విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. మాన్సాస్ ట్రస్టు దరఖాస్తును పరిశీలిస్తున్నామనడం సరికాదని ఆయన సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రభుత్వం వైద్యకళాశాల ఏర్పాటు చేయలేమని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య కళాశాలల ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజుకి మెడికల్ కాలేజీ మంజూరు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని, చంద్రబాబు వారికిష్టం వచ్చినవారికి మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చుకోవచ్చు...గొప్పలు చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. గజపతిగారికి ఎంత మంచి పేరు ఉందో...బొబ్బిలి రాజావారికి అంతే మంచి పేరు ఉందన్నారు. ఆయన కూడా మంచి కార్యక్రమాలు చేశారని, సుజయకృష్ణా రంగారావుకు కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు.
Published Mon, Mar 9 2015 11:32 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement