
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నేపధ్యంలో అక్కడక్కడా విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
దేశ రాజధానిలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో వేదికపై రామలీలను ప్రదర్శిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రావణుని సోదరుడు కుంభకర్ణుని పాత్రను పోషిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.
ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ నివాసి విక్రమ్ తనేజా రామ్‌లీలలో కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నాడు. వేదికపై ఆయన తన పాత్ర పోషిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతనిని పీఎస్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తనేజా మృతి చెందినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి