విజయనగరం: విజయనగరం జిల్లాలోని పలు మండలాల్లో నాటు సారా విచ్చల విడిగా తయారవుతోంది. తాజాగా గుర్ల మండలంలోని దేవుని కనపాక, ఫకీర్త్తలి గ్రామాల్లో సారా తయారీ జోరుగా కొనసాగుతోంది. దీంతో సమాచారం అందుకున్న నెల్లిమర్ల ఎక్సైజ్ అధికారులు సారా కేంద్రాలపై బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో 30 లీటర్ల నాటు సారాను, సుమారు 1000 లీటర్ల వరకు సారా తయారికి వినియోగించే బెల్లం పానకాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(గుర్ల)