సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాగా, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాకిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో పీపీపీ పద్దతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మెత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.
ఇక, ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్దతిలో పెట్టాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment