టీబీ ఆస్పత్రికి సుస్తీ!
నెలల తరబడి అంధకారంలోనే రోగుల పరిస్థితి దయనీయం
భయం గుప్పిట్లో సిబ్బంది, రోగులు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : టీబీ ఆస్పత్రిలో చేరితే వ్యాధి నయమవుతుందని నమ్మి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రత్యక్ష న రకాన్ని తలపిస్తుంది. ఈ కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు నరకయూతన అనుభవిస్తున్నారు. జిల్లా కేంద్రాని కి సమీపంలోని అప్పన్నపల్లి అటవీ ప్రాం తంలో ఏర్పాటు చేసిన టీబీ ఆస్పత్రిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సమాజం నుంచి వెలిసినట్లుగా దూరంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి పై పర్యవేక్షణ కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో నెలల తరబడి లైట్లు వెలగక రోగులు అంధకారంలో మగ్గుతున్నారు. దీనికితోడు ఆస్పత్రి కనీస సౌకర్యాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో రోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. టీబీ బాదితులకు అందించే భోజనంలో నాణ్యత లోకపోగా, భోజనాన్ని సమయానికి అందించకపోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం పా లు, బ్రెడ్‌తో పాటు మధ్యాహ్నం భోజనం ఒక కోడిగ్రుడ్డును అందించాల్సి ఉన్నా అమ లు కావడం లేదు.
కేవలం ఉదయం, మధ్యాహ్నానానికి కలిపి ఒకే సారి ఉదయం 11గంటల సమయంలో పాలు, బ్రెడ్‌తో పా టు అన్నం, నీళ్ళ చారు వడ్డించడం అనవాయితీగా మారింది. భోజనంలో నాణ్యత లేకపోవడం, వేళలు పాటించకపోవడంతో బాధితులకు వ్యాధి తగ్గడం బదులుగా తిరగబెతున్నదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితోడు అడవిలో, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ భయంతో కాలం గడుపుతున్నామన్నారు. అలాగే రోగులకు చికి త్స ఉందించేంతుకు సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో భోజనాన్ని తినలేక రోగులే ఇంటినుంచి తెచ్చుకున్న సరుకులతో స్వ యంగా వండుకుని తింటుండడం విశేషం. ఆస్పత్రిలో కనీసం మంచినీటి వసతి కూడా లేదని స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకులో ఎలుకలు, పాములు చచ్చిపడి ఉంటున్నా ఎవ రూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి ట్యాంకు నాచు పట్టినా శుభ్రంచేసేవారు లేరని తెలిపారు.
ఆ తిండి తినలేం......
వారి ఇష్టం వచ్చినట్లు వచ్చి నీళ్ళచారు, అన్నం, పాలు,బ్రెడ్ తీసుకువచ్చి మా మొకాన వేసి వెళతారు. అవన్నీ తినడానికి వీలులేకుండా ఉంటా యి. అసలే ఆకలిబాధతో ఉంటే వాటిని చూడగానే మరింత బాధేస్తోంది. ఇవన్నీ తాళలేక ఇంటి నుంచి ఆహారధాన్యాలు తెచ్చుకుని వంట చేసుకుంటున్నాం. -కుర్మయ్య,
రోగి బంధువు, లక్ష్మిపలి,్ల
నీళ్లులేవు. కరెంటూ లేదు...
నెలల తరబడి ఆస్పత్రికి కరెంటు లేకపోరుునా పట్టించుకునే నాథుడే లేడు. అంధకారంలోనే అడవి,చెట్ల మధ్య కాలం గడుపుతున్నాం. పైగా కనీసం తాగడానికి వీలుకూడా లేకపోవడం విడ్డూరం. ఇలా ఉంటే ఎక్కువ రోజులు బతకడమే కష్టంగా ఉంది.
-మణెమ్మ, రోగి బంధువు, వర్నె