ANM course
-
ఏఎన్ఎం కోర్సుకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం మెడికల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్) ట్రైనింగ్ కళాశాలలో ఏఎన్ఎం కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుజాత గురువారం ఓప్రకటనలో తెలిపారు. ఈనెల 21లోపు దరఖాస్తులు తీసుకొని సెప్టెంబర్ 4వ తేదీలోపు కళాశాలలో అందజేయాలన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.50 డీడీని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అమరావతి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంక్‌లో తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. 2016 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి చేసి ఉండి 30 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. ఇంటర్ (ఏ గ్రూప్ అయినా అర్హులే), తత్సమాన అర్హత ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 7981178492, 7386099469లో సంప్రదించాలన్నారు. -
ముచ్చటగా మూడో రోజూ..
* ఏఎన్ఎం రాత పరీక్షలో కొనసాగిన మాల్‌ప్రాక్టీస్ * పోలీస్ కానిస్టేబుల్‌పై అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి ఆగ్రహం విజయనగరంఆరోగ్యం: ఏఎన్ఎం కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు నిర్వహించిన రాత పరీక్షలో మూడో రోజు కూడా మాల్ ప్రాక్టీస్ యథేచ్ఛగా సాగింది. పర్యవేక్షించాల్సిన అధికారే ఈ మాల్‌ప్రాక్టీస్‌కు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల హెచ్చరికలను సైతం పర్యవేక్షణ అధికారి పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానిక మహిళా ప్రాంగణంలో మూడో రోజు 240 మంది వరకు అభ్యర్థులు హాజరుయ్యారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ ఓఅభ్యర్థినిని అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి గుర్తించి బయటకు పంపిస్తే ఆమె వెళ్లిపోయిన తర్వాత మళ్లీ అదే విద్యార్థినితో పర్యవేక్షణ అధికారి పరీక్ష రాయించడం గమనార్హం. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు కాసుల బేరసారాల మధ్య జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూసిరాతలతో జరిగిన పరీక్షలను వాయిదా వేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను పట్టుకోవడానికి వచ్చావా, కూర్చోడానికి వచ్చావా? పరీక్ష కేంద్రంలోకి పంపించే ముందు తనిఖీ చేయాలనే విషయం తెలియదా? అంటూ జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సి.పద్మజ పరీక్ష కేంద్రానికి సందర్శనకు వచ్చినప్పుడు మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేవిషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యు.స్వరాజ్యలక్ష్మిని వివరణ కోరగా మాల్ ప్రాక్టీస్ జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.