగాలను ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించింది. వైద్య కళాశాలలకు బోధనాసుపత్రి 10 కిలోమీటర్ల లోపు దూరంలో ఉండాలనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధన. కానీ ఆయా ఆసుపత్రుల నుంచి వికారాబాద్ ఛాతీ ఆసుపత్రికి 60 కి.మీ.ల పైగా దూరం ఉంటుంది. అంటే ఎంసీఐ నిబంధన ప్రకారం తరలింపు వల్ల 10 పీజీ వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సర్కారు పై విధంగా ఆలోచన చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి చె ప్పారు. -
అనంతగిరికి చెస్ట్ ఆస్పత్రి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం) త్వరలో కనుమరుగు కానుంది. ఈ అటవీ క్షేత్రంలో సంజీవని మొక్కలు ఉన్నాయని, వాటి గాలి క్షయ నివారణకు ఔషధంగా పనిచేస్తుందని భావించిన నాటి నిజాం.. 46 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ క్షయ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కాలగమనంలో ఈ వైద్యశాలను గాలికి వదిలివేయడంతో పేషెంట్ల సంఖ్య తగ్గిపోయింది. పదిలోపు రోగులుంటే.. 200 మంది పైచిలుకు వైద్యులుండడంతో ఈ ఆస్పత్రి నిర్వహణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఈ క్రమంలోనే టీబీ శానిటోరియంను ఎత్తివేసి.. దాని స్థానే మానసిక రోగుల చికిత్సాలయం, చాతి వైద్యశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న వీటిని ఇక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలుకు ఒకట్రెండు రోజుల్లో మోక్షం కలుగుతుందని, వారంరోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రులను పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతగిరిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరుస్తామని, ఉద్యాన లేదా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు వాటి స్థానే పిచ్చాస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి తెరమీదకు రావడంతో స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గతంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడే చాతి వైద్యశాల, మానసిక వికలాంగుల చికిత్సాలయం తరలింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే వ్యతిరేకత వచ్చినప్పటికీ, అధికారపార్టీ ప్రతినిధులు తిప్పికొట్టారు. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి రావడం టీఆర్ఎస్ నాయకులను ఆత్మరక్షణలో పడేస్తోంది. నగరానికి సమీపంలో మంచి పర్యావరణం, ప్రముఖ అనంతపద్మనాభస్వామి దేవాలయం కొలువుదీరిన అనంతగిరిని టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేయకుండా ఆస్పత్రులతో నింపేయడమేమిటనే వాదన వినిపిస్తోంది. అయితే, టీబీ శానిటోరియంను ఎత్తివేసే ఆలోచన ప్రతిపాదనలేదని, కొత్తగా వచ్చే ఆస్పత్రుల్లో వీటిని విలీనం చేసి.. ప్రస్తుత వైద్యసిబ్బంది సేవలను వినియోగించుకుంటారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
టీబీ ఆస్పత్రికి సుస్తీ!
నెలల తరబడి అంధకారంలోనే రోగుల పరిస్థితి దయనీయం భయం గుప్పిట్లో సిబ్బంది, రోగులు మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : టీబీ ఆస్పత్రిలో చేరితే వ్యాధి నయమవుతుందని నమ్మి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రత్యక్ష న రకాన్ని తలపిస్తుంది. ఈ కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు నరకయూతన అనుభవిస్తున్నారు. జిల్లా కేంద్రాని కి సమీపంలోని అప్పన్నపల్లి అటవీ ప్రాం తంలో ఏర్పాటు చేసిన టీబీ ఆస్పత్రిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సమాజం నుంచి వెలిసినట్లుగా దూరంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి పై పర్యవేక్షణ కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో నెలల తరబడి లైట్లు వెలగక రోగులు అంధకారంలో మగ్గుతున్నారు. దీనికితోడు ఆస్పత్రి కనీస సౌకర్యాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో రోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. టీబీ బాదితులకు అందించే భోజనంలో నాణ్యత లోకపోగా, భోజనాన్ని సమయానికి అందించకపోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం పా లు, బ్రెడ్‌తో పాటు మధ్యాహ్నం భోజనం ఒక కోడిగ్రుడ్డును అందించాల్సి ఉన్నా అమ లు కావడం లేదు. కేవలం ఉదయం, మధ్యాహ్నానానికి కలిపి ఒకే సారి ఉదయం 11గంటల సమయంలో పాలు, బ్రెడ్‌తో పా టు అన్నం, నీళ్ళ చారు వడ్డించడం అనవాయితీగా మారింది. భోజనంలో నాణ్యత లేకపోవడం, వేళలు పాటించకపోవడంతో బాధితులకు వ్యాధి తగ్గడం బదులుగా తిరగబెతున్నదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితోడు అడవిలో, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ భయంతో కాలం గడుపుతున్నామన్నారు. అలాగే రోగులకు చికి త్స ఉందించేంతుకు సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో భోజనాన్ని తినలేక రోగులే ఇంటినుంచి తెచ్చుకున్న సరుకులతో స్వ యంగా వండుకుని తింటుండడం విశేషం. ఆస్పత్రిలో కనీసం మంచినీటి వసతి కూడా లేదని స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకులో ఎలుకలు, పాములు చచ్చిపడి ఉంటున్నా ఎవ రూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి ట్యాంకు నాచు పట్టినా శుభ్రంచేసేవారు లేరని తెలిపారు. ఆ తిండి తినలేం...... వారి ఇష్టం వచ్చినట్లు వచ్చి నీళ్ళచారు, అన్నం, పాలు,బ్రెడ్ తీసుకువచ్చి మా మొకాన వేసి వెళతారు. అవన్నీ తినడానికి వీలులేకుండా ఉంటా యి. అసలే ఆకలిబాధతో ఉంటే వాటిని చూడగానే మరింత బాధేస్తోంది. ఇవన్నీ తాళలేక ఇంటి నుంచి ఆహారధాన్యాలు తెచ్చుకుని వంట చేసుకుంటున్నాం. -కుర్మయ్య, రోగి బంధువు, లక్ష్మిపలి,్ల నీళ్లులేవు. కరెంటూ లేదు... నెలల తరబడి ఆస్పత్రికి కరెంటు లేకపోరుునా పట్టించుకునే నాథుడే లేడు. అంధకారంలోనే అడవి,చెట్ల మధ్య కాలం గడుపుతున్నాం. పైగా కనీసం తాగడానికి వీలుకూడా లేకపోవడం విడ్డూరం. ఇలా ఉంటే ఎక్కువ రోజులు బతకడమే కష్టంగా ఉంది. -మణెమ్మ, రోగి బంధువు, వర్నె -
వికారాబాద్‌కు పిచ్చాస్పత్రి!
* హెల్త్‌హబ్‌గా వికారాబాద్ * సీఎం కేసీఆర్ ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా : వికారాబాద్‌ను హెల్త్‌హబ్‌గా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న క్షయ ఆస్పత్రి, పిచ్చాస్పత్రిని అనంతగిరికి తరలించనున్నట్లు చెప్పారు. శనివారం టీఆర్ఎస్ భవన్లో జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డి, పార్టీ నేతలు నాగేందర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రత్నం తదితరులు పాల్గొని సమస్యల్ని వివరించారు.