సాక్షి, అమరావతి : ప్రత్యేక జిల్లాతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నంద్యాల ప్రజల చిరకాల వాంఛ. దశాబ్దాల వీరి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కళాశాలా మంజూరు చేశారు. ఇప్పటికే తొలి దశ నిర్మాణం పూర్తయి, ఈ ఏడాది నుంచి తరగతులు కూడా మొదలవుతున్నాయి. మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన 60 ఎకరాలు కేటాయించారు. దీనికి ప్రతిగా వ్యవసాయ పరిశోధన స్థానానికి మరోచోట 60 ఎకరాలు ఇచ్చారు. ఓ పెద్ద ప్రభుత్వ వైద్య కళాశాల, కలెక్టరేట్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రదే శంలో నిర్మించడాన్ని రామోజీ సహించలేకపోయారు.
ఇదేదో నేరమైనట్టు, ఈ భూ ములను చంద్రబాబుమాదిరిగా ప్రైవేటు వ్య క్తు లు, సంస్థలకు పప్పు బెల్లాల్లా పంచేస్తున్నట్టుగా ప్రభుత్వంపై బురద జల్లుతూ ఈనాడులో కథనాన్ని అచ్చేశారు. మెడికల్ కళాశాల, ప్రజలకు అందుబాటులో వైద్య సౌకర్యాలు రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఈ కథనం అచ్చేశారు. వాస్తవాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..
వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతో ఉపయోగకరం. దీని ద్వారా రాయలసీమ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల మెడికల్ కళాశాల మంజూరు చేశారు. మెడికల్ కళాశాలకు 50 ఎకరాలు, సమగ్ర కలెక్టరేట్ నిర్మాణానికి మరో 10 ఎకరాలు అవసరమని గుర్తించారు.
ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన 60 ఎకరాలను వీటికి కేటాయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా తంగడంచ వద్ద మరో 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశోధన స్థానానికి కేటాయించారు. వీటి బదిలీ ప్రక్రియ కూడా మొదలైంది. పరిశోధన స్థానానికి ఇంకా ఎంత భూములు అవసరమైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తప్పేమీ లేదు.
అయితే, ఎలాగైనా మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలకు భూములు ఇవ్వడాన్ని అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అండతో కొందరు హైకోర్టులో కూడా కేసులు వేశారు. ఈ కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మెడికల్ కళాశాల నిర్మాణానికి అనుమతించింది. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక పూర్తిగా విస్మరించింది. రూ.475 కోట్లతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇక్కడ అధునాతన సౌకర్యాలతో కూడిన మెడికల్ కళాశాల నిర్మిస్తోంది.
ఈ కళాశాల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని జీజీహెచ్‌గా స్థాయి పెంచారు. 11.93 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ భవనాలు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తొలిదశ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాదిలోనే తొలి సంవత్సరం ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. 150 మంది విద్యార్థులు ఇక్కడ తొలి ఏడాది వైద్య విద్యను అభ్యసించబోతున్నారు. మరో వైపు ఇక్కడే 10 ఎకరాల్లో సమగ్ర కలెక్టరేట్ కూడా నిర్మిస్తోంది.
దీన్నికూడా ఈనాడు తప్పుబడుతోంది. నిత్యం వందలాది ప్రజలు రాకపోకలు సాగించే మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అదే ఈనాడుకు కంటగింపయింది. ఒక ప్రభుత్వ వ్యవస్థలకు చెందిన భూములను మరో ప్రభుత్వ వ్యవస్థకు కేటాయిస్తే తప్పుపట్టడం ఈనాడుకే చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment