సాక్షి, ముంబై: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా వైద్య సేవలు అందించాల్సిందేనని రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కొత్త నియమాల ప్రకారం ఇక నుంచి ఒక సంవత్సరంపాటు వీరు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ధనంతో చదువుకుని డాక్టర్లైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలనే నియమాలు గతం నుంచి అమలులో ఉన్నాయి. కాని కొందరు ఇష్టం లేని వారు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం జరిమానా చెల్లించి తప్పుకుంటున్నారు.
కేబినెట్‌లో తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి కచ్చితంగా సంవత్సర కాలం పాటు పల్లెటూర్లలో వైద్య సేవలు అందించాల్సిందే. అనేకమంది ధనిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాల్లో చదువుకుని ఎంబీబీఎస్, ఎండీ, ఎం.ఎస్, గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. అందుకయ్యే ఖర్చులు స్వయంగా ప్రభుత్వమే భరిస్తోంది. అందుకుగాను చదు వు పూర్తయిన తర్వాత సంవత్సర కాలంపాటు గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలు అందిస్తామని లేదంటే తగిన జరిమా నా చెల్లిస్తామని ఈ విద్యార్థుల నుంచి హామీ పత్రాన్ని (బాండ్) రాయిం చుకుంటుంది.
కాగా, ఇష్టం లేని కొందరు ప్రభుత్వం నిర్ధేశించిన రూ.10 లక్షల జరిమానాను ప్రభుత్వానికి చెల్లించి పల్లెల్లో పనిచేయకుండా తప్పించుకుంటున్నారు. ఎండీ వంటి పోస్టు గ్రాడ్యుయేట్లు రూ.50 లక్షల వరకు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రూ.కోటికిపైగా జరిమానా చెల్లించి తప్పుకుంటున్నారు. అణగారిన వర్గా ల డాక్టర్లు మొత్తం ఇంత మొత్తం చెల్లించలేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలీస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఫీజు ఎన్నో రెట్లు తక్కువగా ఉంటుంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వెళ్లే వారి సంఖ్య 50 శాతం మాత్రమే ఉంటోంది.
ప్రభుత్వ నిర్నయంపై గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రామీణ వైద్యశాలల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బం ది లేకపోవడంతో పల్లెవాసులకు సరైన వైద్యసదుపాయాలు అందడంలేదు. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు మైళ్లకొద్దీ ప్రయాణించి, పట్టణాల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో సరైన వైద్యం అందక పలువురు ప్రాణా లు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.
పల్లెకుపోవాల్సిందే..
Published Thu, Aug 14 2014 10:56 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement