కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ! | Privatization of new medical colleges | Sakshi
Sakshi News home page

కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ!

Published Thu, Aug 8 2024 9:00 AM | Last Updated on Tue, Aug 13 2024 12:10 PM

Privatization of new medical colleges

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసేలా ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. కేబినెట్‌ భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 

రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్‌ పీపీపీ మోడల్‌’ను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి వివరించారు. ఫేజ్‌–1 కింద నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో (150 సీట్లు) నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలకు గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదించిందన్నారు. ఫేజ్‌–2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెల్లో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తొలి ఏడాది ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించేందుకు మంత్రి మండలి అంగీకరించిందని చెప్పారు. మంత్రి పార్థసారథి వెల్లడించిన మేరకు మంత్రి మండలి నిర్ణయాలు ఇలా ఉన్నాయి.   

ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు 
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు అర్బన్‌ లోకల్‌ బాడీస్‌తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. సంతానోత్పత్తి రేటు, పని చేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం తగదని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది.  

 2014–19తో పోలిస్తే ప్రస్తుత మద్యం పాలసీ లోపభూయిష్టంగా, పారదర్శకత లోపించింది. భవిష్యత్తులో మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానంలోకి తెచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ పునర్‌నిర్మాణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. సెపె్టంబర్‌ 5 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తాం. ఇకపై మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో డిజిటల్‌ లావాదేవీలు ప్రవేశ పెడతాం. 

 గత ప్రభుత్వంలో రూ.22.95 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, క్యూ ఆర్‌ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందిచేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. దీంతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించి 22ఏ నిషేధిత జాబితా భూములపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో గ్రామ సభలు నిర్వహిస్తాం. అప్పటి వరకు 22ఏ నుంచి మినహాయిస్తూ భూములకు ఎటువంటి రిజి్రస్టేషన్లు నిర్వహించం.  

మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం జారీ చేసిన 144, 217 జీవోలను రద్దు చేస్తున్నాం. చేప పిల్లల పెంపకం నుంచి మార్కెటింగ్‌ వరకు దళారీ వ్యవస్థ లేకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం.  

నంద్యాల జిల్లా సున్నిపెంట (శ్రీశైలం ప్రాజెక్టు) గ్రామ పంచాయతీకి 208.74 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం 2023 మే 11న జారీ చేసిన జీవో 40ని రద్దు చేసి, ఆ భూమిని నీటి పారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని పర్యాటకాభివృద్ధి కోసం బదలాయించి టెంపుల్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్డీఎఫ్‌) సంస్థలపై మరో ఏడాది నిషేధాన్ని పొడిగించాం.  

పేదలకు ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యమే లక్ష్యం  
గత ప్రభుత్వంలో ఆ దిశగా వైఎస్‌ జగన్‌ చర్యలు 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచడమే లక్ష్యంగా 17 కొత్త వైద్య కళాశాలలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండేవి. రోజు రోజుకు వైద్య విద్యకు డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా ఉండింది. ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక, తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేర్పించే వారు.

 మధ్య తరగతి కుటుంబాల వారైతే అప్పులు చేసి రష్యా, ఫిలిపైన్స్‌ వంటి దేశాలకు పిల్లలను పంపేవారు. ఈ పరిస్థితులకు చెక్‌ పెట్టేలా కొత్తగా 2,550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేగంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 

ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది నుంచే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్లా ఏపీవీవీపీ (ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థుల అకడమిక్‌ కార్యకలాపాల కోసం లెక్చర్‌ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్‌ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. 

ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం రెండో దశ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా కావాలనే నిర్లక్ష్యం చేసింది. దీనికితోడు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌ పరం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలోనే నడిపి, విద్యార్థులకు జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు, పేదలకు ఉచితంగా> సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడం జగన్‌ విధానం. ఇందుకు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో కళాశాలలను, బోధనాస్పత్రులను పెడితే పేదలకు ఉచిత వైద్య సేవలు కరువయ్యే అవకాశం ఉంది.  

అవసరమైన మేరకు ఉద్యోగుల బదిలీలు
సాక్షి, అమరావతి: వీలైనంత లో ప్రొఫైల్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు దగ్గరకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన వారితో కొద్దిసేపు రాజకీయ అంశాలపై మాట్లాడారు. తమ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ చెబుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. వాళ్లు చేసినట్లు చేయకూడదని పదేపదే చెబుతున్నా, కొందరు వినడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగే చేస్తే ఇబ్బందులు వస్తాయని అన్నట్లు తెలిసింది. ‘ఉద్యోగుల బదిలీలను అవసరమైన మేరకు చేసుకోవాలి. 

నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఏపీ ఎన్నికల్లో వచ్చింది నిశ్శబ్ద విప్లవమైతే.. బంగ్లాదేశ్‌లో వైలెంట్‌ విప్లవం చూశాం. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా జల హారతుల కార్యక్రమాలు నిర్వహిస్తాం. రీ సర్వే వివాదాలు మూడు నెలల్లో పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహిద్దాం. రీ సర్వేకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వాటిని కూడా అధ్యయనం చేయాలి. సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దాం’ అని సీఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement