ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో నాటు సారా విచ్చల విడిగా తయారవుతోంది. తాజాగా జిల్లాలోని చెన్నూరు మండలంలోని గ్రామాల్లో నాటు తయారీ జోరుగా కొనసాగుతోంది. మండలం చింతపల్లి గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు గురువారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్సీ ఆధ్వర్యంలో సారా స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో 150 లీటర్ల నాటుసారాను, 800 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.