In rural areas
-
వ్యవసాయ కుటుంబాలు వెరీ స్మార్ట్!
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాలతో పోలిస్తే వ్యవసాయ కుటుంబాలకే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లున్నాయని నాబార్డు సర్వే వెల్లడించింది. గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, ఆయా కుటుంబాలకు గల గృహాపకరణాలు, వారి జీవన ప్రమాణాల స్థాయిని తెలియజేసేందుకు నాబార్డు 2021–2022 వ్యవసాయ సంవత్సరంలో సర్వే నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబాల్లో 98.3 శాతం వ్యవసాయ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లుండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 96.8 శాతమే స్మార్ట్ ఫోన్లున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో టెలివిజన్ సౌకర్యం కూడా వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉండటం గమనార్హం. స్కూటర్, మోటార్ సైకిళ్లు కూడా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉన్నాయి. కార్లు మాత్రం వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకు తక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఉన్న గృహోపకరణాలు వారి జీవన శైలిని మార్చేందుకు దోహదపడుతు న్నాయని సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి -
ఎఫ్ఎంసీజీకి ఈ ఏడాది సానుకూలం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కాస్త పుంజుకోవడం ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సానుకూలించనుందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ ఆదాయం 7–9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఎఫ్ఎంసీజీ వినియోగంలో 65 శాతం వాటా కలిగిన పట్టణాల్లో వినియోగం స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెరగొచ్చని తెలిపింది. ముడి సరుకుల ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.5–1 శాతం మేర పెరిగి, కరోనా ముందున్న 20–21 శాతానికి చేరుకుంటాయని పేర్కొంది. ప్రధానంగా ఎడిబుల్ ఆయిల్, కెమికల్స్, ముడి చమురు ఉత్పత్తుల ధరలు తగ్గడం కంపెనీల అధిక మార్కెటింగ్ వ్యయాలకు సర్దుబాటుగా ఉంటుందని తెలిపింది. రూ.5.2 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్లో 35 శాతం వాటా కలిగిన 76 ఎఫ్ఎంసీజీ సంస్థల పనితీరు ఆధారంగా ఈ నివేదికను క్రిసిల్ రేటింగ్స్ రూపొందించింది. అమ్మకాల పరంగా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1–3 శాతం వృద్ధినే చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4–6 శాతం మధ్య ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉండకపోవచ్చన్న అంచనాల ఆధారంగానే ఈ విశ్లేషణకు వచి్చనట్టు చెప్పారు. సానుకూలం.. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు క్షీణతను చూడగా, 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లోనే సానుకూల వృద్ధి నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో వినియోగ డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. కీలక పంటలకు కనీస మద్దతు ధర పెంచడాన్ని కూడా ప్రస్తావించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పట్టణ వినియోగం రెండంకెల వృద్ధిని చూడగా, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం వల్ల ఈ వృద్ధి ఇక ముందూ కొనసాగొచ్చని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్: మారికో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో డిమండ్ ధోరణులు స్థిరంగా ఉన్నట్టు మారికో సైతం ప్రకటించింది. అయితే జూన్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అనుకున్నంతగా లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం శాంతించినందున ఈ ఏడాది మిగిలిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూన్ త్రైమాసికానికి సంబంధించి పనితీరుపై ప్రకటన విడుదల చేసింది. గడిచిన త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణ వర్షపాత అంచనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడం, ద్రవ్యోల్బణం దిగిరావడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను క్రమంగా పెంచుతుందన్న ఆశలు కలి్పస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో దేశీయ అమ్మకాల్లో సింగిల్ డిజిట్ వృద్ధి కనిపించినట్టు ప్రకటించింది. సఫోలా వంట నూనెల నిల్వలను గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో పరంగా చానల్ ఇన్వెంటరీలో మార్పులు కూడా చేసినట్టు తెలిపింది. వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పెరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం గరిష్టంగా ఒక అంకె స్థాయిలో (7–8 శాతం) పెరిగినట్టు తెలిపింది. బ్రాండ్ల బలోపేతం, నూతన ఉత్పత్తులపై ప్రచారం కోసం అధికంగా ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. -
పల్లెల్లో జోరు... పట్టణాల్లో బేజారు!
సాక్షి, హైదరాబాద్: ఓటు వేసినా ప్రయోజనం లేదనే భావనలో ఉన్నారో, వరుస సెలవులని ఎంజాయ్ చేశారోగానీ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఓటర్లు ఈసారి పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఓ మోస్తరు పట్టణాలు, కొత్త జిల్లా కేంద్రాలు, కొన్ని మండలాలు కలిసి ఉన్న పట్టణ నియోజకవర్గాల్లో 70 శాతానికి మించి ఎక్కడా పోలింగ్ జరగకపోవడం శుక్రవారం జరిగిన పోలింగ్ సరళి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో గ్రామీణ ఓటర్లు మాత్రం పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూలు కట్టి మరీ ఓట్లేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 గ్రామీణ నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అత్యధికంగా 83 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో జరగడం గమనార్హం. అధిక పోలింగ్ నియోజకవర్గాలివే... 70 శాతానికిపైగా పోలైన నియోజకవర్గాల్లో సిర్పూర్, ఆసిఫాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, చేవె ళ్ల, షాద్‌నగర్, దేవరకద్ర, మక్తల్, ఆలంపూర్, హుజూర్నగర్, తుంగతుర్తి, వైరా, భద్రాచలం, భూపాలపల్లి, పరకాల, అశ్వారావుపేట, ములుగు, ఆలేరు, వికారాబాద్, దుబ్బాక లాంటి గ్రామీణ ప్రాంతాలుండడం గమనార్హం. కొమురంభీం, సిద్దిపేట జిల్లాల్లో 78 శాతం పైగా ఓటింగ్ జరిగింది. హైదరాబాద్‌లో గడప దాటని ఓటర్ ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2014లో తెలంగాణలో 69.5 శాతం ఓటింగ్ జరగ్గా, ఈసారి 67 శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ కేవలం 50.86 శాతం ఓటింగ్ జరగడం గమనార్హం. కంటోన్మెంట్, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, చార్మినార్, నాంపల్లి నియోజకవర్గాల్లో 50 శాతంకన్నా తక్కువగా పోలింగ్ జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోనైతే కేవలం 44.02 శాతమే నమోదైంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ తక్కువగానే నమోదైంది. శుక్రవారం నుంచి మూడు రోజులు వరుస సెలవులు రావడంతో నగరంలోని అనేకమంది ప్రయాణాలు పెట్టుకున్నారు. అటు పట్టణ ప్రజలకు సంబంధించి పెద్దగా ఎన్నికల వాగ్దానాలు లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. గ్రామాల్లోనైతే పథకాలతో లబ్ది పొందడంతోపాటు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు కూడా గ్రామీణ ప్రజలను ఉద్దేశించినవే ఎక్కువ కావడంతో పల్లెల్లో ఓటింగ్‌పై ఆసక్తి కనబరిచారు. ఫలితాలు తారుమారవుతాయా? గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పోలింగ్‌పై ఆసక్తి చూపడం, పట్టణ ఓటర్లు పెద్దగా స్పందించకపోవడం ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజల్లో సానుకూలత ఉందని, పట్టణ ప్రాంతాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పోలింగ్‌లో గ్రామీణ ఓటర్లే ఎక్కువగా పాల్గొనడంతో అధికార పార్టీకి మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఓటరు స్పందించకపోవడం, గత ఎన్నికలకన్నా పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోవడం లాంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది. -
150 లీటర్ల నాటు సారా పట్టివేత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో నాటు సారా విచ్చల విడిగా తయారవుతోంది. తాజాగా జిల్లాలోని చెన్నూరు మండలంలోని గ్రామాల్లో నాటు తయారీ జోరుగా కొనసాగుతోంది. మండలం చింతపల్లి గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు గురువారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్సీ ఆధ్వర్యంలో సారా స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో 150 లీటర్ల నాటుసారాను, 800 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. -
30 లీటర్ల సారా పట్టివేత
విజయనగరం: విజయనగరం జిల్లాలోని పలు మండలాల్లో నాటు సారా విచ్చల విడిగా తయారవుతోంది. తాజాగా గుర్ల మండలంలోని దేవుని కనపాక, ఫకీర్త్తలి గ్రామాల్లో సారా తయారీ జోరుగా కొనసాగుతోంది. దీంతో సమాచారం అందుకున్న నెల్లిమర్ల ఎక్సైజ్ అధికారులు సారా కేంద్రాలపై బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 30 లీటర్ల నాటు సారాను, సుమారు 1000 లీటర్ల వరకు సారా తయారికి వినియోగించే బెల్లం పానకాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (గుర్ల) -
గ్రామీణ ప్రాంతాలకూ గుర్రపందాలు!
బెట్టింగ్ కేంద్రాలను స్థాపించే యోజనలో ‘బీటీసీ’ ఇప్పటి వరకూ బెంగళూరుకు మాత్రమే పరిమితమైన గుర్రపందేలు ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనున్నాయి! ఈ మేరకు బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ) రూపొందించిన నివేదికకు ప్రభుత్వం నుంచి అమనుమతి లభించనుంది. బెంగళూరు నడి బొడ్డున ఉన్న బీటీసీలో జరిగే గుర్రపు పందేలకు ప్రభుత్వ అనుమతి ఉంది. ఇక్కడకు చాలా మంది వచ్చి పందెం కాస్తుంటారు. కోట్లాది రుపాయలు చేతులు మారడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో రాబడి కూడా భారీగానే ఉంటోంది. అయితే ఈ బీటీసీ తమ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది. - సాక్షి, బెంగళూరు తొలుత ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ గుర్రపు పందేలను తొలుత బళ్లారి, దావణగెరె, బెళగావిలో ప్రా రంభించనున్నట్లు సమాచారం. వీటిలో బెంగళూరులో గుర్రపు పందేలు జరిగే సమయంలో వాటిని టీవీ, ఇంటర్నెట్ తదితర మాద్యమాల ద్వారా ఈ కేంద్రాల్లో ప్రసారం చేస్తారు. ఈ కేం ద్రాల్లో బెట్టింగ్ జరపడానికి అవకాశం ఉంటుంది. అంటే నూతనంగా ప్రారంభించబోయే కేంద్రాల్లో ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం బెట్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదట మూడు కేంద్రాల్లో ప్రయోగాత్మంగా ఈ విధానాన్ని ప్రారంభించి అటుపై రాష్ట్రమంతటా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీటీసీ రూపొందించిన నివేదిక ఆర్థికశాఖకు చేరింది. అనుమతిపై అనుమానాలు బెంగళూరు టర్ఫ్ క్లబ్లో మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రభావంతమైన పోస్టుల్లో ఉండటం వల్ల ఁబీటీసీ* ప్రతిపాదికకు అనుమతి లభిస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గుర్రపుపందేల సంస్కృతి గ్రామీణ ప్రాంతాలు విస్తరించడం వల్ల అక్కడి ప్రజల ఆర్థిక విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. జూదాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ దానిని అరికట్టాలని గవర్నర్‌ను కోరుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని కూడా లేవదీసింది. ఈ నేపథ్యంలోనే క్లబ్ సభ్యుడు ఒకరు ఁసాక్షి*తో మాట్లాడుతూ... ‘బెళగావి, దావణగెరె, బళ్లారిలలో కేంద్రాల స్థాపనకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయం వాస్తవమే. త్వరలోనే అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
గ్రామదీపికల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సంక్షేమ విభాగం : గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతంతో పాటు నిరుపేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నిరంతరం కృషి చేస్తున్న గ్రామదీపికల సమస్యలను పరిష్కరించాలని గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్‌కుమార్, జిల్లా ఛైర్మన్ పోలెపొంగు ఆంజనేయులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న గ్రామదీపికల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంపత్‌కుమార్ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇందుకు మద్దతుగా వివిధ మండలాల నుంచి గ్రామదీపికలు తరలొచ్చారు. దీక్ష శిబిరం వద్ద సంపత్, ఆంజనేయులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఆవిర్భావం నుంచి ఐకేపీలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామదీపికల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి వీరి పొట్టగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చేసిన హామీలకు అనుగుణంగా కనీస వేతనం రూ.5వేలు చెల్లించాలని కోరారు. అదేవిధంగా 20నెలల పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామదీపికలకు బీమా సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపతే దశలవారీగా ఆందోళన చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామదీపికలకు గ్రామీణ ఉద్యోగుల సంఘం అన్నివిధాలుగా అండగా ఉంటందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.సీతారాములు, కోశాధికారి జ్యోతి, మహిళా కన్వీనర్ అనురాధ, సత్తుపల్లి ఏరియా బాధ్యుడు విక్టర్‌పాల్, జనార్దన్, జంపాల విష్ణువర్ధన్, కామేపల్లి ఏరియా బాధ్యుడు సోందుసాహెబ్, మధిర ఏరియా బాధ్యుడు కృష్ణయ్య, ముదిగొండ ఏరియా బాధ్యుడు అజయ్‌బాబు, రామారావు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి రామయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖాజామియా, గ్రామదీపికల నాయకులు వెంకటరామమ్మ, నాగమణి, రామకృష్ణ, సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకు విద్యుత్ వెలుగులు
రూ. 43వేల కోట్లతో ‘దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో కొత్త పథకం రూ. 32,612కోట్లతో పట్టణాల్లో ప్రసార, పంపిణీల పటిష్టతకు పథకం విద్యుత్, రైల్వే, పర్యాటక రంగాల్లో సార్క్ దేశాలతో 3 ఒప్పందాలకు ఓకే ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ మెరుగుదలకు రూ. 5,200కోట్లు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం రూపొందించిన గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని కేంద్రం ఆమోదించింది. రూ 43,033 కోట్లతో రూపొందించిన దీనదయాళ్ ఉపాద్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై)కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో ఈ కొత్తపథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్ట పరుస్తారు. విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, ఫీడర్లకు మీటరింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇక పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థల పటిష్టతకు రూ. 32,612కోట్లతో రూపొందించిన సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం (ఐపీడీఎస్) కూడా గురువారం కేంద్రమంత్రివర్గ ఆమోదం పొందింది. వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. డీడీయూజీజేవై పథకం కింద వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ సరఫరా కోసం విడివిడిగా విభాగాలు ఏర్పాటుచేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర వినియోగదారులకు సక్రమంగా విద్యుత్ సరఫరాకోసం విడివిడిగా ఫీడర్లను ఏర్పాటుచేస్తారని మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ సరఫరాకోసం మొత్తంగా ఈ పథకానికి రూ. 43,033కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో రూ. 33,453కోట్లు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. ఇక గత ప్రభుత్వ కాలంనుంచి ఇప్పటివరకూ అమలులో ఉన్న ఆర్‌జీజీవీవై పథకంకింద మిగిలిన పనులు పూర్తిచేయడానికి 2022వరకూ రూ. 39,275 కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమో దం తెలిపింది. ఇందులో రూ. 35,447కోట్లను బడ్జెటరీ కేటాయింపుల ద్వారా అందిస్తారు. ► డీడీయూజీజేవై పథకం ద్వారా గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుదల, రద్దీసమయాల్లో విద్యుత్ వినియోగంపై ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలుంటాయని భావిస్తున్నారు. ► ఈ పథకం కింద ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ తక్షణం మొదలవుతుంది. మంజూరు పూర్తికాగానే, ప్రాజెక్టుల అమలుకు ఆయా రాష్ట్రప్రభుత్వాల పంపిణీ సంస్థలు, విద్యుత్ శాఖలు ఆమోదం తెలుపుతాయి. ఆమోదించిన నాటినుంచి 24నెలల్లోగా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. ► ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుదలకు రూ. 5,200కోట్లతో ఒక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రపంచ బ్యాంక్ రుణాలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ కేటాయింపులతో 50:50 నిష్పత్తితో ఈ పనులు చేపడతారు. సార్క్ దేశాలతో మూడు ఒప్పందాలు దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం నేపాల్ వెళ్లనున్న నేపథ్యంలో సార్క్ సభ్యదేశాలతో విద్యుత్, పర్యాటక, రైల్వే రంగాల్లో ప్రభుత్వం కుదుర్చుకోనున్న మూడు కీలక ఒప్పందాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైలు, రోడ్డు మార్గాల అనుసంధానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు, ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. -
‘జన్ ధన్’లో 74 శాతం అకౌంట్లు జీరో బ్యాలెన్స్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద నవంబర్ 7వ తేదీ నాటికి 7.1 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ అకౌంట్లను మొత్తంగా చూస్తే దాదాపు రూ.5,400 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే వేర్వేరుగా అకౌంట్లను చూస్తే 74 శాతం (దాదాపు 5.3 కోట్లు) జీరో బ్యాలెన్స్‌తోనే ఉన్నాయి. సామాజిక కార్యకర్త సుభాష్ అగర్వాల్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన ఒక పిటిషన్‌కు సమాధానంగా ఆర్థిక సేవల శాఖ ఈ వివరాలను అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 4.2 కోట్లకుపైగా అకౌంట్లు ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 2.9 కోట్లు. 1.2 కోట్ల అకౌంట్లతో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (38 లక్షలు), కెనరాబ్యాంక్ (37 లక్షలు) ఉన్నాయి. అకౌంట్ ప్రారంభం వల్ల పలు ప్రయోజనాలతోపాటు, 6 నెలలు సంతృప్తికరంగా అకౌంట్ నిర్వహిస్తే రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొంత కారు కల గ్రామీణ ప్రాంత వాసుల్లోనూ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కార్ల కంపెనీలు పల్లెబాట పట్టాయి. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు గ్రామాలకు సమీపంలోని చిన్న పట్టణాల్లో చిన్నచిన్న షోరూంలను తెరుస్తున్నాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోపు సైతం ఔట్లెట్లను ప్రారంభిస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ ఇలా ఒకదాని వెంట ఒకటి పల్లెకు పోదాం చలో చలో అంటున్నాయి. అంతేకాదు కంపెనీలు పెద్ద పెద్ద లక్ష్యాలనే విధించుకున్నాయి. లగ్జరీ కార్లకేం తక్కువ. ఈ కార్లూ పల్లె రోడ్లపై హుందా ఒలకబోస్తున్నాయి. గ్రామీణ భారతం వాటా కంపెనీని బట్టి 32% దాకా ఉందంటే పల్లెల్లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ పల్లె బాట పట్టక తప్పదేమో. ఊహించనంతగా.. కంపెనీలు ఊహించని స్థాయిలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల అమ్మకాలు నమోదవుతున్నాయి. మారుతి సుజుకి మొత్తం విక్రయాల్లో 2007-08 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంత అమ్మకాల వాటా 4 శాతం మాత్రమే. ప్రస్తుతమిది 32 శాతానికి ఎగబాకింది. 2013-14లో హ్యుందాయ్‌కి గ్రామీణ భారతం నుంచి 10 శాతం అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా 15 శాతానికి చేరవచ్చని అంచనా వేస్తోంది. గ్రామీణ, ఉప పట్టణ మార్కెట్లలో ప్రయాణికుల రవాణా వాహనాలు పుంజుకుంటున్నాయన్న సంకేతాలు ఉన్నాయని దేశీ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ సీఎఫ్‌వో రామకృష్ణన్ ఇటీవల వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు 30 శాతం వృద్ధి కనబరుస్తున్నాయని ఆటోమొబైల్ కంపెనీలు అంటున్నాయి. మెట్రోయేతర ప్రాంతాల వాటా తమకు 15% పైగా ఉందని లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో చెబుతోంది. అంటే ఖరీదైన కార్లకూ పల్లెల్లో కొనుగోలుదారులు ఉన్నారన్న మాటే. కాగా, ప్రయాణికుల రవాణా వాహనాల్లో రూ.4 లక్షల లోపు ఖరీదున్న చిన్న కార్ల వాటా 35-40% దాకా ఉంటుందని అంచనా. మారుతి సుజుకి హవా.. పల్లెల్లో మారుతి సుజుకి హవా నడుస్తోంది. భవిష్యత్‌ను నడిపించేది గ్రామీణ మార్కెట్లేనని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ అంటున్నారు. 2013-14లో గ్రామీణ మార్కెట్ల అమ్మకాల్లో 16 శాతం వృద్ధి మారుతి కనబర్చింది. రెండేళ్ల క్రితం 44 వేల గ్రామాల నుంచి కంపెనీకి కస్టమర్లుంటే, ప్రస్తుతమీ సంఖ్య 94 వేలకు చేరువలో ఉంది. ఈ సంఖ్యను 2014-15లో 2 లక్షల గ్రామాలకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యం. దేశవ్యాప్తంగా 6.5 లక్షల గ్రామాలున్న సంగతి తెలిసిందే. మారుతి సుజుకి తెలంగాణలో జనగామ, నిర్మల్, కొత్తగూడెం, జగిత్యాల, ఆంధ్రప్రదేశ్‌లో జగ్గయ్యపేట, జంగారెడ్డిగూడెం, కావలి, నూజివీడు తదితర కేంద్రాల్లో షోరూంలను నిర్వహిస్తోంది. 10 చిన్న షోరూంలను ప్రారంభించేందుకు మారుతి సుజుకీకి దరఖాస్తు చేసుకున్నామని ప్రముఖ డీలర్ వరుణ్ మోటార్స్ డెరైక్టర్ వరుణ్‌దేవ్ తెలిపారు. ఇప్పటికే 5 షోరూంలను తెరిచామన్నారు. పల్లెటూర్లలో అమ్మకాలకు మంచి భవిష్యత్ ఉందని హ్యుందాయ్ ఎర్ఎస్ఎం తేజ అడుసుమల్లి చౌదరి పేర్కొన్నారు. అన్ని కంపెనీలు పల్లెబాట పట్టాల్సిందేనని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో జగిత్యాల, గోదావరిఖని, మహబూబాబాద్, తుని, మండపేట, అమలాపురం తదితర పట్టణాల్లో హ్యుందాయ్‌కి రీజినల్ సేల్స్ ఔట్‌లెట్లున్నాయి. -
జోరుగా సారా తయారీ
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో నాటు సారా తయారీ జోరుగా సాగుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు మొక్కుబడిగా మారడంతో సారా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మంచాల మండలం నాటు సారా తయారీ, విక్రయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాకుండా మండలం సరిహద్దులోని నారాయణపూరం, యాచారం, మర్రిగూడెం మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న గిరిజన తండాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. మండలంలోని పటేల్ చెర్వు తండా, బుగ్గ తండా, ఎల్లమ్మ తండా, ఆంబోత్ తండా, సత్తితండా, సల్లిగుట్ట తండా, దాద్‌పల్లి తండా, వెంకటేశ్వర తండా, నారాయణపూరం మండలంలోని రాచ కొండ తండా, కడీలబావి తండా, దుబ ్బగడ్డ తండాల నుంచి సారాను మండలంతోపాటు ఇబ్రహీంపట్నం, నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళ్లల్లో ఆర్టీసీ బస్సుల్లోనే ఈ సారాను తరలిస్తుండటం గమనార్హం. సమీప ప్రాంతాల్లోకి మాత్రం స్కూటర్లు, బైక్‌ల ద్వారా సారా రవాణా కొనసాగుతోంది. ఆరుట్లలో ముడిసరుకులు సారా తయారీకి వినియోగించే ముడిసరుకులకు ఆరుట్ల అడ్డాగా మారింది. ఇక్కడ కొందరు వ్యాపారులు సారా తయారీకి కావాల్సిన ముడి సరుకులను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో లారీల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి నల్ల బెల్లం, పట్టిక వంటి సరుకులను తీసుకొచ్చి ఈ గ్రామంలో నిల్వచేస్తున్నారు. ఇక్కడినుంచి ఆయా గ్రామాల వ్యాపారులు లేదా సారా తయారీదారులు ముడిసరుకులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గతంలో పలుమార్లు ఆరుట్లలో అధికారులు దాడులు చేసి సరుకులతోపాటు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు స్తబ్దుగా ఉన్న వ్యాపారులు మళ్లీ తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రాణాలు కబళిస్తున్న సారా మహమ్మారి పచ్చని పల్లెల్లో సారా మహమ్మారి చిచ్చుపెడుతోంది. సారా తాగడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీన్ని పక్కనబెడితే అనేకమంది సారాకు బానిసలుగా మారి ప్రాణాలను తీసుకుంటున్నారు. కేవలం ఆరుట్ల గ్రామంలోనే సారా మహమ్మారి బారినపడి 25 మంది మృతిచెందారు. వీరిలో కొందరు సారా తాగి చనిపోగా మరికొందరు సారా ప్రభావంతో అస్వస్థతకు గురై మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. జాపాల కూడా మూడేళ్ల వ్యవధిలో పదిమందిని సారా పొట్టనపెట్టుకుంది. మండలంలో ఈస్థాయిలో సారా తయారీ కొనసాగుతున్న అధికారులు మిన్నకుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు నిద్రపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ తుక్యా నాయక్‌ను మాట్లాడుతూ.. సారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దాడులు మరిం త ముమ్మరం చేసి సారా తయారీని అడ్డుకుంటామన్నారు. -
పల్లెకుపోవాల్సిందే..
సాక్షి, ముంబై: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా వైద్య సేవలు అందించాల్సిందేనని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కొత్త నియమాల ప్రకారం ఇక నుంచి ఒక సంవత్సరంపాటు వీరు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ధనంతో చదువుకుని డాక్టర్లైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలనే నియమాలు గతం నుంచి అమలులో ఉన్నాయి. కాని కొందరు ఇష్టం లేని వారు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం జరిమానా చెల్లించి తప్పుకుంటున్నారు. కేబినెట్లో తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి కచ్చితంగా సంవత్సర కాలం పాటు పల్లెటూర్లలో వైద్య సేవలు అందించాల్సిందే. అనేకమంది ధనిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాల్లో చదువుకుని ఎంబీబీఎస్, ఎండీ, ఎం.ఎస్, గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. అందుకయ్యే ఖర్చులు స్వయంగా ప్రభుత్వమే భరిస్తోంది. అందుకుగాను చదు వు పూర్తయిన తర్వాత సంవత్సర కాలంపాటు గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలు అందిస్తామని లేదంటే తగిన జరిమా నా చెల్లిస్తామని ఈ విద్యార్థుల నుంచి హామీ పత్రాన్ని (బాండ్) రాయిం చుకుంటుంది. కాగా, ఇష్టం లేని కొందరు ప్రభుత్వం నిర్ధేశించిన రూ.10 లక్షల జరిమానాను ప్రభుత్వానికి చెల్లించి పల్లెల్లో పనిచేయకుండా తప్పించుకుంటున్నారు. ఎండీ వంటి పోస్టు గ్రాడ్యుయేట్లు రూ.50 లక్షల వరకు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రూ.కోటికిపైగా జరిమానా చెల్లించి తప్పుకుంటున్నారు. అణగారిన వర్గా ల డాక్టర్లు మొత్తం ఇంత మొత్తం చెల్లించలేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలీస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఫీజు ఎన్నో రెట్లు తక్కువగా ఉంటుంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వెళ్లే వారి సంఖ్య 50 శాతం మాత్రమే ఉంటోంది. ప్రభుత్వ నిర్నయంపై గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రామీణ వైద్యశాలల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బం ది లేకపోవడంతో పల్లెవాసులకు సరైన వైద్యసదుపాయాలు అందడంలేదు. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు మైళ్లకొద్దీ ప్రయాణించి, పట్టణాల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో సరైన వైద్యం అందక పలువురు ప్రాణా లు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. -
టెంపరేచర్@101
జ్వరం జనాన్ని వణికిస్తోంది. ఆస్పత్రుల పాల్జేస్తోంది. చిన్నారుల నుం చి వృద్ధుల వరకు మంచం పట్టే ఉన్నారు. అనారోగ్యంతో నీరసిం చిపోతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. వాతావరణంలో మార్పు లు చోటుచేసుకోవడంతో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. నెల రోజుల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరంలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండడంతో జ్వర పీడితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. సీజన్ ప్రారంభంలోనే జనాలను భయపెడుతున్నాయి. మరో నెల రోజుల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలవక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఒక్కో రోజు భారీగా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఎండల్లో విపరీతంగా తిరిగిన వారికి వడ దెబ్బ తగిలి జ్వరం వస్తుంటే.. వర్షాలకు సూక్ష్మజీవులు వృద్ధి చెంది మరికొంత మందికి వైరల్ జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వాస్తవానికి వేసవి కాలం చివరి నుంచి జ్వరాలు ప్రబలుతుంటాయి. కానీ వాతావరణం లో మార్పులు కారణంగా వర్షాకాలానికి ముందే జ్వరాలు, ఇతర రోగాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా నగరంలో మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంతోనే కాకుండా నీటి కాలుష్యం ద్వారా రోగాలు చుట్టుముడుతున్నాయి. వేసవి తాపానికి దాహం ఎక్కువగా వేస్తుండడంతో అందరూ ఎక్కడ మంచినీరు దొరికినా తాగేస్తుండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల దగ్గు, జలుబుతో పాటు టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఇంట్లో ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నాయి. మున్ముందు భయానకం వాస్తవానికి ఏటా ఈ సీజన్లో ఏజెన్సీలో జ్వరాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరంలో కూడా విపరీతంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడంతో దోమలు పెరిగి జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సూక్ష్మ జీవులు వృద్ధి చెందే కాలం వస్తుండడంతో వర్షాలు ఎక్కువైతే జ్వరాలు కూడా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలోనే ఈగలు కూడా పెరుగుతుండడంతో జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఏజెన్సీలో స్ప్రేయింగ్‌కు ఏర్పాట్లు అపిడమిక్ సీజన్ దగ్గరపడుతుండడంతో ఏజెన్సీలో స్ప్రేయింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడత స్ప్రేయింగ్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన మందులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే ఏజెన్సీలో గిరిజననులు వ్యాధుల బారినపడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు అందక అవస్థలు పడుతున్నారు. జాగ్రత్తలు అవసరం సీజన్ ప్రారంభంలోనే జ్వరాలు ఎక్కువగా ఉన్నా యి. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేస్తే ఎక్కడపడితే అక్కడ నీరు తా గకూడదు. బయట మార్కెట్లో ఫ్రూట్‌జ్యూస్‌లు తాగకపోవడమే మంచిది. జ్యూసుల్లో వేసే ఐస్, నీరు మంచివి కావు. వర్షాలు పడుతుండడంతో ప రిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి. - పి.ఎస్.ఎస్.శ్రీనివాసరావు, కేజీహెచ్ ఫిజీషియన్ -
నిర్వహణ లోపంతో మూలనపడుతున్న తాగునీటి పథకాలు
ఒంగోలు, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వాటర్ ట్యాంకులు నిర్మించినా నిర్వహణ లోపం కారణంగా అవి పనికిరాకుండా పోతున్నాయి. జిల్లాలోని తాగునీటి పథకాలను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది. వందలాది పథకాలు ఎంత అధ్వానంగా, నిరుపయోగంగా ఉన్నాయో వెలుగు చూసింది. జిల్లాలో 38 సమీకృత రక్షిత మంచినీటి పథకాలు, 1672 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఇటీవల పర్చూరు, కొండపి, ఒంగోలు, అద్దంకి, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని 36 వాటర్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని ఫిల్టర్బెడ్లు అపరిశుభ్రంగా మార గా, పలుచోట్ల మోటార్లు కాలిపోవడం, పైపులైను మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతులకు * 30.50 లక్షలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా నేటికీ ఒక్కపైసా కూడా విడుదల కాలేదు. ఒంగోలు నియోజకవర్గంలో సర్వేరెడ్డిపాలెం చెరువుకు గండిపడడంతో చెరువులో నీరు మొత్తం బయటికి పోయి రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. కరువది, చేజర్ల, మండువవారిపాలెం, పెళ్లూరు గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ అవి ఆశించిన ప్రయోజనం కల్పించలేకపోతున్నాయి. గ్రామీణ తాగునీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్వహణ పంచాయతీలకు సంబంధించింది కావడం, సుదీర్ఘ కాలం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో చాలా వరకు పథకాలు మూలనపడ్డాయి. ఒంగోలు నగరంలోనే కొత్తపట్నం బస్టాండు సెంటర్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉంది. పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని అరుణోదయ కాలనీలో ప్రజల దాహార్తి తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి * 30 లక్షలు మంజూరు చేసిన ట్యాంకు నిర్మాణం పూర్తయి 2011లో ప్రారంభించినా..ఇంత వరకు చుక్క నీరు విడుదల కాలేదు. గార్లపాడు ఆర్ఆర్ కాలనీలో 2007లో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం, మల్లవరప్పాడు ఓవర్‌హెడ్ ట్యాంకులు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. పొన్నలూరు మండలం విప్పగుంట స్కీం కేవలం స్విచ్వేసేవారు లేక నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పామూరు కొత్తపల్లిలో *10 లక్షలు వెచ్చించి ఓహెచ్‌ఆర్ ట్యాంక్ నిర్మించారు. కానీ పైప్‌లైన్, డీప్బోర్వెల్కు విద్యుత్ సరఫరాలేక ఐదునెలల నుంచి నిరుపయోగంగా ఉంది. కనిగిరి మండలంలో *175 కోట్లతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. మార్కాపురం పట్టణంలో లక్షమంది జనాభాకు గాను 30 వేలమందికి మాత్రమే సాగర్‌నీరు అందుతోంది. యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లోని 48 గ్రామాల ప్రజలకు సాగర్‌నీరు సరఫరా చేసేందుకు యర్రగొండపాలెంలో పాలకేంద్రం ఎదురుగా నిర్మించిన పంప్‌హౌస్, ట్యాంకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రెండు గ్రామాలకు సైతం నీరందించలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడివరంలో 18 నెలలుగా రక్షిత మంచినీటి పథకం మూలనపడింది. పర్చూరు మండలంలో ఆరు గ్రామాల్లో ఫిల్టర్బెడ్లు పనిచేయడం లేదు. నాలుగు గ్రామాల్లో ట్యాంకులు శిథిలావస్థకు చేరాయి. మార్టూరు మండలంలోని బొల్లాపల్లిలో తాగునీటి కోసం రక్షిత మంచినీటి పథకం నిర్మించినా పదేళ్ల నుంచి చుక్క నీరు విడుదల కాలేదు. బొబ్బేపల్లిలో కోటి రూపాయల నిధులతో తాగునీటి పథకాన్ని నిర్మించారు. అయితే ట్యాంకులోకి నీరు ఎక్కకపోవడం వల్ల ఆగ్రామ ప్రజలకు రక్షిత నీరు అందడం లేదు. గిద్దలూరు, బేస్తవారిపేట మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం, మోటార్లు కాలిపోవడం వంటి పలు కారణాలతో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 20 పథకాలు ప్రజలకు చుక్కనీరు కూడా అందించలేకపోతున్నాయి. వేటపాలెం మండలంలో *70 లక్షలతో నిర్మించిన రెండు తాగునీటి పథకాలు, చీరాల మండలంలో నాంది స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు సైతం పనిచేయకపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలోను నిర్మాణం పూర్తయిన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.