కోల్‌కతా నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు | Key Suspect In Kolkata Doctor Case Went To Red Light Area, Says Police | Sakshi
Sakshi News home page

ఘటనకు ముందు.. కోల్‌కతా నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు

Aug 21 2024 8:47 AM | Updated on Aug 21 2024 9:15 AM

Key Suspect In Kolkata Doctor Case Went To Red Light Area, Says Police

కోల్‌కతా: కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌ రాయ్‌కు సంబంధించి కోల్‌కతా పోలీసు వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. హత్యాచార ఘటన జరిగిన ఆగస్టు 8 రాత్రి నిందితుడు కోల్‌కతాలోని సోనాగాచి రెడ్‌ లైట్‌ ఏరియాకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు అర్ధరాత్రి ఆర్జీ కర్‌ హాస్పిటల్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. 

హత్యాచారం జరిగిన ఆస్పత్రి సెమినార్‌ హాల్‌లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్ట్‌  చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ అత్త ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్యను తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. తీవ్రంగా కొట్టటంతో మూడు నెలల గర్భిణీ అయిన ఆయన భార్య గర్భస్రావానికి కారణమయ్యాడని ఆరోపణలు చేశారు. సంజయ్‌ మంచివాడు కాదని, చాలా రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన సంజయ్‌ను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. 

మరోవైపు నిందితుడి పెళ్లిళ్ల విషయంలో కూడా చర్చ జరుతుగుతోంది. మరోవైపు..  ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, నిందితుడు సంజయ్ రాయ్, కోల్‌కతా పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అనూప్ దత్తా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement