మీ రాక కోసం
- ఎదురుచూస్తున్న ఇందూరు ప్రజలు
- ముఖ్యమంత్రి తొలి పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యల పరిష్కారంపై ఆశ
- జిల్లాపై వరాల జల్లు కురిసేనా!
- హామీల అమలుకు మాట ఇస్తారా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలి పర్యటన పై జిల్లా ప్రజలలో ఆసక్తి నెలకొంది. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో భారీ మెజార్టీ ఇచ్చిన ఇందూరు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలపై ‘ కేసీఆర్ ఏమంటారో’ అన్న చర్చ జరుగుతోంది. జడ్‌పీ చైర్మన్, నగర మే యర్ సహా మెజార్టీ జడ్‌పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న నేపథ్యంలో గులాబీ దళపతి ఇందూరుపై వరాల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇవేకాకుండా, నిజామాబాద్ బైపాస్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు ఏడేళ్లుగా పెండింగులో ఉన్నాయి.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే ఎర్రజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.10.83 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్న హామీపై రైతులు ఆసక్తితో ఉన్నారు. తమ ప్రభుత్వం రాగానే, లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ఇందూరు నుంచే ప్రకటించా రు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.754 కోట్లు కేటాయించినా, ఆ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ఆసియాలో అతిపెద్దదైన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సందేహాలున్నాయి. కౌలాస్‌నాల సామర్థ్యం పెం చి, ప్రాణహిత, లెండి తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పసుపు, చెరుకు రైతులకు భరోసా ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సందర్భంగా నిజాం షుగర్స్‌కు పూర్వవైభవం తెచ్చి చెరు కు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తద్వారా మెరుగైన వంగడాలు, మద్దతు ధర వచ్చేలా చూస్తామని కేసీఆర్ చెప్పా రు. గల్ఫ్‌బాధితులు, బీడి కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులు, వైద్య సిబ్బంది లేక మెరుగైన అత్యవసర వైద్యసేవలు అందడం లేదు. గత ప్రభుత్వం 838 పోస్టుల భర్తీకి 150 జీవోను విడుదల చేయగా, ఆర్థికశాఖ అనుమతిం చినా నేటికి నియామకాలు లేవు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించి మంజూరు చేసిన తెలంగా ణ యూనివర్సిటీని ఆయన మరణానంత రం వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. కొత్త ప్రభుత్వంలోనైనా తెలంగాణ యూని వర్సిటీకి పూర్థిస్థాయి సదుపాయాలు క ల్పించాలని కోరుతున్నారు. వీటన్నింటితో పాటు ఇటీవల పెరిగిన విద్యుత్ కోతలు, వ్యవసాయం జీవనాధారంగా ఉన్న జిల్లా లో ఈసారి వర్షాలు లేక నెలకొన్న ప్రతి కూల పరిస్థితుల నేపథ్యంలో సీఎంపై ఇం దూరు ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు.