కోల్‌కతా: పేషెంట్‌ కుమారుడిపై దాడి.. భద్రతపై జూడాల ఆందోళన | Patients son beaten up SSKM Hospital In Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతా: పేషెంట్‌ కుమారుడిపై దాడి.. భద్రతపై జూడాల ఆందోళన

Published Sun, Oct 13 2024 5:36 PM | Last Updated on Sun, Oct 13 2024 5:36 PM

Patients son beaten up SSKM Hospital In Kolkata

కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం హాస్పిటల్‌లోని ఓ రోగి కుమారుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆస్పత్రిలోకి చొరబడి ఒక రోగి బంధువుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా, డాక్టర్ల భద్రతా చర్యల గురించి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న వేళ ఈ  ఘటన చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

‘‘ఉదయం 8 గంటల సమయంలో 10-15 మంది వ్యక్తులు మోటారుబైక్‌లపై వచ్చి  ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్‌కు చొరబడి, ఈ రోజు డిశ్చార్జ్‌ కావాల్సిన బంకురాకు చెందిన రోగి కుమారుడు సౌరవ్ మోదక్‌పై దాడి చేశారు. మోదక్‌కు తీవ్రగాయాలవడంతో  అనంతరం దుండగులు  అక్కడి నుంచి పారిపోయారు’’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

జూనియర్‌ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో.. ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేశామనే సీఎం మమమతా ప్రభుత్వ భరోసాపై ఈ దాడి ఘటన తీవ్ర అనుమానాలకు తావిస్తోందని జూనియర్‌ డాక్టర్లు అంటున్నారు. ఆసుపత్రి భద్రతా వ్యవస్థ వైఫల్యానికి ఈ ఘటన స్పష్టమైన ఉదాహరణ అని ఓ జూనియర్ డాక్టర్ అన్నారు. ఎస్‌ఎస్‌కేఎం వంటి పెద్ద ఆసుపత్రిలో ఇటువంటి దాడి సంఘటన జరిగితే.. భద్రతను కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపారు.

ఇక.. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ట్రామా కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై జూనియర్‌ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement