
కోల్‌కతా: ఆర్‌జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో వైద్యురాలి హత్యోదంతంపై కోల్‌కతా నగరంలో ఆదివారం మరోమారు నిరసనలు మిన్నంటాయి. విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు, కుమ్మరి కారి్మకులు, రిక్షావాలాలు... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు సైతం వీటిలో పాల్గొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
పలు ర్యాలీలో అమ్మాయిలు దుర్గా మాత వేషాల్లో పాల్గొన్నారు. ‘ఇంకెంత కాలం?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పశి్చమబెంగాల్‌లోని పలు పట్టణాల్లోనూ నిరసనలు కొనసాగాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంపై రాష్ట్ర కేబినెట్‌ను అత్యవసరంగా సమావేశపరిచి చర్చించాలని మమత సర్కారును గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదేశించారు.