గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల్లోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు
స్కూటర్లు, బైక్‌లు కూడా ఆ కుటుంబాల్లోనే ఎక్కువ గ్రామీణ ఆర్థిక స్థితిపై నాబార్డు సర్వే నివేదిక వెల్లడి
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాలతో పోలిస్తే వ్యవసాయ కుటుంబాలకే ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లున్నాయని నాబార్డు సర్వే వెల్లడించింది. గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, ఆయా కుటుంబాలకు గల గృహాపకరణాలు, వారి జీవన ప్రమాణాల స్థాయిని తెలియజేసేందుకు నాబార్డు 2021–2022 వ్యవసాయ సంవత్సరంలో సర్వే నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబాల్లో 98.3 శాతం వ్యవసాయ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్‌లుండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 96.8 శాతమే స్మార్ట్ ఫోన్‌లున్నాయి.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో టెలివిజన్ సౌకర్యం కూడా వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉండటం గమనార్హం. స్కూటర్, మోటార్ సైకిళ్లు కూడా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉన్నాయి. కార్లు మాత్రం వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకు తక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఉన్న గృహోపకరణాలు వారి జీవన శైలిని మార్చేందుకు దోహదపడుతు న్నాయని సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment