రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత తొలిసారిగా శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రెండు నెలల విరామం తరువాత శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు, అనుకూలంగా తెలంగాణ మంత్రులు చీలిపోయిన నేపథ్యంలో శుక్రవారం జరిగే భేటీకి ప్రాధాన్యం నెలకొంది.
భూ కేటాయింపులు, పోస్టుల మంజూరు వంటి అంశాలే తప్ప ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలేవీ ఉండబోవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాల్సిం దిగా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే రచ్చబండ నిర్వహణ కూడా నిలిచిపోయింది. ఈ రెండు అంశాలపై చర్చ జరిగే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి.