నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని డీఎస్‌ఆర్ ప్రభుత్వ ప్రధానాస్పప్రతి ఆవరణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరుగుతున్న చిత్రాలు అన్నీఇన్నీ కావు. కాలేజీ పరిపాలన వ్యవహారాల్లో అధికార పార్టీ జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది. జీతాలు ఇచ్చేందుకు తమ వద్ద బడ్జెట్ లేదని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో కొంతమందిని తొలగించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా కొంతమంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నారు. తొలగించిన సిబ్బంది తమకు అన్యాయం చేశారంటూ దీనిపై గగ్గోలు పెడుతున్నారు.
తొమ్మిది మంది తొలగింపు
మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్‌టెక్నీషియన్, వివిధ విభాగాల అటెండర్లుగా పనిచేసేందుకు గతేడాది నవంబర్‌లో 16 మందిని నెల్లూరుకు చెందిన ఉత్తమ్ ఔట్ సోర్సింగ్ ఏజన్సీ ద్వారా తీసుకున్నారు. వీరిలో ఆరుగురు తమకు అవసరం లేదంటూ డిసెంబర్‌లో తొలగించారు.
మిగిలిన పదిమంది చేత పనులు చేయించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఈ పది మందిలో 9మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ని తొలగించాలని ఉత్తమ్ ఏజెన్సీకు ప్రిన్సిపాల్ వద్ద నుంచి లేఖ వెళ్లింది. కొత్తగా సిబ్బంది అవసరమైతే కబురు చేస్తామని లేఖలో రాశారు. తమను తొలగిస్తున్నటు ్లగా ముందుగా చెప్పలేదని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. ఏజెన్సీ వాళ్లను సిబ్బంది అడిగితే జీతాలు ఇచ్చేందుకు బడ్జెట్ లేదని నిలిపివేయాలని చెప్పారు. దీంతో వాళ్లు ఏంచేయాలో తెలియక నిమ్మకుండిపోయారు. ఇదిలా ఉండగా ఔట్‌సోర్సింగ్ ద్వారా తీసుకున్న సిబ్బందికి ఇప్ప టివరకు జీతాలు ఇవ్వలేదు. ప్రతినెలా తమ కు రావాల్సిన జీతం బిల్లును కళాశా ల అధికారులకు పంపుతూ వచ్చారు.
నోటిఫికేషన్ లేకుండా నియామకాలు
జీతాలు ఇచ్చేందుకు బడ్జెట్ లేదని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించి రోజులు గడవకముందే నాలుగు రోజుల క్రితం కొత్తగా 15మందిని ఔట్‌సోర్సింగ్ కింద అటెం డర్లు, స్వీపర్లుగా తీసుకున్నారు. నోటిఫికేషన్ లేకుండానే వీరిని విజయవాడకు చెందిన చైతన్య ఏజన్సీ ద్వారా నియమించినట్లుగా చెబుతున్నారు. హడావుడిగా వీరిని వైస్ ప్రిన్సిపాల్ ఒకరు నామమాత్రంగా ఇంటర్వ్యూలు జరిపి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల సిఫార్సులతోనే వీరిని తీసుకున్నట్లుగా తెలిసింది. అలాగే నోటిఫికేషన్ లేకుండానే తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియామకాల్లో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఉన్నవారిని తొలగించి తమకు కావాల్సిన వారిని నియమించారని ఆరోపణలున్నాయి.
అవసరం లేదని తీసేశాం:
-ఎన్. ప్రభాకర్‌రావు, ప్రిన్సిపాల్
కాలేజీ ప్రారంభానికి ముందు అవసరమ ని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసుకున్నాం. ప్రారంభమయ్యాక కొంత మంది రెగ్యులర్ స్టాఫ్ రావడంతో ఔట్‌సోర్సింగ్ సి బ్బందిలో కొంత మంది అవసరం లేదని తీసేశాం. కొత్త వారిని తీసుకొనేందుకు నో టిఫికేషన్ ఇవ్వలేదు. ఏజన్సీ ద్వారా వచ్చా రు. పాత సిబ్బందికి జీతాలు ఇస్తాం.
అధికారం..ఇష్టారాజ్యం
Published Fri, Feb 6 2015 2:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement