అనంతపురం మెడికల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్) ట్రైనింగ్ కళాశాలలో ఏఎన్‌ఎం కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుజాత గురువారం ఓప్రకటనలో తెలిపారు. ఈనెల 21లోపు దరఖాస్తులు తీసుకొని సెప్టెంబర్ 4వ తేదీలోపు కళాశాలలో అందజేయాలన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.50 డీడీని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అమరావతి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంక్‌లో తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. 2016 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి చేసి ఉండి 30 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. ఇంటర్ (ఏ గ్రూప్ అయినా అర్హులే), తత్సమాన అర్హత ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 7981178492, 7386099469లో సంప్రదించాలన్నారు.