land allotment
-
GHMC పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు
-
ఆ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 మధ్య పరిశ్రమలకు జరిగిన భూ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా వివిధ పరిశ్రమల అభివృద్ధికే సర్కార్ రాయితీ, ప్రోత్సాహకాలు కల్పించిందని స్పష్టం చేసింది. అయితే భూ కేటాయింపు జరిగినా, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి, స్టార్‌గేజ్, అనంత టెక్నాలజీ, జేటీ హోల్డింగ్స్.. కంపెనీల నుంచి దాదాపు 850 ఎకరాలను నాలుగు నెలల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుదీర్ఘ విచారణ అనంతరం సీజే ధర్మాసనం తీర్పు ఇస్తూ వాదనలను ముగించింది. ఎలాంటి టెండర్లు, ప్రకటనలు లేకుండా పలు కంపెనీలకు ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఛత్రి స్వచ్ఛంద సంస్థతోపాటు మరో ఇద్దరు హైకోర్టులో 2007లో పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో జరిపిన భూ కేటాయింపులపై సమీక్ష జరిపి మార్కెట్ విలువ ప్రకారం వసూలు చేయాలని, కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీల నుంచి భూమి వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లీజు/అమ్మకం జరిపే ముందు టెండర్లు పిలిచిన తర్వాతే కేటాయింపులు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై 17 ఏళ్లకుపైగా విచారణ కొనసాగగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాస్‌రావు ధర్మాసనం తాజాగా 72 పేజీల తీర్పు వెలువరించింది. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ‘పిటిషనర్ వాదనల మేరకు.. çసహజ వనరులైన భూమి, గాలి, నీరు అత్యధిక ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) ఏర్పాటైంది. 2001 నుంచి 2006 మధ్య నామినేషన్ ప్రాతిపదికన టెండర్లు లేకుండా 4,156.81 ఎకరాలను కార్పొరేషన్ పలు కంపెనీలకు కేటాయించింది. అభివృద్ధి ముసుగులో వేల ఎకరాలను ప్రభుత్వం ప్రైవేట్‌కు కారుచౌకగా కేటాయించింది. ప్రభుత్వ వాదన మేరకు.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి భూ కేటాయింపులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో హైదరాబాద్‌లోనూ పరిశ్రమల ఏర్పాటు సహకరించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ రంగ అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి పెంపొందించడానికి ప్రభుత్వం పలు విధానాలను రూపొందించింది. ఈ కేటాయింపులు చేసిన ఏడాది తర్వాత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో ఉండగా, అనేక పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఆ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశిస్తే.. అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుంది. ఈ దశలో జోక్యం చేసుకొని ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా, అన్ని కంపెనీలపైనే కాదు దానిపై ఆధారపడిన వారిపైనా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు భూ కేటాయింపుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. అయితే, భూ కేటాయింపులు జరిగినా ఇప్పటివరకు కార్యకలాపాలు ప్రారంభించని ఐదు కంపెనీల నుంచి దాదాపు 840 ఎకరాలను అధికారులు నాలుగు నెలల్లో వెనక్కి తీసుకోవాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిశ్రమల అభివృద్ధికి ఏపీఐఐసీ... ‘పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం 1973, సెపె్టంబర్ 26న ఏపీఐఐసీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో భాగంగా పరిశ్రమలను ఆకర్షించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రభుత్వ ఆస్తుల కేటాయింపు విషయంలో విధానం పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండాలి (ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది). భూకేటాయింపులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ 2000, మే 25న జీవో 3 విడుదల చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు, విధివిధానాలు, దరఖాస్తులు, వాటి పరిశీలనా విధానం, షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని చెప్పింది. రాష్ట్రంలో ఐటీ రంగం 2004–05లో 64.05 వృద్ధి సాధించగా, జాతీయ సగటు 34 శాతమే. 2007–08లో పరిశ్రమల ఎగుమతి రూ.8,270 కోట్లతో 41 శాతం ఉండగా జాతీయ సగటు 33.88 మాత్రమే.. ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2007–08 దాకా 1584 యూనిట్లు ఏర్పాటు కాగా, రూ.26,122 కోట్ల ఎగుమతులు, రూ.10,101 కోట్ల పెట్టుబడులు, 2.39 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొంది. 2002–05, 2005–10 మధ్య ఐటీ పాలసీ కారణంగా హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ పరిశ్రమలు మాదాపూర్‌లో, బహుళ జాతీయ సంస్థలు, మైక్రో సాఫ్ట్, సీఏ, కాన్బో, యుబీఎస్, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్, విప్రో, హనీవెల్, అమెజాన్, తదితర బహుళజాతి కంపెనీలు ఏర్పాటయ్యాయి. రూ వందల కోట్ల పెట్టుబడులతో వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది’అని పేర్కొంది. భూ కేటాయింపుల్లో వివక్ష లేదు.. ‘భూకేటాయింపుల్లో దురుద్దేశాలు, వివక్ష ఉన్నట్టు పిటిషనర్ చెప్పలేదు. ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేం. ఈ కారణంగా పారిశ్రామిక అభివృద్ధికి రాయితీ మీద భూకేటాయింపులో ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూకేటాయింపులపై చర్యలు తీసుకోంటోంది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేం అంటూ పిటిషన్లో విచారణ ముగిస్తున్నాం’అని స్పష్టం చేసింది. -
సీఆర్డీఏలో భూ కేటాయింపులపై మంత్రులతో బృందం
సాక్షి, అమరావతి: సీఆర్డీఏలో పలు సంస్థల భూ కేటాయింపుల సమస్యలను పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మంత్రుల బృందంలో పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ కన్వీనర్‌గా వ్యవహరిస్తూ ఈ బృందం ప్రొసీడింగ్స్‌ను సమన్వయం చేస్తారు. బృందంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్థిక, ప్రణాళిక, ఉన్నత విద్యా, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, యువజన సర్వీసు శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. మంత్రుల కమిటీ అప్పగించిన బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. మంత్రులు బృందం ఎప్పటికప్పుడు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ బృందం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవేంటంటే..» సీఆర్డీఏలో గతంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులను సమీక్షించి ఇప్పటికే ఉన్న వాటి కేటాయింపులను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవాలి. ఇందివరకే కేటాయించిన భూమి వినియోగం లేదా ఇతర అంశాలను అంచనా వేయడంతోపాటు అవసరమైన మార్పులను పరిశీలన చేయాలి.» భూ కేటాయింపుల కోసం కొత్త అభ్యర్థనలను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలి. పలు రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థలను గుర్తించి వాటిని అమరావతిలో తమ కార్యాకలాపాలను నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలి. సీఆర్డీఏ ప్రాంతంలో పలు సంస్థలకు మొత్తం భూముల కేటాయింపుల పురోగతిని పర్యవేక్షించాలి. 17 నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా సన్నాహక కార్యక్రమం ఈ నెల14న ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు.తక్కువ బడ్జెట్‌తో నాణ్యమైన రోడ్లు నిర్మించాలి తక్కువ వ్యయంతో ఎక్కువకాలం మన్నేల రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బి అధికారులను సీఎస్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో వెలగలపూడిలోని సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. -
850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. వివరాల్లోకి వెళితే.. 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్‌ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. -
చంద్రబాబు తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 850 ఎకరాలు.. కారుచౌక ధరకు.. అదీ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలో.. ఒక్క రోజులో చకచకా అనుమతులిచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే రూ.వేల కోట్ల విలువైన భూమి అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)’కు 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్‌డీడ్ ద్వారా ధారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ 2003లో నాటి చంద్రబాబు నాయుడి సర్కారు చేసిన నిర్వాకంలో... ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్‌డీడ్‌ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ... భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. 5 రోజులకే 850 ఎకరాలు... ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. విచిత్రమేంటంటే.. అంతకు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే రూ.వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003, నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనార్హం (అంటే.. అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు). 2004, ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీబీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్‌కు రూ.వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్‌తో ఎంవోయూను, సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది’ అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
పరిశ్రమలకు సకాలంలో రాయితీ, భూ కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థలకు సంబంధించి ప్రభుత్వం అందించే రాయితీలు, భూమి కేటాయింపు తదితర అంశాలు చర్చించగా, వాటికి కమిటీ ఆమోదం తెలిపింది. సీఎస్ మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అవగాహన ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు, సంస్థలు, ఆ తరువాత వచ్చిన కంపెనీలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన రాయితీలు, భూ కేటాయింపు అంశాల్లోను, వాటిని సకాలంలో ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా, అందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అజెండా వారీగా ఆయా సంస్థలు, కంపెనీల ఏర్పాటుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్, ఎస్.ఎస్.రావత్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, రాష్ట్ర పర్యాటక శాఖ సంస్థ ఎండీ కె.కన్నబాబు, నెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి, పుడ్ ప్రోసెసింగ్ సొసైటీ సీఈఓ ఎల్ శ్రీధర్ రెడ్డి, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
అయ్యయ్యో.. ఇదేమి బాధ రామోజీ!!
సాక్షి, అమరావతి : ప్రత్యేక జిల్లాతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నంద్యాల ప్రజల చిరకాల వాంఛ. దశాబ్దాల వీరి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కళాశాలా మంజూరు చేశారు. ఇప్పటికే తొలి దశ నిర్మాణం పూర్తయి, ఈ ఏడాది నుంచి తరగతులు కూడా మొదలవుతున్నాయి. మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన 60 ఎకరాలు కేటాయించారు. దీనికి ప్రతిగా వ్యవసాయ పరిశోధన స్థానానికి మరోచోట 60 ఎకరాలు ఇచ్చారు. ఓ పెద్ద ప్రభుత్వ వైద్య కళాశాల, కలెక్టరేట్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రదే శంలో నిర్మించడాన్ని రామోజీ సహించలేకపోయారు. ఇదేదో నేరమైనట్టు, ఈ భూ ములను చంద్రబాబుమాదిరిగా ప్రైవేటు వ్య క్తు లు, సంస్థలకు పప్పు బెల్లాల్లా పంచేస్తున్నట్టుగా ప్రభుత్వంపై బురద జల్లుతూ ఈనాడులో కథనాన్ని అచ్చేశారు. మెడికల్ కళాశాల, ప్రజలకు అందుబాటులో వైద్య సౌకర్యాలు రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఈ కథనం అచ్చేశారు. వాస్తవాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతో ఉపయోగకరం. దీని ద్వారా రాయలసీమ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల మెడికల్ కళాశాల మంజూరు చేశారు. మెడికల్ కళాశాలకు 50 ఎకరాలు, సమగ్ర కలెక్టరేట్ నిర్మాణానికి మరో 10 ఎకరాలు అవసరమని గుర్తించారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన 60 ఎకరాలను వీటికి కేటాయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా తంగడంచ వద్ద మరో 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశోధన స్థానానికి కేటాయించారు. వీటి బదిలీ ప్రక్రియ కూడా మొదలైంది. పరిశోధన స్థానానికి ఇంకా ఎంత భూములు అవసరమైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తప్పేమీ లేదు. అయితే, ఎలాగైనా మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలకు భూములు ఇవ్వడాన్ని అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అండతో కొందరు హైకోర్టులో కూడా కేసులు వేశారు. ఈ కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మెడికల్ కళాశాల నిర్మాణానికి అనుమతించింది. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక పూర్తిగా విస్మరించింది. రూ.475 కోట్లతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇక్కడ అధునాతన సౌకర్యాలతో కూడిన మెడికల్ కళాశాల నిర్మిస్తోంది. ఈ కళాశాల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని జీజీహెచ్‌గా స్థాయి పెంచారు. 11.93 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ భవనాలు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తొలిదశ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాదిలోనే తొలి సంవత్సరం ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. 150 మంది విద్యార్థులు ఇక్కడ తొలి ఏడాది వైద్య విద్యను అభ్యసించబోతున్నారు. మరో వైపు ఇక్కడే 10 ఎకరాల్లో సమగ్ర కలెక్టరేట్ కూడా నిర్మిస్తోంది. దీన్నికూడా ఈనాడు తప్పుబడుతోంది. నిత్యం వందలాది ప్రజలు రాకపోకలు సాగించే మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అదే ఈనాడుకు కంటగింపయింది. ఒక ప్రభుత్వ వ్యవస్థలకు చెందిన భూములను మరో ప్రభుత్వ వ్యవస్థకు కేటాయిస్తే తప్పుపట్టడం ఈనాడుకే చెల్లింది. -
కొత్తగా 195 యూనిట్లకు భూమి కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఈ వర్గాలకు పెద్ద పీట వేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తాజాగా చేసిన భూ కేటాయింపుల్లోనూ వీరికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 195 పరిశ్రమలకు 467.13 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిశ్రమల్లో 57 శాతం అంటే 111 యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవే. అందులో అత్యధికంగా మహిళల యూనిట్లే ఉన్నాయి. 54 యూనిట్లు ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఏర్పాటు చేస్తుండగా, ఎస్టీలు 15, బీసీలు 42 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 195 యూనిట్లు ద్వారా రూ.5,153.43 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 10,219 మందికి ఉపాధి లభిస్తుంది. రెండు సెంట్ల భూమి నుంచి రెండు ఎకరాల లోపు భూమిలో చిన్న పెట్టుబడులతో బడుగు, బలహీన వర్గాలు ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో ఆటోమొబైల్ వెల్డింగ్స్, పేపర్ ప్లేట్స్, బొమ్మల తయారీ, రెడీమేడ్ గార్మెంట్స్, వుడ్ కారి్వంగ్, కుట్టు మిషన్ల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. జనరల్ కేటగిరీ విభాగంలో పెద్ద పరిశ్రమలు జనరల్ కేటగిరీ విభాగంలో జరిగిన భూ కేటాయింపుల్లో అత్యధికంగా భారీ పరిశ్రమలు ఉన్నాయి. హెల్లా ఇన్ఫ్రా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో రూ.260.70 కోట్లతో పీవీసీ పైపుల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమకు 26.75 ఎకరాలు కేటాయించారు. ఏఐఎల్ డిక్సన్ కొప్పర్తి ఈఎంసీలో 0.46 ఎకరాల్లో రూ.105.26 కోట్లతో డిజిటల్ వీడియో రికార్డులు, కెమెరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. గ్రేస్ వెంచర్స్ రూ.520 కోట్లతో నాయుడుపేటలో బయో ఇథనాల్ యూనిట్, , ఆరోకెమ్ ఇంగ్రిడియంట్స్ రూ.320 కోట్లతో నాయుడుపేట సెజ్‌లో అరోమా ఇంగ్రిడియంట్స్ యూనిట్, ఎవరెస్ట్ స్టీల్ రూ.242.13 కోట్లతో అనంతపురంలో పీఈబీ ప్లాంట్, అబీస్ ప్రొటీన్స్ రూ.150 కోట్లతో చిత్తూరులో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, తారకేశ్వర లాజిస్టిక్ పార్క్ రూ.180 కోట్లతో విశాఖలో వేర్‌హౌసింగ్, రూ.1,771.50 కోట్లతో హిందాల్కో తిరుపతిలో అల్యూమినియం ఉత్పత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించారు. -
జూబ్లీహిల్స్‌లో చదరపు గజం రూ.1.75కి కేటాయించారా?
సాక్షి, హైదరాబాద్: ఆనంద్ సినీ సర్వీసెస్‌కు 2001లో జూబ్లీహిల్స్‌లో చదరపు గజం రూ.1.75 పైసలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వం కారు చౌకగా, పప్పుబెల్లాల మాదిరిగా భూములను కేటాయించిందని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆ భూమిని ఎప్పటిలోగా వినియోగించుకోవాలన్న షరతులు విధించకపోవడాన్ని తప్పుబట్టింది. నిర్ణీత గడువులోగా వినియోగించుకోకపోతే స్వాధీనం చేసుకుంటామని షరతు విధించాల్సి ఉన్నా ఎందుకు విధించలేదని ప్రశ్నించింది. ఇప్పుడు ఆ భూమిని వినియోగించుకోలేదనే కారణంతో స్వాధీనం చేసుకుంటామంటూ కొత్తగా షరతులు ఎలా పెడతారని నిలదీసింది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పాలసీ తెచ్చిందని, ఈ మేరకు పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు షరతులతో కేటాయింపులు చేశామని, ఇదే పాలసీని ఆనంద్ సినీ సర్వీసెస్‌కు వర్తింపజేస్తామన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కొత్త పాలసీని పాత భూ కేటాయింపులకు ఎలా వర్తింపజేస్తారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు ఈ భూ కేటాయింపులకు సంబంధించి విధించిన షరతులను, పూర్తి వివరాలను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఖాళీగా మూడెకరాల స్థలం.. ఆనంద్ సినీ సర్వీసెస్ సంస్థకు 2001లో జూబ్లీహిల్స్‌లో 5 ఎకరాల స్థలాన్ని చదరపు గజం రూ.1.75 పైసలకు కేటాయించింది. అయితే ఈ భూమిలో 1.7 ఎకరాలు మాత్రమే ఆనంద్ సినీ సర్వీసెస్ వినియోగించుకుందని, ఖాళీగా ఉన్న 3.31 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ 2014లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆనంద్ సినీ సర్వీసెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. 3.31 ఎకరాలను ఆనంద్ సినీ సర్వీసెస్‌కు రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. -
భూ కేటాయింపుల కమిటీలో లోకేష్
-
మంత్రి గంటాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు
విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంగళవారం సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఫిలింనగర్ సొసైటీకి భూకేటాయింపులపై ఎమ్మెల్యేలు గరం గరంగా ఉన్నారు. తొట్లకొండ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి విఘాతం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ సొసైటీకి భూముల కేటాయింపుపై అంతాతానై చక్రం తిప్పారు. వారంలోనే దస్త్రాలు సిద్ధమయ్యాయి. దీంతో కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను ఫిల్మ్ నగర్ సొసైటీ పేరిట ధారాదత్తం చేశారు. ఇక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయించారు. ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే. ఇంత విలువైన భూమిని ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా ఒత్తిడితో జిల్లాయంత్రాంగం సొసైటీపరం చేసింది. ఎన్నేళ్లకు ఇస్తున్నాం..ఎకరా ధర ఎంతకు ఇస్తున్నాం? అనేది కూడా నిర్ణయించలేదు. పైసా కూడా లీజు మొత్తం చెల్లించలేదు. కనీసం భూములను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. అంతా గోప్యంగానే. కొద్ది క్రితం ఏర్పాటు మీడియా సమావేశంలో ఫిల్మ్‌నగర్ సొసైటీకి 17 ఎకరాల కేటాయింపు విషయమై ప్రతిపాదన అందిందని.. లీజు నిర్ణయించలేదని అధికారికంగానే ప్రకటించారు. ఇంతలోనే భూమిని స్వాధీనం చేసుకుని ఫిల్మ్ నగర్ పెద్దలు భూమిపూజ కూడా చేసేశారు. గత సోమవారం సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేశారు. ఓ వైపు జిల్లా ఎమ్మెల్యేలు, మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు కూడా భూముల కేటాయింపుపై గుర్రుగా ఉన్నారు. పరిశ్రమలకు, వాటర్ క్లబ్‌కు భూములివ్వమని కోరితే లేవని చెబుతున్న జిల్లామంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ హరిబాబు మండిపడినట్లు సమాచారం. -
‘వుడా’కు 21.68 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా పెదగంట్యాడలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)కు 21.68 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ భూమి ఎకరం విలువ రూ.60 లక్షలుగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే నగరాభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని వుడాకు ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ మంగళవారం జీవో జారీ చేశారు. -
ప్రాజెక్టులకు ‘భూ’తాపం!
సాగునీటి ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూమి 1.94 లక్షల ఎకరాలు అందులో జీవో 123 ప్రకారం సేకరించేందుకు నిర్ణయించిన భూమి 90,881 ఎకరాలు జీవో 123 కింద ఇప్పటివరకు సేకరించింది 20 వేల ఎకరాలు జీవోపై పలుచోట్ల నిర్వాసితుల నుంచి వ్యతిరేకత 2013 చట్టం అమలుకు డిమాండ్ మెరుగైన పరిహారం, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద గుదిబండగా మారుతోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటిలోనూ భూసేకరణ ముందుకు కదలకపోవడంతో నిర్మాణ పనులకు బ్రేక్‌లు పడుతున్నాయి. దీంతో సాగు లక్ష్యాలపై సందిగ్ధత నెలకొంటోంది. రాష్ట్రంలో భూసేకరణ జరగాల్సిన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా ఇందులో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకు మాత్రమే భూసేకరణ పూర్తి చేయగలిగారు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి మరో 1.94 లక్షల ఎకరాల సేకరణ పెండింగ్‌లోనే ఉంది. ఈ దృష్ట్యా ప్రధాన ప్రాజెక్టుల భూ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపేలా ప్రభుత్వం జీవో 123ని తెరపైకి తేగా దానిని నిర్వాసితులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకు కదలడం ఎలా అన్న దానిపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది. 1.94 లక్షల ఎకరాలు అవసరం.. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు కలగలిపి దాదాపు 3,94,725.18 ఎకరాల మేర భూమి కావాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. గతంలో వేసిన అంచనాలమేరకు 3.25 లక్షల ఎకరాల వరకు అవసరం ఉండగా కొత్తగా చేరిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల కారణంగా అది మరో 40 నుంచి 50వేల ఎకరాలకు పెరిగింది. మొత్తం కావాల్సిన భూమిలో ఇప్పటి వరకు 1,99,257.83 ఎకరాలు సేకరించారు. మరో 1,94,629.45 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో 90,881 ఎకరాలను జీవో 123 ప్రకారం సేకరించాలని నిర్ణయించిన సర్కారు ఆ మేరకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ జీవో కింద సుమారు 20వేల ఎకరాలను సేకరించింది. ఈ ఏడాది మరో 70 వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జీవో 123 ప్రకారం భూసేకరణకు పలు గ్రామాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, కొత్త చట్టాలకు అనుగుణంగా చెల్లింపులు జరపాలన్న డిమాండ్, శాఖల మధ్య సమన్వయ లేమి వల్ల సేకరణ నత్తనడకన సాగుతోంది. ఎకరాకు రూ.5.5 లక్షలు... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల్లో జీవో 123 ప్రకారం ఏటా రెండు పంటలు పండే భూములకు ఎకరాకు రూ.5.5 లక్షలు, ఒక పంట పండే భూమికి ఎకరాకు రూ.4.5 లక్షలు, బీడు భూములకు రూ.3.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించి ఆ విధంగానే కొనుగోలు చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కింద అందరి సమ్మతితో ఆమోదయోగ్య ధర నిర్ణయించి పరిహారం ఇస్తున్నారు. మల్లన్న సాగర్‌తో చిక్కులు.. అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్ సహా కొన్ని చోట్ల ఈ పరిహారంపై నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వస్తోంది. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు జత కలవడంతో ఇది మరింత తీవ్రం అవుతోంది. వారంతా 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాలని డిమాండ్ చేయడం ప్రభుత్వానికి నిద్రపట్టనీయడం లేదు. ఈ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే గ్రామసభల ఆమోదం తీసుకోవడం, మార్కెట్ విలువపై మూడు రెట్ల ధర కట్టడం, ప్రభావితం అయ్యే కుటుంబాలకు రూ.5 లక్షల వరకు పరిహారం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఏకమొత్తంగా పరిహారం ఇవ్వాల్సి రావడం పెద్ద ప్రక్రియగా మారుతోంది. దీన్నంతా కొలిక్కి తెచ్చేందుకు సుమారు 6 నుంచి 8 నెలలు పట్టనుండటం ప్రభుతాన్ని కలవరపెడుతోంది. భూసేకరణ ఆలస్యమైన పక్షంలో నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడం ఎలా అన్నదానిపై ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో తొలి ప్రాధాన్యం సహా.. మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రయోజనాలను జీవో రూపంలో వెలువరించే అవకాశం ఉంది. -
ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఏపీఎస్ఎఫ్సీ)కు కేటాయించిన భూముల విషయంలో యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ భూ కేటాయింపులను రద్దు చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి గాజులరామారం వద్ద 271.39 ఎకరాలను కేటాయించింది. ఈ కేటాయింపులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 29న ఉత్తర్వులిచ్చింది. ఈ రద్దును సవాలు చేస్తూ ఏపీఎస్ఎఫ్సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఏపీఎస్ఎఫ్సీ తరఫున ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ కేటాయింపులను రద్దు చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఏపీఎస్ఎఫ్సీ పరిరక్షించడం లేదని, ఆ భూమిని కాపాడేందుకు కేటాయింపులను రద్దు చేశామని తెలిపారు. తెలంగాణ భూభాగంలో ఉన్న భూమిపై తమకు చట్ట ప్రకారం హక్కులున్నాయని పేర్కొన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. -
రండి.. భూకేటాయింపు తేలికే!
ఏపీలో మీకోసం.. ప్రత్యేక డెస్కు ఏర్పాటు చేస్తా ‘అమరావతి’ నిర్మాణంలో మీరూ ఓచేయి కలపండి చెంగ్డు పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు రెడ్ కార్పెట్ చైనాలో ఐదోరోజు పర్యటనలో బాబు బృందం బిజీ సిచువాన్ నుంచి షాంఘైకి పయనమైన సీఎం బృందం సాక్షి, హైదరాబాద్: ఏపీలో పెట్టుబడులు పెట్టే చైనా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటూ పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం బృందం 5వ రోజు గురువారం సిచువాన్ రాజధాని చెంగ్డులో ఏర్పాటైన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది. తమ రాష్ట్రంలో భారీ ల్యాండ్ బ్యాంకు ఉందని, భూ కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలూ ఉండబోవని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్, జపాన్ తరహాలో చైనా కూడా సహకరించాలని కోరారు. చెంగ్డును తమ రెండో మజిలీగా చేసుకుంటామని, కొత్త రాజధాని అమరావతిని చైనా అలాగే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియానే తమ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా సిచువాన్ ప్రావిన్షియల్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ యాంగ్ చింగ్ పింగ్ చెప్పారు. తాము ‘వన్ బెల్ట్-వన్ బ్రెడ్ పాలసీ’ని అనుసరిస్తున్నామన్నారు. తమకు నిర్మాణ రంగంలో గొప్ప నైపుణ్యం ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో తమకు మొదటి అవకాశం లభించిందన్నారు. పెట్టుబడులకు 4 కారణాలు! తమ పెట్టుబడులకు ఏపీని కేంద్రంగా చేసుకునేందుకు చైనాకి, సిచువాన్ రాష్ట్రానికి 4 కారణాలున్నాయని చైనాలో భారత రాయబారి అశోక్ కాంతా వాటిని సవివరంగా చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం ఎంవోయులు కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రు లు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. మేం సహకరిస్తాం: చెంగ్డు మేయర్ లియాంగ్జీ ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని చెంగ్డు మేయర్ టాంగ్ లియాంగ్జీ అన్నారు. భారత్ వచ్చినప్పడు తప్పకుండా ఏపీని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు బృందంతో ఆయన భేటీ అయి మాట్లాడుతూ.. ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లో, వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు సహకరిస్తామన్నారు. అనంతరం సీఎం గౌరవార్ధం బాబు బృందానికి లియాంగ్జీ విందునిచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఏపీలో హార్డ్‌వేర్ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. అనంతరం ఏపీ బృందం సభ్యులు చెంగ్డు నుంచి షాంఘై వెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
పరిహార భూములు ఎక్కడిస్తారు?
మంత్రి నారాయణను నిలదీసిన ఎర్రబాలెం రైతులు మంగళగిరి: ‘మా భూములకు బదులుగా ప్రభుత్వమిచ్చే భూములు ఎక్కడ కేటాయిస్తారు?. మా గ్రామ రైతులందరికీ ఒకే చోట కేటాయిస్తారా? లేక ఒక్కొక్కరికి వేర్వేరు చోట్ల ఇస్తారా?. ఈ విషయాల్ని అగ్రిమెంట్లో ఎందుకు చేర్చలేదు?. అగ్రిమెంట్ చేసుకుని.. కౌలు చెక్కు తీసుకున్న తర్వాత రైతుకు ఎలాంటి హక్కు లేదంటే మా పరిస్థితేంటి?.’ అని రైతులు రాష్ట్ర మంత్రి పి.నారాయణ వద్ద ప్రశ్నల వర్షం కురిపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులకు కౌలు చెక్కులు అందజేసిన మంత్రి.. భూముల్ని చదును చేసేందుకు పొలాల్లోకి చేరుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన రైతులు తమ ప్రశ్నలతో మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి.. ‘మమ్మల్ని, చంద్రబాబును నమ్మండి. రైతులకు అన్యాయం చేయం’ అని అన్నారు. ‘రుణమాఫీ వ్యవహారంతో సీఎం చంద్రబాబుపై నమ్మకం పోయింది. ఇప్పుడెలా నమ్మాలి’ అని రైతులు ప్రశ్నించడంతో మంత్రి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. నా భూమి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటా: రైతు రాఘవరావు భూసమీకరణ గడువు చివరి రోజుల్లో.. మంత్రి నారాయణ నాటకాలాడి రైతులను భయపెట్టినందునే అంగీకారపత్రాలు ఇచ్చామని ఎర్రబాలెం రైతు రాఘవరావు వెల్లడించారు. ఇప్పుడు కౌలు చెక్కులు, భూముల చదును పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. చదును పేరుతో తనభూమి వద్దకు వస్తే మానవబాంబుగా మారి ఆత్మహత్య చేసుకుంటాని హెచ్చరించారు. భూముల గురించి నారాయణకు ఏం తెలుసని ప్రశ్నించారు. స్కూళ్లలో పేద పిల్లల వద్ద ఫీజులు గుంజడం నేర్చుకుని.. అదే విద్యను పేద రైతులపై చూపిస్తున్నారని విమర్శించారు. ఫీజులు వసూలు చేయడంలో నారాయణ దిట్ట కనుకే.. భూములు లాక్కొస్తారని చంద్రబాబు ఆయనను రాజధాని గ్రామాల్లో తిప్పుతున్నారని ఆరోపించారు. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత తొలిసారిగా శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రెండు నెలల విరామం తరువాత శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు, అనుకూలంగా తెలంగాణ మంత్రులు చీలిపోయిన నేపథ్యంలో శుక్రవారం జరిగే భేటీకి ప్రాధాన్యం నెలకొంది. భూ కేటాయింపులు, పోస్టుల మంజూరు వంటి అంశాలే తప్ప ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలేవీ ఉండబోవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాల్సిం దిగా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే రచ్చబండ నిర్వహణ కూడా నిలిచిపోయింది. ఈ రెండు అంశాలపై చర్చ జరిగే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి.