కోల్‌కతా ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ.. ఓవైపు వైద్యులు, విద్యార్ధులు తీవ్ర నిరనసలువ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఘటన జరిగిన ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజాగా దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పోలీసులే తమను తాము రక్షించుకోలేకపోతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు నిర్భయంగా ఎలా విధులు నిర్వర్తించగలగరని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది.
ఒకవేళ రాష్ట్ర పోలీసులు వైద్యులకు రక్షణ కల్పించలేకపోతే అవసరమైతే ఆసుపత్రిని మూసివేసి.. అక్కడి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే పోలీసులను మందలించింది.
‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. కానీ ఇంత గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు చుట్టుముట్టలేదు. ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 7000 మంది ప్రజలు నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం కదా? అంటూ మండిపడింది. ఇలాంటి సంఘటనలు వైద్యులు, వైద్య సిబ్బంది నైతికత, విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయి
ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. హింసకు భయపడకుండా వైద్యులు, ఇతర సిబ్బంది తమ విధులను నిర్వహించే వాతావరణాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
అదే విధంగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను వివరంగా సీబీకి తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆసుపత్రిపై దుండగుల దాడి ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తమ కేసు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను దాఖలు చేయాలని సీబీఐను కోర్టు కోరింది.
అయితే దుండగుల దాడిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన గదిలో సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించిన నేపథ్యంలో క్రైమ్‌సీన్ చెక్కుచెదరకుండా ఉందని నిరూపించే ఫొటోలను చూపించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..? 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం.
ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడిన 19 మందిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ప్రకారం బుధవారం అర్థరాత్రి 40 నుంచి 50 మంది వ్యక్తుల గుంపు ఆసుపత్రి ఆవరణలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment