దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది.
భారత్లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment