వైద్య ప్రొఫెసర్లకు హార్వర్డ్‌లో శిక్షణ | Government Medical College Harvard Training | Sakshi
Sakshi News home page

వైద్య ప్రొఫెసర్లకు హార్వర్డ్‌లో శిక్షణ

Published Fri, Jul 8 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

Government Medical College Harvard Training

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న 100 మంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాత న వైద్యచికిత్స పద్ధతులపై శిక్షణ ఇచ్చేటట్లు గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో వందమంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్యవిద్య సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన విధించిన ట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement