Harvard
-
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
అందుకే కుక్కలు రెచ్చిపోతున్నాయి: హార్వర్డ్ స్టడీలో వెల్లడి
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కుక్కకాటు సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన పరిశోధనలలో ఒక ఆందోళన కలిగించే రిపోర్టు బయటకువచ్చింది. దాని ప్రకారం శునకాల ప్రవర్తన వాతావరణ మార్పులకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ సాగించిన ఈ పరిశోధనలో వాతావరణంలో వేడి, అల్ట్రావైలెట్(యూవీ) స్థాయి పెరిగినప్పుడు శునకాలు మనుషులకు శత్రువులుగా మారుతాయని తెలిపారు. ఈ మార్పు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ 70 వేలకు పైగా డాగ్ బైట్స్‌కు సంబంధించిన ఘటనలపై అధ్యయనం చేసిన అనంతరం ఒక ఆందోళనకర ట్రెండ్‌ను గుర్తించింది. వేడివాతావరణంలోను, పొల్యూషన్ కలిగిన వాతావరణంలోనూ శునకాలు మనుషులపై దాడులకు దిగుతాయని వారి పరిశోధనలో తేలింది. మానవుల తప్పిదాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. దీని ప్రభావం శునకాలపైన కూడా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నేచర్ జర్నల్ ఈ సైంటిఫిక్ రిపోర్ట్స్‌ను జూన్ 15న ప్రచురించింది. అమెరికాలోని 8 ప్రముఖ నగరాల్లో ఈ పరిశోధన 10 ఏళ్లపాటు కొనసాగింది. వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లోను, కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లోనూ శునకాలు హింసాత్మకంగా మారడం కనిపించింది. Dog bites may occur more frequently on days with hotter, sunnier weather, and when air pollution levels are higher, suggests a paper in @SciReports. However, the authors caution that more data and further research is needed to confirm these findings. https://t.co/njHvX3z5BG— Springer Nature (@SpringerNature) June 16, 2023 ఈ పరిశోధనలో ప్యాట్రన్‌ను గమనిస్తే యూవీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ కుక్క కాట్లు 11 శాతం పెరుగుతూ వచ్చింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో ఇది 4 శాతం మేరకు పెరిగింది. ఓజోన్ లెవెల్ అధికంగా ఉన్న రోజుల్లో కుక్క కాట్లు 3 శాతం మేరకు పెరిగాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలోనూ ఈ ముప్పు ఒకశాతం మేరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. ఇది కూడా చదవండి: భారత్‌లో అధికంగా విక్రయమయ్యే కండోమ్ బ్రాండ్స్.. -
రెండంకెల వృద్ధికి చేరువలో భారత్
బోస్టన్: భారత్ ఈ ఏడాది రెండంకెల వృద్ధికి చేరువలో ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీలో మొదటి స్థానంలో నిలవనుందని వివరించారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆర్థికమంత్రి చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలు.. ► వచ్చే ఏడాది ఆర్థికాభివృద్ధి 7.5–8.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇది రాబోయే దశాబ్దానికి నిలకడగా ఉంటుంది. ► వృద్ధి అంచనాలపై భారత్ ఆర్థిక శాఖ ఇంకా ఎటువంటి అభిప్రాయానికీ రాలేదు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), రేటింగ్ ఏజెన్సీలు మాత్రం భారత్ వృద్ధి రేటు రెండంకెలకు చేరువలోనే ఉంటాయని అంచనావేస్తున్నాయి. ► భారత్‌లో అన్ని కీలక విభాగాలూ మంచి పురోగతిని సాధిస్తున్నాయి. పరిశ్రమల వృద్ధి తీరు బాగుంది. సేవల రంగం మంచి ఫలితాలను అందిస్తోంది. రాబోయే దశాబ్దాలలో భారతదేశం వృద్ధి తీరు వెనుకబడి ఉంటుందనడానికి నాకు ఒక కారణం కనిపించడం లేదు. ► మీరు మొత్తం ప్రపంచం విషయంలో ఒకే ఆలోచనను కలిగి ఉంటారని నేను అనుకోను. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకునే అవకాశం ఉంది. వేగవంతమైన వృద్ధి పథాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఆయా దేశాలు బహుశా వృద్ధికి చోదక శక్తిగా కూ డా ఉండే అవకాశం ఉంది. ఆయా దేశాలే ప్రపం చ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి. ► గణాంకాలను పరిశీలిస్తే, ఈ సంవత్సరం భారతదేశ వృద్ధి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుందని నేను చెప్పగలను. అయితే ఇక్కడ లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం కూడా ఉండివుండవచ్చు. కానీ వృద్ధి స్పీడ్ వచ్చే యేడాది కూడా కొనసాగుతుంది. 2022 లో కూడా మా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. ► అభివృద్ధి చెందిన దేశాలు కూడా చక్కటి పురోగతి సాధిస్తున్నాయి. కానీ హై బేస్ వల్ల ఆయా దేశాల పురోగతి రెండంకెలకి దగ్గరగా ఉండదు. ప్రపంచ వృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా తోడ్పడతాయి. ► ప్రపంచ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న వృద్ధి తీరును కరోనా మహమ్మారికి ముందు పరిస్థితితో పోల్చి చూడడం సరికాదన్నది నా అభిప్రాయం. ► ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల పరిస్థితిని చూసినప్పుడు ప్రస్తుతం ఒక విషయం అర్థం అవుతోంది. దేశాలు తమ వృద్ధి ప్రణాళికలను మునుపటి కంటే (కరోనా ముందు) చాలా భిన్నంగా రూపొందించుకుంటున్నాయి. దీనికి మహమ్మారి విసిరిన సవాళ్లు ప్రధాన కారణం. ► మారిన ప్రపంచ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు అనుకూలమైన దేశాలపై దృష్టి సారిస్తున్నారు. చట్టబద్దమైన పాలన, ప్రజాస్వామ్యం, పారదర్శక విధానాలు, మీరు విస్తృత ప్రపంచ చట్రంతో ఉన్నారని బయటి వ్యక్తి కాదని ఒక దేశంలో పెట్టుబడిదారుకు లభిస్తున్న హామీ, అంతర్జాతీయంగా అనుసంధానమైన నియమ నిబంధనలు.. ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారులకు అవసరం. భారతదేశంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి, పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఇవన్నీ అదనపు కారణాలు. ► భారీ మార్కెట్‌ను కలిగి ఉండడం, వినియోగ డిమాండ్‌ను కలిగి ఉండడం భారత్‌కు ఉన్న అదనపు ఆర్థిక బలం. ► యువత అధికంగా ఉండడం భారత్‌కు కలిసి వస్తున్న మరో అంశం. వివిధ రంగాల్లో యువత మంచి నైపుణ్యతను కలిగి ఉంది. దేశం గొప్ప కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు వినియోగ శక్తికి కలిగి ఉన్నారు. ఇతర దేశాల నుంచి తమ పెట్టుబడులను తరలించాలనకునే పెట్టుబడిదారులకు భారత్ ఒక చక్కటి గమ్య స్థానంగా ఉంటుంది. ► ఇక వ్యవసాయ రంగంలోనూ భారత్ పురోగమిస్తోంది. పలు దేశాలకు భారత్ నుంచి ఆహారోత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. ఆహారం, ఫుడ్ ఫ్రాసెస్డ్ మెటీరియల్స్ ఎగుమతులకు సంబంధించి ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ► జౌళి, పాదరక్షలు, తోళ్ల పరిశ్రమలుసహా తయారీ రంగంలోని పలు విభాగాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తులు పనిచేస్తున్నారు. ఆయా అంశాల నేపథ్యంలో వచ్చే దశాబ్ద కాలంలో భా రత్ సగటున 7.5 శాతం నుంచి 8.5 శాతం వృద్ధి నమోదుచేస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. విశిష్ట లక్షణాలు భారత్ సొంతం పెట్టుబడులకు సంబంధించి ఏ ఒక్క దేశంలోనూ లేని అన్ని విశిష్ట లక్షణాలు భారత్‌కు ఉన్నాయి. ఒక దేశంలో కొన్ని సానుకూల అంశాలు... మరొక దేశంలో మరికొన్ని సానుకూల అంశాలు ఉండవచ్చు. కానీ భారతదేశంలో అన్నీ సానుకూల అంశాలే ఉన్నాయి. – ఆర్థికమంత్రి -
లఖీమ్‌పూర్ ఘటనను ఖండించాలి
బోస్టన్: ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రైతుల ప్రాణాలను బలి తీసుకున్న లఖీంపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అదే సమయంలో ఆ తరహా ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా గళమెత్తాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ మంగళవారం హార్వర్డ్ కెన్నెడీ స్కూలులో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు సీతారామన్‌ను రైతులు బలిగొన్న ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ప్రధానమంత్రి, ఇతర సీనియర్ మంత్రులు ఎందుకు పెదవి విప్పడం లేదని, బీజేపీ దేనికి ఆత్మరక్షణలో పడిపోయిందని సూటిగా ప్రశ్నించారు. దీనికి సీతారామన్ బదులిస్తూ లఖీంపూర్ ఖేరి ఘటనని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారని ఆ తరహా ఘటనలు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని వాటి గురించి కూడా మాట్లాడాలని అన్నారు. ‘‘దేశంలో ఏ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరిగినా అందరూ గళమెత్తాలి. భారత్ గురించి బాగా తెలిసిన డాక్టర్ అమర్త్యసేన్ వంటి వారు ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా లేవనెత్తాలి. యూపీలో బీజేపీ అధికారంలో ఉండడం, కేంద్ర మంత్రి కుమారుడు ప్రమేయంపై ఆరోపణలున్నాయి కాబట్టే అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ పని ఎవరు చేసినా న్యాయస్థానంలో తేలిపోతుంది. ఇదంతా నేను మా ప్రధానిని కానీ, మా పార్టీని కానీ వెనకేసుకొని రావడం కాదు. నేను భారత్ గురించి మాట్లాడతాను. నిరుపేదలకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడతాను’’అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
హార్వర్డ్ లో నా బెస్ట్ మెమరీ అదే: జుకర్ బర్గ్
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సరిగ్గా 12 ఏళ్ల తర్వాత తన హార్వర్డ్ డిగ్రీని తాను సంపాదించుకున్నారు. హార్వర్డ్‌లో చదువుకుని డ్రాప్ అవుట్‌గా బయటకు వెళ్లిన జుకర్‌బర్గ్ తిరిగి ఇదే యూనివర్సిటీ నుంచి గురువారం గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో యూనివర్సిటీని వీడిన జుకర్ బర్గ్, తన అద్భుతమైన ప్రతిభతో బిలియనీర్‌గా అవతరించి 2017లో యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రసగించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రసంగంలో హార్వర్డ్ యూనివర్సిటీలో తన బెస్ట్ మెమరీని విద్యార్థులతో పంచుకున్నారు. తన భార్య ప్రిస్ సిల్లా చాన్ ను కలవడం హార్వర్డ్ లో తన బెస్ట్ మెమరీగా చెప్పారు. ప్రిస్ సిల్లాతో ఆ పరిచయాన్ని ఎంతో సంతోషంతో పంచుకున్నారు. '' అప్పుడే ఫేస్ మ్యాష్ అనే వెబ్ సైట్ ను లాంచ్ చేశాను. అడ్మినిస్ట్రేటివ్ బోర్డు నన్ను చూడాలనుకుందని తెలిసింది. ఇక అందరూ నన్ను ఆ యూనివర్సిటీ నుంచి బయటికి పంపేస్తారని అనుకున్నారు. యూనివర్సిటీలో నా సామన్లంతా సర్దడానికి నా తల్లిదండ్రులు కూడా వచ్చేస్తున్నారు. ఆ సమయంలో స్నేహితులు వీడ్కోలు పార్టీ ఏర్పాటుచేశారు. ఎవరికి తెలుసు? ఆ సమయంలో అదృష్టం మనవెన్నంటే ఉంటుందని. ప్రిస్ సిల్లా కూడా వాళ్ల స్నేహితులతో ఆ పార్టీకి వచ్చింది. ఫోహో బెల్ టవర్ లో బాత్రూమ్ కోసం వేచిచూస్తున్న లైన్ లో మేము కలుసుకున్నాం. ఆల్ టైమ్ మోస్ట్ రొమాంటిక్ లైన్స్ ను నేను ప్రిస్ సిల్లాతో చెప్పా. ఇంకో మూడు రోజుల్లో నేను వెళ్లిపోతున్నా. వెంటనే మనం డేట్ కి వెళ్దామా అని అడిగేశా'' అని మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. జుకర్ బర్గ్ తన బెస్ట్ మెమరీగా ఆ తీపి జ్ఞాపకాలను పంచుకుంటున్న సమయంలో ప్రిస్ సిల్లా ఎంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
యూఎస్‌లో బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇవే..
వాషింగ్టన్: మార్కెట్లో ఎన్ని కోర్సులున్నా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కు ఉన్న క్రేజ్ వేరే. కోర్సు సమయంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలతో పాటు.. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సాధారణంగానే ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే యూఎస్‌లోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఈ కోర్సు కాస్త వ్యయంతో కూడుకున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ ఇటీవల ఫుల్ టైం ఎంబీఏ కోర్సును అందిస్తున్న అమెరికాలోని ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా-2016ను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొదటి స్థానంలో నిలువగా.. స్టాన్ఫోర్డ్ రెండో స్థానం దక్కించుకుంది. బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థుల అనుభవాలు, కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగాలు పొందుతున్న సరళి, ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు లాంటి విస్తృతమైన సమాచారంతో ఈ ర్యాంకులను రూపొందించినట్లు బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 20లో నిలిచిన యూఎస్‌లోని ఉత్తమ బిజినెస్ స్కూళ్లు ఇవే.. 1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 2. స్టాన్ఫోర్డ్ 3. డ్యూక్ 4. చికాగో(బూత్) 5. డర్ట్మోత్ 6. పెన్సిల్వేనియా(వార్టన్) 7. ఎమ్ఐటీ 8. రైస్(జోన్స్) 9. నార్త్ వెస్టర్న్ (కెల్లాగ్) 10. యూసీ బర్క్లీ(హాస్) 11. కొలంబియా 12. వర్జీనియా 13. మిచిగాన్(రాస్) 14. యేల్ 15. కార్నేగి మిలాన్(టెప్పర్) 16. కార్నెల్(జాన్సన్) 17. ఎన్‌వైయూ(స్టెర్న్) 18. టెక్సాస్(మేస్) 19. వాషింగ్టన్(ఫాస్టర్) 20. ఎమోరి(గొయ్జుటా) -
వైద్య ప్రొఫెసర్లకు హార్వర్డ్‌లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న 100 మంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాత న వైద్యచికిత్స పద్ధతులపై శిక్షణ ఇచ్చేటట్లు గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో వందమంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్యవిద్య సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన విధించిన ట్లు తెలిపారు. -
ఈ ఈగలతో మరింత మెరుగైన డ్రోన్లు
న్యూయార్క్: ప్రకృతిలోని జీవుల నుంచి స్ఫూర్తి పొందిన శాస్త్రవేత్తలు ఎగిరే రోబోలను తయారు చేశారు. చూడ్డానికి చాలా చిన్నగా ఉండే ఈ సూక్ష్మ రోబోలను ‘రోబో ఈగ’లుగా పిలుస్తున్నారు. మరి ఇంత చిన్నరోబోలు దేనికి ఉపయోగపడతాయనే ప్రశ్నకు శాస్త్రవేత్తల నుంచి ఎన్నో సమాధానాలు వస్తున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో మరింత మెరుగైన డ్రోన్లను రూపొందించేందుకు ఈ రోబో ఈగలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా ఒకచోటు నుంచి మరో చోటుకు దూసుకుపోయే డ్రోన్లను మాత్రమే రూపొందించారు. గాలిలో నిశ్చలంగా ఎక్కువసేపు నిలిచే సామర్థ్యం వీటికి తక్కువ. అయితే డ్రోన్లను గాలిలో కొంతకాలంపాటు నిశ్చలంగా ఉండేలా చేసేందుకు ఈ బుల్లి రోబో ఈగలు ఉపయోగపడతాయంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు. -
కొద్దిపాటి మార్పులతోనే క్యాన్సర్ మరణాలు సగం తగ్గుతాయి!
పరిపరిశోధన కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా క్యాన్సర్ వల్ల కలిగే మరణాలలో సగానికి పైగా నివారించవచ్చని పేర్కొంటున్నారు హార్వర్డ్‌కు చెందిన పరిశోధకులు. ఇది నిశ్చయంగా మేలు చేస్తుందన్న విషయం గతంలోనే తెలిసినా తాజా అధ్యయనాలలో ఈ అంశం మరోమారు సాధికారికంగా నిరూపితమైంది. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అన్నది అన్ని రకాల క్యాన్సర్ మరణాలనే గాక... ఊపిరితిత్తుల కాన్సర్లను 80 శాతం నివారిస్తుందని తేలింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు దాదాపు 1,36,000 మంది మెడికల్ రిపోర్టులను పరిశీలించి, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల దాదాపు 50 శాతం మరణాలు నివారితమయ్యాయని తేల్చారు. అంతేకాదు... పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల కలిగే మరణాలు 21 శాతం తగ్గితే, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మృతులు 12 శాతం తగ్గాయని ఈ అధ్యయనంలో తేలింది. దీన్నిబట్టి తాజా పండ్లతో కూడిన పోషకాహారం, వారంలో రోజుకు అరగంట చొప్పున కనీసం రెండున్నర గంటల వ్యాయామం, పొగతాగడం పూర్తిగా మానేయడం వంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు... క్యాన్సర్ సంబంధిత మరణాలు సగానికి సగం తగ్గుతాయని తేల్చారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు. -
సన్నగా ఉంటే దీర్ఘాయువు
బోస్టన్: సన్నగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని అమెరికాలోని హార్వర్డ్, టఫ్ట్స్ వర్సిటీల అధ్యయనంలో తేలింది. చిన్నతనం నుంచి మధ్య వయస్సు వరకు ఎక్కువగా బరువు పెరిగినవారు త్వరగా చనిపోయే అవకాశాలుంటాయని పరిశోధకులు చెప్పారు. శరీర పరిణామక్రమం, మరణాల మధ్య సంబంధంపై వారు పరిశోధనలు చేశారు. వీటిలో 80,266 మంది మహిళలు, 36,622 మంది పురుషులు పాల్గొన్నారు. వారంతా 5, 10, 20,30,40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో చెప్పారు. 50 ఏళ్లప్పుడు వారి శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఐ)ను నమోదు చేశారు. 60 ఏళ్ల తర్వాత వారిపై పరిశీలన ను కొనసాగించారు. 60 దాటిన తర్వాత మరో 15 ఏళ్లలోపు చనిపోయే అవకాశం సన్నగా ఉన్న మహిళల్లో 11 శాతం, పురుషుల్లో 20.3 శాతం. అదే లావుగా ఉన్నవారిలో ఇది పెరిగి మహిళల్లో 19.7 శాతం, పురుషుల్లో 24.1 శాతంగా నమోదైంది. -
వచ్చే పదేళ్లూ టాప్ స్పీడ్..
► భారత్ ఆర్థిక వ్యవస్థపై హార్వర్డ్ వర్సిటీ విశ్లేషణ ► వార్షిక వృద్ధి రేటు 7%గా అంచనా న్యూయార్క్: భారత్ వచ్చే పదేళ్లూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. వార్షిక వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంటుందన్నది వీరి అంచనా. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సీఐడీ)లో వీరు సమర్పించిన ఆర్థిక పరిశోధనా నివేదిక ప్రకారం... చైనా వృద్ధి తగ్గుతోంది. భారత్ మాత్రం దాన్ని పక్కకునెట్టి, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కొనసాగించనుంది. 2024 నాటికి చైనా వార్షిక వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలు వేగవంతమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. అయితే చమురు, ఇతర కమోడిటీ ఆధారిత దేశాలు మాత్రం వృద్ధి మందగమనం సమస్యలను ఎదుర్కొంటాయి. భారత్‌కు విభిన్న రంగాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే సామర్థ్యం పెరగనుంది. ఫార్మా, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు వీటిలో కీలకం. చైనా ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాన్ని పొందింది. కేవలం పదేళ్లలోనే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగింది. 2024 నాటికి అమెరికా సగటు వార్షిక వృద్ధి రేటు 2.8%గా ఉంటుంది. బ్రిటన్ విషయంలో ఇది 3.2%. స్పెయిన్ 3.4%, ఇటలీ 1.8%, జర్మనీ 0.35% వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది.