
కోల్‌కతా: ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అక్తరి బేగం అనే మహిళను ఆమె కుటుంబసభ్యులు గురువారం రాత్రి కమర్‌హతిలోని సాగోర్ దత్తా ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది గంటలలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రిపై దాడికి దిగారు. అత్యవసర వార్డులోని కిటికీలు పగలగొట్టి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment